🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

 


శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం 
గమనిక: ఇక్కడ చాల పేజీల సాహిత్యం ఉన్నందున దీనిని 5 చిన్న భాగాలుగ విభజించడం జెరిగింది 
శ్యామ సుధా పాటలు

పాటల సూచిక


0) పరమం పవిత్రం

00) మంగళం హారతి


1) నాకేది మంచిదో (01.01.)

2) పరాభక్తి (02.01.)

3) గురువరా నను కావరా (03.01.)

4) చిదంబరేశ్వరా (04.01.)

5) వదలను నిను వదలను (05.01.)


6) శ్రవణము లోపమా (06.01.)

7) బాబా నామమే (07.01.)

8) మధురం మధురం (08.01.)

9) ఈ జీవిత యాత్రలో (09.01.)

10) నీ కొరకై నిను (10.01.)


11) నీ దయ గలిగిన కాని దేముంది

12) నీ వేరా నా ప్రాణము

13 నిను నమ్మితిరా

14) అనంత మహిమాన్విత

15) నీకు న్యాయమా


16) నీ సేవకునిగ

17) నీ దయయే నా బ్రతుకయ్యా

18) నా పూర్వ జన్మ పుణ్యఫలమొ

19) నాతో పంతమా

20) నీ ముందు నేనెంత యనెడి భావన


21) నీకున్న బలమెంత

22) దత్త శరణం సాయి శరణం

23) అర్ధించుచుంటినని

24) అలిగితివో ఆగ్రహించితివో

25) ఆటలనాడుచు నుంటివి దేవ! (Part-1 Completed)

---------

26) ఇది నీ లీల కరుణా లోలా

27) అహాహాహాహా....... నీవెంతటి

28) అపార కరుణాసాగరా

29) ఆగింరపుమా ! ఫలము లారగింపుమా !

30) ఇది ఏ కర్మ ఫలితమొ,


31) ఆవోసాయి

32) శాంతి నొసగుము (01.02.)

33) ఎంత కాలమిటుల (02.02.)

34) ఎందుకో వ్యామోహము (03.02.)

35) ఎన్నడు నీ దయ కలుగునో (04.02.)


36) ఎంత కాలమని వేచియుందురా (05.02.)

37) ఎంత చిత్రమైన వాడివయ్యా (06.02.)

38) ఎందుకు నాతో ఆటలాడెదవు (07.02.)

39) ఎందుకొచ్చితివి జీవా (08.02.)

40) ఉయ్యాలలూగవయ్య రామ (09.02.)


41) ఎంత మధురం (10.02.)

42) ఎంత చిత్రమైనదో నీ లీల (11.02.)

43) ఏ క్షణమున నీ కరుణ ప్రసరింప చేతువో (12.02.)

44) ఏల కానరావయ్య బృందావన విహారా (13.02.)

45) ఏ ప్రాంతమందున (14.02.)


46) ఏదిరా నిజమేదిరా? (15.02.)

47) ఏమి చేయగా నెంచితివో (16.02.)

48) ఏ రూపంబని నిను ధ్యానించను (17.02.)

49) ఎందులకీ యోచనలు (18.02.)

50) రామ పట్టాభి రామ  (19.02.) (Part-2 Completed)

----

51) శరణు శరణు రఘు రామా (20.02.)

52 ) శరణం శరణం శ్రీ శ్యామ చరణం (21.02.)

53 ) పావన గుణ నామ హరే (22.02.)

54) హరి నారాయణ, హరి నారాయణ (23.02.)

55) వందనం వినాయకా..... (24.02.)


56) అంబా భవాని జగదంబ భవాని (25.02.)

57) గోవింద గోపాల నీలమేఘశ్యామ్ (26.02.)

58 ) ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప (27.02.)

59) అవధూత చింతన గురుదేవ దత్త (28.02.)

60) ఆత్మా రామ ఆనంద రమణ (29.02.)


61) భగవన్నామమే తరుణోపాయము (01.03.)

62) గురుదేవా జయదేవ సాయి దేవా దయామయా (02.03.)

63) ప్రభో సాయి రామ రావా.....మమ్మేలు కోరా (03.03.)

64) ఇది ఏమి ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా! (04.03.)

65) గురుదత్త దిగంబర తవ శరణం (05.03.)


66) పాహి పాహి యనుచు నీదు (06.03.)

67) రమణ రమణ భగవాన్ (07.03.)

68) అత్రి నందన అనసూయత్మజ (08.03.)

69) సాయి నామమను మధురామృతము (09.03.)

70) సాయి నన్ను బ్రోవ భారమా (10.03.)


71) ఏ ప్రాంత మందున జనన మందితివో (11.03.)

72) దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా! (12.03.)

73) ప్రేమ ముదిత మనసె కహో సాయిరామరాం (13.03.)

74) శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా (14.03.)

75) అవో సాయి నారాయణ దర్శన దియో (15.03.)


76) ఆనందమే సాయి నామము  (16.03.)

77) ఇది ఏమీ ఆటరా తండ్రీ ! (17.03.)

78) ఏదని దలతును నీ రూపమును (18.03.)

79) ఏమి కర్మముల చేసితినో నేనేమీ పాపముల (19.03.)

80) ఏల కానరావయ్య బృందావన విహారా (20.03.)


81) ఒక పరి నిన్ను మనసారగ నమ్మిన (21.03.)
82) కనుల నీరు తుడవగా కదలి రావ దేలరా (22.03.)
83) భక్తి నీయవమ్మా భవతారిణి (23.03.)
84) సుందరానన సుందరానన (24.03.)
85) కరుణ జూపుమా - సాయి కనికరించుమా (25.03.)

86) కలుగదా నామీద జాలి (26.03.)

87) కనికరింపుమా దేవ కారుణ్య నాథా (27.03.)

88) కొలువై యున్నాడే  (28.03.)

89) కన్న తండ్రీ కావగా (29.03.)

90) చాలు చాలు సాయి దేవా  (30.03.)


91) సద్గురు బ్రహ్మ సనాతన హే (31.03.)

92) జయ జయ జయ సాయీ (01.04.)

93) జారవిడువకురా శ్యామ (02.04.)

94) ధర్మ స్వరూప ద్వారకామాయివాసా (03.04.)

95) దైవ ప్రార్థన దారి చూపును (04.04.)

 

96) పరాపవాదము పరిహరింపవే  (05.04.)

97) ప్రభో సాయి రామ రారా…. (06.04.)

98) శ్రీ సాయినాథా…..  శ్రీనివాసా… (07.04.)

99) సద్గురు నీవే…..  సర్వము (08.04.)

100) సాయినాథా…..  చేరరారా…… (09.04.)


101) సాయి రాముని భజన జేయండి (10.04.)

102) ప్రభో ఏసునాథా….. పరాకేలనయ్య (11.04.)

103)  హరి గురు నామమే (12.04.)

104) పవళించ ప్రార్థింతు పనగ శాయి (13.04.)

105) వైభోగము చూడగ రారండి (14.04.)


106) ఏమి కర్మముల జేసితినో (15.04.)

107) దయను జూపుమా సాయీ (16.04.)

108) దిక్కెవరు ఉన్నారురా  (17.04.)

109) ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా (18.04.)

110) దయ గనవే సాయీ మమ్ముల (19.04.)


111) గురుదేవ గురుదేవ గురుదేవ రారా (20.04.)

112) కనుగొను మదిగో మనసా (21.04.)

113) రామ రామ యని రోమ రోమమున (22.04.)

114) ధుని ముందు కూర్చున్న సాయి (23.04.)

115) దయ రాదా? నీ దరికి చేర్చవా ! (24.04.)


116) దత్త దిగంబర సాయి దేవా ! (25.04.)

117) నీ పవిత్ర దివ్య సమాధి మందిరము నందు (26.04.)

118) నీ నామమే మాకు మంత్రము సాయీ (27.04.)

119) నీ సరి గలరా సాయీ (28.04.)

120) నిన్ను చూడని కనులేల (29.04.)


121) రామ నామము గానము ఎందున్న(30.04.)

122) నీదు లీలలు నేరుగ జాలను (01.05.)

123) సాయీ - రామా- రామా -కావ రావా (02.05.)

124) నీ పవిత్ర పద పద్మముల పైన (03.05.)

125) నిరామయా నిరంజనా నిర్గుణా (04.05.)


126)  నీ సేవకునిగ నీ బానిసగ (05.05.)
127) నీ లీలల తెలియగ తరమే (06.05.)
128) నీ నామము వినుటయే నా భాగ్యము (07.05.)
129) నీ లీలల కంతము కలదా (08.05.)
130) అది దేవా అమర వినుత (09.05.)

131) ప్రేమ తోడ గావుమయ్యా (10.05.)
132) పవిత్రునిగ నుంతువో పతితునిగా (11.05.)
133) పాపికి నిష్కృతి ఎన్నడు ? (12.05.)
134) భాగ్యము నొసగుమురా సాయి (13.05.)
135) ప్రసన్న వదనా సాయీ (14.05.)

136) బాబా నిను నమ్ముకుంటి (15.05.)
137) భేద భావము తొలగ జేయుము (16.05.)
138) బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ? (17.05.)
139) మోహనమే సాయి నామం (18.05.)
140) వందనములను గొనుమా (19.05.)

141) వ్యర్థపు యోచన లెందుకు మనసా (20.05.)
142) వలదయ్యా - నను వదలకు మయ్యా (21.05.)
143) వలదు - వలదు సాయీ ! (22.05.)
144) శ్రీ స్వామిని సేవించుటలో (23.05.)
145) శరణు శరణు రఘురామా... (24.05.)

146) శరణము శరణము రామా సాయి (25.05.)
147) మంగళం జయ మంగళం (26.05.)
148) శ్రీరామ జయరామ - జయ జయ రామా (27.05.)
149) శిరిడీ వాసా... శ్రీ సాయీశా... (28.05.)
150) శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా (29.05.)

151) శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం (30.05.)
152) శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో (31.05.)
153) శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా (01.06.)
154) శిరిడీ వాసా దీన జనావనా (02.06.)
155) శిక్షయో - నీ శిక్షణ యో ! (03.06.)

156) శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త రూపా (04.06.)
157) శ్రీ సాయి రామ నామ మహిమను చక్కగా (05.06)
158) సాయి రామా ---- సాయి రామా (06.06)
159) ఇది కల కాదు (07.06)
160) హే కరుణా భరణా దయానిధే (08.06.)

161) శ్రీ సాయి రామ నామ మహిమను (09.06.)
162) సాయిరామా..... సాయిరామా (సద్గురు దేవా(10.06.)
163) సాయి ! సాయి ! శ్రీ సాయీ సాయీ సాయీ ! (11.06.)
164) సచ్చిదానంద సాయినాథా ! (12.06.)
165) సాయి నామమను మధురామృతమును (13.06.)

166) సాయి సాయి (మోహన కళ్యాణి రాగం )  (14.06.)
167) సాయి సద్గురు దేవా నాపై  (15.06.)
168) సన్నుతి జేయరా సాయి రమణా  (16.06.)
169) సాయి దత్త శ్యామా రామా  (17.06.)
170) సారధిని నీవే సాయి  (18.06.)
 
171) సాయిరామ ప్రభో ౼ సాయిరామ ప్రభో (19.06)
172) సాయి రామా దేవ నాపై దయను జూపవే (20.06.)
173) సాయి శరణం ౼ సద్గురు శరణం (21.06.)
174) సాంబ సదాశివ సాయి శంభో (22.06.)
175) సాయియే నా గానము  (23.06.)
 
176) సాయి ! నన్ను బ్రోవ భారమా! (24.06.)
177) సాయి బోలో రామ బోలో (25.06.)
178) సాయి..... జయ జయ సాయి...... (26.06.)
179) దాసుడ నేన నేనయ్య  (27.06.)
180) సాయి నామమునకు సాయి రూపమునకు  (28.06.)
 
181) సాయి సద్గురు దేవా - సాయి దేవాధి దేవా (29.06.)
182) హారతి గైకొనువమ్మా దేవీ (30.06.) 
183) హర హర శంకర భక్తవ శంకర గౌరి (01.07.)
184) బాలా త్రిపుర సుందరి మాతా (02.07.)
185) పాహి పాహి హే పరమేశ్వర శివ (03.07.)

186) ఏమి చేసితి ననుచు వెనుకేసు కొస్తావు (04.07.)
187) ఏ నక్షత్రము నందు జనించిన నేమి (05.07.)
188) కనుల కెదురుగ లేక కదలి పోయిన గాని (06.07.)
189) ప్రభో ఏసునాధా..... పరాకేలనయ్యా (07.07.)
190) ప్రేమనాథుడగు ఏసునాధునకు (08.07.)

191) ఏసునాధుని స్మరణ జేయండి (09.07.)
 

****

****

0) పరమం పవిత్రం

పరమం పవిత్రం బాబా విభూతిం

పరమం విచిత్రం లీలా విభూతిం

పరమార్థ ఇష్టార్థ మోక్షాప్రదాతం

బాబా విభూతిం ఇదమాశ్రయామి

శ్యామావిభూతిం ఇదమాశ్రయామి.


00) మంగళం హారతి

సర్వ మత సమ్మతాయ - సర్వ లోక రక్షకాయ

సర్వజీవ పోషకాయ సాయి మంగళమ్


సకల వేద శాస్త్రాయ - సత్య ధర్మవాసాయ

సద్గురు స్వరూపాయ సాయి మంగళమ్


రామకృష్ణశరూపాయ - శివ మారుతి దత్తాయ

పాండురంగనాథాయ సాయి మంగళమ్


షిరిడీ నివాసాయ - భక్తాశ్రిత పోషకాయ

సర్వ లోక వాసాయ సాయి మంగళమ్


జ్ఞాన ప్రదాతాయ - జన్మ కర్మ నాశకాయ

భుక్తి ముక్తి దాయకాయ సాయిమంగళమ్


కాలాతీతాయ - కామితార్థ దాతాయ

కళ్యాణరూపాయ సాయి మంగళమ్


ఏసు ఈశ రూపాయ వెంకటేశరమణాయ

బాల భక్త దేవాయ- సాయి మంగళమ్


రాఘవేంద్ర గురురాయ - రామదాస సమర్థాయ

సత్యనారాయణాయ సాయి మంగళమ్


మాతృ పితృ స్వరూపాయ- మహాశక్తి రూపాయ

శ్యామచరణ సన్నుతాయ సాయి మంగళమ్


సాయి మంగళం "జయ" సాయి మంగళం

సాయి మంగళం "హర" సాయి మంగళం

సాయి మంగళం "దత్త" సాయి మంగళం

సాయి మంగళం "హనుమ" సాయి మంగళం

సాయి మంగళం "రామ" సాయి మంగళం

సాయి మంగళం "కృష్ణ" సాయి మంగళం

సాయి మంగళం "బాల" సాయి మంగళం

సాయి మంగళం "లలిత" సాయి మంగళం

సాయి మంగళం "అల్లా" సాయి మంగళం

సాయి మంగళం "ఏసు" సాయి మంగళం

సాయి మంగళం "శ్యామ" సాయి మంగళం

సాయి మంగళం "సద్గురు" సాయి మంగళం

శుభ సాయి మంగళమ్:


1) నాకేది మంచిదో (01.01)

నాకేది మంచిదో నా కేది చెడుపో

నా కంటే బాగుగా నా స్వామికెరుక


అతని చేరిన వారి కతడాయ తలితండ్రి

అతని బిడ్డను నేను ఇతరము నా కేల ||నా కేది||


స్వామి నది ఇది అడుగ దాసునకు ధర్మమా

అన్ని తెలిసిన స్వామి చేసేది నా కొరకే ||నా కేది||


2) పరాభక్తి (02.01)

పరాభక్తి నా మదిలో నిలిపి నన్ను దయతోకావరా

శ్రీకరేశ్వర హే కరుణాకర కృపాకర ప్రభు గురువరా ॥పరా||


విశ్వధారా విశ్వరూప విమలచరిత గురువరా

ప్రాణాధారా ప్రాణిరూపా పతితపావన గురువరా ॥పరా||


జీవాధారా జీవరూప జగత్సాక్షి గురువరా

జ్ఞానాధారా జ్ఞానరూప జగత్ ప్రభో గురువరా ॥పరా||


నీ చరణములే శరణము శరణము

నీ నామామృతమే నాకు శరణము ॥పరా||


నీ కృపయే నాకు జీవనము

నీ కరుణయే శ్యామాదుల కభయము ॥పరా||


3) గురువరా నను (03.01)

గురువరా నను కావరా

గురువరా నను బ్రోవర

శ్రీ గురు నీవే శరణము

సద్గురు నీవే దిక్కు ||గురు||


నీ నామము పలుక నీయుమా

నీ రూపము నా మదిలో నిలుపుము

నీ మార్గమునందు నడుపుము

నీ దరికే నన్ను జేర్చుము ||గురు||


ఎవరియందున ద్వేషముంచక

దేనియందును కోరిక యుండక

నీదు సూక్తుల కనుగుణముగా

నన్ను నడుపుము గురువరా ||గురు||


దోషములను జేయనీయకు

దురాలోచన రానీయకు

దుర్మార్గములోన ఉంచకు

నీ మార్గము నందు ఉంచుము ||గురు||


అణువు అణువున నీవు గలవను

అనుభవములను కృపతో నొసగుము

నేను నాదను భావములను

సమూలముగా పెరికి వేయుము ||గురు||


సత్యమును నను పలుక నీయుము

ధర్మ మార్గమునందు నడుపుము

పరమ ప్రేమతో నన్ను మలచుము

నీదు సేవలో నన్ను నిలుపుము ||గురు||


మాయలో పడి ఉన్నవాడను (దానను)

మాతవై నను పాలింపుము

నీ చెంతకు చేర్చుకొనుము

నీ లోనే నిలుపుకొనుము ||గురు||


దాసనాయకి దాససేవిత

దాసవందిత త్రినయనీ

దాససన్నుత సద్గుణాలయ

నీదు చరణములే శరణము ||గురు||


4) చిదంబరేశ్వరా (04.01)

చిదంబరేశ్వరా శ్రీకరేశ్వరా

ఆదరమున కావరా

అరుణాచలేశ్వరా

అరుణాచల శివ అరుణాచల //2//


నమ్మినానురా నీ పద కమలముల

ప్రేమ మీద చేరదీసి కావవేమిరా //అరుణాచల//


జపము నెఱుఁగను నేను తపము నెఱుఁగను

మంత్రమెరుగను నేను తంత్రమెరుగను

ధ్యానమెరుగను సుజ్ఞాన మెరుగను

ధ్యాన రూప జ్ఞానరూప అరుణాచలేశ్వర //అరుణాచల//


స్నేహమెరుగను నేను ప్రేమ నెరుగను

జీవమెరుగను నేను భావమెరుగను

దైవమెరుగను నేను దెయ్యమెరుగను

ఏమియు ఎరుగని నన్నేటుల భ్రోతువో //అరుణాచల//


ఏది ఎందుకెపుడు ఎటుల చేసినాడనో

దేనికెందుకిపుడు ఇటుల జరుగుచున్నదో

తెలియలేదురా తెలివిలేదురా

ధ్యాన రూప జ్ఞానరూప అరుణాచలేశ్వర //అరుణాచల//


నా కనులలో నీవు కరిగిపోవా

నా మనసులో నీవు నిండిపోవా

నా పలుకులో నీవు నిలచిపోవా

నాలోన లోలోన అణిగిపోవ //అరుణాచల//


నా లోన యిమిడి ఉన్నది నీవే కదా

నీ లోన నిలచి ఉన్నది నేనే కదా

నీవు నేను వేరు కాదు, కాదనుచు తెలుపవా

శ్యామనాథ రమణనాథ అరుణాచలేశ్వర //చిదంబరేశ్వరా//


5) వదలను నిను వదలను (05.01)

వదలను నిను వదలను నే వదలను వదలను వదలను వదలను సాయి

వదలక నిను వదలక నే వదలక వదలక వదలక వదలక

చేకొనుమయ్యా శ్రీతజన మాయి

సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ //2//


మానవ జన్మను నొసగితివయ్య

మనుసునొకటి కల్పించితివయ్య

మాయలోన నను ముంచితివయ్య

మహా చిత్రము చేసేదవయ్య //వదలను//


సంసారము యొకటి కల్పించితివి

సంఘములో పడవేసితివి

సమస్యలెన్నో సృష్టించితివి

సతమత అగుటకు చేసితివి //వదలను//


బాధ్యతలను భారీయించెదనంటివి

నిను శరణన్నచో గాచెదనంటివి

ఎప్పుడు భరించెదవో ఎటుల గచెదవో

శ్యామాదులకు శాంతి నొకగుమా //వదలను//


6) శ్రవణము లోపమా (06.01)

శ్రవణము లోపమా

స్మరణము లోపమా

మననము లోపమా సాయి

శ్రవణ స్మరణ మన నాడులకందవు

ఇదేమి చిత్రమో సాయి సాయి //శ్రవణము//


పరాయణత్వముతో చేయని

పారాయణము లోపమా

ధ్యేయము నందలి ధ్యాస లేకయే

ధ్యానము చేయుట లోపమా


అవగాహనయే లేక యాంత్రికపు

పూజలు చేయుట లోపమా

అహమును వదలక అటునిటు చూచుచు

ఆర్చించుటయే లోపమా


సదా చరణయే సతతము లేకయే

అతిగా వాగుట లోపమా

సకల జీవులలో నిన్ను చూడకయే

నీవు గలవనుట లోపమా


నిన్ను గూర్చి నేనేమి ఎరుగయే

పరు అని దూరుట లోపమా

శరణు శరణుమను

శ్యామ చరణనుని కరుణతో బ్రోవ భారమా!! //శ్రవణము//


7) బాబా నామమే (07.01)

బాబా నామమే భవ్య నామము

దీన జనులకు దివ్య నామము

సృష్టి స్థితి లయ తారక నామమ


ఇహపర సుఖముల నోసగెడి నామము

ఇప్సిత్తముల నెరవేర్చేడి నామము

బాధ్యతలను భరించేడి నామము

భవ బంధములను త్రేంచడి నామము


భక్తి జ్ఞానం నొసగేడి నామము

వైరాగ్యమును కలిగించండి నామము

ముక్తి పదమున చేర్చడి నామము

ఆత్మానందం నిలిపెడి నామము


భక్తుడు సతతము స్మరింపు నామము

యోగులు ధ్యానము చేసెడి నామము

సకల దేవతలు జపించు నామము

శ్యామాధులకు తారక నామము


8) మధురం మధురం (08.01)

మధురం మధురం మన సంబంధం

జన్మజన్మల రుణానుబంధం

జన్మజన్మల విడివడిన బంధం

సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం //2//


విడదీసినను విడవలేనిది

కదిలించిన ను కదలలేనిది

తొలగించినను తొలగబోనిది

అమృతమయముగా నిలిచిపోయినది //మధురం//


మరవ దలచినను మరువనీయనిది

మాటల చేతల భాషల కందనిది

తను మన ధనముల మరువజేయునది

ఆనందామృత మందు నిలచునది //మధురం//


సంతస మోసగి రక్షించునది 

సంతస మోసగి సంరక్షించునది

స్మరియించినచో కృప చూపునది అని

ఆత్మీయతతో అలరించునది //మధురం// //సాయిరాం//


మధురం మధురం సాయి సంబంధం

మధురం మధురం సద్గురు బంధం //సాయిరాం//


9) ఈ జీవిత యాత్రలో (09.01)

ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో పాత్రలు

ఏది ఎందులకు ఉద్భవించునో

ఏది ఎందులకు నిష్క్రమించునో

ఎప్పుడు ఉద్భవించునో ఎటుల నిష్క్రమించునో

తెలియదు తెలియదు తెలియదు మనకు తెలియదు //ఈ జీవిత//


ఎవరికి వారే ఒంటరిగా బ్రతుకలేరని ఎంచియు

రుణాను బంధములను పెంచి

సంబంధములకు స్పందించి

ఒకరినొకరుగా తొడు నీడగా బ్రతుకులు లాగగ

ప్రారబ్దమును అనుసరించు నడుచుచున్నా ఈ నాటక మందునా //ఈ జీవిత//


జరిగెడి దానిని అనుభావించుచు

జరగబోవునది ఊహించుచు

తాను చేసినది విస్మరించుచు

పరులు చేసినది చూపించుచు


మంచికి తానే కారణమనుచు

చెడుకి ఇతరులు కారకులగుచును

కీచులాటలతో పెనుగులాటలతో

బ్రతుకును బరువుగా లాగు చుండెడి //ఈ జీవిత//


సత్యమేమిటో తెలిసినగాని

సంతసమన్నది అర్ధం కాదు

ఆశలు ధ్యాసలు అవేశములు

అర్ధరహితములనుచు తెలియదు


త్రికరణ శుద్దితో సత్యాన్వేషణ

మార్గాములో మునిగిన కానీ

బాధలు తొలగవు బంధములుడవు

జగదీశ్వరుడు గోచరించడు //ఈ జీవిత//


సత్సంగములో ఉండినగాని

సత్పురుషుల సేవించినగాని

సత్ గ్రంధాలములు చదివినగాని

సదాచరణతో ఉండినగాని

సత్యము తెలియదు సంతసముండదు

సదాలోచనలు అసలే కలుగావు


సత్యమునెరిగి చేసేడి సద్గురు

శ్యామ సాయిని సమాశ్రయింపుమా //ఈ జీవిత//


10) నీ కొరకై నిను (10.01)

నీ కొరకై నిను ప్రేమింప నీయుమా

ప్రేమ ప్రదాత సాయి తండ్రి

అజ్ఞానమును ధ్వంసము చేయుమా

పతిత పావనా సాయి తండ్రి

పతిత పావనా శ్యామచరణా

పతిత పావనా వందిత చరణా


శ్రీ గురు నామమే భయమును బాపును

శ్రీ గురు సేవయే ముక్తి నొసగును

శ్రీ గురు కృపయే మన జీవితమూ

గురు సూక్తుల ఆచరణయే శ్రేష్ఠము


సద్గురు నామమే భవతారకమూ

సద్గురు స్మరణయే భయ నాశకము

శ్రీ గురు దేవా అని స్మరియించిన

నాలో నిలచి నను నడిపించును


తల్లి తండ్రి గురు దైవము తానై

శాంతి సౌఖ్యముల నాకందించును

శ్రీ గురు దేవా అని పిలిచినచో

పరుగు పరుగున నాదరి చేరును


బాధ్యతలన్నియు తానే భరించును

తన మార్గములో నను నడిపించును

నిను నమ్మినచో భయము నాకేల

సమర్థ సద్గురు సాయి దేవా


నిను భక్తితో సదా స్మరించగా

కృప చూపుము నా సాయి దేవా


పంచేంద్రియములు పంచప్రాణములు

అహంకారము మనసు బుద్దులను

నీ సేవలకై వినియోగింపగ

కృప జూపుము నా సాయి దేవా


నీ కొఱకై నిను ప్రేమింప నీయుము

నీ కొఱకై నను జీవింప నీయుము

నీ సేవలనే చేయ నీయుము

నీ కృపతో మము నడువ నీయుము


కరుణా భరణా కల్మష హరణా

ప్రేమ ప్రదాయక కల్మష నాశక

నిస్వార్ధముగా నడువ నీయుమా

శ్యామ పోషక శాంతి నొసగుమా


పతిత పావన శ్యామ చరణా

పతిత పవనా వందిత చరణా


11) నీ దయ గలిగిన (11.01)

నీ దయ గలిగిన కాని దేముంది

ఇహ పరములలో సాయీ

నీ కృపగలిగిన రాని దేముంది

శ్యామాదులకు సాయీ ||నీ||


నీ లీలల కీర్తించిన గలుగును

అనంత ధైర్యము సాయీ

నీ నామము స్మరియించిన గలుగును

అమితానందము సాయీ ||నీ||


నిను పూజించిన నిశ్చలముగ

మది నీపై నిలుచును సాయీ

నిను సేవించిన నిశ్చయమౌ

మది నిష్ఠ సబూరులు సాయీ ||నీ||


నిను ఆరాధించిన నే తెలియును

అసలు తత్వము సాయీ

నిను ప్రేమించిననే దెలియును

పరమ సత్యము సాయీ ॥నీ॥


నిను నమ్మినచో కలుగును

భువిలో అష్టసిద్ధులు సాయీ

నిను శరణన్నచో ఆనందింతురు

అష్టభోగముల సాయీ ||నీ||


నమ్మిన వదలక శరణము నొసగుచు

కరుణింతువు గద సాయీ

నీ చరణములే శరణము శరణము

సంకట హరణా సాయి ||నీ||


12 నీ వేరా నా ప్రాణము (12.01)

నీ వేరా నా ప్రాణము

నీవేరా నా జీవము


ప్రాణము, జీవము,

రూపము, ధ్యానము,

నామము సర్వము

నీవేరా..... నీవేరా .....


సాయిరాం.... రాధేశ్యాం .... ॥నీ వేరా॥


మధురాతి మధురం నీదు నామము

మహిత మనోహరం నీదు రూపము

మహిమోపేతము నీ కీర్తనము

మనసానందము బ్రహ్మనందము


దైవ స్వరూపా... సాధు స్వరూపా...

జీవ స్వరూపా... యోగ స్వరూపా...

ప్రేమ స్వరూపా... జ్ఞాన స్వరూపా...

విశ్వ స్వరూపా... దత్త స్వరూపా....


సాయిరాం... రాధేశ్యాం... ॥నీ వేరా॥


రోమ రోమమున సాయి సాయి యన....

అణువణువున బాబ బాబాయన

అన్ని వేళలలో అంతరంగమున

నీవే నిలిచి నన్ను కావరా ॥నీ వేరా॥


నీ దయ లేక బ్రదుక జాలరా...

నీ కృపలేక మనజాలనురా..

ముక్తి దాయకా, భక్తి దాయకా..

శక్తిదాయకా భుక్తిదాయకా...


సాయిరాం...... రాధేశ్యాం... ॥నీ వేరా॥


ఎందులకీ భువి నేనడుగిడితినో

కామక్రోధముల వలలో పడితినో

అజ్ఞానముతో మసలు చుంటినో

అసలు సత్యమును తెలియనైతినో


నీ చేతిలో కీలు బొమ్మనై

నీ ఆటలో తోలు బొమ్మనై

మార్గమెరుగని మట్టి బొమ్మనై

పడియుంటినిగా శ్యామ సన్నుతా


సాయిరాం...... రాధేశ్యాం... ॥నీ వేరా॥


13) నిను నమ్మితిరా (13.01)

నిను నమ్మితిరా నీరజ నయనా

కరుణించుమా కమలలోచనా


ప్రగాఢమగు విశ్వాసము  నోర్పుల గలిగిన వారిని రక్షింతువనీ

నీవే దిక్కని నమ్మిన వారల బాధ్యతల నెల్ల భరియింతువనీ

పూర్వ జన్మ సంసాదితమౌ ఈ పాప ఫలితముల వలలో జిక్కితి

పాప ఫలితములు తొలగింతువనీ జ్ఞాన వైరాగ్యంబుల నొసగెదవనీ

 

ముక్తి మార్గమున నడపింతువనీ సమర్థ సద్గురు దైవము నీవని

ఆర్తితో బిలచిన ఆదుకొందువని ఆవేదనలను తొలగింతువనీ

కోరిన కోర్కెల దీర్చుచుందువని కొంగు బంగారపు పెన్నిధి నీవని

దలచిన వారికి కనిపింతువనీ, బిలచిన వారితో పలుకు చుందువని ||నిను॥


14) అనంత మహిమాన్విత (14.01)

అనంత మహిమాన్విత గురుదేవా.

ఆనందామృత చిన్మయ భావా || గురుదేవా||

సద్గురు దేవా.. సమర్థసద్గు రుసాయిదేవా ||అనంత||


అనంత కోటి బ్రహ్మాండ నాయకా

అనంత గుణ గణ ఆగమ వినుత

అనంత సురగణ మునిజన వందిత

అనంతానంత అమృతానంద || అనంత ||


కామ క్రోధ మద మత్సర నాశక

లోభ మోహ సంశయ వినాశక

చిత్తచాంచల్య కర్మనాశక

సుజన పూజిత సుందరనాయక ॥ అనంత ॥


భక్తి శక్తి చిచ్భిక్తి పద్రాయక,

జ్ఞాన వైరాగ్య ముక్తిదాయక,

సచ్చిదానంద విశ్వవిధాయక,

శ్యామ సేవిత సద్గురు నాయక ॥ అనంత ॥


15) నీకు న్యాయమా (15.01)

నీకు న్యాయమా నీరజనయనా

ఇక్కట్టుల కలిగించ బాధించ ॥నీకు॥


సర్వము నీ సంకల్పమె యందువు

యీ బాధలు నా పాపమందువు

నేనెవరో? పాప మేల జేసితినో?

తెలియగ నీయవు శోధించెదవు ॥నీకు॥


సమస్యలెన్నియో సృష్టించెదవూ

పరిష్కరింపక వేధించెదవు

తనువు మనసులను హింసించెదవు

ఎందుకో నా బ్రతుకుతో చెలగాటము ॥నీకు॥


సర్వభారముల మోనెదనందువు.

భక్తి గ పిలిచిన పలికెద నందువు

ఎపుడు మోసెదవు ఎప్పుడు పలికెదవు

బాధ్యతల దించి శాంతి నొసగెదవు ॥నీకు॥


అసమర్థుడనని ఆడించెదవా

అవివేకి ననుచు పరిహసింతువా

అజ్ఞాని ననుచు నిరాదరింతువా

అహంకారినని అణచి వేతువా ॥నీకు॥


నను సృజియించిన దీవయేగదా

ఈ బ్రతుకంతా నీదయయేగదా

కరుణ జూపి కడదేర్చగ రావే

శ్యామ హృదయ వాసా సాయీ ॥నీకు॥


16) నీ సేవకునిగ (16.01)

నీ సేవకునిగ నీ బానిసగ

నీ సేవలోన నిరతము నిలుపుము సాయి ॥నీ॥


సర్వము నీ కర్పణము జేయుచు

సకలము నీదేయని మది దలచుచు

సకల విశ్వమున నిన్ను జూచుచు

సంతోషంబు పొందగ చేయుము ॥నీ॥


నీనామామృత పానము జేయుచు

నీ లీలలను గానము జేయుచు

నీ సేవకులకు సేవల జేయుచు

నిరతము సంతసమందున నుంచుము॥నీ॥


ఆశయమీ వై ఆశలు నీవై

ఆచరణ ఆలోచన లీవై

అంతట నీవై అన్నియు నీవై

ఆనందంబు నందింపుము సాయీ ॥నీ॥


నీవే నేనై నేనే నీవై

నిశ్చయ నిశ్చలమగు గతినేనై

నిరుపమానంద ధామము నేనై

వుండగా జేయుము శ్యామ సన్నుతా ॥నీ॥


17) నీ దయయే (17.01)

నీ దయయే నా బ్రతుకయ్యా

నీ కరుణయే నా జీవితమయ్యా

నీ ప్రేమయే నా సంతసమయ్యా

నా పాపమే సంతాపము లయ్యా ॥నీ॥


పావనమగు నీ దివ్య నామమును

వినగలుగుట నీదయయే గదా

పవిత్రమౌ నీ‌ దివ్య చరితమును

పఠియించుట నీ కృపయే గదా

నీదు లీలలను నిరతము గానము

జేయుటయు నీ కరుణగదా

మంగళకరమౌ నీదు రూపమును

జూచుట నీప్రేమయే గదా ॥నీ॥


నీ నామమే నామనసును స్థిరముగ

నీ దరి నిలిపెడి మంత్రమయా

నీ చరితమే నా భక్తిని దృఢముగ

నీపై నిల్పడి మంత్రమయా

నీ లీలలే నా దుష్కర్మలను దనుమార

గలుగు శస్త్రమయా

నీ రూపమే నా కాత్మ జ్ఞానము నొసగి

రక్షించు నేత్రమయా ॥నీ॥


నీదయ కలుగని, క్షణమొక యుగమై

బ్రదుకు దుర్భరమగునయ్యా

నీ కరుణలేని నా జీవితమొక

నరకయాతనగ మారునయ్యా

నీ ప్రేమలేని క్షణమున శ్యామచరణుడు

భువి మరి నిలువడయా

శ్రీచరణా భవ భయ హరణా

సంకట హరణా సాయిరమణా ॥నీ॥


నిరామయా నిరంజనా నిర్గుణా సనాతనా

నిగమాగమ వేద వేద్య శ్రీ చరణా మోహనా


18) నా పూర్వ జన్మ (18.01)

నా పూర్వ జన్మ పుణ్యఫలమొ నీ అనుగ్రహమొ..

నీ పవిత్ర నామమునే వినగలిగితి సాయీ.

నీ దివ్య లీలలనే జదువ గలిగితిని సాయీ

నీ పద భక్తునిగా భువి పిలువబడుచు నుంటి సాయి ॥నా॥


సాధనలను చేయలేదు, తపముల నొనరించలేదు,

యజ్ఞయాగాదుల, నే, నసలే, మదినెరుగలేదు,

నీ నామమె స్మరియించుచు, నీ లీలల జదువు చుండ

అంతమాత్రమునకే, ఎంతో దయ జూపితివి ॥నా॥


అడుగడుగునా ఆడుకొనుచు అదృశ్యముగా గాచుచు

అనవరతము మమ్మెల్లర కరుణతో బ్రోచుచునుంటివి

పావన నామా సాయీ పతిత జనోధ్ధారకా

సదమల హృదయా దేవశ్యామ సుజన పోషకా ॥నా॥


19) నాతో పంతమా (19.01)

నాతో పంతమా నా పాలి దైవమా సాయీ ॥నాతో॥

సుంత యేని మది శాంతి నిలుపవు

వింత వింతగా బాధించెదవు ॥నాతో॥


ఎంతగా నిను ప్రార్థించిననూ

ఎంతగా నిను వేడుకొనిననూ

రవ్వంత యేని కరుణ జూపవు

ఒక్క సమస్యను పరిష్కరించవు ॥నాతో॥


సర్వ భారముల నీ పరము జేసి

సమస్యలను నీ భుజంబుల మోపి

మంచి చెడుగులకు కారణమీవని

బలుకుచు భువిలో బ్రతుకుచుంటినని ॥నాతో॥


తామసముతో తడబడు నడుగులతో

అలసటతో ఆడంబరములతో

అంతయూ నీదయయేయని బలుకుచు

ఆడుచుంటినని అల్పుడ నేనని ॥నాతో॥


దండించిననూ దరి జేర్చిననూ

పరీక్షించినను పరిరక్షించిన

నీవుగాక యింకెవరున్నారని

ఆశ్రయింతురా శ్యామ సన్నుతా సాయి ॥నాతో॥


20) నీ ముందు నేనెంత (20.01)

నీ ముందు నేనెంత యనెడి భావన తోడ

ప్రారంభమయినది మన బంధము

నిను వదలి జీవించలేననెడి భావనతో

సాగుచున్నది సాయి అనుబంధము


మధురాతి మధురమౌ ఈ బంధము

మహిత మనోహరపు అనుబంధము

సంతసమ్మొనగూర్చు సంబంధము

విడదీయ లేనిదీ ఋణబంధము ॥నీ ముందు॥


చిత్రాతి చిత్రమౌ సంకెలల లంకెలతో

బ్రతికించుచున్నది బుణబంధము

ఏవేవో కర్మలను ఎట్టెటులో జేయించి

జన్మలొసగుచున్నదీ బంధము


సర్వము కలిగించి సంత సంబుల ముంచి

సాయినే అందించు నీ బంధము

కర్మలెన్నియో తెంచి కర్తవ్యమును త్రుంచి

కడతేర్చు నీ సంబంధమూ ॥నీ ముందు॥


ప్రతి క్షణము ప్రతిప్రాణి పయనించుచుండుటకు

మూలాధారమ్ము ఈ సంబంధము

స్థావర జంగమము లన్నిటికి

హేతువై లోతుగా నున్నదీ అనుబంధము


సకల చరాచర విశ్వమే

తానై సాయిగా శ్యామ చరణాదులను

సాయిలో లీనమ్ము చేసి

హాయిని గూర్చు సంబంధము ॥నీ ముందు॥


21) నీకున్న బలమెంత (21.01)

నీకున్న బలమెంత బంధుబలగమెంత

చదువు సంధ్యల వెంత శ్యామా?

నీకున్న ధన ధాన్య భోగ భాగ్యము లెంత

సద్గురుని యందు నీ విశ్వాసమెంత

శ్యామా...... ఆ........ ఆ


అహము మోహము లందు వ్యామోహమెంత

కామ క్రోధములందు మమకారమెంత

మద మాత్సర్యములందు సహకారమెంత

నీకు సహకారమెంత ||నీకున్న||


దారా పుత్రాదులతో నీ ధర్మమెంత

ఆహారముల యందు ఆసక్తి ఎంత

సజ్జనులతో మెలుగు సద్భావ మెంత

సకల జీవుల యందు అనురాగమెంత ||నీకున్న||


నాది నాదని బలుకు నీదు తెలివెంత

నాది నీదని బల్కు నీదు మనసెంతా

ఆనందమందుటకు ఆచరణ ఎంత

అసలు నీవెంత నీ అధికారమెంత ||నీకున్న||


22) దత్త శరణం సాయి శరణం (22.01)

దత్త శరణం సాయి శరణం 

దత్త సాయి శరణం శరణం ॥ 

 

దత్తా సాయి శరణం శరణం 

సాయి దత్త శరణం శరణం

భువనేశ్వరా అఖిలేశ్వరా 

గుణగంభీరా సాయిశ్వర ॥దత్త॥ 

 

దేవకి నందన శ్యామా సాయి 

దశరథ నందన రామా సాయి 

శ్యామ సాయి రామా సాయి 

శ్యామా రామ సాయి సాయి 

రామా శ్యామ సాయి సాయి 

సాయి సాయి శ్యామ రామా 

సాయి సాయి రామా శ్యామా

రామ సాయి రామా సాయి 

రామా సాయిరామా శ్యామ సాయి 

శ్యామా సాయి శ్యామా సాయి శ్యామా

మాధవ మురహర శ్యామా 

సాయి రాఘవ సురవర రామా సాయి

దేవకి నందన శ్యామా 

సాయి దశరథ నందన రామా సాయి


శ్యామ సాయి రామా సాయి 

శ్యామ రామ సాయి సాయి 

దేవకి నందన శ్యామా సాయి

శరణం శరణం తవశరణం 


దశరథ నందన శ్యామ 

సాయి శరణం శరణం తవ శరణం 

మాధవ మురహర శ్యామ

సాయి శరణం శరణం 

తవ శరణం రాఘవ సురవర రామా సాయి 

శరణం శరణం తవశరణం


23) అర్ధించుచుంటినని (23.01)

అర్ధించుచుంటినని అందలము

పైకెక్కి అవహేళనల పాల జేయకయ్యా


ప్రార్థించు చుంటినని పరిహాసమాడుచూ

పది మందిలో కించ బరచకయ్యా

దేవా...సాయిదేవా రావా నన్ను కావరావా ||అ||


కోర్కెలధికములనుచు కోపమ్ము జెందితివా

ఆశలధికములనుచు ఆయాస పడితివా

కోర్కెలు ఆశలు నీ అధీనములే గదా!

నేర్పుగా నడిపించి నీ దరికి జేర్చమని ||అ||


కాముకుడు వీడనుచు కరుణ మానితివా

మోహ మత్యధికమని మూగబోయితివా.

కామ మోహమ్ములు నీ సంకల్పమేగదా.

సద్భుద్ధులొసగి నీ కరుణ ప్రసరింపమని ||అ||


బలహీనతల వలలోన బందీగ మారాను..

అస్తవ్యస్తపు మార్గముల నడచుచున్నాను.

సర్వభారంబులను నీ పరము జేశాను.

శ్యామ సన్నుత సాయి కావరావే యనుచు ||అ||


24) అలిగితివో ఆగ్రహించితివో (24.01)

అలిగితివో ఆగ్రహించితివో

మందభాగ్యుడని మదినెంచితివో !

దుర్మార్గమ్ములో జేసిన దోసగుల

క్షమియింపుము కరుణించుముసాయి || అలిగితివో॥


సతతము నీ నామమునేదలపక

సర్వము నీ కర్పణ జేయక

సాయీ సాయీయని సంతాపములలో

బిలచుచు, బలుకుచు, పిడించితినని ॥ అలిగితివో ॥


నాదను భావము లోలోనుండగ,

సర్వము సాయి యిచ్ఛయేయనుచు

బలుకుచు స్వార్ధముతో జీవించుచు,

నీ కపకీర్తిని దెచ్చుచుంటినని, ॥ అలిగితివో ||


అసత్యమాడుచు అహమున దిరుగుచు

అధర్మ మన్యాయముల తో బద్రుకుచు

కామ మోహమ్ముల వలలో గ్రుక్కుచు,

మ్రొక్కుచు నీవేశరణ మంటినని ॥ అలిగితివో ||


ధ్యాన సాధనల జపముల జేయక

నిష్ఠసబూరుల కలిగియుండక

భక్తిశద్ర్ధవిశ్వాసములుండక

శ్యామ చరణుడు సంచరించునని ॥ అలిగితివో ||


25) ఆటలనాడుచు నుంటివి దేవ (25.01)

ఆటలనాడుచు నుంటివి దేవ!

వేడుక జూచుచు మహానుభావా ॥ఆట॥


ఆటల నాడగ వేడుక జూడగ,

మేమెంతటివారము సాయిదేవా ॥ఆట॥


అహమున ముంచుచు నుంటివి దేవా

మోహము బెంచుచు నుంటివి దేవా

అహమున ముంచుచు మోహము బెంచుచు

ఐహిక చింతల నుంచుచు దేవా ॥ఆట॥


కామమ్ము ను కలిగించుచు దేవా

క్రోధమ్ము ను రెట్టించుచు దేవా

కామ క్రోధ కందకముల ద్రోయుచు,

కష్టములను కలిగించుచు దేవా ॥ఆట॥


మదమును లోలో పెంచుచు దేవా

మత్సరమును కలిగించుచు దేవా

మదమత్సరములలో బడ వైచుచు

మంచిని మరువగ జేయుచుదేవా ॥ఆట॥


స్వార్థంబును మదిబెంచుచు దేవా

లోభంబును కలిగించుచు దేవా

స్వా ర్థలోభముల మదిరగిలించుచు

మాయలలో బడద్రోయుచు దేవా ॥ఆట॥


సకలము నీదని నెంచుచు దేవా

సతతము నిన్నే దలచుచు దేవా

సకలము నీదని సతతము దలచుచు

నున్న శ్యామను గాచుచు దేవా ॥ఆట॥


26) ఇది నీ లీల కరుణా లోలా (26.01)

ఇది నీ లీల కరుణా లోలా

శ్రితజనపాల షిరిడి వాలా ॥ఇది॥


లోకమున గల బాధల వేల

నాకము నరకము మాటల వేల

ఇహపర సుఖముల యోచన లేల

నీ పదములను నమ్మిన వేళ ॥ఇది॥


బరువు బాధ్యతల చింతన లేల

పాప పుణ్యముల పలుకుల వేల

తీర్థయాత్రులలో తిరుగుట దేల

నీ చరణములను నమ్మిన వేళ ॥ఇది||


గురువుల కొరకు వెదుకగనేల

ఉపదేశంబుల కోరుటదేల

నిష్ఠ సబూరుల వదలని వేళ

శ్యామసాయి దయ కలిగిన వేళ ॥ ఇది॥


27) నీవెంతటి దొంగాడవు (27.01)

అహాహాహాహా.......

నీవెంతటి దొంగాడవు రా బంగారు సాయీ,

అడిగినదెల్లా నాకు వెను వెంటనే అందించి,

అదృశ్యముగా నిలిచి ఆడించు చున్నావు. ॥అహాహా॥


భక్తి నడుగ దలచినంత భుక్తి నడుగ జేసెదవు.

ముక్తిని కోరగ నెంచిన యుక్తిగ తప్పించెదవు

నీయందనురక్తి నెపుడు పెంచనీక ముంచెదవు

వంచిన, ముంచిన, త్రెంచిన, నిన్నొదలి పోదునా ॥అహాహా॥


నీ నామ స్మరణమె నా కిహపరముల భుక్తి

నీ రూప ధ్యానమే నా కెన్నటికైనా ముక్తి

నీలీలాగానములే పెంచును అనురక్తి

నీ చరణములే శరణము శ్యామచరణ వందితా ॥అహాహా॥


28) అపార కరుణాసాగరా (28.01)

అపార కరుణాసాగరా - అనంత ప్రేమమందిరా,

సమర్ధ సద్గురు సచ్చిదానంద సాయినాధ మహరాజ ॥అపార॥


అభయప్రదాత, అనాధరక్షక, ఆశ్రిత పోషక, నమో నమో….

ఆపద్భాంధవ అనంత మహిమా లీలా వినోది నమో నమో…. ॥అపార॥


భవ భయనాశక భక్తి ముక్తి ప్రద భావాతీత నమో నమో….

బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపా బంధనాశక నమో నమో…. ॥అపార॥


ఆది మధ్యాంతరహిత పరాత్పర అది దేవ గురు నమో నమో….

అనంత సృష్టి స్థితి లయకారక అత్రీనందన నమో నమో…. ॥అపార॥


సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాతా సచ్చిదానంద నమో నమో….

సజ్జన సన్నుత ముని జన వందిత మోహన రూపా నమో నమో…. ॥అపార॥


కామ క్రోధ మద మత్సర లోభ మోహనాశక నమో నమో…..

కాల స్వరూపా కాలాతీతా కర్మవినాశక నమో నమో…. ॥అపార॥


సంశయనాశక, సద్గురు నాయక సద్గతిదాయక నమో నమో….

సకల చరాచర వాసా పరేశా శ్యామేశా ప్రభు నమో నమో… ॥అపార॥


29) ఆగింరపుమా (29.01)

ఆగింరపుమా ! ఫలము లారగింపుమా !

పరమాత్మాసాయీశ్వర, పరమ కృపాసాగర || ఆరగింపుమా ||


సర్వము నీదే యైన నూ, నాది యనెడి అహము తోడ

నైవేద్యం బిడు చుంటిని నవ్వకుమా నాగసాయి ||ఆరగింపుమా ||


విశ్వమెల్ల నిండి యున్న నీ విటనే ఉన్నావని

అజ్ఞానముతో దలచుచు కుడము నారగింపవేడితి ||ఆరగింపుమా||


మాయాతీతుడవైనను మాయకు లోబడి నిన్నొక

మహాత్మునిగా భావించి నివేదనల చేయుచు నుంటి || ఆరగింపుమా||


రూపాతీతుడవైనను నిన్నొకరూపమున దలచి

అవివేకముతో నలుగుచు ఆహారములను దెచ్చితి || ఆరగింపుమా ||


మాయకు లోబడి యుంటినో, అమాయకునిగనుంటినో

ఎటు దలచిన నీవెగాదె నైవేద్యము గ్రహియింపుమా || ఆరగింపుమా ||


నైవేద్యము లారగించి నాసేవల ప్రేమగగోని,

అందించెడి చిలుము త్రాగి ఆనందించుము దేవా,

ఆదరించుమా మమ్మాదరించుమా

అనవరతము శ్యామదుల కనుగ్రహము నీయుమా || ఆరగింపుమా ||


30) ఇది ఏ కర్మ ఫలితమొ (30.01)

ఇది ఏ కర్మ ఫలితమొ, ఏ గ్రహ ఫలితమొ

నీ ఆగ్రహ ఫలితమొ, అనుగ్రహ ఫలితమొ

దెలియని వాడను సాయి భగవాన్

భగవాన్, భగవాన్, భగవాన్, భగవాన్, సాయి భగవాన్ ||ఇది ||


మనసును స్థిరముగ నీ పద పంకజ

ధ్యానము నందున నిలువనీయవు

సతతము భగవన్నామ స్మరణమును,

జేయగ నీయక శోధించెదవు || ఇది ||


ఐహిక చింతనల కలిగింతువు

దుశ్చింతనలను మది రగిలింతువు

అది ఇది నెరుగని స్థితిలో నుంతువు

ఆట బొమ్మగా నన్నాడింతువు || ఇది ||


ఎన్నడు నీ స్థితికి చేరుదునో

జన్మ పరం పరలెపుడు దాటుదునో

ఎయ్యది నీ పద సన్నిధి నొసగునో

దెలియని గతి లో శ్యామ యుండగ || ఇది ||


31) ఆవోసాయి (31.01)

ఆవోసాయి నారాయణ దరిశన దియో

తుమ్ హో జగతికే త్రాతా తుమ్ హో భాగ్య విధాతా ॥ ఆవో॥


త్వమేవ మాతా పితా త్వమేవ

త్వమేవ విశ్వవిధాతా…….. త్వమేవ సర్వవిధాతా ॥ ఆవో॥


త్వమేవ బ్రహ్మ త్వమేవ విష్ణు

త్వమేవ శంకర రూపా - త్వమేవ దత్త స్వరూపా ॥ ఆవో॥


త్వమేవ రామా… త్వమేవ కృష్ణా

త్వమేవ శిరిడి సాయి బాబా…. త్వమేవ సత్యసాయిబాబా ॥ ఆవో॥


32) శాంతి నొసగుము (01.02)

శాంతి నొసగుము దేవదేవ

సాయి దేవా శరణము (2).


శరణము శరణము శరణము

సాయి దేవా శరణము (2) ||శాంతి॥

తెలిసి తెలియక దోస ములను

చేసినామని చింత చేయకు (2)


కన్న తండ్రివి నీవుగాక గాచు వారెవరయ్య మమ్ముల||శాంతి॥


మంచి చెడుగుల తెలియుమయ్య

మాయ మర్మము లెరుగు మయ్యా

మనసు నిండుగ నిన్ను నమ్మిన 

మమ్ము కరుణతో కావరావా ||శాంతి॥


జపతపంబుల చేయలేము

ధ్యానములనొనరించలేము

తోచినట్టుల సాయి

స్మరణము చేయుచుంటిని కరుణతో ||శాంతి॥


దీనజనులను బ్రోతు వీవే

బాధ్యతల భరియింతు వీవే

సద్గతుల నందింతు వీవే

శ్యామ చరణుని దైవ ||శాంతి॥


33) ఎంత కాలమిటుల (02.02)

ఎంత కాలమిటుల వేరు చేతువో సాయీ

వేరు చేసి పేరుతోడ బ్రతుక చేతువో సాయీ ॥ఎంత॥


నేను నేను నేననుచు , బ్రతుకు నిలా లాగుచుంటి

నీవు ప్రేమ మయుడవంచు నిజ ముగ ప్రేమించకుంటి

కరుణామయుడవని బలుకుచు కలలో నిను దలచకుంటి

నిదుర మెలకువలలోన నన్ను నేనే దలచుచుంటి ॥ఎంత॥


నీ శక్తిని చూచి శరణు శరణనుచూ పలుకుచుంటి

భక్తి భావమే లేక భజనలనే జేయుచుంటి

నిజముగను నమ్మినటుల నిండుగ నటియించు చుంటి

భౌతిక వాసనల యందు బహు విధముల దగులు కొంటి ॥ఎంత॥


ఏ ఎండల కా గొడుగుల పట్టుకు బ్రతుకుచు నుంటిని

సత్య ధర్మ ప్రేమ శాంతి మార్గములో నడువ కుంటి

అపరిమితంబగు స్వార్థపు రూపము నేనుగ నుంటి

శ్యామ యనుచు పిలువ బడుచు ప్రేమను తెలియగ నుంటి॥ఎంత||


వీటన్నిటి దాట గలిగె మార్గములను తెలియకుంటి

మూర్ఖుడనై నీ కృపకు పడిగాపులు గాచుచుంటి

శరణాగత రక్షకా శ్యామ నాయకా సాయి

దూరమ్మును నుసి చేసి పేరును పరిమార్చి

నీలోనే కలుపుకో నీలోనే నిలుపుకో నీలోనే నిరతమ్ము కలుపుకో నిలుపుకో|| ఎంత ||


34) ఎందుకో వ్యామోహము (03.02)

ఎందుకో వ్యామోహము 

నాకెందుకో ఈ మోహము

నిజము గాదని దెలిసియు 

భ్రమకు లోనై బ్రతుకు చున్నా ||ఎందుకో||


రుచులు రుచులుగ ఎంత తినిననూ ,

మరల మరలా తినగ నెంచును

ఏమి మనసో.... నా దేమి మనసో ||ఎందుకో||


35) ఎన్నడు నీ దయ (04.02)

ఎన్నడు నీ దయ కలుగునో

నేనెన్నడు నీ దరి జేరుదునో

భవ బంధమ్ముల వలలు తెంచుకొని

బ్రహ్మానందము నెపుడు పొందుదునో


సాయి రామ... రామ సాయి... సాయి రామ ||ఎన్నడు||


మంచి చెడుగులను మది నెరుగకనే

తోచిన దారుల సాగుచుంటిని

ధ్యాన సాధనల సంగతు లెరుగక ,

మందమతిగ భువి మసలు చుంటిని ||ఎన్నడు||


ఎన్ని జన్మల పాప ఫలితమొ

మది నిలువదు నీ చరణములపై

ఏ ఏ దుశ్చర్యల ప్రతిఫలమొ

చేయగ నైతిని నామ జపంబును ||ఎన్నడు||


ఇహమున దేనిని పొందనైతిని,

పరమే తీరుగ నుండునో తెలియదు,

ఎందుకు యీ విధి శోధించెదవో

శ్యామచరణుని బాధించెదవో ||ఎన్నడు||


36) ఎంత కాలమని (05.02)

ఎంత కాలమని వేచియుందురా

ఏ క్షణమని నేనెదురుజూతురా

దయ జూపి నీ దరిశనమీయవు

మనసారగా నాతో మాటలాడవు ||ఎంత||


ఈ జన్మము నా కెటు లేర్పడెనో

ఏ ఏ కర్మము లెపుడు జేసితినో

ఏది ఎందులకు జరుగుచు నుండునో

తెలియక నీ భువి బ్రదుకు గడుపుచు ||ఎంత||


నిను నమ్మినచో నిర్భయ మగునని

నీ నామ స్మరణమే నిష్ట నొసగునని

సద్గురు సేవలే సబూరి యగునని

అపార కరుణతో బోధింతువనీ ||ఎంత||


అరిషడ్వర్గము లధికము లాయెను

సదాలోచనలు శూన్యము లాయెను

ఎదలో వేదన ల మితములాయెను

దరి చేరగా నీ వాదరింతువని ||ఎంత||


ఒకపరి నిను శరణాగతి వేడిన

వారల కరుణతో చేకొందువనీ

నమ్మితి నీ పదము లా శ్రయించితిని

నీ దరి జేరగా శ్యామ సన్నుతా ||ఎంత||


37) ఎంత చిత్రమైన వాడివయ్యా (06.02)

ఎంత చిత్రమైన వాడివయ్యా సాయినాథ

నీవెంతో చిత్రమైన వాడివయ్యా ...సద్గురు నాథ ||ఎంత||


కంటికి కనిపించకనే కరుణతోడ గాచెదవు

నీ దరిశన మీయకనే నిదర్శనము చూపెదవు

వింత వింత అనుభూతుల విభూతుల నొసగెదవు

అది ఇది యని దెలియరాని ఆనందము నిలిపెదవు ||ఎంత||


ఎంతటి దూరమున నున్న నీ వారిని చేసుకొందువు

ప్రేమగా పాలించుచు పవిత్రులుగ జేయుదువు

దుష్కర్మల ఫలితములను దూరము గావించెదవు

అంతట నీవున్నావని అనుభూతుల నొసగెదవు ||ఎంత||


చీమ దోమ శునకాదులుగా దరిశన మొసగెదవు

అది తెలియని శ్యామాదుల నాటల నాడించెదవు

నాది నీదను భావము నాశన మొనరించెదవు

నేర్పుగ నీవారి కెల్ల సద్గతులందించెదవు ||ఎంత||


38) ఎందుకు నాతో ఆటలాడెదవు (07.02)

ఎందుకు నాతో ఆటలాడెదవు ద్వారకమాయిశా

తగునా నన్నిటు నటు దిప్పగా షిరిడి సాయిశా ॥ఎందుకు॥


ఎందరెందరినో నా కడ కంపుచు నక్కియుందువయ్యా

అందరిలోనూ దర్శన ముసగుచు వెక్కిరింతువయ్యా ॥ఎందుకు॥


అనేక రూపంబులను ధరించి ఆదరింతువయ్యా

అన్నివేళలలో నా హృదయంబున దాగి యుందువయ్యా ॥ఎందుకు॥


క్రోధముతో నన్నాడగా చేయుచు నవ్వుచుందువయ్యా

ధైర్యమే లేకుండా జేసి దారి జూపవయా

కష్టమునందున మనసును ద్రోసి కానుపింపవయ్యా

సుఖముల నెన్నో కలుగజేయుచూ సంతసింతువయ్యా ॥ఎందుకు॥


శాంత గుణంబు

ల నా కందించుచూ సేదదీర్తువయ్యా

సైర్య ధైర్యముల మనసున నిలిపి సేమమిత్తువయ్యా


ప్రేమ భావమును పెంపొందించుచు పరిపాలింతువయ్యా

దైవభావమును నా మది నిలిపి దయ జూపింతువయ్యా ॥ఎందుకు॥


39) ఎందుకొచ్చితివి జీవా (08.02)

ఎందుకొచ్చితివి జీవా

నీవెందుకొచ్చితివి జీవా

ఎందుకొచ్చితివి ఎచటకొచ్చితివి

ఏమి చేయగా ఇచట కొచ్చితివి (2) ॥ఎందుకొచ్చితివి ॥


ఎగిరి పడుటకు వచ్చితివా

మిడిసిపడుట కేతించితివా(2)

ఎగిరిన ఎగిరిన ఎంతగా ఎగిరిన

ఏమున్నదిలే కాళ్లు విరుగును (2) ॥ఎందు కొచ్చితివి॥


మిడిసిపడినను మిడిసి పడినను

ముందరికాళ్ళకు బంధము

చూడవేముందుకు పోయేది

మార్గము నెరుగవే ॥ఎందు కొచ్చితివి జీవా॥


ఏమి తెలిసేనే జీవా నీకేమీ తెలిసేనే జీవా

తెలిసి తెలియక తెలిసి తెలియక

ఏమేమో ఏమేమో వాగుచుంటివి

వాగుచు నుండుట వాగ్బంధం బని

తెలిసి తెలియక బోర్లపడదెవే ॥ఎందుకొచ్చితివి జీవా॥


నీదేమున్నది చూడక తెలియక(2)

నాది నాదని నాదీ నాదని

నగుబాట్లను పొందుచుందువు ॥ఎందుకు కొచ్చితివి॥


త్రికరణ శుద్ధిగా కోరినదేదీ (2)

మరణము దనుక వదలనందురే

మరణమే నీకు శరణం మటంచును

మరల పుట్టుచూ మరల గిట్టుచు (2) ॥ఎందుకొచ్చితివి జీవ॥


అందరి మధ్యన బ్రతుకుచున్నను

ఎందెరెందరితో కలుసుచున్నను


అందరిలోనూ ఎందరు వత్తురో

ఎవరికెవ్వరో ఎవరెవ్వారో

తెలిసి బ్రతుకవా జీవా

సత్యము నెరిగి బ్రతుకవా జీవా (2) ॥ఎందుకొచ్చితివి॥


గతంలోన నీవేమి గా నుంటివో

ఏమి కోరుకొని ఇటు చేరితివో

ఏమీ కోరకున ముందెటులవునో (2)

ఏ గతిగా నీవు బ్రతుకుచు నుందువో ॥ఎందుకు వచ్చితివి జీవ॥


వచ్చిన సమయము వ్యర్థము చేయక

వ్యధలను తీర్చెడి సద్గురుని చేరి

అజ్ఞానమునే ధ్వంసం చేసెడి

ప్రేమ మయుండగు సాయిని చేరి ॥ఎందుకు వచ్చితివే జీవ॥


బరువు బాధ్యతల తలచి కృంగుచూ

చేయవలసినది చేయగలేక

నిరుపయోగమగు ఊహలలోన తిరిగి తిరిగినా

తిక్కబట్టునే సత్యము నెరుగవే జీవ ॥ఎందుకొచ్చితివి జీవా॥


40) ఉయ్యాలలూగవయ్య ... (09.02)

ఉయ్యాలలూగవయ్య ...

రామా రామా రామాభిరామ

సీతారామా శ్రీ సాయి రామా


సీతమ్మతో గూడి - ఉయ్యాలలూగుచు

ఆర్తులను గాచుచు అభయముల నొసగుచూ

విశ్వకళ్యాణమున కవతరించిన రామా

హాయిగా, ఠీవిగా ఉయ్యాలలూగుమా ||ఉయ్యాలలూగవయ్య ||


నీకు నీవే సాటి - లేరెవరు నీ పాటి

శరణన్న వారలను కావగల మేటి

కళ్యాణ ధామా కళ్యాణరామా

సీతమ్మతో గూడి - ఉయ్యాలలూగుమా ||ఉయ్యాలలూగవయ్య ||


లోకములు శ్రేయమై విశ్వామానందమై

సకల శుభములు కలుగ కన్నులకు పంటయై

శ్యామాదులను పరిశుభ్ర మార్గమున

నడిపించ కరుణతో ఉయ్యాలలూగుమా ||ఉయ్యాలలూగవయ్య ||


41) ఎంత మధురము (10.02)

ఎంత మధురము, నీ నామమెంత మధురము

ఎంత మధుర మెంత మధురము

మధురాతి మధురము నీదు నామము

సాయి రామ తండ్రీ సాయి రామ దేవా


సాయి, సాయి ,సాయి, సాయి, సాయి, సాయి యనిన

ఎంతకాల మెంతకాల మెంతకాల మనిన గాని

రామ, రామ,రామ ,రామ ,రామ, రామ, యనిన

ఎంతకాల మెంతకాల మెంతకాల మనిన గాని


సాయిరాం, సాయిరాం ,సాయిరాం అనిన గాని

సాయి తండ్రి ,సాయి తండ్రి ,సాయి తండ్రి అనిన గాని

సాయి దేవ ,సాయి దేవ, సాయి దేవ యనిన గాని

సాయి బాబ, సాయి బాబ, సాయిబాబ యనిన గాని


సాయి దత్త, సాయి దత్త , సాయి దత్త యనిన గాని

సాయి హనుమ,సాయి హనుమ, సాయి హనుమ అనిన గాని

మౌలా సాయి, జీసస్ సాయి, మౌలా సాయి యనిన గాని


ఏమనిన, ఏమనిన ,ఏదనిన, ఎటులనిన, ఎపుడయున

సాయి, సాయి, సాయి యని జోడించు కొనిన

ప్రేమలొలుకు నీ చూపులు చూసిన చాలును తండ్రీ

కరుణ చాలు నాకు, నీదు చూపు చూచిననూ చాలు


నన్ను నేను మరిచిపోదు, నీ నామము స్మరియుంచుచు, స్మరియుంచుచు

నీ రూపము ధ్యానించుచు, ధ్యానించుచు, ధ్యానించుచు

నీ రూపము నే చూచుచు, నే చూచుచు, నే చూచుచు

సాయి అని పలికినను సాయి అని పిలచిననూ


సాయి అని స్మరించిననూ, ఏదో తెలియని హాయి

మది నిండుగ నిండు సాయి ఇదేమి చిత్రమో, ఎంత విచిత్రమో

ఎంత మధురమో, నీ రూప మెంత మధురమో॥ ఎంత॥


42) ఎంత చిత్రమైనదో నీ లీల (11.02)

ఎంత చిత్రమైనదో నీ లీల

మరెంత చిత్రమైనదో మా గోల ॥ఎంత॥


నీదు లీల నెరుగకయే మా గోలల వినిపింతుము

విసుగు గొనక వినుచుంటివా కరుణాలోలా॥ ఎంత॥


ఆనందము నందు గానక అందరినీ రమ్మనుచు

ఆదర మోవ్వగ ప్రేమతో బిలుచుచు, నుండగ

ఆనందమున కర్దము తెలియలేని మా బ్రతుకుల

ఆకారమే అహమును పెంచును అల్పుని జేయునే మనసా

వినయ వివేకములు, లేని ఎడల అది విషముగా మారునే మనసా

అనుకున్నది నిజమని బ్రభమియక, నిజము తెలియవే మనసా

నిను నీ వెరిగిన శ్యామనాథుని నిక్కము తెలియవే మనసా॥ఎంత॥


43) ఏ క్షణమున నీ కరుణ (12.02)

ఏ క్షణమున నీ కరుణ ప్రసరింప చేతువో

ఏ క్షణములో నన్ను ప్రేమ గాచెదవో॥ఏ॥

సాయి....రామా.... సాయి.... రామా ॥ఏ॥


అయిన వారెవరయ్యా, కాని వారెవరయ్యా

ఉన్నదేదోనయ్యా ణలేనిదేదోనయ్య


ఏ తీరుగా నేను జీవించవలయునో

ఏమాత్ర మెరుగక నిన్ను నమ్మితినయ్యా ॥ఏ॥


క్రుళు కుత్సితముల నెరుగగా లేదయ్యా

వంచనల మోసముల దెలియగా లేనయ్యా


ఇచ్చికము లాడేడి మనసు లేదు గదయ్యా

లోకంబులో నేను బ్రతుకు విధమేదయ్యా ॥ఏ॥


పరుల సంపదలకు ఆశపడలేదయ్యా

మెప్పుదనముల గోరి మిడిసిపడ లేదయ్యా


కలిగినంతటిలోనే కాపుర మెనరింప

నీ ఆశ్రితుల కేల కలత లిచ్చితివయ్యా ॥ఏ॥


దీన జన బాంధవా దిగులు తొలగించుమా

ఆశ్రిత పోషకా నన్నాదు కొమ్మా

ద్వారకామాయశా దరి జేర్చరమ్మా

శామచరణానాధులకు సంతసమ్ములిమ్మా ॥ఏ॥


44) ఏల కానరావయ్య (13.02)

ఏల కానరావయ్య బృందావన విహారా

ఎందు దాగినావయ్యా రాధా మానస చోరా॥ ఏల॥


పున్నమి వెన్నెల రాత్రులు కన్నుల పండువు జేయగ

నానా విధ సువ్ర బాలలు సుగంధముల విరజిమ్మగ

సుందర యమునా తీరము నీ రాకకు తపించగ

చల్ల చల్లని పిల్లగాలి నీ కొరకటు నిటు దిరుగగ ॥ఏల॥


చిరుమువ్వల సవ్వడులు ఘల్లు ఘల్లుమనగ

మురళీనాదము మోహనరాగ మాలపించగా

సమ్మోహమున జగమే సంతసమును బొందగా

నీ పద భక్తులు నీకై పరిపరి విధముల వేడగా ॥ఏల॥


45) ఏ ప్రాంతమందున (14.02)

ఏ ప్రాంతమందున జనన మెందితివో

కులమేమో మతమేమో నీదు పేరేమో ?

తెలియగా లేరయ్యా! రూప గుణ రహిత

రామ శివ మారుతి దత్త గురు సాయీ ॥ఏ ప్రాంత॥


పత్రీ గ్రామము నందు జనన మెందితివంట

జమునాబాయ్ నందలాల్ తనయుడ నీవంట

బాల్యము నందె యెక ముస్లిం ఫకీరు కడ

ప్రేమ వాత్సల్యముల పొంది పెరిగితివంట ॥ఏ ప్రాంత॥


నీదు సంకల్పమున వేంకుసా గురుచేరి

శుశ్రూషులను చేసి కర్తవ్య మెరిగి

గురుని ఆజ్ఞల బొంది గోదావరిని చేరి

ఆ చెంతనే నున్న షిరిడీ చేరితివంట ॥ఏ ప్రాంతమందున॥


బాధితులందరినీ బాగుపరచితి వంట

సద్భక్తులకు ముక్తి పదము నిచ్చితివంట

నమ్మి నిన్నే గొలుచు శ్యామ చరణునిగాచి

రక్షించి బ్రోచుచూ నిలిచి యున్నా వంట ॥ఏ ప్రాంతమందున॥


46) ఏదిరా నిజమేదిరా? (15.02)

ఏదిరా నిజమేదిరా? చివరకు నిలిచేదేది రా ?

అనుమానములను అంతము చేసి అనంతమై మిగిలేదేదిరా॥ ఏదిరా॥


జీవుడు, దేవుడు,ఒక్కటే యనుచు అద్వైతము బోధించును రా

జీవుడు దేవుడు వేరు వేరనుచు ద్వైతము ఉద్భోదించును రా ॥ఏదిరా॥


ఉన్నది లేదని దేవుడు కలడని అతడే మూలంబని యందురురా

ఉన్నది కలదని దేవుడు లేడని మనోరోగ మది యని అందురు రా ॥ఏదిరా॥


వాక్కుకు మనసుకు అందని స్థితి యని

అదియే దైవంబని యందరు రా

ఊహాజీవుల సోమరి పోతుల

పిచ్చి భావమది యని అందురురా ॥ఏదిరా॥


మంచి చెడుగులను బేధ భావములు

లేని కాలమే లేదందురా

తర్కవాదములతో సత్యమును తెలియుట

సాధ్యము కాదందురురా ॥ఏదిరా॥


విశ్వమే తానై తానే దైవమై

నిలచిన జ్ఞానిని చదువమందుదురు రా

అటు చదవకనే అహమని బలికిన

అవివేకం బది యని యందరురా ॥ఏదిరా॥


శ్యామనాథుడగు సాయినాధుడే

అట్టి దైవంబని యందురు రా

సాయిని ప్రేమతో సమాశ్రయించిన

సత్యము అనుభవమగు నందురు రా


అదియేరా నిజమదియేరా

చివరకు నిలుచునది యేరా

అనుమానములను అంతము చేసి

అనంతమై నిలచెడి దది యేరా ॥ఏదిరా॥


47) ఏమి చేయగా నెంచితివో (16.02)

ఏమి చేయగా నెంచితివో

నన్ను ఏమి చేయగా నూహించితివో

ఎరుగలేనయ్యా సాయి దేవా

పరమ పురుష ప్రేమ స్వభావా ॥ఏమి॥


బహు దుర్లభమగు మానవ జన్మను

నా కొసంగీతివి వాత్సల్యముతో

సార్ధకత లేని వ్యామోహంలలో

ఎందుకు తోసితివయ్యా దేవా ॥ఏమి॥


చిక్కుల నెన్నో కల్పించెదవు

ధైర్యమెసంగక దండించెదవు

ఏమి చేసితినో నీ కపకారము

కృప చూపక నన్నేడిపించుటకు ॥ఏమి॥


అధిక సంపదల నాశించలేదు

అధికారంముల కోరగలేదు

నిష్ట సబూరుల నా కొసగుమని

నిను ప్రార్థించుట నేరమాయెనా ॥ఏమి॥


48) ఏ రూపంబని నిను (17.02)

ఏ రూపంబని నిను ధ్యానించను,

ఏ నామంబని మది స్మరియుంచను,

ఏ నామంబని హృది జపియుంచను ,

తెలియని దీనుడ శ్యామచరణుడును,

దయ నీవారల గావ వేడెదను ॥ఏ రూప॥


క్రిమి కీటక పశు పక్ష్యాదులలో

నర వానర దేవాది గణములతో

విశ్వమెల్లడల నీవున్నావని

నిదర్శనముల నొసగితి వనగా

నీ భక్తులకు జూపితి వనఘా ॥ఏ రూప॥


ఆది మధ్యంతరహితుడ నీవనీ

సృష్టి స్థితి లయ గతులు నీవనీ

అనంత నామములన్నీ నీవనీ

నిదర్శనములనొసగితివనగా

నీ భక్తులకు తెలిపితి వనఘా ॥ఏ రూప॥


49) ఎందులకీ యోచనలు (18.02)

ఎందులకీ యోచనలు 

మనకెందులకీ సమాలోచనలు

యోచనల చేసి తీర్పుల చేసి 

సాధించునదా సాయి మార్గము ॥ఎందు॥


సాయి సాయి అని పలుకుట 

తోడనే సమయము లెల్ల గడిచిపోయినె

సాయియె సకల విశ్వమయుండని 

సత్యము నేరిగే సమయమ దెప్పుడు ॥ఎందు॥


వాదన చేత వ్రాతల చేత 

వశమవునా శ్రీ సాయి మార్గము

భజనల చేత ప్రార్థనల చేత 

అనుభవమగునా సాయి మార్గము ॥ఎందు॥


అంతరంగమును శుద్ధి చేసుకుని, 

త్రికరణ శుద్ధిగా పలుక నేర్వని

మనసుల తోడ మరి మరి వెదికిన 

మనకు దొరకునా సాయి మార్గము ॥ఎందు॥


తన మనసునే తాను నమ్మలేని 

తత్తర పడెడి మందభాగ్యులకు

చీటికిమాటికి చిరుబురులాడుచు 

ఓర్పుగ నుండని మతిహీనులకు


ఎటు కలుగునో కదా శ్రీ సాయి కృప

ఎటు నడుతురో గదా సాయి మార్గము ॥ఎందు॥


50)రామా పట్టాభి రామా (19.02)

రామా పట్టాభి రామా రామా కోదండ రామా

రామా కళ్యాణ రామా రాఘవా

రామా సీతాపతి రామా నీవే గతి

రామా నీకు మ్రొక్కితి రామా నీచే చిక్కితి

రామా నాకెవరు తోడు రామా క్రీగంట జూడు

రామా నేను నీ వాడ రామా నాతో మాట్లాడు

రామా నీ నామమె మేలు రామా చించతనే చాలు

రామా నీ నామమె మేలు రామా నీ చింతనె చాలు


51) శరణు శరణు రఘు రామా (20.02)

శరణు శరణు రఘు రామా సాయి రామా.

సాయి దత్త గురు నామా 

సద్గుణ సాయి ధామా ప్రభో సాయిరామా


సాయి సాయి యని స్మరియించిన చాలు

సకల పాపంబులే సమసి పోవు


సాయి సద్గురు కరుణే సదా తోడు నీడయై

గాచి రక్షించి ప్రేమ మీర బ్రోచు గాదా


సకల దైవ స్వరూపములు సాయియే

సకల ప్రాణి స్వరూపములు సాయియే


ఎవ్వరెటుల గొలిచినా ఎవ్వరెటుల పిలచినా

ఆలకించి సర్వము సమకూర్చు గాదా.


52 ) శరణం శరణం శ్రీ శ్యామ చరణం (21.02)

శరణం శరణం శ్రీ శ్యామ చరణం
హృదయా భరణం సంకటహరణం
శరణం శరణం శరణం శరణం
గురుదేవా నీ గుణముల త్రోవ 

నిత్యము నడువా శక్తినీయవా ॥2॥
 
మహదేవా నీ మహిమను కొలువ
వాక్కు నొసగవా ప్రేమ చూపవా
నీవు నిండిన మనసు కెన్నడు చేటేరాదయ్యా
నిన్ను నమ్మిన బ్రతుకు ఎప్పుడు లోటేరాదయ్యా
 
కామ క్రోధ మద లోభ హరణమౌ
దివ్య స్మరణం శ్రీ శ్యామ చరణం
శ్రీ శ్యామ చరణం ॥శరణం శరణం॥
 
రాగ ద్వేషమే పదముల పూజ చేసి 

తరించ కరుణించవయ్యా
దివ్య తేజ నీ దర్శన కాంక్ష 

భవముల తీర్చ మన్నించవయ్యా
 
నిరతము నిన్నే భక్తిని కొలిచితి
దయ చూపగ రావా సతతము
నీకై తపమునరించితి నన్ను బ్రోవగ రావా
ధర్మ ,అర్థ ,కామ ,మోక్ష ,మంత్రమౌ దివ్యస్మరణం
శ్రీ శ్యామ చరణం శ్రీ శ్యామ చరణం ॥శరణం॥

53 ) పావన గుణ నామ హరే (22.02)

పావన గుణ నామ
హరే పరమ దయా నిలయా
హరే మాయా మానుష రూపా
మాయాతీత మంగళ ధాత
వేదాంత వధూ హృదయ
విహారా వేదమయా పరమానంద రూప॥ పావన॥
కరుణారస భర నయనా
దరహాస మనోహరవదనా
నవ తులసీదల మాలా భరణా
నానా జీవన నాటక కారణ॥ పావన॥

54) హరి నారాయణ, హరి నారాయణ (23.02)

హరి నారాయణ, హరి నారాయణ,
హరి నారాయణ గోవిందా॥॥
 
అచ్యుత, కేశవ, మాధవ,
మురహరి హరి నారాయణ గోవిందా ॥ హరి ॥
 
వామన, నృసింహ, జనార్ధన,
శ్యామ హరి నారాయణ గోవిందా ॥హరి ॥
భక్తి ప్రదాతా , ముక్తి ప్రదాత,
హరి నారాయణ గోవిందా ॥హరి॥

55) వందనం వినాయకా..... (24.02)

వందనం వినాయకా.....
ఓం నమో గజానన॥

ఓం నమో మూలాధారా........
ఓం నమో శ్యామధారా॥
ఓం నమో ప్రణవ స్వరూపా
ఓం నమో ప్రేమ స్వరూపా
ఓం నమో కృపా స్వరూపా
ఓం నమో సాయి స్వరూపా ॥ వందనం వినాయక॥


56) అంబా భవాని జగదంబ భవాని (25.02)

అంబా భవాని జగదంబ భవాని॥2॥
శ్రీ చక్రధారిని ఆనందదాయుని ॥2॥
జ్ఞాన స్వరూపిణి జ్యోతి ప్రకాశిని॥2॥
ఓంకార రూపిని విశ్వవినోదిని॥2॥ ॥అంబా భవాని॥


57) గోవింద గోపాల నీలమేఘశ్యామ్ (26.02)

గోవింద గోపాల నీలమేఘశ్యామ్
నీల మేఘశ్యామ భజో సాయి గణేష్ శ్యామ్
సాయి గణ శ్యామ్ మేర సాయి గణ శ్యామ్
మురళీమనోహర సాయి గణ శ్యామ్
గోవింద హరి గోపాలహరి గోవర్ధన గిరిదారి శ్యామ
సుందర మదన మోహన బృందావన సంచారి


58 ) ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప (27.02)

ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప
శరణం దే స్వామి కరుణించవేమి
నారాయణ హరి గోవింద గోపాల
మురళీ మాధవ వారింజబాంధవ ॥2॥

59) అవధూత చింతన గురుదేవ దత్త (28.02)

అవధూత చింతన గురుదేవ దత్త ॥ అవధూత॥
దిగంబరా దత్త దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా సాయి దిగంబరా

శ్రీపాద వల్లభ దిగంబరా
శ్రీపాద వల్లభా దిగంబరా
అత్రి నందన దిగంబరా
అనసూయత్మజ దిగంబరా
అవధూత రూపా దిగంబరా

శ్రీ గురుదేవా దిగంబరా
జయ గురుదేవా దిగంబరా

సమర్థదేవా దిగంబరా
సద్గురు దేవా దిగంబరా
 
దిగంబరా దత్త దిగంబరా
దత్త దిగంబరా దత్త దిగంబరా
 
దిగంబరా సాయి దిగంబరా
సాయి దిగంబరా సాయి దిగంబరా
 
దిగంబరా బాబ దిగంబరా
బాబ దిగంబరా బాబ దిగంబరా
 
దిగంబరా శ్రీ గురు దిగంబరా
శ్రీ గురు దిగంబరా శ్రీ గురు దిగంబరా
 
దిగంబరా సద్గురు దిగంబరా
సద్గురు దిగంబరా సద్గురు దిగంబరా
 
దిగంబరా జయ గురు దిగంబరా
జయ గురు దిగంబరా జయ గురు దిగంబరా
 
అవధూత దిగంబరా శ్రీపాద వల్లభా దిగంబరా......
 

60) ఆత్మా రామ ఆనంద రమణ (29.02)

ఆత్మా రామ ఆనంద రమణ
అచ్యుత కేశవ హరి నారాయణ
భవ భయ హరణ వందిత చరణ
రఘుకుల భూషణ రాజీవలోచనా ॥ఆత్మా రామ॥

ఆదినారాయణ ఆనంతశయనా
సచితానంద శ్రీ సాయి నారాయణా

61) భగవన్నామమే తరుణోపాయము (01.03)

భగవన్నామమే తరుణోపాయము
బంధములూడుటకు అది ఉపాయము ॥భగవన్నామమే॥

సాయిరాం సాయిరాం సాయిరాం 
సాయి శ్యామ్ సాయి శ్యాం 
సాయి శ్యామ్ సాయి శ్యామ్ సాయిరాం
నేను నాదనెడి భావము చేత
బంధింపబడిన బడుగు జీవులకు
అజ్ఞానముతో అలమటించెడి
అసలు సత్యమును తెలియని వారికి ॥భగవన్నామమే॥

ఆనందమునకు పాకులాడుచు
అది ఐహికమున కలదని

అందురు కామాదులలో పరిభ్రమించుచు

అశాంతితో కూడా తోడ జీవించు వారికి ॥భగవన్నామమే ॥


వాల్మీకి వ్యాస మహర్షులందరు
తుంబుర నారద గంధర్వులందరు
త్యాగయ్య అన్నమయ్య భక్తాదులెందరో
మైమరచి స్మరించి పులకించి తరియింప ॥భగవన్నామమే॥

62) గురుదేవా జయదేవ సాయి దేవా దయామయా (02.03)

గురుదేవా జయదేవ
సాయి దేవా దయామయా
విభూతి సుందర శశాంక శేఖర ॥2॥
సాయి శంకర దయాకరో॥2॥
దయాకరో దయాకరో
దయాకరో ప్రభు దయాకరో
సాయి శంకర దయాకరో॥
గురుదేవా జయదేవ॥
గోపిక రంజన సాయి
గోపాల రఘుకుల తిలక
సాయిరామ దీన జనావన
దయాకరో ప్రభు దయాకరో
దయాకరో దయాకరో ప్రభుదయాకరో ॥గురుదేవా జయదేవ॥


63) ప్రభో సాయి రామ రావా.....మమ్మేలు కోరా (03.03)

ప్రభో సాయి రామ రావా.....
మమ్మేలు కోరా షిరిడి నివాసా శ్రీనివాసా ॥ప్రభు॥
 
తల్లివి నీవే తండ్రివి నీవే గురువు దైవము
నీవే రాముడు నీవే కృష్ణుడు
నీవే దత్తమారుతి నీవే శివ నాగ సాయి
నీవే శ్యామ సాయి నీవే జయహో సాయిశా....
జయహో సాయిశా .....॥ప్రభొ॥
 
నీవే దిక్కని నిరతము నమ్మి కొలిచే వారము
దేవా కరుణను చూపి కడదేరిడి
మార్గములను చూపగా రావా రంగనాథ సాయి
నీవే రామదాస నీవే జయహో
సాయిశా.... జయహో సాయిశా.... ॥ప్రభో॥
 
సుఖదుఃఖములకు చెదరని మనసును
కరుణనొసంగుము స్వామి
సద్భక్తులమై నీ పద సన్నిధి చేరగ చేయుము స్వామి
మము దయ గనవే సాయి ద్వారకామాయి
ఈశ మహేశా సాయి నటేశా శామసన్నుతా॥ ప్రభు॥
 
 64) ఇది ఏమి ఆటరా తండ్రీ ! ఇది ఏమి వేడుక దేవా! (04.03)
ఇది ఏమి ఆటరా తండ్రీ !
ఇది ఏమి వేడుక దేవా!
ఇటు నటు నూపుచు
అటు నిటు జేర్చక ఆడించుచున్నావు సాయి.... ॥ఇది ॥

భక్తితోడ నిన్ను తలచ దలంచిన
భవ బంధములు బంధములాయెను
నీదు లీలలను గానము జేయగా నెంచిన
నా మది నిలువక పోయెను లోకవాసనల
వ్యామోహములతో మంచి చెడుగుల
విచక్షణ లేక గుడ్డివానిగా బతుకుచు నుంటిని
పిచ్చివానిగా వాగుచు నుంటిని ॥ఇది॥
 
పరబ్రహ్మమే నీ వనెడి నిజము పరిపూర్ణముగా
తెలియగ నైతిని బాధ్యతలను భరియంచెడి
నిన్ను భక్తిగ నెపుడు గొలువ నైతిని సర్వము
నీదని అనుకొనుచు నాది యనుచునే భ్రమ పడుచుంటిని
జ్ఞానము నొసగక శ్యామను ఈ భువి అవివేకముతో బ్రతుకగ జేయగా ॥ఇది॥
 
65) గురుదత్త దిగంబర తవ శరణం (05.03)
గురుదత్త దిగంబర తవ శరణం
దత్త దత్తా దిగంబర తవ శరణం
గురుదత్త దిగంబర తవ శరణం
సాయి దత్తా దిగంబర తవ శరణం ॥గురు॥
 
అత్రిసుత అనసూయ నందన
యోగిరాజ గురు తవ శరణం ॥గురు॥

శ్రీపాద శ్రీవల్లభ యతివర
నరసింహ సరస్వతి తవ శరణం ॥గురు॥

కార్తవీర్య గుత్తి ముక్తి ప్రద
పింగళ పూజిత తవ శరణం ॥గురు॥
 
ఘోరక గర్వ వినాశక దత్త
అవధూత నిరంజన తవ శరణం ॥గురు॥
 
హీన దీన తారక పురుషోత్తమ
వాసుదేవ గురు తవ శరణం ॥గురు॥
 
ఏకనాథ జనార్ధన స్వామి
అక్కలకోట గురు తవశరణం॥ గురు॥
 
పూర్ణ పరాత్పర సగుణ గుణేశ్వర
నిరాకార గురు తవ శరణం ॥గురు॥
 
నారాయణ భైరవ మాణిక్య ప్రభు
రంగతార గురు తవ శరణం॥ గురు॥
 
నీలకంఠ ఆలమ బకనూరి
సాయినాథ గురు తవశరణం॥ గురు॥
 
దాసోపంతు యవన నుఁప
తారక సిద్ధ సరస్వతి తవ శరణం ॥గురు॥
 
66) పాహి పాహి యనుచు నీదు (06.03)
పాహి పాహి యనుచు నీదు వెంట నేను
బడుచు నుండ పారిపోవనుంటివా సాయి
దేహి దేహి యనుచు నిన్ను కోరికలతో
దేవురించ రాలేదు లే నేను
సాయి..... సాయి.. బాబా... బాబా ...సాయి...
 
కామ క్రోధ లోభ మోహ మద మత్సరముల
వలలో చిక్కి నిన్ను వేధింతునా సాయి ....
నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించు
భయము లేదనుచు సాయి సాయి ...బాబా ....బాబా.. సాయి...

ఎంతటి కష్టములనైన భరియంచెడి
శక్తి నొసగి కృప చూపి బ్రోవుమా
సాయి అంతట నీవు నిండి ఉన్నావను
సత్యమును శ్యామ హృదయ చేయుమా సాయి...
 
67) రమణ రమణ భగవాన్ (07.03)
రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణా యనరే॥
మరణ మనిన చింతించే మనసును గనరే
మాయ మనసును గనరే మన మనసును గనరే॥
భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణా యనరే ॥
నేనెవరని పరికించెడి మార్గము గనరే దివ్య మార్గము గనరే

రమణ మార్గము గనరే సులభ మార్గము గనరే
సాయి మార్గము గనరే ॥
నేను నీవు నశించెడి భావము గనరే
సద్భావము గనరే
సాయి భావము గనరే
రమణ భావము గనరే
రమణ రమణ రమణ రమణ రమణాయనరే ॥
ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే
లోకతీరును గనరే
లోకేశ్వరు సేవించడి పదమును గనరే
దివ్య పదమును గనరే
రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్ రమణ రమణ రమణ రమణ రమణాయనరే ॥
 
అరిషడ్వర్గములు వర్గములు జేయు వింతలు గనరే
వింత వింతలు గనరే
వింతల నశింపజేయు చరణము గనరే
రమణ చరణము గనరే
శ్యామాదులు సేవించడి చరణము గనరే
రమణ చరణము గనరే
॥రమణ రమణ భగవాన్ రమణ రమణ భగవాన్
రమణ రమణ రమణ రమణ రమణాయనరే॥

68) అత్రి నందన అనసూయత్మజ (08.03)

అత్రి నందన అనసూయత్మజ 

శ్రీ గురుదేవా దత్త గురూ...

దత్త గురు దత్త గురు

దత్త గురు దత్త గురు అవధూత నిరాకారి

దత్త గురు త్రిభువనాధ కేళి...

త్రిమూర్తి రూపా త్రిగుణాతీతా

దత్తాత్రేయ గురు దేవా .....

అవధూత నిరాకారీ

దత్త గురు త్రిభువనాధ కేళి ..... దిగంబరా దిగంబరా

దిగంబరా దిగంబరా.... శ్రీపాద వల్లభా

దిగంబరా దిగంబరా.... దిగంబరా దిగంబర

దిగంబరా దిగంబరా అవధూత చింతన

దిగంబరా దిగంబరా


69) సాయి నామ మను మధురామృతము (09.03)

సాయి నామమను మధురామృతమును 

గోలగ రండి జనులారా.........

శాంతి సౌఖ్యముల నందు కొనుచు

ఆనందము నందుడు జనులారా..... ॥ శ్రీ సాయి॥


దైహిక బాధల దాడి ఐరుంగని

స్థితిని చేరుడోజనులారా

లౌకిక వాంఛలను తప్పుకొని

స్థిరత్వమెందుడు జనులారా

స్థిరతను బొందుడు జనులారా॥ శ్రీ సాయి॥


కాంతా కనకపు కామమోహముల

వలలో బడకుడు జనులారా

శాంతి కొరకు శ్రీనాధుని మదిలో

చింతన చేయుడు జనులారా.... సాయి॥


ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల

గలిగి యుండుడో జనులారా

బహు దుర్లభమగు ముక్తి పదమును

శ్యామచరణుని సూక్తులను ఆసక్తిగా

వినుడోజనులారా (ముందుగా దెలియుడు జనులారా)


(బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే) రాగం)


70) సాయి నన్ను బ్రోవ భారమా (10.03)

సాయి నన్ను బ్రోవ భారమా

రామ సాయి నన్ను బ్రోవ భారమా

శివ సాయి నన్ను బ్రోవ భారమా

కృష్ణ సాయి నన్ను బ్రోవ భారమా

శ్యామ సాయి నన్ను బ్రోవ భారమా //సాయి//


మంచి చెడుగులను భేదము

మది నెంచక యుండుట నా నేరమా

సాయిరామ నన్ను బ్రోవ భారమా...


కామ క్రోధాదుల తోడను...

కలహించి జీవించుట నా నేరమా... ॥సాయి॥


దానధర్మంబుల జేయక

నీచ స్వార్థంబు నడతలు నా నేరమా... ॥సాయి ॥


ఈర్ష్య అసూయలతోడను

భక్తులందరినీ దూరట నేరమా...॥ సాయి॥


తప్పులన్నీ తెలిసి కృంగుచు

నీకు చెప్పుకొనుటయే నేరమా ...॥సాయి॥


మెప్పుదనముగా నే పొంగుచు

నా గొప్పదనము గోర నేరమా...॥ సాయి॥


చేయరాని పనులు చేసితి,

మరి వినగరాని మాటలాడితి నని ..॥సాయి ॥


శ్యామచరణుని నన్ను దూరము చేయకుమని

వేడుకొందును నిన్ను దైవమా ..॥సాయి॥


71) ఏ ప్రాంత మందున జనన మందితివో (11.03)

ఏ ప్రాంత మందున జనన మందితివో

కులమేమో ? మతమేమో? నీదు పేరేమో?

తెలియగ లేరయ్యా ! రూప గుణ రహితా

రామ శివ మారుతి దత్త గురు సాయి...


పత్రి గ్రామము నందు జనన మందితి వంట

జమునా భాయ్ నందలాలు తనయుడవు నీవంట

బాల్యమునందే ఒక ముస్లిం ఫకీరు కడ

ప్రేమ వాత్సల్యముల పొంది పెరిగితివంట...


నీదు సంకల్పమున వేంకుసా గురుజేరి

శుశ్రోషలను చేసి కర్తవ్య మెరిగి

గురుని ఆజ్ఞల బొంది గోదావరిని చేరి

ఆ చెంతనే నున్న షిరిడీ చేరితివంట....॥ ఏ ప్రాంత॥


బాధితుల నందరిని బాగుపరిచితివంట

సద్భక్తులకు ముక్తి పథము నిచ్చితివంట

నమ్మి నిను జేరడి భక్తులందరగాచి

నిన్నే కొలుచు శ్యామచరణుని గాచి

రక్షించి బ్రోచుచు నిలిచి ఉన్నావంట ॥ఏ ప్రాంత


72) దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా ! (12.03)

దయ చూపి ప్రేమతో దరి చేర్చుకోవా !

నీ పాదముల చెంత పడి ఉండనీవా!...

చాలు నీ సంసారము సాయిరామా !..

ఆదరించగ రమ్ము ఆత్మాభిరామ !..


శ్రీరామ రఘురామ శృంగార రామా

జయ రామ జయ రామ జానకి రామా...॥ దయ ॥


సంసారమును జేయ సకల వ్యామోహములు

బంధించి బాధించి కృంగజేయుచునుండె

ధర్మ మార్గములను తప్పించు చుండె

దైవ భావములను దరి చేర్చకున్నాయి..॥ దయ॥


సకల విశ్వమునందు నీవున్న గాని

చూడగలిగెడి శక్తి నాకు లేదయ్యా

అవతార రూపమే ఆరాధనము చేసి

అందుకో దలిచితినయ్యా నీ దీవెనలు ..॥దయ ॥


భక్తిశ్రద్ధల తెలియలేని మూర్ఖుడనయ్యా

నిష్ట సబూరులను నిలుపుకోలేనయ్య

పూజ చేయగలేని పరమ నీచుడనయ్యా

ప్రతితుడను నీ పాల బడితి నేనయ్య


నాకేమీ కావలెను నేనెరుగలేను

నేనేమి చేయదునో తెలియలేను

నీ పరము చేసుకొని నన్నేలుకోవా

శ్యామచరణుని నీలో కలుపుకోలేవా..॥ దయ॥


73) ప్రేమ ముదిత మనసె కహో సాయిరామరాం (13.03)

ప్రేమ ముదిత మనసె

కహో సాయిరామరాం సాయి రామ రాం

సాయి రామ రాం

బాబా సాయి రామరామ్

 

పాపమిటే దుక్కకటే లేకె సాయినాం 

భవ సముద్ర సుఖ ధనావ ఏక్ సాయిరాం 

పరమ శాంతి సుఖనిదాన మంత్ర సాయి నామ్ 

నిరాధార కోవధార ఏక్ సాయి నామ్

 

పరమ గోపయ పరమ దివ్య మంత్ర సాయి నామ్ 

సంతహృదయ సదా వసతు ఏక్ సాయి నామ్ 

మాతా పితా బంధు సఖ సబ్ కి సాయి నామ్ 

భక్తజనర జీవన ధన ఏక్ సాయి నామ్


74) శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా (14.03)

శ్రీకరా ! శ్రీ షిరిడీశ్వరా 

ప్రేమగ నను గావరా ! సాయిశ్వరా! ॥శ్రీకర ॥ 

 

గురుడవు నీవని, దైవము నీవని, 

గురువే దైవమని, సత్య ధర్మము 

సత్పథ మర్మము తెలుపగా వేడితిమి

 

నీ నామామృత పానము చేయుచూ 

నీవే శరణమని పిలిచి పిలిచి 

నేను గొలిచి గొలిచి నేనలసిపోతిని రా 

దయను చూపి నీ దర్శనము నొసగి

హృదయ మందిరము నందు నిలువరా! పలుకరించరా ! ॥ శ్రీకర॥ 

 

నిష్ట సబూరుల శిక్షణ నొసగగ 

ఇక్కట్టుల కలిగించితివో ! 

సుఖదుఃఖంబులలో సమభావము 

కలుగునటుల కరుణించితివా 

మోహము నెప్పుడు కూల్చెదవో 

మోదమునెప్పుడూ కూర్చెదవో 

ఎటుల నీ దరికి చేర్చెదవో

ఎప్పుడు నీలోన నిలుపెదవో 

నేనెరుగలేను రా శ్యామ సన్నుత సాయి॥ శ్రీకర॥


75) అవో సాయి నారాయణ దర్శన దియో (15.03)

అవో సాయి నారాయణ దర్శన దియో

తుమ్ హో జగతికే త్రాతా !.....

తుమ్ హో భాగ్యవిధాతా....॥ ఆవో ॥


త్వమేవ మాతా పితా త్వమేవా

త్వమేవ విశ్వవిధాతా .....

త్వమేవ సర్వవిధాతా......॥ ఆవో॥


త్వమేవ బ్రహ్మ త్వమేవ

విష్ణు త్వమేవ శంకర రూపా........

త్వమేవ దత్త స్వరూపా ......॥.ఆవో॥


త్వమేవరామ త్వమేవ కృష్ణ

త్వమేవ షిరిడి సాయిబాబా......

త్వమేవ సత్య సాయి బాబా..... ॥ ఆవో ॥


76) ఆనందమే సాయి నామము (16.03)

ఆనందమే సాయి నామము- 

పరమానందమే సాయి నామము


ఆనందమే సాయి నామము-

మధురానందమే సాయి నామము


ఆనందమే సాయి రూపము-

 పరమానందమే సాయి రూపము


ఆనందమే సాయి రూపము- 

మధురానందమే సాయి రూపము


ఆనందమే సాయి నామము- 

పరమానందమే సాయి రూపము


ఆనందమే సాయి గానము- 

నిత్యానందమే సాయి గానము


ఆనందమే సాయి ధ్యానము- 

మధురానందమే సాయి ధ్యానము


ఆనందమే సాయి స్మరణము- 

బ్రహ్మానందమే సాయి స్మరణము


ఆనందమే సాయి మననము- 

దివ్యనందమే సాయి మననము


ఆనందమే సాయి దైవము - 

సచ్చిదానందమే సాయి దైవము


ఆనందమే సాయి వైభవం -

 మహదానందమే సాయి వైభవం


ఆనందమే సాయి జ్ఞానము - 

పరమానందమే సాయి జ్ఞానము


ఆనందమే సాయి ధామము - 

మధురానందమే సాయి ధామము


ఆనందమే సాయి యోగము - 

పరమానందమే సాయి యోగము


ఆనందమే సాయి భోగము - 

మహాదానందమే సాయి భోగము


ఆనందమే సాయి భావన -

పరమానందమే సాయి దీవెన


ఆనందమే సాయి దీవెన - 

మహాదానందమే సాయి భావన


ఆనందమే సాయి నామము - 

శ్యామకానందమే సాయి రూపము


ఆనందమే సాయి రూపము -

శ్యామకానందమే సాయి నామము


77) ఇది ఏమీ ఆటరా తండ్రీ ! (17.03)

ఇది ఏమీ ఆటరా తండ్రీ ! 

ఇది ఏమి వేడుక దేవా!

ఇటు నటు నూపుచు 

అటు నిటు జేర్చక ఆడించుచున్నావు సాయి.. ॥ ఇది॥


భక్తి తోడ నిను తలచ దలంచిన 

భవ భంధములు బంధము లాయెను

నీదు లీలలను గానము జేయగ నెంచిన 

నా మది నిలువకపోయెను

లోకవాసనల వ్యామోహములతో 

మంచి చెడుగల విచక్షణ లేక

గ్రుడ్డివానిగా బ్రతుకుచు నుంటిని 

పిచ్చివానిగా వాగుచు నుంటిని ॥ఇది ॥


పరబ్రహ్మమే నీవనడి నిజము 

పరిపూర్ణముగా తెలియక నైతిని

బాధ్యతలను భరియంచెడి నిన్ను భక్తిగా నెపుడు గొలవ నైతిని

 సర్వము నీదని అనుకొనుచు నాది యనుచునే భ్రమ పడుచుంటిని

 జ్ఞానము నొసగక శ్యామను ఈ భువి అవివేకముతో బ్రతుకగ జేయగా ॥ఇది॥


78) ఏదని దలతును నీ రూపమును (18.03)

ఏదని దలతును నీ రూపమును
ఏమని బిలతును నీ నామమును
లీలా నాటక సూత్రధారి
హే! మాయా మానుష వేషధారి ..॥ఏమని ॥

ఇది యది యనక అన్ని రూపములలో
నున్నది నీవే యని దెలుపుచు
సర్వనామముల కధిపతి నీవై
సమతా మమతలను నిలిపిన దేవా ॥ ఏమని॥

రామ, కృష్ణ ,శివ, దత్త ,మారుతి,
రహీము, అల్లా, యెహోవా, క్రీస్తు,
నానకు, నారాయణి శక్తులుగా
దర్శన మెసగిడి శ్యామ సన్నుతా ॥ఏమని॥


79) ఏమి కర్మముల చేసితినో నేనేమీ పాపముల నొనరించితినో (19.03)
ఏమి కర్మముల చేసితినో
నేనేమీ పాపముల నొనరించితినో
ఈ భూమిలో పలు బాధల వలలో
జిక్కి దిక్కుతోచక ఉన్నాడను ॥ఏమి॥

నిను నమ్మితిని, ఓర్పుగ
నుంటిని నీవేదో మేలొన గూర్తువని
ఎన్నడు నీ దయ ప్రసరించునోయని
ఎదురు తెన్నులు జూచుచు నుంటిని ॥ఏమి కర్మముల॥

నీ దయ రాక దారి తెలియక
నిట్టూర్పులతో బ్రతుకుచు నుంటిని
అంతము లేదా ఈ ఓర్పునకు,
అభయము నీయవా ఈ ఆర్తునకు ॥ ఏమి కర్మముల॥

ఎటు నిను వేడిన కరుణించెదవో
ఎటు ప్రార్ధించిన మొరలాలిన్తువో
ఎరుగని వాడను సాయి దేవా,
ఎటు నను బ్రోతువో దేవా దేవా ॥ ఏమి కర్మముల॥

తండ్రివి నీవే దయమాలిన
ఇక దీనజనులకు దిక్కెవరయ్యా
మా మొరలను విని వేదనలను
గని సరగును బ్రోవుము శామసన్నుత॥ ఏమి కర్మముల॥

80) ఏల కానరావయ్య బృందావన విహారా (20.03)
ఏల కానరావయ్య
బృందావన విహారా
ఎందుకు దాగినావయ్యా
రాధా మానస చోరా ॥ఏల॥

పున్నమి వెన్నెల రాత్రులు, కన్నుల పండువు జేయగ
నానా విధ సుమ బాలలు సుగంధముల విరజిమ్మగ
సుందర యమునా తీరము నీ రాకకు తపించగ
చల్ల చల్లని పిల్లగాలి నీ కొరకటు నిటు దిరుగగ ॥ఏల॥

చిరుమువ్వల సవ్వడులు ఘల్లు ఘల్లు ఘల్లుమనగ
మురళీనాదము మోహనరాగ మాలపించగా
సమ్మోహనమున జగమే సంతసమును బొందగా
నీ పద భక్తులు నీకై పరిపరి విధముల వేడగ ॥ ఏల॥

81) ఒక పరి నిన్ను మనసారగ నమ్మిన (21.03)
ఒక పరి నిన్ను మనసారగ నమ్మిన -
వారల ప్రేమగ కరుణించెదవూ !

ఒకపరి నిన్ను శరణాగతి వేడిన -
వారల బరువుల భరించెదవూ !

నీ ప్రేమ అనంతమూ - దయ అపారము
కరుణ అనూహ్యము సాయి రామా -
శరణం సాయిరామా శరణం సాయిరామా ॥ఒకపరి॥

పాపాత్ముల పరిరక్షణ చేయగ
మానవ రూపము ధరియుంచితివి
పరిశుద్ధాత్ముల పరమును జేర్చగ
పరమాత్ముడవై ధర వెలసితివి
సకల జీవులను సంరక్షించగ
సాయినాధునిగా భువి నిలచితివి ॥నీ ప్రేమ॥

కులమత రహితము జాతి కతీతము
సంతస భరితము సర్వోన్నతము.
సర్వ సమ్మతము సూన్రుత సహితము
సుందర చరితము మంగళకరము
సద్గతి భరితము సజ్జన హితము
సోహం నాదము దైవ విధానము ॥నీ ప్రేమ॥

82) కనుల నీరు తుడవగా కదలి రావ దేలరా (22.03)
కనుల నీరు తుడవగా కదలి రావ దేలరా
కలతలను బాపి నాకు కానుపింప వేమిరా
ప్రభో ! సాయి దేవరా పలుక కున్నా వేమిరా
శరణంటిని దేవరా సతతము నను గావరా ॥కనుల॥

పూర్వజన్మ కర్మ ఫలము, నీ లీలా సంకల్పము,
మహాత్ముల శాప ఫలము , దుచ్చరియల ప్రతిఫలము,
సమస్యలకు పరిష్కార వమింత దనుక కలుగ లేదు
సతమతమౌ హృదయంబున శాంతి అయిన నిలువలేదు ॥ కనుల ॥

వివాహముల జేయనెంచి వినయంబుగా నిను వేడగ
నిమ్మకు నీరెత్తినటుల నిచ్చలముగా కూర్చుంటివి
ఇలు వెడలిన తమ సుతుని వెదకుచున్న నీ వారికి
సంతసముల నీయకుండ వూరకే జూచూచు నుంటివి ॥ కనుల॥

వివాహముల జేయించుము ప్రేమ సాయి దేవరా
ఇలు వెడలిన సుతుని దిరిగి గృహమునకు జేర్చరా
నీ శక్తిని, నీ మహిమను, నీ కరుణను, నీ ప్రేమను ,
నిను నమ్మిన భక్తుల కిల నిదర్శనగ జూపరా॥ కనుల॥

83) భక్తి నీయవమ్మా భవతారిణి (23.03)
భక్తి నీయవమ్మా భవతారిణి శక్తినీయవమ్మా సౌమ్య రూపిణి ॥ భక్తి॥ 
రూప నామ గుణ తత్వ చింతనలతో నీదు సేవలను చేయనీయవే॥ భక్తి ॥ 
కరుణ రూపమైన కామాక్షి నాదు కనులు తెరవజేసి కానుపింపవే ॥ భక్తి ॥ 
ఆదిశక్తి నీవే అఖిలమ్ము నీవే అమ్మ యనెడి వారలాదరింపవే సర్వవ్యాపీ వైన 
సర్వేశ్వరి శామాదులను కరుణ బ్రోవ రావే ॥భక్తి ॥

84) సుందరానన సుందరానన (24.03)
సుందరానన సుందరానన
సుందరానన శివ సుందరానన

భస్మోధూలిత సుందరాననా
భవభయ హరణ సుందరానన
భద్ర సేవిత సుందరానన
వీరభద్ర సేవిత సుందరానన ॥ సుందరానన॥

అరుణాచల శివ సుందరానన
అర్థనారీశ్వర సుందరానన 
అంబికా వల్లభా సుందరానన
ఆదరమున కావరా సుందరాననా ॥ సుందరానన॥

 రుద్ర కోటేశ్వర సుందరానన
రుద్రాణి సమేత సుందరానన
రుద్రాక్ష ధారణ సుందరానన
రూప నామ రహిత సుందరానన ॥ సుందరానన॥

కాశీ విశ్వనాథ సుందరానన
విశాలాక్షి సమేత సుందరానన
కలి నాశక సుందరానన 
శ్యామ  పూజిత సుందరాననా ॥సుందరానన॥

షిరిడీ నివాస సుందరానన 
ద్వారకా నిలయ సుందరానన
సద్గురు నాథ సుందరానన
శరణంటినయ్య సుందరానన ॥ సుందరానన॥


85) కరుణ జూపుమా - సాయి కనికరించుమా (25.03)

కరుణ జూపుమా - సాయి కనికరించుమా 

పటములోని రూపముతో మమ్ము పలకరింపుమా 

పటంలోని రూపముతో మాకు కానుపింపుమా ॥కరుణ॥


మానవుల మైనందున మాయల బడి ఉన్నందున

పరోక్షముగ కనిపించెడి నిన్ను తెలియలేమైతిమి

పటములోని రూపముతో దర్శనమిడి బలుకరించ

ఆత్మానందముల నొంది కృతార్థులము మేమగుదుము ॥కరుణ॥


నీ దర్శనమెనరించిన నిర్మూలనమౌ కర్మలు

నీ పలుకుల వినినంతనే నిచ్చలమౌ మాది మనసు

నీ ఆశీస్సుల బడసిన నీ దరి వీడగలేము

నీ దయతో తరియుంతుము నిజము శామసన్నుతా ॥కరుణ॥ 


దేవతలలో నిన్ను చూచి అర్చించగ లేమయితిమి

మహాత్ములలో నిన్ను జూచి సేవింపగా లేమైతిమి

జీవులలో నిన్ను చూచి ప్రేమించగ లేమైతిని 

విశ్వములో నిన్ను చూచి ధ్యానించగ లేమైతినే ॥కరుణ॥


86) కలుగదా నామీద జాలి (26.03)

కలుగదా నామీద జాలి సాయి కరుగదా 

నీ మనసు నా ప్రార్థనలను విని ॥కలుగదా॥


తనువశాశ్వతము ఆశయే దుఃఖము 

రుణాను బంధమే ఈ బంధములని

జూచుచు నుండి మనసు నిలపక లేక

సుడి గుండములో జిక్కినవాడను॥ కలుగదా॥


తనువు మనసులకు బలమే లేదు

మమకారంబుల కంతమే లేదు

సద్గతి నందెడి మార్గము తెలియక

అజ్ఞానంతో బ్రదుకుచు నుండగా ॥ కలుగదా॥


సద్గతిని గోరిన సుఖములు తొలగును 

సుఖముల గోరిన సగ్గతి కలుగదు

రెంటిని గోరుచు నుంటిని ఈ భువి

కంటికి రెప్పగ కాపాడెదవని ॥ కలుగదా॥


87) కనికరింపుమా దేవ కారుణ్య నాథా (27.03)

కనికరింపుమా దేవ కారుణ్య నాథా

కలత బాపుమా వేగ శ్రీ సాయినాథా ॥కనికరింపుమా॥


తల్లి తండ్రి గురు దైవము లీవేనని దలచితిరా 

సుఖ దుఃఖము లందు నిన్ను మరువక పూజించితిరా

కంటికి రెప్పగా కాపాడు దైవమా

కనుల నీరు తుడవగా కదలిరావదేలరా ॥కనికరింపుమా॥


ఈ మాయా మోహము లో తగులు కొనిన వాడరా

మమ కారములన్నీ దాటి వెలికి రాని వాడరా

ఏ తీరుగ బ్రోతువో ఏ తీరుగ గాతువో 

నీ పదములే శరణంబని నమ్మియున్న వాడరా ॥కనికరింపుమా॥


88) కొలువై యున్నాడే (28.03)

కొలువై యున్నాడే 

మన సాయి రాముడు

కొలువు దీరిచి యున్నాడే 

ఘనముగా మన శ్యామ సన్నతుడు ॥కొలువై॥


మాతాపిత గురుదైవము తానై

మందహాసముతో ముచ్చట గొలుపగ

భక్తులారా రండు రండనుచు ఇక

భయము మీకేల వలదు వలదనుచు ॥కొలువై॥


మీ భారంబుల నాపై వదలడు

సర్వము నేనే మోయు చుందునని

నిష్ట  సబూరుల గలిగి యుండుడని

అవియే సకల శ్రేయముల గూర్చునని ॥కొలువై॥


89) కన్న తండ్రీ కావగా (29.03)

కన్న తండ్రీ కావగా 

కరుణ మానితి వేలరా

కనులు గానక  కళ్ళలాడుచు 

కష్టములలో నుంటిరా॥కన్నతండ్రీ॥


విశ్వమందున అణువు 

నేనను సత్యమును గుర్తించనైతిని

విర్ర వీగుచు నేను నేనని 

నాది నాదని తలచు చుంటిని ॥కన్నతండ్రి॥


నిన్ను జేరగ దలచి నంతట నన్ను లాగును 

మోహము నిన్ను తలవగ నెంచి నంతట 

మనసు చేయును మోసము దారి తెలియక 

నిన్ను జేరిన శ్యామ కీవే శరణము ॥కన్నతండ్రి॥


90) చాలు చాలు సాయి దేవా (30.03)

చాలు చాలు సాయి దేవా నీ ఆట

సాగ నీయమా మమ్ముల నీ బాట ॥ చాలు॥ 


పలుక నీయుమా సతతము నీ మాట

పాడగ చేయుము ఆనందముగా నీ పాట ॥చాలు॥


నిలువ నీయమా నీ నామము మా నోట

నొసగి బ్రోవుమా మా కిల భక్తి మూట ॥చాలు ॥


కట్టి వేయుమా మా మనసుల నీ గాట

తుడిచి వేయుమా దుష్కర్మల నీ గోట ॥చాలు॥


91) సద్గురు బ్రహ్మ సనాతన హే (31.03)

సద్గురు బ్రహ్మ సనాతన హే 

పరమ దయాకర పావన హే


జన్మజ దుఃఖ వినాశనహే

జగదో ధారణ కారణహే


 సాయి కృష్ణ జనార్ధన హే

 జనార్ధన హే - జనార్ధన హే - జనార్ధన హే -


శిరిడీ సాయి కృష్ణ జనార్ధన హే

భవ భయ జలధీ కారణహే ॥సద్గురు॥


92) జయ జయ జయ సాయీ (01.04)

జయ జయ జయ సాయీ -

జయ జయ జయహో సాయీ -

ఏమని బొగడుదు నీ కరుణను

నే నేమని బొగుడుదు నీ లీలలనూ ॥జయ॥


ఒక పరి బాధల కలిగింతువు

నింకొకపరి ఓదార్పుల నందింతువు

ఒకపరి మనసును ఖేదింతువు

నింకొక పరి నేకాగ్రత నందింతువు ॥జయ॥


ఒకపరి అరిషడ్వర్గము లందు ద్రోసి

ఆ క్షణమే నేర్పుగా మము బ్రోచెదవు

ఒకపరి చిక్కుల గల్పించుచూ

చిత్రముగా విడదీసేదవూ ॥జయ॥


సుక, శౌనక, ప్రహల్లాద ,నారద, 

వశిష్ట, కౌసిక , భరద్వాజలే 

నీ లీలలను తెలియజాలరు

అల్పగ్నుడను నాకేమీ తెలియను ॥జయ॥


93) జారవిడువకురా శ్యామ (02.04)

ముల్తాన్ రాగం ఆదితాళం చతురస్రం 

జారవిడువకురా.... శ్యామ హృదయేశ్వరా.... సాయీ ॥జార॥

జారవిడచిన చేరదీయ గలాడు ఈ భువి లేడురా ॥జర॥


జారవిడవకురా... నన్ను జారవిడవకురా 

జారవిడచిన చేరదీయ గలాడు ఈ భువి లేడు లేడురా 

లేడు లేడురా... జార విడువకు రా.... రా !సాయి ॥జార॥


నిన్ను నమ్మి నీ కంకితమై నీ ఉపదేశంబుల నుండుట లేదని

సకల విశ్వమున నిన్ను జూచి ప్రేమగా సేవించుట లేదని

సత్య ధర్మ సన్మార్గములందున చరియింపక  - నిను దలచుంటినని ॥జార॥


పరదూషణముల పాపపు పనులను ప్రత్యక్షముగనే చేయు చుందునని

కులమత భేదము లెంచుచు అహమున అల్పునిగ 

చరియుంచుందునని

సౌఖ్యము లందున నిన్ను మరచి దుఃఖంబులలో నిన్ను దలచు చుంటినని  ॥జార॥


భక్తి శక్తి యుక్తాదులు లేకనే 

భక్తునిగా నటించు చుంటినని

అర్హత యోగ్యత లసలే లేక 

అధికారంబుల గోరుచుంటినని

ఆడంబరమున ప్రశంసనములతో 

ప్రతితుడనై - నశించుచుంటినని ॥జార॥


విశ్వ మెల్లడల నిండి యున్నట్టి 

నీలో నేనొక భాగమే కదా !

నేనను ,నా భావన , ప్రతి చర్య యు  

నీ వాడించెడి నాటకమే కదా !

సుఖదుఃఖంబుల చింతన లేలనో 

నీకు నాకు భేదమేలనో ॥జార॥


ఏమి తెలియక అజ్ఞానముతో 

అవివేకముగా బలుకుచుంటిని

లౌకిక వాసనలందు తగులుకొని  

మూర్ఖముతో నడయాడు చుంటిని

కోపము చెంది దూరము చేసి 

దుర్మార్గుడనని ఆవలకు ద్రోసి  ॥జార॥


94) ధర్మ స్వరూప ద్వారకామాయివాసా (03.04)

ధర్మ స్వరూప ద్వారకామాయివాసా

దయరాదా నీ దరిశన మీయగ

దయ రాదా నాతో ప్రేమగ పలుకగ ॥ధర్మ॥


బ్రోచితివి గద ఎందరెందరినో

నీ దగు దివ్య దరిశన మొసగి

గాచితివి కదా భక్తులెందరినో

వీనుల విందుగ ప్రేమగ పలికి ॥ధర్మ॥


ఏ రీతిగ నిను ధ్యానము చేసిన

కనుల కగపడి కరుణించెదవూ

ఏ విధముగా నిను పిలచిన నాతో

ప్రేమగ పలికి మొరలాలింతువు ॥ధర్మ॥


నీ చరణములే శరణంబని మది

నమ్మిన దీనుడ శ్యామచరణుడను

కనికరముంచి కరుణను జూపి

దరిశన మొసగీ ప్రేమగ బలుకుము ॥ధర్మ॥


అభయ ప్రదాత ఆశ్రిత రక్షక

కరుణాసింధొ కామిత దాయక

ప్రేమ స్వరూపా భవభయ నాశక

సద్గురు దేవా శ్యామ సన్నుత ॥ధర్మ ॥


95) దైవ ప్రార్థన దారి చూపును (04.04)

దైవ ప్రార్థన దారి చూపును 

శాంతి ధైర్యముల నొసగును

తృప్తి ఆనందము లుంచును

దయను బెంచి దరికి జేర్చును ॥దైవ॥


ఒక్క దైవము నాశ్రయించుము

ఒక్క నామమునే జపించుము

రూప నామములు లెన్ని యున్నను

అన్ని ఒకటే యనుచు జేసెడి ॥దైవ॥


దురాలోచన తుడిచి వేయుము

దూషణములను వదలి వేయుము

సహన విశ్వాసముల గలిగి

భక్తి శ్రద్ధల తోడ జేసిడి ॥దైవ॥


ప్రేమ భావము పెంపు జేయుము 

పరమ శాంతికి జేరువగుము

శ్యామ సూక్తుల ఆలోచించుచూ

ఆచరించుచు సదా జేసిడి ॥దైవ॥


96) పరాపవాదము పరిహరింపవే (05.04)

పరాపవాదము పరిహరింపవే -

పరార్థదాయీ బాబా సాయి

నిరంతరంబును నీ నామంబును

స్మరింపనీయవే సద్గురు సాయి ॥పరాప॥


వృధాభిమాన స్వీయ ప్రశంసల

కధీను చేయకు మయ్యా సాయీ 

కృథా కామ దుర్లోభాదుల కడు

వ్యధల్ నివారింపగదే సాయీ ॥పరాప॥ 


సతంబు భూత విహితంబు గూర్చుచు

ప్రతి ప్రాణి నీవలె గన నీవే 

ప్రతి క్షణము నీవలె గన నీవే 

మదిన్ ప్రసాదింపగదే సాయీ ॥పరాప॥


ప్రశంసనములకు నృశంసనములకు

ప్రశాంత బుద్దిని బరపవె సాయీ

ప్రశస్తము నీ యశోలీలల్

అహర్నిశల్ స్మరియుంపనీయవే ॥పరాప॥


97) ప్రభో సాయి రామ రారా…. (06.04)

ప్రభో సాయి రామ రారా….  మమ్మదు కోరా…. 

షిరిడి నివాసా…… శ్రీనివాస…. ॥ప్రభు॥


తల్లివి నీవే, తండ్రివి నీవే ,గురు దైవములు నీవే…..

రాముడ నీవే, కృష్ణుడ నీవే ,దత్త మారుతి నీవే……

శివ నాగ సాయి నీవే ,శ్యామ సాయి నీవే…..

 జయహో సాయిశా…. జయహో సాయిశా…. ॥ప్రభో॥


నీవే దిక్కని నిరతము నమ్మి కొలిచే వారము దేవా-----

కరుణను జూపి కడ తేరెడి మార్గములను జూపగా రావా -----

రంగనాథ సాయి నీవే…. రామదాస నీవే….. 

జయహో సాయిశా… జయహో సాయిశా…. ॥ప్రభో॥


సుఖ దుఃఖములకు చెదరని మనసును

కరుణ నొసంగుము స్వామి…… 

సద్భక్తులమై నీ పద సన్నిధి జేరగ చేయుము స్వామి…… 

మమ్ము దయ గనవే సాయీ…. ద్వారకామాయి…

శ్యామ సన్నుతా…. సాయి మహేశా… ॥ప్రభో॥


98) శ్రీ సాయినాథా…..  శ్రీనివాసా… (07.04)

శ్రీ సాయినాథా…..  శ్రీనివాసా….. చింత బాపగ రారా

నీ సేవ చేసే మా మనవి నీకు వినబడలేదా ॥ శ్రీ సాయి॥


ఆయువేమె తక్కువై….. ఆశలేమె ఎక్కువై…. 

అసలైన దారులు వదిలి అలమటించి పోతున్నాము

నీవు గాక దిక్కెవరయ్యా నిన్ను కొలుచు బాలల మయ్యా

మంచిని దెలిపీ మాయల దులిపి

మము దయ గనగా రావా…. వేగమే రావా… ॥శ్రీసాయి॥


నీ పదముల నమ్మినాము…. 

నీ భజనే చేసినాము…. 

మాకు నీవే దిక్కువని మనసారాగ వేడినాము 

మాదు మొరలు వినగా లేవా ----

మమ్ముల గాన జాలియే రాదా….. 

అఖిలలోక నాయక నీవే… 

అలిగిన ఇక గతి ఏమి మా స్థితి ఏమి….. ॥శ్రీ సాయి॥


99) సద్గురు నీవే…..  సర్వము (08.04)

సద్గురు నీవే…..  సర్వము నీవే….. 

సరియగు బాటల నడిపే శక్తివి నీవే ॥సద్గురు॥


మంచి చెడు లేరుగని మనుషుల మయ్యా

పాప పుణ్య మెరుగని బాలల మయ్యా 

మంచి చెడుగు లేరుగ చేయ వేదితిమయ్యా 

ధర్మ మార్గ మందు నడుప నిన్ను కోరితి మయ్యా 

శ్రీహరి రూపా…. సాయి స్వరూపా…. ॥సద్గురు॥


కలి మాయల వలను జిక్కి కలతల లోనా

శక్తి ,భక్తి ,యుక్తి ,లేక కుములు చుంటిమి

వలను త్రెంచి వలపు జూపి ,వరల జేయగా 

పుణ్య చరిత మనసారగ వేడితి మయ్యా

శ్రీహరి రూపా….సాయి స్వరూపా…. ॥సద్గురు॥


100) సాయినాథా…..  చేరరారా…… (09.04)

సాయినాథా…..  చేరరారా…… 

నీదు బాలల మయ్యా……

మము చేరదీసే భారమంతా నీది కాదా బాబా ॥శ్రీ సాయి॥


గోదావరి తీరములో…. 

శ్రీ షిరిడీ క్షేత్రములో

నీ భక్తుల సేవలలో 

కొలువుదీరి ఉన్నావు 

 

నమ్మిన వారిని నడిపించి, 

నిను గొలిచెడి వారల కరుణించి

మహిమల జూపుచు మాయల జూపుచు

భక్తుల బ్రోచుచు నవ్వుచుంటివా…. ॥శ్రీ సాయి॥


నిన్ను చూడగ కొలచినాము, 

మది నిండుగ తలచినాము

తల్లైనా తండ్రైనా నీవనియే పిలిచినాము

మాపై కరుణె రాలేదా! 

మము బ్రోవగ మమతే రాలేదా !

నీ పద సన్నిధి మాకిల పెన్నిధి --- 

మా మనసే నీ కంకిత మయ్యా ॥ శ్రీ సాయి ॥


101) సాయి రాముని భజన జేయండి (10.04)

సాయి రాముని భజన జేయండి …  ఓ భక్తులారా


సాయి నామామృతము గ్రోలండీ

సాయి రాముని భజన చేయుచు

సాయి నామామృతము గ్రోలుచు

సాయి సాయీ యని సతతంబు

సంతస మందు మునగగ ॥ సాయి॥


జన్మలెన్నియో గలవు తెలియండి

ఆ జన్మలందున మనిషి జన్మమే గొప్పదౌ నండీ

జన్మలెన్నియో గలిగి యున్ననూ

మనిషి జన్మమే గొప్పదనుచును

మరీ మరీ గుర్తించుకొని 

సద్గురుని పాదము లాశ్రయించుచూ ॥సాయి॥


భక్తిశ్రద్ధలు గలిగియుండండి

వినయంబుగా శ్రీ సద్గురువుల సేవ జేయండి

భక్తి శ్రద్ధలు గలిగియుండి వినయముగ

సద్గురుని సేవలు చేయుచుండెడి వారే

ధన్యులు, పుణ్యలు మహితాత్ములనుచును ॥సాయి॥


పేదలకు దానము జేయండి

కడు ఆదరంబున సాధువుల పోషణల జేయండి 

పేదలకు దానంబు జేయుచు సాధువుల పోషించు చుండిన

శ్యామదేవుని గాచు సాయియే సద్గతుల నందించగలడని  ॥సాయి ॥


102) ప్రభో ఏసునాథా….. పరాకేలనయ్య (11.04)

ప్రభో ఏసునాథా….. పరాకేలనయ్య

దయను జూపి మమ్ము.. దరికి చేర్చవయ్యా ॥ ప్రభు ॥


నిన్నేరుగ లేక నింద మోపినారు

నిజము నెరిగి నంత నిట్టూర్చినారు

నీ ప్రేమయే దైవమై దారి జూపే ॥ ప్రభు ॥


జీవకోటి నెల చేర దీసినావు

పతిత మానవాళి నుద్దరించినావు

నీ ప్రేమయే జ్యోతియై దారి జూపె ॥ప్రభు॥


కృష్ణ రాము లీవే… క్రీస్తు మౌలా లివే….

శ్యామ సాయి వీవే….సద్గురుడ వీవే

ప్రభో కావరా.   వేగమే దేవ దేవా ॥ప్రభు॥

------

103)  హరి గురు నామమే (12.04)

హరి గురు నామమే మధురము మధురము

 హరి గురు నామమే మధురాతి మధురము

 గురు దరిశనమున కదే సోపానము    || హరి గురు||


1.  హరియే గురుడట  గురుడే హరియట

 హరి గురువులకు బేధము లేదట

మానవాళిని ఉద్ధరించుటకు 

హరియే గురువుగ అవతరించునట ||హరి గురు||


2 . మానవ రూపమున నుండెడి గురువును

గుర్తించుటయే  బహు దుర్లభమగు నట

అహము వదలినచో హరియే గురుడను

సత్యము దెలుయుట సులభమగునట  || హరి గురు ||


3 . సద్గురు నామము స్మరియుంచుటకు

సద్గురు కృపయే కారణమగునట

శ్యామనాధుడగు సాయినాధుని 

కృపతో సర్వము సులభ మౌనట ||హరి గురు||


4 . పరులకు అపకారములను జేయక 

ఉపకారములను జేయుచునుండిన

 సర్వజీవులలో దైవము గలడని

 వినయము తో సేవించు చుండినను

 

శ్రీ హరి నామపు మధురము దెలియును

హరి గురు లొకటను అనుభవమగును || హరి గురు ||


104) పవళించ ప్రార్థింతు పనగ శాయి (13.04)

పవళించ ప్రార్థింతు పనగ శాయి
శయనించ వేడెదను శ్రీ శేష సాయి || సాయి ||

పట్టు పానుపు మీద పరిమళము వెదజల్లు
మల్లె మాలతి జాజి సంపెంగలను బరచి
శ్యామ హృదయంబున అమరించి నాడయ్యా
శయనించి కరుణ శ్యామను ఏలవయ్య

భక్తులను రక్షించి బాధ్యతల భరియించి
ఆలించి లోకముల పాలించినావూ
అలసిపోయితివేమో దేవాది దేవా
శయనించి కరుణ శ్యామను ఏలవయ్యా

తెరవేయు తనలోని తెరలు తొలగించగా
పాదములు సేవించు మాయ తొలగించగా
అర్ర్చించు నీలోన తానైక్య మొందగ
ప్రార్ధించు ప్రేమ నీ విపుడు శయనించగ


105) వైభోగము చూడగ రారండి (14.04)

వైభోగము చూడగ రారండి
శ్రీ సాయి రాముని వైభోగము
చూడగ రారండి ||

1 .సకల బాధలు సమసిపోవునట
సర్వజీవులకు శాంతి కలుగునుట
సకల దేవతల దర్శనమగునట
సంతస మంతట వెల్లివిరియునట

||వైభోగము చూడగా రారండి||

2 . షిరిడి గ్రామము నందు కనిపించి
ద్వారకమాయి నందు నివసించి
సకల జీవులను సమాదరించి
ప్రేమ రూపమై వెలసిన సాయి

||వైభోగము చూడగ రారండి||

3 . భక్తులందరికి అభయ మొసగుచు
బాధ్యతల నెల్ల తానే భరియించుచు

ఇహపర సుఖముల కరుణ నొసంగుచు
వాత్సల్యంబున గాచెడి సాయి
||వైభోగము చూడగ రారండి||

4. వెనుక వైపున ఒక చిన్న రథమును
కుడి వైపున తులసి బృందావనమును
మధ్యన భజనల భక్త బృందమును
ఎదురుగ సాయి కూర్చొని యుండెడి
||వైభోగము చూడగ రారండి||

5 . తాళ మృదంగ భేరి నినాదముల
సంతసమిడు సంగీత స్వరములతో
నిండిన సాయి నామ కీర్తనలు
తిలకించెడి సాయి రాముని
|| వైభోగము చూడగ రారండి||

6. భక్తి భావములు మనసులు నిండగ
నుండగ తనువులే నాట్యములాడగ

మహోత్సాహమున భక్త బృందము
సాయి నామమునే పలుకుచు నుండెడి
||వైభోగము చూడగ రారండి||

7 . తాత్యా తదితర భక్తులను కూడి
ద్వారకమాయి వాసుని చేరి

బయలుదేరుటకు సిద్ధమగుమని

వినయముగా ప్రార్థించుచుండెడి
||వైభోగము చూడగ రారండి||

8 . తాత్యా సాయిని లేవదీయగా
కుడికాలి తోడన ధునిని సవరించి
కుడిచేతి తోడ దీపమునార్పి
మెల్లగ ముందుకు అడిగిడు సాయి
||వైభోగము చూడగ రారండి||

9 . అలంకరించిన శామకర్ణియును
వెండి పల్లకి యు ముందుగ నడువగ
భక్తులు పరిచెడి వస్త్రంబులపై
మెల్లగా ముందుకు అడుగిడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

10 . ఎడమవైపున తాత్యా పటేలు
కుడి వైపున శ్రీ మహాల్సాపతి
వెనుక చత్రమును జోగుసాహెబ్
పట్టుకొనుచుండ నడిచెడి సాయి
||వైభోగము చూడగ రారండి||

11. రకరకముల దీపముల కాంతిలో
రంగురంగుల తోరణములతో
వీనుల విందగు సంగీతములతో
షిరిడీ నెలర మైమరిపించడి
|| వైభోగము చూడగ రారండి||

12. సాయినాధునికి జయము జయమనుచు
భక్తినిండార నృత్యం చేయుచు
సర్వభారముల సాయికి వదలుచు
సంతోషంబున భక్తులుండగ
||వైభోగము చూడగా రారండి||

13 . దివ్య తేజముతో మోము వెలుగొంద
సర్వశక్తి స్వరూపము తానై
ఏమియు నెరుగని సామాన్యుని వలె
చావడి చేరగ అడుగిడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

14 . చక్కని ఆసనములమరించి
కనుల కింపుగా అలంకరించి
చావడి లో అడుగిడిన సాయిని
సుఖాసీనునిగా చేయుచునుండెడి
|]|వైభోగము చూడగ రారండి||

15 . పురంధరుడు హారతుల నీయగ
భక్తులందరూ సేవలు చేయగ
ప్రతి ఒక్కరు ప్రణామమొనరింప
చిరునవ్వులతో చూచెడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

16. భక్తులందరి కోరిక మేరకు
వారి సేవలను ప్రేమగా భరియించి
ప్రేమ కరుణలతో నెల్లర గాచుచు
పరమాత్మ పరబ్రహ్మ తానై నిలచిన

|| వైభోగము చూడగ రారండి||

17 . ఎల్లరు బాబా ఆశీస్సులగొని
ఆనందముగా వెడలుచు నుండగ
ప్రాణికోటిని పరిరక్షించుచు
చావడిలో పవళించిన సాయి
|| వైభోగము చూడగ రారండి||


106) ఏమి కర్మముల జేసితినో (15.04)

ఏమి కర్మముల జేసితినో

నేనేమి పాపముల నొనరించితినో
ఈ భూవిలో పలు బాధల

వలలో జిక్కి దిక్కుతోచక యున్నాడను

1. నిన్ను నమ్మితిని, ఓర్పుగ నుంటిని

నీవేదో మేలొన గూర్తువనీ ఎన్నడు

నీ దయ ప్రసరించునో యని

ఎదురుతెన్నులు జూచుచు నుంటిని ‌//ఏమి //

2. ఎటు నేను వేడిన కరుణించెదవో,

ఎటు ప్రార్ధించిన మొరలాలింతువో
ఎరుగని వాడను సాయి దేవా,

ఎటునను బ్రోతువో దేవా దేవా //ఏమి //

3. తండ్రివి నీవే దయమాలిన

ఇక దీనజనులకు దిక్కెవరయ్యా
మా మొరలను విని వేదనలను గని

సరగును బ్రోవుము శ్యామ సన్నుత //


107) దయను జూపుమా సాయీ (16.04)

దయను జూపుమా సాయీ -

నీ దరిశన మొసగుము సాయీ
కనికరించుమా సాయీ -

నను కరుణతో గనుమా సాయీ //దయ //

1. నమ్మితి నిన్నే సాయీ -

నను వీడకు నెప్పుడు సాయీ
దిక్కువు నీవే సాయీ-

నా దిగులు తొలగించు సాయీ

2 . అభ్యర్థించెద సాయీ-

నాక భయమొసంగుము సాయీ
ఆరాధించెద సాయీ-

నా ఆర్తిని బాపుము సాయీ

3. చింతన జేతును సాయీ-

నా చిక్కుల దీర్పవే సాయీ
సతతము దలతును సాయీ -

సద్భక్తిని నొసగవే సాయీ

4 . పదముల బట్టితి సాయీ -

వరము నీయవే సాయీ
శ్యామ దేవుని సాయీ -

సద్గతి నొసగవే సాయీ // దయ //


108) దిక్కెవరు ఉన్నారురా (17.04)

దిక్కెవరు ఉన్నారురా
సాయినాథుడు తప్ప

మనకు ఈ భూవి లోన //దిక్కు//


1. తోడు నీడై నిలిచి యుండెడి
బాధ్యతలను భరియించు చుండెడి
శ్రేయముల నొన గూర్చు చుండెడి
ప్రేమ మయుడగు సాయి దప్ప //దిక్కు//

2. భక్తి విశ్వాసముల పెంచెడి
జ్ఞాన వైరాగ్యముల నొసగడి
సద్దతి సంతసముల నొసగిడి
సద్గురుండగు సాయి దప్ప //దిక్కు//

3 .తలచినంతనే దర్శనంబిడి
బిలచి నంతనే పలుకుచుండెడి
విశ్వమంతా నిండియుండడెడి
శ్యామ హృదయుడు సాయి దప్ప //దిక్కు//


109) ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా (18.04)

ద్వారకా మాయీశా దరి జేర్చగా రావా సాయి రామా
నీవు కరుణించ కున్ననూ కాపాడె వారెవరు సాయిరామా

1. నియమ నిష్టల తోడనూ పూజించగా లేను సాయి రామా
మీకు పంచ భక్ష్యంబుల భోజనం బిడలేను సాయిరామా

2. పన్నీటి స్నానము చేయించగా లేను సాయిరామా
పట్టు వస్త్రము లిచ్చి పూజించగా లేను సాయిరామా

3. తాంబూల దక్షిణల నర్పించగా లేను సాయిరామా
హారతుల నొసగి అర్ర్చించగ లేను సాయిరామా

4. సతతంబు నీ నామ స్మరణ జేయగ లేను సాయిరామా
నీ లీలలను గాన మొనరింపగా లేను సాయిరామా

5. ఆర్భాటముగా భజన లేమీ చేయగ లేను సాయిరామా
నీ మహిమలను గూర్చి వర్ణించగా లేను సాయిరామా

6. నీ రూప మెటులుండు ? నీ వేష మెటులుండు ? సాయిరామా
నీ రూప వేషముల దెలియగా లేనయ్యా సాయిరామా

7. నిను నమ్మి పిలచిన పలికెద వని వింటి సాయి రామా
పనిలికి భక్తుల నెల్ల రక్షింతువని వింటి సాయిరామా

8. దెలిసి దెలియక నిన్ను పిలుచుచచూ నుంటి సాయి రామా
నా పిలుపునకు పలికి నన్ను రక్షింపగా రావే సాయి రామా

9. నీ పాలబడిన నన్ను వదలకు మని నిన్ను సాయిరామా
మరి మరీ వేడుచు మ్రొక్కుల నిడుచుంటి సాయి రామా

10 . శ్యామ చరణాదులను కృప జూపి బ్రోవగా సాయిరామా
వేగ అరుదెంచ వేడెద కరుణాంతరంగ శ్రీ సాయి రామా....


110) దయ గనవే సాయీ మమ్ముల (19.04)

దయ గనవే సాయీ మమ్ముల
దయ గనవే సాయీ ద్వారకామాయి
దరిశన మీయవే శేష సాయీ //దయ//

1. పరమ ధర్మమును ఇల నెలకొల్పగ
పరమత సహనము పాదు కొలపగ
భక్త జనులకు అభయ మొసంగగ
సాయి దేవునిగ అవతరించితివి //దయ//

2. నిష్టయే మనసును నిలుప గలుగు నని
ఘన సబూరియే నడిపించు ననీ
ప్రేమ స్వరూపమే పరమాత్మ యనీ
దెలుపగ ధరలో అవతరించితివి //దయ//

3. సద్గురు దేవుడే సకల మొసగునని
సద్గుతులను కలిగించ గలడనీ
దెలిపి మానవుల తరింప జేయగ

శ్యామ సన్నుత అవతరించితివి // దయ//


111) గురుదేవ గురుదేవ గురుదేవ రారా (20.04)

గురుదేవ గురుదేవ గురుదేవ రారా
కృప జూపి నా మనసు నిండుగా నుండరా // గురు //

1. భక్తితో నిను గొలచి తరియించ దలచితే
బలహీనమగు మనసు క్రింద మీదకు లాగు
నీ కృపయే లేకున్న నిన్ను గొలువగ లేను
నిన్ను చింతించుచూ నన్ను మరువగ లేను //గురు//

2 . పారాయణము చేయ పరుగులెత్తును మనసు
పాడు సోమరితనము పడక మీదకు చేర్చు
జపము చేయగా ఎంతో ఆశపడు నా మనసు

తప్పింప జేయు నా నీచ సంస్కారము //గురు//

3 . దయ జూపి కరుణించి దరి జేర్చు దైవమా
నా శక్తి యుక్తులు నిరుపయోగములు
నీవు ప్రేమను చూపి నన్ను లాగకున్న
శ్యామాదులకు శాంతి సౌఖ్యములు సున్న //గురు//


112) కనుగొను మదిగో మనసా (21.04)

కనుగొను మదిగో మనసా
శ్రీరామ భక్తుడగు హనుమ దేవుని //కను //

1. రామరామ శ్రీ రామ రామ రఘురామ రామ
కౌసల్య రామ కోదండ రామ సీతారామ
పట్టాభి రామ ఘనమేఘ శ్యామ //కనుగొను//

2. సాకేత సార్వభౌమా శ్రీరామా యనుచు
రోమ రోమముల రామ నామమే వీనుల విందుగ
వినబడు చుండెడి రామ చరణార వింద సేవకుని //కనుగొను //

3. భక్తి భావమున నృత్యము జేయుచు
తన్మయత్వమున తాళము వేయుచు
మేను మరచి అరమోడ్పు కన్నులతో
ఆనందాశ్రువులు జాలు వారగా //కను//

4 .రామా రామా రామా రామా రామా శ్రీరామా
రామా రామా యనుచు రామ నామ ధ్యానంబున
మునిగిన శ్యామ చరణ సన్నుత శ్రీ హనుమను //కను//


113) రామ రామ యని రోమ రోమమున (22.04)

రామ రామ యని రోమ రోమమున
ధ్వని యించు హనుమ జయహో
రామనామ సుధామృత పానమును
రమియించు హనుమా జయహో // రామ //

1. శ్యామ సన్నుత జయ హనుమా
శ్యామ వందిత జయ హనుమా

సకల క్లేశ సంహారక నామము
సకల సిద్ధి ప్రదాయక నామము

సకల సౌభాగ్య దాయక నామము
రామ నామమని దెలిపిన హనుమా // రామ //

2. శ్యామ సన్నుత జయ హనుమా
శ్రీరామ నామాంకితుడుగా హరి
నీలో నిలిచెను నీ వశమాయెను
రామనామ మహిమ లోకముల
నీమూలముననే నిశ్చయ మాయెను // రామ //


114) ధుని ముందు కూర్చున్న సాయి (23.04)

ధుని ముందు కూర్చున్న సాయి దేవా
నన్ను ధుని లోని కర్రగా మార్చుకోలేవా !
ద్వారకా మాయీశ సాయి దేవా
నన్ను నీ చేతి సటకగ చేర్చుకోలేవా !

లెండి తోటకు బోవు సాయి దేవా
నన్ను నీ పాదరక్షలుగ కూర్చుకోలేవా !
మార్చుకోలేవా ! చేర్చుకోలేవా ! కూర్చుకోలేవా ! //ధుని//

భిక్షాటనము చేయు సాయి దేవా
నన్ను దయతో నీ జోలెగా మార్చుకోలేవా !
రేకు పాత్రగా నన్ను మలచుకోలేవా !
దర్బారు నందుడు సాయి దేవా

నన్ను నీ ఆసనముగా తీర్చుకోలేవా !
చిలుము సేవించడి సాయి దేవా
నన్ను చిలుము గొట్టముగా కూర్చుకోలేవా !
మార్చుకోలేవా ! తీర్చుకోలేవా ! కూడ్చుకోలేవా ! //ధుని //

భక్తులను దీవించు సాయి దేవా
నన్ను భక్త సేవకునిగా నొనరించలేవా !
లోకముల పాలించు సాయి దేవా
నన్ను లౌకికమ్ముల నుండి తొలగించలేవా !

శామసన్నుత చరణ సాయి దేవా
నన్ను నీ పాద రేణువుగ నిలుపుకోలేవా !
నొనరించలేవా! తొలగించ లేవా !! నిలుపుకోలేవా ! //ధుని //


115) దయ రాదా? నీ దరికి చేర్చవా! (24.04)

దయ రాదా? నీ దరికి చేర్చవా !

దయా స్వరూపా దీన బాంధవా //దయ//

1. తెలిసియో దోషముల నొనరించితి
క్రోధముతో పరదూషణ జేసితి
మిడిమిడి జ్ఞానముతో మిడిసి బడితిని
అహాము తోడ నిను అపహసించితిని //దయ //

2 . మానవుడను మాయా బద్ధుడను
మంచిని తెలియని పరమ మూర్ఖుడను
మహిలో బ్రతుకును ఈడ్చు చుంటిని
మద మత్సరముల బ్రతుకు చుంటిని //దయ //

3 . సత్సంగములను జేయగ నైతిని
సన్మార్గంబుల నడువ నైతిని
సతతము నిన్నే దలపక యుంటిని
ధ్యాన సాధనల జేయగ యుంటిని / దయ //

4 . నీ సంకల్పమే నా బ్రతుకు గద
ఎందుకు యిటుల శోధించెదవు
బాధించెదవు ? వేధించెదవు
కరుణను చూపి నను కడ తేర్చవు //దయ //

5 . శ్యామాదులు నీ బానిసలే కదా
అరిషడ్వర్గము లన్నియు ద్రుంచవే
బవ బంధముల బాధల మాన్పవే
శ్రీ చరణ భవ భయ హరణ //దయ//


116) దత్త దిగంబర సాయి దేవా ! (25.04)

దత్త దిగంబర సాయి దేవా !
దీనులను నొకపరి కరుణ తో గనుమా
తెలిసి తెలియక జేసిన దోసములను
దలచి మము వేధించకురా! శోధించకురా ! బాధించకురా ! //దత్త //

1. అమాయకులమై అర్థము దెలియక
అనర్థములను కొని దెచ్చుకొనుచు

ఆవేదనలలో పడి వుంటిమిరా

ఆధారమునే కనజాలమురా //దత్త //

2. లౌకిక వాంఛల వలలో పడితిమి
దురాశ పాల్పడి దూర్తుల మైతిమి
ఇది మా కర్మమొ ! నీ అనుగ్రహమొ !
దెలియక శాంతికి దూరమైతిమి //దత్త //

3 . ప్రేమ స్వరూపము నీవే గాదా
దయా సముద్రుడవు నీవే గాదా
కన్నతల్లి వలె కరుణతో గాచి
శ్యామాదులను చల్లగా నేలుము //దత్త //


117) నీ పవిత్ర దివ్య సమాధి మందిరము నందు (26.04)

నీ పవిత్ర దివ్య సమాధి మందిరము నందు
అడుగిడిన వారే ధన్యులు ---
రామా సాయీ ----- రామ శ్యామా సాయి---

శ్యామ రామా సాయి మేఘ శ్యామా సాయి. //నీ//

1 .నీ పవిత్ర పద పద్మముల యందు
మనసుంచి శిరముంచు వారే ధన్యులు---
రామా సాయీ. //రామ//

2 . నీ దివ్య సమాధికి ప్రదక్షిణములను
భక్తిగ చేసెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామ//

3 . నీ దివ్య రూపమును నిరతము
మదిలో నిలిపి ధ్యానించు వారే ధన్యులు ----
రామా సాయీ //రామ//

4 . నీ దివ్య నామమును సతతము
హృదిలో చింతన చేసెడి వారే ధన్యులు----
రామా సాయీ //రామ//

5 . నీ దివ్య సమాధికి అభిషేకంబుల
శ్రద్ధగ చేసెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామా//

6 . నీ దివ్య సమాధిని సుగంధములతో
నలంకరించెడి వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

7. నీ దివ్య సమాధిని మధుర సుమములతో 

అలంకరించెడి వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

8. నీ దివ్య సమాధికి పట్టు వస్త్రముల
నలంకరించెడి వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

9. నీ దివ్య సమాధికి సుగంధ ధూపము లిచ్చి
పూజించు వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

10. నీ దివ్య సమాధికి అటు నిటు అనేక
దీపముల నుంచు వారే ధన్యులు ----
రామా సాయీ //రామా//

11. నీ దివ్య రూపమును అనేక నామముల
తోడ నర్చించు వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

12. నీ దివ్య రూపమున కనేక
నైవేద్యముల నర్పించు వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

13. నీ దివ్య లీలలను తలచుచు,
పొగడుచు స్మరించు చుండెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామ//

14. నీ దివ్య మహిమలను ఆనందముగా
మరి మరి దలచెడి వారే ధన్యులు-----
రామా సాయీ //రామా//

15. నీ పవిత్ర దివ్య నామా మృత పానము జేసి
పులకించు వారే ధన్యులు -----
రామా సాయీ //రామా//

16. నీ దివ్య రూపమున కత్యంత
భక్తి చిలుము నొసంగెడి వారే ధన్యులు ----
రామా సాయీ //రామా//

17. నీ దివ్య తేజమున కానందముగా
హారతుల నొసగు వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

18. నీ దివ్య నామమున కనవరతము
జయ జయమని బలికెడి వారే ధన్యులు------
రామా సాయీ //రామా//

19. నీ దివ్య తేజమున కెప్పుడు
మంగళం బనుచు కీర్తించు వారే ధన్యులు------
రామా సాయీ //రామా//

20. నీ దివ్య రూప నామంబులే
సతతము దిక్కని నమ్మిన వారే ధన్యులు----
రామా సాయీ //రామా//

నీ పవిత్ర పద పద్మంబులే దిక్కని
నమ్మిన శ్యామను గావుము ---
రామా సాయీ //రామా//


118) నీ నామమే మాకు మంత్రము సాయీ (27.04)

నీ నామమే మాకు మంత్రము సాయీ
నీ రూపమే మాకు ధ్యానము సాయీ //నీ నామమే//

1 .రామ భక్తులకు రామ చంద్రుడవు
శివ భక్తులకు పరమేశ్వరుడవు
కృష్ణ భక్తులకు పండరీశుడవు
హనుమ భక్తులకు ఆంజనేయుడవు //నీ నామమే//

2. ఏ దైవము నారాథించిననూ
ఆ రూపము గనే కనిపించెదవు
మనసారా నిను నమ్మిన మాకు
సకల దేవతల రూపము నీవే //నీ నామమే//

3. తారక నామ మంత్రము నీవే
పంచదశి, శ్రీవిద్యలు నీవే
అష్టాక్షరి, బీజాక్షరము లీవే
ఆది మూలమగు ఓంకార మీవే //నీ నామమే//

4. ఏ మంత్రము నుపాసించిననూ
నియమ నిష్టలతో సేవించిననూ
ఫలిత మొక్కటని తెలిపిన దేవా
శ్యామ సన్నుత సత్కృప జూపుము //నీ నామమే//


119) నీ సరి గలరా సాయీ (28.04)

నీ సరి గలరా సాయీ
నీ నామమే గూర్చును హాయీ

1. నిను నమ్మిన ఆశ్రితుల నెల్లప్పుడు
అనునయించుచు అభయ మొసంగుచు
గాచుచు నుందువు కరుణ రూపమై
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //

2. ప్రాపంచికమగు సుఖముల నెన్నో
కలుగజేయుచూ పరిపాలించుచూ
వక్ర మార్గముల జననీయవు గదా
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //

3. కోరకయే సకలము సమగూర్తువు
శాంతి సౌఖ్యముల నందించెదవు
నీ భక్తులకు నొసగెదవు ముక్తిని
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //


120) నిన్ను చూడని కనులేల (29.04)

నిన్ను చూడని కనులేల
నీ గీతి పాడని గళమేల
షిరిడి వాసా సాయినాథా //నిన్ను//

1. నిన్ను తలచని మనసేలా
నిన్ను పొగడని నాలుకేల
నిన్ను పూజించని కరము లేల
నీ కరుణ పొందని భక్తేల //నిన్ను//

2. నీ పదముల నుంచని శిరసేల
నీ కథలు వినని శ్రవణము లేల
నీ కర్పించని ప్రాణమేల
నీలో కలువని ఆత్మయేల //నిన్ను//


121) రామ నామము గానము ఎందున్న(30.04)

రామ నామము గానము ఎందున్న
అందునే నుందు నున్న దైవమా
నా వందనముల గొనుమా
వాయునందనా హనుమా --- హనుమా. // రామ //

శివుడవు భవుడవు భవభయ హరుడవు
హరుడవు ధవుడవు మాధవ హితుడవు

హితుడవు నుతుడవు అంజని సుతుడవు
ఆనంద కరుణను అప్రమేయుడవు //రామ//


122) నీదు లీలలు నేరుగ జాలను (01.05)

నీదు లీలలు నేరుగ జాలను
సగుణ నిర్గుణ రూపా సాయి
నెరుగ జాలని శ్యామను
కరుణతో బ్రోవ వేడెదను బాబా సాయి //నీదు//

శరణు సద్గురు దేవా సాయి-
పాహి సద్గురు దేవా సాయి. //నీదు//

1. శివ భక్తులకు శివుడవు నీవే
రామ భక్తులకు రాముడ నీవే
హనుమ భక్తులకు మారుతి నీవే
కృష్ణ భక్తులకు రంగడి నీవే //నీదు//

2. చూడ గలిగిన వారికి అంతట
దరిశన మొసగిడి దైవము నీవే
వినగలిగిన వారికి మధురముగా
మాటల వినిపింతువు నీవే // నీదు //

3. ఎవరే తీరుగ కొలచిన వారిని
ఆయా తీరుల గనే గా చెదవు
ప్రాణికోటికి పరమాప్తుడవు
పవిత్రాత్మలకు పరమాత్ముడవు //నీదు//


123) సాయీ - రామా- రామా -కావ రావా (02.05)

సాయీ - రామా- రామా -కావ రావా //సాయి//

1. నీ కోసమై కనులు వెదకి వెదకి
చాలా అలసి పోయినవయ్యా దేవా
కరుణాంతరంగ నా కనుల కగపడ రావే
ప్రేమగా నిమిరి నను దీవించరావే // సాయి //

2. జీవించ లేక నీ పంచ చేరగా
ప్రాకు లాడుచు నుంటి దేవా
ప్రాపంచికములగు కోర్కెలను
దనుమాడి సచ్చిదానందము నీవా // సాయి //

3. జపము చేయగ లేని తపము
చేయగ లేని సోమరిగ నుంటినో దేవా
సర్వభారములు నీ పరము జేసుకొని
శామాదుల ప్రేమతో కావరావే //సాయి //


124) నీ పవిత్ర పద పద్మముల పైన (03.05)

నీ పవిత్ర పద పద్మముల పైన
నా శిరము నుంచ దయ చూడుమయా

నీ దివ్య కరముతో ప్రేమగా నిమిరి
దీవించి కరుణించవయా //నీ పవిత్ర //

ఆశ్రిత పోషక అనాధ రక్షక
దీన బాంధవా పాహిమాం
భక్తవత్సల భవ భయ నాశక
బాబాసాయి రక్షమాం //నీ పవిత్ర//

1. సుభద్రమగు నీ ఒడిలో శిరముంచి
కౌగిలించుకొన నీయుమయా
అరిషడ్వర్గములను సంహరించి
వాత్సల్యంబున గావుమయా //నీ పవిత్ర//

2. సచ్చిదానంద మొసగు నీచరణ
కమలముల సేవ నొసగుమయా
సతతము నీ నామ రూపములు
మనసున నిలువగ బ్రోవుమయ్యా //నీ పవిత్ర//

3. సర్వాభీష్ట ప్రదాయకమౌ
నీ చరితమునే చదివించుమయా
సూనృత మగు నీ దివ్య లీలలను
గాన మొనరింప నీయుమయా //నీ పవిత్ర //

4. నీ సేవకులకు సేవలు జేసేడి
మహాత్భాగ్యము నొసగుమయా
సుమధుర మధురంబగు నీ పలుకుల
విని తరియింపగ జేయుమయా //నీ పవిత్ర//

5 . నిష్ట సబూరుల నా ఊపిరిగా
జేసి నన్ను గ్రహియింపుమయా
నీ దివ్య రూప సందర్శనమును
సర్వావస్థల నొసగుమయా //నీ పవిత్ర//

6. సుఖదుఃఖంబుల మంచి చెడుగులలో
నా మదిలోనే నిలుపు నిలుపుమయా
నీ దరికి జేరు మార్గంబుననే నిరతము
నన్ను నడుపు మయా //నీ పవిత్ర//

7. తెలిసీ తెలియక చేసిన దోస గుల
క్షమియించి దయను చూపుమయా
ప్రేమమయా నీలో నైక్య
మొనరించుమయా శ్యామహృదయా //నీ పవిత్ర//


125) నిరామయా నిరంజనా నిర్గుణా (04.05)

నిరామయా నిరంజనా నిర్గుణా సనాతనా
నిగమాగమ వేదవేద్య శ్రీ చరణ మోహన //నిరామయా//

1. సంశయ భవభయ నాశక సద్గతీ ప్రదాయకా
సత్య ధర్మ పరిరక్షక సద్గురు వినాయకా
సకల దైవ సకల సాధు సకల ప్రాణి రూపకా
సుఖదాయక సుజన మనో మందిరాది దాయకా //నిరామయా//

2. నమో లక్ష్మీనారాయణ, సాయినాధాయ
నమో రామకృష్ణ శివ మారుతీ దత్తాయ
నమో గోదావరి తట శిరిడీ నివాసాయ
నమో శేష సాయి భక్త హృదలాయాయ //నిరామయా//

3. భూతా వాసాయ నమో సర్వహృనిల యాయా
భూత భవిష్యత్ భావ వర్జితాయ నమో నమో
కాలా తీతాయ కాలాయ నమో నమో
కాల కాలాయ కాలదర్ప దమనాయ నమో //నిరామయా//

4. మృత్యుంజయాయ నమో అమర్త్యాయ నమో నమో
మత్యాభయ ప్రదాయ జీవాధారాయ నమో
భక్తా మన సమర్దాయ సర్వాధారాయ నమో
భక్తావన ప్రతిజ్ఞాయ అన్న వస్త్రదాయ నమో //నిరామయా//

5 . ఆరోగ్య క్షేమదాయ నమో అద్భుతాయ
ధన మాంగల్య ప్రదాయ ప్రీతి వర్ధనాయ నమో
బుద్ధి సిద్ధిదాయ నమో ప్రేమ ప్రదాయ
పుత్రమిత్ర కళత్ర బంధు దాయ నమో నమో //నిరామయా//

6 . యోగక్షేమ వహాయ నమో సచ్చిదాత్మాయ
ఆపద్బాంధవాయ నమో మార్గ బంధువాయ
భుక్తి ముక్తి స్వర్గాప వర్గదాయ నమో నమో
సర్వాంతర్యామినే నమో పరమ సుఖదాయ //నిరామయా//

7. ప్రియాయ నమో నిత్యానందాయ నమో
పరబ్రహ్మణే పరమేశ్వరాయ నమో నమో
భక్తానం మాతృ ధాతృ పితా మహాయ నమో
పరమాత్మ జ్ఞాన స్వరూప జగత్ ప్రభువాయ నమో //నిరామయా//

8. జగన్మాత జగత్ పిత జగద్గురవాయ నమో
భక్తాభయ ప్రదాయ నమో భక్తవస్యాయ
భక్తానుగ్రహ కరాయ నమో భక్తి శక్తిదాయ
శరణాగత వత్సలాయ నమో భాస్కరాయ //నిరామయా//

9. హృదయ దౌర్భాల్య పాపకర్మ నాశకాయ నమో
సంశయ విచ్చేదకాయ నమో సులభ గమ్యాయ
హృదయ గాంధి భేద కాయ నమో కర్మ ధ్వంసకాయ
శుద్ధసత్వ స్థితాయ నమో గుణాతీతాయ //నిరామయా//

10. అంతర్యామి నమో భక్త పరాధీనాయ
జ్ఞాన వైరాగ్యదాయ నమో పుణ్య తీర్థాయ
పుణ్య శ్రవణ కీర్తనాయ నమో అచింతాయ
సర్వాంతర్యామి నమో మనో వాగతీతాయ నమో //నిరామయా//

11. అనంత కళ్యాణ గుణాయ నమో గుణాత్మాయ
అమిత పరాక్రమాయ నమో దుర్దర్శ కోభ్యాయ
జయాయ నమో అపరాజితాయా నమో నమో
త్రిలోకేశు అవిఘాత పతాయ నమో నమో //నిరామయా//

12. అశక్య రహితాయ నమో సర్వశక్తి మూర్తాయ
సురూప సుందరాయ నమో సులోచనాయ
బహు రూప విశ్వముర్తయే సూక్ష్మాయ నమో
అరూప వ్యక్తాయ ఆనందాయ నమో //నిరామయా//

13 . మనోవాగ తీతాయ నమో ప్రేమ మూర్తయే
సర్వాంతర్యామి నమో సులభ దుర్లభాయ నమో
అసహాయ సహాయాయ నమో అనంతాయ
అనాధనాథ దీన బాంధవాయ నమో హరాయ //నిరామయా//

14. సర్వభార భరితాయ నమో వాసుదేవాయ
అకర్మనేక కర్మ సుకర్మిణే నమో నమో
సత్పరాయణాయ నమో లోకనాధాయ
సతాంగతయే నమో భాస్కర ప్రభాయ //నిరామయా//

15. అమృతాంశవే నమో పావనాన ఘాయ
బ్రహ్మచర్య తప చర్య సువృతాయ నమో నమో
సత్య ధర్మ పరాయణా సిద్దేశ్వరాయ నమో
సిద్ధ సంకల్పాయ నమో శ్రీకరాయ //నిరామయా//

16. యోగేశ్వరాయ నమో భక్తవత్సలాయ
భగవతే సత్పురుషా పురుషోత్తమాయ నమో
సత్య తత్వ బోధకాయ నమో సత్వరూపాయ
కామాది షడ్వైరి ధ్వంసకాయ నమో నమో //నిరామయా//

17. అభేదానందాను భవప్రదాయ నమో
సమ సర్వమత సమ్మతాయ సాయి నమో నమో
దక్షిణామూర్తి నమో వెంకటేశ రమణాయ
అద్భుతానంత చర్యాయ నమో అప్రమేయ //నిరామయా//

18. సంసార సర్వ దుఃఖ క్షయకరాయ నమో నమో
ప్రఫన్నార్తి హరాయ నమో పాపరహితాయ
సర్వవిత్ సర్వతో ముఖాయ నమో నమో
సర్వాంతర్బహి స్థితాయ నమో శ్రీకరాయ //నిరామయా//

19. సర్వమంగళ కరాయ నమో సౌమ్య గుణాయ
సర్వాభీష్ట ప్రదాయ నమో నమో బలాయ
సమరస సన్మార్గ స్థాపనాయ నమో శివాయ
సమర్థ సద్గురు శ్రీ సాయినాధాయ నమో //నిరామయా//

20. సాయి రామా నమో సాయి కృష్ణా నమో సాయి
సాయి హనుమ నమో సాయి దత్త నమో సాయి
సాయి శ్యామ నమో సద్గురు
శ్యామ సన్నుతాయ నమో శ్యామ హృదయాయ //నిరామయా//


126)  నీ సేవకునిగ నీ బానిసగ (05.05)
నీ సేవకునిగ నీ బానిసగ
నీ సేవలోన నిరతము
నిలుపుము సాయి //నీ సేవ//


1. సర్వము నీ కర్పణ జేయుచు
సకలము నీదే యని మది దలచుచు
సకల విశ్వమున నిన్ను జూచుచు
సంతోషంబును పొందగ జేయుము //నీ సేవ//

2 . నీ నామామృత పానము జేయుచు
నీ లీలలను గానము జేయుచు
నీ సేవకులకు సేవలు జేయుచు
నిరతము సంతస మందున నుంచుము //నీసేవ//

3 . ఆశయ మీవై ఆశలు నీవై
ఆచరణ ఆలోచన నీవై
అంతట నీవై అన్నియు నీవై
ఆనందమున నిలుపుము సాయి //నీ సేవ//

4. నీవే నేనై నేనే నీవై
నిశ్చయ నిశ్చల మనుగతి నేనై
నిరూపమానంద ధామము నేనై
నుండగ జేయుము శ్యామ సన్నుత //నీ సేవ// 

 

127) నీ లీలల తెలియగ తరమే (06.05)

నీ లీలల తెలియగ తరమే
నీ మహిమల పొగడగ వశమే
నిర్గుణ సగుణ సచ్చిదానంద
సద్గురు దేవా సాయీ //నీ లీలల//

1. అవాంగ్ మానస గోచరుడవు
ఆది మధ్యంత రహితుడవు
ఆదిదేవుడవు అధి దేవుడవు
అప్రమేయుడవు అపాంతరాత్ముడవు // నీ లీలల//

2. సంతతా నంద సంధాయకుడవు
సద్గురుడవు సర్వోన్నతుడవు
సంసార దుఃఖ వినాశకుడవు
సత్య రూపుడవు సత్య రూపుడవు //నీ లీలల//

3 . సద్భక్తుడవు సంరక్షకుడవు
సకల సంశయ విచ్చేధకుడవు
వివేక విజ్ఞాన ప్రదాయకుడవు
శ్యామ హృదయడవు శ్యామ నాథుడవు //నీ లీలల// 


128) నీ నామము వినుటయే నా భాగ్యము (07.05)

నీ నామము వినుటయే నా భాగ్యము
నీ రూపము జూచుట నా పుణ్యము
నీ నామము స్మరించుట యే జ్ఞానము
నీ రూపము ధ్యానించుటయే మోక్షము //నీ నామము//

1. నామము వినగ మనసు కలగదు
రూపము జూడగ బుద్ధి నిలువదు
నామ స్మరణకు తీరిక కలుగదు
ఎందుకిట్టుల జేతువో
ఎందుకీ వీధి ఆడించెదవో
దోషములన్నియు దయతో మన్నించి
కనికరముతో నను గావుము సాయి //నీ నామము//

2. అనేక యిడుముల కలిగించెదవు
వాటిని తొలగించగ నిను ప్రార్థించెదను
లౌకిక విషయము లందు నిలిపెదవు
పరమార్థమునకు జేరనీయవు //నీ నామము//


129) నీ లీలల కంతము కలదా (08.05)

నీ లీలల కంతము కలదా
నీ ప్రేమ అనంతము కాదా? //నీ//

1 . వింత వింత అనుభూతులలో
మది ఎంతో పొంగి పోవునురా
సుంతయేని నిను నమ్మి
జీవించు వారికి చింత గలదా //నీ//

2. సాయి సాయి యని బాబా బాబా యని
ఎప్పుడెటుల నిను బిలచిన గానీ
వెనువెంటనే నీ కరుణను బరపి
ఆలన పాలన జేతువు గాదా

3. తల్లి దండ్రి గురు దైవము లీవై
సత్య ధర్మము శాంతియు నీవై
జ్ఞాన మార్గమున మము నడపించుచు
సద్గతి నొసగెడి శ్యామ వందితా //నీ//


130) అది దేవా అమర వినుత  (09.05)

అది దేవా అమర వినుత 
అప్రమేయం పాహిమాం.

అఖిలలోక సంచారకా 
వినాశనాశక రక్షమాం.

మంత్రరూపా మహా మోపేతా 
మూలధార పాహిమాం 

మహాదేవా మధురానాథా 
వినోద నాయక రక్షమాం

విశ్వరూపా విజ్ఞానదాయక 
విమల చరితా పాహిమాం

ప్రణవ రూప ప్రేమమందిరా 
ప్రాణ నాయక రక్షమాం

సామగాన విలోల శివ 
ప్రియనందనా గురు పాహిమాం.

శ్యామ వందిత శ్రీ గజాననా 
శ్రీ గురు ప్రభు రక్షమాం .!
 
131) ప్రేమ తోడ గావుమయ్యా (10.05)

ప్రేమ తోడ గావుమయ్యా పరమాత్మ సాయి నీ పద పంకజములే నమ్మియున్న వారమనీ ప్రేమగ మము గావుమయ్యా పరమాత్మ సాయి //ప్రేమ// 1. ప్రతిక్షణము నీ నామమే మా మనసుల పలుకుచుండ అనుక్షణము నీ రూపమే మా కనులలో కదలు చుండ అహరహము నీ దయయే మమ్మెలర నడుపు చుండ క్షణక్షణమూ నీ కరుణయే మా కభయము నొసగు చుండ //ప్రేమ// 2. బాధ్యతల నేమో అధికము జేసి మా మనసుల కెంతో బాధల కలిగించి దారి తెలియక దిరుగు చుండగా కూర్చొని హాయిగా నవ్వుచూ వున్నావు ఇపుడి దేహమున కెందుకో బాధల కల్పించుచూ వున్నావు నీవే దిక్కని నమ్మిన వారమనుచు ఆ బాధల తొలగించుము సాయి //ప్రేమ//


132) పవిత్రునిగ నుంతువో పతితునిగా (11.05)

పవిత్రునిగ నుంతువో పతితునిగా నొనరింతువో నీ పాల బడితినయ్య పతిత పావనా సాయీ //పవిత్ర// 1. సత్యమునే బలుక మనుచు ధర్మముగనే బ్రతుక మనుచు సకల మానవాళికీవు సందేశము లొసగితివి అసత్యములనే బలికెడి అల్పునిగా నిలిపితివి అధర్మముగనే బ్రతికెడి అజ్ఞాని జేసితివి //పవిత్రు// 2. పరులను దూషించకుమని పరమార్ధము నెరుగుమనీ పదేపదే నీ భక్తుల కాదేశము లోసగితివి పర దూషణ చేయు పరమ మూర్ఖునిగా నుంచితివి పరమార్ధము మెరుగలేని పాపిగనను నిలుపితివి //పవిత్రు// 3. విశ్వాసము నోర్పులను కలిగియుండు మంటివి అవియే సకలాభీష్టము లోసగి గాచు చుంటివి విశ్వాసము కలుగ నట్టి అవివేకిగా జేసితివి ఓర్పులేని మందమతిగా మహిలో నను బెంచితివి //పవిత్రు// 4. దుర్మార్గుల సన్మార్గుల గావించగా వెలసితివి మతములన్ని ఒకటే అని మానవులకు దెలిపితివి నీ లీలల నెరుగ లేను నీ మహిమల దెలియగ లేను శ్రీ చరణా భయ హరణా శ్యామ చరణ సన్నుతా //పవిత్రు //


133) పాపికి నిష్కృతి ఎన్నడు ? (12.05)

పాపికి నిష్కృతి ఎన్నడు ? నీ పద సన్నిధిని చేరు టెన్నడు? పతితునిగా ఈ పవిత్ర భువి లో మసలుచు నుండెడి మందభాగ్యుడగు- ఈ- //పాపి// 1. తలచున దొకటి చెప్పేడి దొకటి చేసేడి దొకటిగ బ్రతుకుచు నుండెడి అహము మోహముల ఈర్ష్యాసూయల తోడ దుర్భాష లాడుతూ నుండెడి //పాపి// 2. కామముతోడ కన్నులు గానక కనరాని పనులు చేయు చుండెడి మహితాత్ములగు దైవ భక్తులను హీనముగా పరికించు చుండెడి //పాపి // 3. అధర్మ మన్యాయములతో నడుచుచు ఆస్తి కొరకు ఆరాటము చెందెడి స్వార్ధము కొరకై నయ వంచనముతో నరులను బహుగ పొగడుచుండెడి //పాపికి // 4. పుణ్యము సంపాదించుట కొరకై భక్తి శూన్యమగు పూజలు చేసి పలువుర లోన భక్తుడు వీడని నటియుంచు చుండెడి //పాపికి // 5. పూజల చేయగ సేవల చేయగ నీ దయ కొరకై చూచుచు నుండెడి దానధర్మముల చేయక సతతము సద్గతి నందక అభిలషించెడి //పాపికి// 6. ప్రేమభావమున ప్రాణుల జూడక శ్రీ గురుదేవుని ఆశ్రయించక శ్రీ గురుదేవుల ఆదేశములను అణుమాత్రమైన ఆచరించక సత్ఫలితములనే సదా కోరుచు స్వార్థ చింతనతో నడుచుచుండెడి శ్రీ గురుదేవుని కృపను కోరెడి హీన మనస్కుడగు శ్యామచరణుడు //పాపికి //


134) భాగ్యము నొసగుమురా సాయి (13.05)

భాగ్యము నొసగుమురా సాయి -

నీ దరిశన భాగ్యము నొసగుమురా ------ //భాగ్యము // 1. నీ పద పంకజములనే నమ్ముచు నీ రూపమునే ధ్యానము చేయుచు నీ లీలలనే గానము చేయుచు

నీ నామమునే పలికెడి వారికి //భాగ్యము // 2. అన్న వస్త్రముల నందింతు వినీ ఈతి బాధలను బాప గలవనీ

జీవికి సద్గతి నొసగ గలవనీ నమ్మి

నిను గొలుచు శ్యామ చరణునకు // భాగ్యము //


135) ప్రసన్న వదనా సాయీ (14.05)

ప్రసన్న వదనా సాయీ - పతిత పావనా సాయీ పరమ కృపాకర - పాపనాశకర -

పావన నామా - సాయీ సద్గురు దేవా

పాహిమాం సాయినాధా రక్షమాం // ప్రసన్న// 1. నీకును నీ చిత్రమునకు భేదము లేదనుచు మాకు తెలిపితివి నీ చిత్రమునకు చేసిన సేవలు నీకే చెందుననుచు తెలిపితివి భక్తి శ్రద్ధ విశ్వాసములున్నవో, లేవో కానీ

నీ సేవలు చేయుచుంటి గ్రహించెదవో,

ఆగ్రహించెదవో నెరుగని అవివేకిగా నేనుంటిని

మౌనముగా నుందువో లేక మాటాడెదవో

నెరుగ లేనయ్యా సాయి // ప్రసన్న //

2. నిరతము నీ చరణముల దరి నే విడువక నివసించగ నెంచితి సాయి నామ స్మరణము తోడనే సతతము జీవించ దలచితిని //ప్రసన్న// 3. సాయి సేవకుల సద్భక్తులకు సేవలు జేయుచు సచ్చిదానంద మొంద నెంచి తిని కరుణ బరపి ఈ దీనుని మొరలను విని దయ చూపుము - దరికి జేర్చుము //ప్రసన్న//


136) బాబా నిను నమ్ముకుంటి (15.05)

బాబా నిను నమ్ముకుంటి నీకే మ్రొక్కుచు నుంటి
ప్రేమ గాచెదవన నీవే నా శరణ మంటి
బాబా శ్రీ సాయి బాబా //బాబా//

1. సత్యమునే బలుక కుంటి- ధర్మమున నడవకుంటి
దానముల చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

2. సచ్చింతన చేయకుంటి - సన్మార్గము నడవకుంటి
సత్సంగము చేయకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

3. నీ లీలల చదవకుంటి - ధ్యానము చేయకుంటి
భజనలో పాల్గొన కుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

4. మోసంబుల చేయుచుంటి - మోహంబున తిరుగుచుంటి
మహాత్ముల జూడకుంటి - ఎందుకో నేనిట్లుంటి //బాబా//

5. మనసును నిలపకుంటి- మమతలను విడవకుంటి

మాయలను దాటుకుంటి- ఎందుకో నేనిట్లుంటి //బాబా//

6. తల్లివై లాలించు - తండ్రివై నను పోషించు
గురుడవై నను నడిపించు - దైవం బై దరిజేర్పించు //బాబా//

7. పాపముల జేయనీకు- పెడమార్గముల బోవనీకు
పర దూషణ జేయనీకు - సచ్చింతన వదల నీకు //బాబా//

8. దైవ ప్రేమను బెంచి - ఈర్ష్యాసూయల ద్రుంచి
నీ బంటుగా నన్ను గావించి - కరుణించు వరము నిచ్చి //బాబా//

9. సాయి నామది నివసించు- నీ నామమునే పలికించు
నీ చరితమునే చదివించు - నీలోన నన్నిమిడించు //బాబా//

10. నిష్ట సబూరుల బెంచు -నీ సేవల చేయగ నుంచు
సంతోషములో నన్నుంచు - నీ సన్నిధి నా కందించు //బాబా//

11. నాలోన మాయను ద్రుంచు -మమతానురాగము
పెంచు నాకు సద్గతులందించు - సన్మార్గముతో నడిపించు //బాబా//

12. దోసంబుల సంహరించు - పాపంబుల పరిహరించు
నీ పాద భక్తిని బెంచు - నీలో నన్నైక్యమొనరించు //బాబా//

13. దుర్గుణములను పోగొట్టి- అసత్యమును మానిపించి
మంచిగ నను నీవు బెంచి - నీతి నియమాలను బోధించి //బాబా//

14. పరాకు జేసే వేల - కరుణించి కాపాడవేల
జాగు సేయ కోపమేల - నను బ్రోవ వేగ రావేల //బాబా//

15. నీ రూపమును జూడగలేదు- నీ సమాధిని దర్శించగలేదు
నీ చరితమును చదవగలేదు- నీ నామమునే వినగలుగుదు //బాబా//


137) భేద భావము తొలగ జేయుము (16.05)

భేద భావము తొలగ జేయుము
బ్రహ్మానందము కలుగ జేయుము
భావమందున గాన మందున నిలచి

మమ్ముల నుద్దరింపుము

బాబా సాయి నా బాబా సాయి //భేద//

1. సత్యమేదోతెలియజేయుము
నిత్యమందున నిలిపివేయుము
భక్తి యను భత్యమును వేయుము
ముక్తి పదమును వాస వేయుము //భేద//

2. అణువు అణువున నీవు గలవను
అనుభవముల కలుగ జేయుము
ఆత్మ జ్ఞానము పొంద గలిగెడి
మార్గ మందున నడువ జేయుము //భేద//

3. సుఖము దుఃఖము లనెడి భావన ఎన్నడైనను
కలుగ జేయకుము సుఖము దుఃఖములనెడి
భావనలన్నీ దాటెడి స్థితికి చేర్చుము సచ్చిదానందంబు
నందున శ్యామచరణుని ముంచి వేయుము //భేద//


138) బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ? (17.05)

బాబా నిను నమ్మిన బాధలు కలుగునా ?
సాయీ నిన్ను నమ్మిన శోకము నిలుచునా ?
త్రికరణ శుద్ధిగ భక్తిగ నిన్ను పిలువక యుండిన పలికెదవా
శ్రద్ధతోడ నీ సేవలు చేయక ఆరాధించిన నిలిచెదవా //బాబా//

1. భక్తి శ్రద్ధ విశ్వాసము లుండక
ఎంతగ నిను పిలచినను
పలికెదవా కనిపించెదవా
దయ చూచెదవా- కరుణించెదవా //బాబా//

2. భక్తిగ పిలచిన పలికెద నంటివి
శ్రద్ధగ పిలిచిన నిలిచెద నంటివి
భక్తిశ్రద్ధలు లేని మూర్ఖుడను
నిన్ను ఎప్పుడు చూచెదనో ఎటుల తరియింతునో //బాబా//

3. భక్తి శ్రద్ధలను ఒసగి గావుము
నిష్ట సబూరుల నొసగి బ్రోవుము
ప్రేమ భావమును పెంపొందించుము
దర్శనం మోసగి పలకరించుము //బాబా //

4. సర్వాభీష్ట ప్రదాయక సాయీ
సచ్చిదానంద సద్గురు సాయీ
సర్వమత సమ్మత శ్రీ సాయీ
శ్యామృదయాధివాసా సాయీ //బాబా//


139) మోహనమే సాయి నామం (18.05)

మోహనమే సాయి నామం
సమ్మోహనమే సాయి రూపం

1. సకల వ్యాధులకు దివ్య ఔషధము
సమస్యలకు అది పరిష్కారము
సచిన్తనలకు ఆలంబనము
సన్మార్గంబున కది ఆధారము //మోహనమే//

2. భక్తి జ్ఞానముల కదియే మూలము
వైరాగ్యమునకు తరుణోపాయము
శాంతి సుఖములకు అది సాధనము
సద్గతు లందుట కదియే మార్గము //మోహనమే//

3. కలియుగమున కది కర్మనాశకము
సత్పురుషుల కది సోహం నాదము
సకల జీవులకు శాంతి దాయకము
శ్యామాదులకు ముక్తిదాయకము //మోహనమే//


140) వందనములను గొనుమా (19.05)

వందనములను గొనుమా
వాయునందన హనుమా

1. శరణు శరణంటి హనుమా
సద్భక్తి నొసగవే హనుమా
వినుతించెద జయ హనుమా
వీడక బ్రోవుము హనుమా //వందనము//

2. అభ్యర్థించెద హనుమా
నన్ను ఆదరించవే హనుమా
అర్ర్చించెద జయ హనుమా
ఆశీస్సుల నొసగవే హనుమా

3. సన్నుతి జేసెద జయ హనుమా
సద్గతుల నోసగవే హనుమా
సతతము దలచెద హనుమా
శ్యామాదుల గావవే హనుమా //వందనము//


141) వ్యర్థపు యోచన లెందుకు మనసా (20.05)

వ్యర్థపు యోచన లెందుకు మనసా
వ్యామోహంబులు ఎందుకె మనసా
నిరతము చింతన చేయుచు నుందువు
జనన మరణ చక్రంబున నుందువు //వ్యర్థపు//

1. పంచ భూత సమ్మేళ మగునది దేహంబని నీ వెరుగుదువే
పుట్టుట గిట్టుట లన్ని జీవులకు సహజంబని నీ వెరుగుదువే
అశాశ్వతంబౌ ఆస్తి సంపదలు మోహమయంబని దెలియుదువే
దెలిసి దెలిసియు దెలివి లేక పెడ మార్గములందున దిరిగేదవే //వ్యర్ధపు//

2. ఆశయే సర్వ దుఃఖంబులకు మూలంబని
నీ వెరుగుదువే అహంకార మమకార పరంపర

లంధకారమని దెలియదువే దెలిసి దెలిసియూ
దెలివి లేక పెడమార్గము లందున దిరిగేదవే //వ్యర్థపు //

3. పరబ్రహ్మమున మనసును నిలుపగ ప్రయత్నించవే మనసా
సత్య ధర్మ పధ గమనము లందున సాగుచుండవే మనసా
నిష్ట సబూరుల గలిగి యుండి నిజ మార్గము తెలియవే మనసా
శ్యామ చరణ సన్నుతుడగు సాయిని సతతము దలచవే మనసా //వ్యర్థపు//


142) వలదయ్యా - నను వదలకు మయ్యా (21.05)

వలదయ్యా - నను వదలకు మయ్యా
పాపాత్ముడనని నాపై కోపము //వలదయ్యా //

1. పవిత్రతయు యిసుమంతయు లేదని
పరమ భక్తి నలుసంతయు లేదని
సదాలోచనలు సుంతయు లేవని
సదా చరణ శూన్యంమని - అలుక //వలదయ్యా //

2. దురాచారుడని దుర్మార్గుడనని
సాధు పోషణలు సేవలు లేవని
సమయాను కూలముగ నుండునని
స్వార్థ పరాయణుడని - అలుక //వలదయ్యా //

3. ధర్మ న్యాయముల దలచు ననుచుననీ
నీతి నియమముల పాటించనని
సత్య మార్గమున సంచరించని
సజ్జన దూషణ జేయుదుననీ - అలుక //వలదయ్య //

4. సద్గురువులను సరకు జేయనని
సత్సంగముల పాల్గొనననీ
సద్భక్తుల సహవాసము లేదని
సద్భాషణలను జేయనని - అలుక //వలదయ్య //

5. పూర్వ పుణ్యమున నిన్ను దలచితిని
రక్షించెదని మది నమ్మితిని
నీ దరికి లాగ నిను శరణంటిని
శ్యామదేవుని కరుణించ మంటినని - అలుక //వలదయ్య//


143) వలదు - వలదు సాయీ ! (22.05)

వలదు - వలదు సాయీ !
నను వదల వలదు సాయీ !
నను వదిలిన నాశనమై
నరకములో బడి పోవుదు _ //వలదు //

1. ధర్మమే దహనమై
నీతియె నిర్మూలనమై
న్యాయమే నశియించు చున్న
స్థితి గతులలో నన్నుంచ //వలదు //

2. ప్రేమయే నశియించు చున్న
ద్వేషమే పెరుగుచున్న
స్వార్థము సంసారమున్న
మనసులతో నన్నుంచ //వలదు//

3 .ఆడంబర మధికమైన
ఆలోచన తక్కువైన
ఆచరణయే శూన్యమైన
మనుషులలో నన్నుంచ //వలదు//

4. నయవంచనతో నిండిన
దయా రహితమౌ బ్రతుకుల
ఢంభముతో గడుపుచున్న
సంఘములో నన్నుంచ //వలదు//

5. అజ్ఞానం అధికమై
నిను వదిలిన నను వదలక
నను వదిలిన నిను వదలను
మన మధ్యన భేదముంచ //వలదు//

6. దెలిసి దెలియక గడచిన జన్మలలో
జేసినట్టి కర్మములకు ప్రతి ఫలముగ
ఈ జన్మము కలిగేనేమో అటులికపై

జేయించక జన్మములను కలిగించక గావ వేడెద
శ్యామ చరణేశ్వరా -దేవా //వలదు//


144) శ్రీ స్వామిని సేవించుటలో (23.05)

శ్రీ స్వామిని సేవించుటలో
శ్రీనాధుని భజియించుటలో
కలుగులే ఆనందము
తొలగులే మన పాపము //శ్రీ స్వామి //

1. రామకృష్ణుల రమ్య స్వరూపం
శ్యామ సుందర విగ్రహ రూపం
కరుణ మమతలు కలిసిన రూపం
మన కనుల కగపడు సద్గురు రూపం // శ్రీ స్వామి //

2 .మన ఆత్మల కోసగును అనంతశక్తి
మనసుల పెంచును మరింత భక్తి
ముసలెడి తీరుల తెలుపును యుక్తి
చివరకు కూర్చును మన కిల ముక్తి
ఈ మాయల నుండి విముక్తి --- //శ్రీ స్వామి//


145) శరణు శరణు రఘురామా... (24.05)

శరణు శరణు రఘురామా...
సాయిరామా.. సాయి దత్త గురునామా
సద్గురు ధామ... ప్రభో సాయి రామ //శరణు//

1. సాయీ.. సాయీ‌.... అని స్మరించిన చాలూ
సకల పాపంబులే సమసి పోవూ...
సాయి సద్గురు కరుణే... సదా తోడు నీడయై
గాచి రక్షించి ప్రేమ మీర బ్రోచు గాదా... //శరణు//

2. సకల దైవ స్వరూపములు సాయియే
సకల ప్రాణి స్వరూపములు సాయియే
ఎవ్వరెటుల బిలచినా... ఎవ్వరెటుల గొలిచినా...
తానే ఆలకించి సర్వము సమకూర్చు గాదా... //శరణు//


146) శరణము శరణము రామా సాయి (25.05)

శరణము శరణము రామా సాయి
నీ దివ్య చరణమే శరణము సాయి //శరణము//

1. మ్రొక్కెద మ్రొక్కెద రామా సాయి
మోద మలర మము గావుము సాయి //శరణము//

2. వేడెద వేడెద రామా సాయి
వేదనలను తొలగించుము సాయి //శరణము//

3. పూజించద పూజించద సాయి
పుణ్యాత్ములలో కలుపవే సాయి //శరణము//

5. అర్చించెద అర్చించద సాయి
అనవరతము నను బ్రోవుము సాయి //శరణము//

6. ధ్యానించద ధ్యానించెద సాయి
దరైశన మొసగుము దత్త గురు సాయి //శరణము//

7. సేవించద సేవించెద సాయి
సమాధి నిష్ట నోసంగుము సాయి //శరణము//

7. వినుతించెద వినుతించెద సాయి
వినయ వివేకముల పెంచుము సాయి //శరణము//

8. విశ్వాసంబును పెంచుము సాయి
నిష్ఠ సబూరుల బెంచుము సాయి //శరణము//

9. నుతియించెద నుతియించెద సాయి
సద్గదులను కలిగించవే సాయి //శరణము//

10. ప్రార్ధించెద ప్రార్ధించెద సాయి
పరమ పదము నా కొసగవే సాయి //శరణము//

11. సమర్థ సద్గురు దేవా సాయి
శ్యామచరణ సన్నుత శ్రీ సాయి //శరణము//


147) మంగళం జయ మంగళం (26.05)

మంగళం జయ మంగళం
మంగళం శుభ మంగళం

శ్రీ సాయినాధునకు శిరిడీ నివాసునకు //మంగళం //
ప్రేమ స్వరూపునకు - పరమాత్మ రూపునకు //మంగళం//
శివరామ కృష్ణునకు - మారుతి రంగనికి //మంగళం//
దత్త గురునాథునకు - ధర్మావతారునకు //మంగళం//

సాఫల్య దాతకు - సద్గతి ప్రదాతకు‌‌ //మంగళం//
కాల నిర్ణేతకు - కైవల్య దాతకు //మంగళం//
కులమత రహితునకు - శ్యామ దేవునకు //మంగళం//
జగమేలు తండ్రికి - జయ చిద్విలాసునకు //మంగళం//


148) శ్రీరామ జయరామ - జయ జయ రామా (27.05)

శ్రీరామ జయరామ - జయ జయ రామా
జయ జయ రామ - జయ రామ శ్రీరామా //శ్రీరామ //

మనసున నిలిచి శ్రీరామా - మాయ తొలగించు శ్రీరామా

భక్తిని పెంచుము శ్రీరామా -‌మా బాధల మా బాపుము శ్రీరామా //శ్రీరామ//

దిగులు తొలగించు శ్రీరామా - దిక్కు నీవయ్య శ్రీరామా
దారుల జూపుము శ్రీరామా - దయ జూపమయ్య శ్రీరామా // శ్రీరామ //

కామితము దీర్చు శ్రీరామ - కరుణను చూపి శ్రీరామ

శామసన్నుతా శ్రీరామ -సద్గతి నీయవే శ్రీరామ //శ్రీరామ //


149) శిరిడీ వాసా... శ్రీ సాయీశా... (28.05)

శిరిడీ వాసా... శ్రీ సాయీశా...
నీ పదముల నెర నమ్మితి మయ్య
మము దయ గనుమా పరమేశా //శిరిడి //

1. తల్లివి నీవై... తండ్రివి నీవై
గురుడవు నీవై.... దైవము నీవై
భక్త జనులను పరిరక్షించగ
ద్వారకా మాయి యందు వెలసిన //శిరిడి//

2. రాముడ నీవై... కృష్ణుడనీవై
ప్రేమ స్వరూపా... సత్య స్వరూపా
శివుడవు నీవై.... భవుడవు నీవై
సాధు స్వరూపా ---సత్య స్వరూపా
సకల దేవతా రూపుడ నీవై
శ్యామాదులనూ పరిపాలించెడి //శిరిడి//


150) శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా (29.05)

శిరిడీ నుంచి వచ్చినావా సాయి రామయ్యా
ప్రేమ జూపి చిత్రముగ ఇంటికి దయజేసి నావయ్యా //శిరిడీ//

శిరిడీ క్షేత్రము చూడగలేదు శ్రీకర సాయిశా
ద్వారక మాయిన అడుగిడ లేదు భయహర శిరిడీశా
నీ సమాధిని తాకగ లేదు జయ హర జగదీశా
నీ పాదుకలను సేవింప లేదు రఘువర పరమేశా //శిరిడీ //

2. ఎప్పుడు దలచిన అప్పుడే మమ్ము అలరింతువయ్యా
ఎక్కడ దలిచిన అక్కడే మమ్ము రక్షింతువయ్యా
నీ చిత్రములో విచిత్రములనే జూపింతువయ్యా
నమ్మిన వారిని వదలక ఎప్పుడు ప్రేమింతువయ్యా //శిరిడీ//

3. నీ లీలలనూ తెలియగ లేని నీ పిల్లలమయ్యా
నీ మహిమల గుర్తించగా లేని జనులము మేమయ్యా
నీ చేతులకు అర్థము తెలియని ఆశ్రితులమయ్యా
శ్యామ సన్నుతుడె దిక్కు మా కనుచు నమ్మి నారమయ్యా //శిరిడీ//


151) శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం (30.05)
శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం
ప్రభు శ్రీ సాయి రూపములకు నిత్య శుభ మంగళం

1. శ్యామా తాత్యాలు, దీక్షిత్ నరసింహ,
దాసుగణులు కృష్ణా, భాగోజీ,
రాధాకృష్ణ మాయిలు గొలిచే //శ్రీ సాయి//

2. పురందర, విట్టలు, సాధే,
బడేబాబా, మహల్సాపతి, ఉపాసనీ,
మేఘశ్యాములు, నానా, నార్కెలు గొలిచే //శ్రీ సాయి//

3. నిమోన్కర్, బూటీ, దేవు,
హనుమ, సాంబ, పార్థసారథి,
కేశవయ్య, భరద్వాజ, బాలాసాహెబు గోలిచే //శ్రీ సాయి//

4. తారాబాయి, చంద్రా బాయి, మెహర్ బాబా,
కృష్ణా భాయి, ఉమాబాయి , ద్వారకామాయి
వరమ్మ, కళ్యాణి గొలిచే //శ్రీ సాయి//

5. భక్తిగ దైవమునే నమ్మి భజనలతో
కీర్తించుచూ సద్గురు దేవుని సత్ కృప గోరుచు
శ్యామదేవుడు సతతము తలచే //శ్రీ సాయి//

152) శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో (31.05)
శిరిడి పురమున నీ శరీరమును దర్శించితినో లేదో
గడచిన జన్మలలో నీ సేవల జేసుకుంటినో లేదో
నేడు నీదు చిత్తరువును జూచుచు వేడు కొనుట - వినరాదా -

అంతటి భాగ్యము ఎన్నడు కలుగునో
ఎన్నడు నీదరి జేరుదునో యని నేడు

లోకులు పలుగాకుల వలె దూరగా
బాధల వలలు సంకెలలు బిగించగ
భవ భంధముల దిగ్భంధనమున
కుములుచు నిను శరణాగతి వేడితి // శిరిడి //

2. తల్లివి నీవై లాలించెదవు
తండ్రివి నీవై పోషించెదవు
సద్గురు నీవై నడిపించెదవు
దైవము నీవై దరి జేర్చెదవు // శిరిడీ //

3. నీ రూపమునే సందర్శించెడి
నీ పలుకుల నే విని పులకించెడి
నీ సేవలనే జేయ గలిగెడి
భాగ్యము నీయుము శ్యామ సన్నుత // శిరిడీ//

153) శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా (01.06)
శ్రీకరా... శ్రీ శిరిడీశ్వరా
ప్రేమగ నను కావారా... సాయీశ్వరా‌//శ్రీకరా //

గురుడవు నీవనీ, దైవము నీవనీ,
గురువే దైవమని సత్యము ధర్మము
సత్పధ మర్మము తెలుపగ వేడిమి
నీ నామామృత పానము చేయుచు

నీవే శరణమని పిలచి పిలచి
నిన్ను కొలచి కొలచి నే నలసిపోయితిని
లేరా దయను చూపి నీ దరిశన మొసగి
హృదయ మందిరము నందు నిలువరా.. పలకరించరా //శ్రీకర //

నిష్ట సబూరుల శిక్షణ నొసగగ
ఇక్కట్టుల కలిగించితివా
సుఖ దుఃఖములలో సమ భావము
కలుగునటుల కరుణించితివా

మొహంబు నెప్పుడు గూల్చెదవో మోదంబు
నెపుడు గూర్చెదవో ఎటుల నీ దరికి జేర్చెదవో
ఎప్పుడు నీలోన నిలిపెదవో నే నెరుగ లేను రా
శ్యామ సన్నుతా... సాయి
//శ్రీకర //

154) శిరిడీ వాసా దీన జనావనా (02.06)
శిరిడీ వాసా దీన జనావనా శాంతస్వరూపా సాయిరాం అభయ ప్రదాతా జ్ఞానప్రదాతా పావన చరిత సాయిరాం //శిరిడీ// 1. ఏసువు నీవే అల్లావు నీవే శివుడవు మాధవుడవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గురుడవు దైవము నీవే మాయా జనిత ముని జన సన్నుతా మహిత చరిత సాయిరాం //శిరిడీ// 2. నిన్నే మదిలో నమ్మిన వారికి కష్టము లుండవు ఎన్నడూ నీ నామము జపించు వారికి పాపము లుండవు ఎన్నడూ యుక్తి ప్రదాతా భక్తి ప్రదాతా ముక్తి ప్రదాతా సాయిరాం //శిరిడీ// 3 . సత్యము ధర్మము తొలగిన వేళ, పాపములు చెలరేగిన వేళ భువిలో నీవు అవతరించితివి, మానవ రూపము దాల్చితివి భవ భయ హర పాహి పరాత్పర పరమ దయాకర సాయిరాం //శిరిడీ//

155) శిక్షయో - నీ శిక్షణ యో ! (03.06)
శిక్షయో - నీ శిక్షణ యో !
పరిరక్షణయో సాయీ - ఇది నీ //శిక్షయో//

1. అక్షయముగ నీ అభయ ప్రధానము ఆశ్రితుల నెల్ల గాచుచు నుండగ
నీ రక్షణతో భక్తులెల్లరూ బ్రహ్మా నందము నందు మునుగుచు నుండగ

నీ శిక్షణలో సమర్థ సద్గురు దేవులెందరో 
లోకముల పాలించుచుండగ
మంద బాగ్యుడై మోహా వేశుడై 
మూర్ఖునిగా చరియించు వీనికిది //శిక్షయో//

2.  నీతినియమములతో చరియించాలని న్యాయ ధర్మముల నడయాడాలని
సకల విశ్వమున సాయిని చూచి సంతసమున సేవించ వలయునని 
కోరికలెన్నో ఆశలు ఎన్నియో అంత రంగమును అధివసించగా 
దేనిని చేయక ఎందుకు చెందక 
మూర్ఖునిగా చరియించు వీనికిది   //శిక్షయో//

156) శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త రూపా (04.06.)
శ్రీరామ కృష్ణ శివ మారుతి దత్త రూపా
శ్రీ వాణి మహేశ్వరి లలితాది శక్తి రూపా
శ్రీ హనుమ కేశవ నరసింహ మహర్షి రూపా
నాదు నమస్సుమాంజలుల నందుకో సాయి రూపా

ఈ లోక మెల్ల సృజియించెడి దైవ మీవే
పోషించు భారమును భరియించెడి దైవమీవే
చిత్రాతి చిత్రముగ లయించెడి దైవమీవే
నాదు ప్రణామముల నందు కొను దైవమీవే

శరీర కంబులగు బాధల లెన్ని యున్న 
మానసికంబుగ నశాంతు లెనియున్న
విశ్వాస ముంచి 'బాబా 'యని దలచుకొన్న 
సంతోషకరంబులకు సత్ఫలితము లోన గూడు గాదే

157) శ్రీ సాయి రామ నామ మహిమను చక్కగా (05.06.)
శ్రీ సాయి రామ నామ మహిమను 
చక్కగా దెలియుము మనసా !

ఘన సంసారంబుధి దాటగ 
జేసేడి మధుర నామమే మనసా !
శ్రీ సాయి నామమే మనసా ! 
శ్రీ రామ నామమే మనసా ! //శ్రీ //

2. సద్గురువుల చెంతకు నిను చేర్చును 
చక్కగా నడుపును మనసా ! 
భోగభాగ్యముల సుఖసంపదలను 
సత్వర మొసగును మనసా ! // శ్రీ //

3. ఆపదలలోన నిన్నాదుకొనుచు 
పరిరక్షణ జేయునే మనసా !
ఆనందామృత మందించును 
నిన్నలరించును సతతము మనసా !  //శ్రీ//

4 . సాంబశివుడు సద్భక్తితో 
రామనామమే దలచును మనసా !
రామ నామము సకల పాపముల 
హరిహరించునే మనసా ! //శ్రీ //

158) సాయి రామా ---- సాయి రామా (06.06.)
సాయి రామా ---- సాయి రామా 
సద్గురు దేవా --- సాయి రామా 
దత్త గురు కృష్ణ శివరామా 
మారుతి విఠల రంగనామా //సాయి//

2. ఏమి పుణ్యముల చేసితిమో
ఏయే నోముల నోచితిమో
నీ పదములనే నమ్మితిమి 
నిను  దైవముగా పొందితిమి //సాయి//

3. సన్మార్గంబుల నడిపించి 
సచింతనలను కలిగించి 
సద్గతులను నా కొసగ గదే 
శ్యామచరణ సన్నుత శ్రీ సాయీ //సాయీ//

159) ఇది కల కాదు (07.06.)
ఇది కల కాదు కల్లా కానే కాదు 
ఇది ఆనంద నిలయము కరుణాలయము 
ఇది భావాలకు అందని బ్రహ్మానంద నిలయము
ఇది గురుదేవుల శ్యామచరణ హృదయాలయము 

ఇది మా అందరి పాలిట ప్రేమాలయము
దివ్య ప్రేమాలయము కరుణాలయము 
మన కరుణాలయము సాయి కరుణాలయము

1. సతమతమౌ నటుల చేయు పిచ్చియోచనలతో  వికలము కలిగింపజేయు వ్యర్థ కలాపాలతో 
తరిగిపోవు నా జీవిత పరిమాణపు సమయాన 
తరియించగ తపియించుచు నీదరి చేరినదానా 
బాల ననుచు బేలననుచు జాగుచేయ తగునా..తగునా... తగునా ....
శ్యామాచరణ ఓ శారద రమణా 
శ్యామాచరణా హే వందిత రమణా 
//ఇది కల కాదు//

2. ఏది నీవు  లేనిదేదీ నీవు కానిదేదీ 
నీవు చేయలేనిదేదీ నీవూ అడుగడుగున 
ఆదుకునెడి ప్రేమ స్వరూపా అణువణువున నిండియున్న దివ్య స్వరూపా పరమ దివ్య స్వరూపా
శ్యామా చరణా ఓ శారద రమణా
మా శ్యామ చరణా హే వందిత రమణా 
//ఇది కల కాదు //

3. నీ సన్నిధి లేనపుడు 
నా బ్రతుకే అయోమయం
నీ సన్నిధి ప్రభావమున 
నా బ్రతుకే ప్రేమమయం 

కలకాలం నీ దివ్య సన్నిధిలోనే 
నిలిచిపోని , రాలిపోని, కరిగిపోని 
శ్యామా చరణా హే శారద రమణా
 శ్యామా చరణా ఓ శారద రమణ 
// ఇది కల కాదు //

160) హే కరుణా భరణా దయానిధే (08.06.)
హే కరుణా భరణా దయానిధే
కల్మష హరణా కృపానిధే
కరుణా భరణా కల్మష హరణా
దయానిధే కృపానిధే 
హే కరుణా భరణా .....

1. భౌతిక వాసనలో  పడియుంటిని
ఆధ్యాత్మికతకు ఆశపడితిని 
భౌతికమునకు ఆధ్యాత్మికతకూ
బంధము నెరుగక కుములు చుంటిని
॥ హే కరుణా భరణా ॥

2. ఒకపరి నీవున్నావనె ధైర్యము 
ఒకపరి తెలియని దేదో అధైర్యము
కలుగుచు నా మది చంచల మగును 
అశాంతితోడ అలమటింతును 
॥ హే కరుణా భరణా॥

3.  నాది నాదనుచు  ప్రాకులాడితిని
ఎన్నెన్నో కార్యముల జేసితిని
నాది కానిదేదో శక్తి కలదని నేటికి తెలుసుకుంటిని
తెలుసుకున్ననూ అవగాహనకు
అందక ఇటు నటు దిరుగుచుంటిని
॥ హే కరుణాభరణా ॥

4. నీ కృప లేనిదె ఏమి జరుగదని 
 నీ కరుణయే నను దరి జేర్చునని
 నీ దయయే నను రక్షించునని
 ప్రేమతో తెలిపిన నీకు దాసుడను 
॥ హే కరుణాభరణా ॥

5.  నీ దాసునిగా నను చేసుకొనుమా
 నీ బిడ్డగ నను బ్రదుక జేయుమా
 నీ మార్గములో నడవ నీయుమా
 నిను ప్రేమించగ శ్యామదేవుని బ్రోవుమ
॥ హే కరుణా భరణా ॥

161) శ్రీ సాయి రామ నామ మహిమను (09.06.)
శ్రీ సాయి రామ నామ మహిమను 
చక్కగ దెలియుము మనసా !
ఘన సంసారంబుధి దాటగ జేసెడి 
మధుర నామమే మనసా !
శ్రీ సాయి నామమె మనసా ! 
శ్రీ రామ నామమె మనసా ! ॥శ్రీ॥

(1) సద్గురువుల చెంతకు నిను జేర్చును 
చక్కగ నడుపును మనసా !
భోగ భాగ్యముల సుఖ సంపదలను 
సత్వర మొసగును మనసా ! ॥శ్రీ॥

(2) ఆపదల లోన  నిన్నాదు కొనుచు 
పరిరక్షణ జేయునె మనసా ! 
ఆనందామృత మందించును 
నిన్న లరించును సతతము మనసా ! ॥శ్రీ॥

(3) సాంబ శివుడు సద్భక్తితో 
రామనామమె దలచును మనసా !
రామ నామము సకల పాపముల 
పరిహరించునే మనసా ॥శ్రీ॥

162) సాయిరామా..... సాయిరామా (సద్గురు దేవా(10.06.)
సాయిరామా..... సాయిరామా
సద్గురు దేవా..... సాయిరామా
దత్త గురు కృష్ణ శివరామా
మారుతి విఠలా రంగనామా ॥సాయి॥

(1)  ఏమి పుణ్యముల చేసితిమో
 ఏ యే నోముల నోచితిమో
 నీ పదములనే నమ్మితిమి
 నిను దైవముగా పొందితిమి ॥సాయి॥

(2) సన్మార్గంబుల నడిపించి
 సచ్చింతన లను కలిగించి
 సద్గతులను నా కొసగగదే
శ్యామచరణ సన్నుత శ్రీ సాయీ ॥ సాయి॥

163) సాయి ! సాయి ! శ్రీ సాయీ సాయీ సాయీ ! (11.06.)
సాయి ! సాయి ! శ్రీ సాయీ సాయీ సాయీ ! 
శ్రితజన ఆయీ
సాయి ! సాయి ! ద్వారకా మాయీ 
సాయి బాబా !సాయిబాబా ॥సాయి॥

(1) భక్త జనావన సాయీ సాయీ
 ముక్తి విధాయక సాయీ సాయీ
అగణిత గుణ గణ సాయీ
నిగమాంత స్థిత సాయి సాయీ

కరుణాత్మక సాయీ సాయీ
దారిధ్యాత్మక సాయీ సాయీ 
కరుణాత్మక సాయీ సాయీ 
ధీర విహారా సాయీ సాయీ

అనంత రూపా సాయీ సాయీ 
అనాధ రక్షక సాయీ సాయీ
జగదభి వందిత సాయీ సాయీ 
నిగమ గుహాలయ సాయీసాయీ

సద్గతి దాయక సాయీ సాయీ
చిత్ ఘన స్థిత సాయీ సాయీ
శ్రితజన పోషక సాయీ సాయీ
పతితో ధారక  సాయీ సాయీ 

వినుత చరిత్ర సాయీ సాయీ 
హనుమత్రాత సాయీ సాయీ 
సాయీ ! సాయీ ! శ్రీ సాయీ సాయీ !
సాయీ !  శ్రితజన ఆయీ !

164) సచ్చిదానంద సాయినాథా ! (12.06.)
సచ్చిదా నంద సాయినాథా !
సజ్జన పోషక గురునాథా ॥
ఆనంద నామా సాయినాథా !
పరమా నంద రూపా గురునాథా ॥

త్రిగుణా తీతా సాయినాథా !
త్రిమూర్తి రూపా గురునాథా ॥

దత్త దిగంబర సాయినాథా !
ధర్మ స్వరూపా గురునాథా ॥

దారిద్ర్య నాశక సాయినాథా !
దివ్య స్వరూపా గురునాథా ॥

నందలాల సాయినాథా !
శ్యామ సన్నుత గురునాథా ॥

165) సాయి నామమను మధురామృతమును (13.06.)
సాయి నామమను 
మధురామృతమును
గ్రోలగ రండి జనులారా..... ॥సాయి॥ 

శాంతి సౌఖ్యముల నందు కొనుచు 
ఆనందము నందుడు జనులారా..... ॥ శ్రీ సాయి॥

(1) దైహిక బాధల దాడి నెరుంగని
 స్థితిని జేరుడో జనులారా.....
 లౌకిక వాంఛల లయలు తప్పుకొని
 స్థిరతను బొందుడు జనులారా... ॥ శ్రీ సాయి॥

(2) కాంత కనకపు కామ మోహముల 
వలలో బడకుడు జనులారా... 
శాంతి కొరకు శ్రీకాంతుని మదిలో
చింతన జేయుడు జనులారా.... ॥ శ్రీ సాయి॥

(3) ప్రగాఢమగు విశ్వాసము నోర్పుల
గలిగి యుండుడో జనులారా.....
శ్యామ చరుణు నీ సూక్తులను
ఆసక్తిగ  వినుడో జనులారా.... ॥ శ్రీ సాయి॥

166) సాయి సాయి (మోహన కళ్యాణి రాగం )  (14.06.)
సాయి సాయి సాయి 
సాయి సాయి యనవే మనసా.......

(1) సాయి సాయి యని సాయి సాయి యని
 సతతము దలచవే మనసా.....
 సాయి సాయి యన సకల బాధలు
సమసి పోవునే మనసా.... ॥సాయి॥ 

(2) సృష్టి స్థితి లయ కారకు డ తడను
 సత్యము నెరుగవే మనసా.....
 సర్వభారముల మోయున తడనే
 సంగతి మరువకే మనసా..... ॥సాయి॥ 

(3) భక్తితోడ నీవు వెపుడు తలచినా
 నీలో నిలుచునే మనసా.....
నిలచి నిన్ను సద్గతి పాల్జేయును
నిజము తెలియవే మనసా...... ॥సాయి॥

సాయి దాసుల గనవే మనసా.....
శామ చరణుని మనసా.....

167) సాయి సద్గురు దేవా నాపై  (15.06.)
సాయి సద్గురు దేవా నాపై 
కనికరంబును జూపుమా
దయతో నా హృదయంబు నందున 
నిలచి పాలన జేయుమా ॥సాయి॥

(1) సతతంబు నీదు పాద దాసుల తోడ చెలిమిని గూర్చుమా
సద్గుణంబుల, భక్తి ,శ్రద్దల తోడ బ్రతుకగ జేయుమా
సత్య, ధర్మ పధంబు లందున సాగునటుల దీవించుమా 
సకల విశ్వమునందు నీదగు విశ్వరూపము జూపుమా 
॥సాయి॥

(2) అహము మోహము లందు ద్రోయక నేర్పుగా నడిపింపుమా 
కామ, క్రోధ, లోభాది గుణముల కలుగ నీయక గావుమా
ఎల్లవేళల సాయి నామ స్మరణ మనసున నిలుపుమా
సర్వ మీవే యనుచు నమ్మిన శామదేవుని  బ్రో వుమా 
॥సాయి॥

168) సన్నుతి జేయరా సాయి రమణా  (16.06.)
సన్నుతి జేయరా సాయి రమణా
కరుణతో నన్ను మంగళ చరణా ॥సన్నుతి॥

(1)  సతతము నీదగు దివ్య నామమును
 స్మరణము జేయుచు నుంటిని దేవా
కలలో నైనా నీ దరిశనమును
ఒసగి బ్రోవుమా ప్రేమ స్వభావా ॥సన్నుతి॥

(2) జేసితిని ఎన్నో దోసములనూ
 దండన జేయకుమని ప్రార్థింతును
 నీ పాదములే శరణు మంటిని 
నీవే దిక్కని బ్రతుకుచు నుంటిని ॥సన్నుతి॥

(3) మానవుడను అమాయకుడను
మాయలోనే వున్నాడను
మంచి చెడుగులను దెలియని వాడను 
సత్కృప గావుము శ్యామ చరుణుడను ॥సన్నుతి॥

169) సాయి దత్త శ్యామా రామా  (17.06.)
సాయి దత్త శ్యామా రామా 
రంగ ధామా బల భీమా
హనుమ నామ సద్గుణ ధామా 
జయము సాయి రామా ॥సాయి॥ 

(1) శిరిడీ యందు నివసించి 
జగముల నెల్ల పాలించి
సృష్టి స్థితి లయ కారక శక్తివి 
నీవే ననుచూ దెలిపిన సాయీ ॥సాయి॥

(2)  మతముల భేదము మనుషుల కేనని
 సమ్మతమే నీ సహజ గుణమనీ
 సద్భక్తులకు సంతస మొసగీ
 సద్గుతుల నొసగి గాచిన సాయీ ॥సాయి॥

(3)  నిష్ఠ సబూరులె నిజమగు మార్గము
 దయ దానంబులె దైవ భావమని
 సకల జనులకు చక్కని బోధల
 జేసి వారలను బ్రోచిన సాయి ॥సాయి॥

170) సారధిని నీవే సాయి  (18.06.)
సారధిని నీవే సాయి
శ్యామ సారధివి నీవే సాయి ॥సారధి॥

(1) ఎచ్చటనో పడి యుండడి వారిని 
ముచ్చట గొలుపగ ముందుకు ద్రోయుచు
ముద్దు మురిపముల ప్రేమల ముంచుచు
నీ వారలనెడి బిరుదుల నోసగడి ॥సారధి॥

(2) ఏమిటేమిటో జేయుచు నుందువు 
అటు నిటు ద్రిప్పుచు జూచచు నుందువు
అంతు తెలియని సంసారంబుధి
నందు ముంచుచు దేల్చుచు నందువు ॥సారధి॥
 
171) సాయిరామ ప్రభో ౼ సాయిరామ ప్రభో (19.06)
సాయిరామ ప్రభో ౼
సాయిరామ ప్రభో
సాయిరామ ప్రభో
సాయి మమ్మేలు
శ్రీ సాయి కృష్ణా ప్రభో ॥సాయి॥

సాయి కృష్ణ ప్రభో సాయికృష్ణ ప్రభో
సాయి మమ్మేలు శ్రీ సాయి శామ ప్రభో ॥సాయి॥

సాయి శ్యామప్రభో సాయి శ్యామ ప్రభో
సాయి మమ్మే లు శ్రీ సాయిరామ ప్రభో ॥సాయి॥

(1) స్వార్థ చింతన తప్ప అన్య చింతన లేక
 జీవించు చుంటిని శ్రీ సాయి రామ ప్రభో

(2) సుఖ దుఃఖముల లోన పొంగి కృంగుచు నుండు
మనసు కలిగిన వాడ శ్రీ సాయిరామ ప్రభో

(3) నీతి నియమము లేని భక్తి శ్రద్దలు లేని
బ్రతుకు లాగుచు నుంటి సాయి రామ ప్రభో

(4) లోకము నందు గల వ్యామోహముల యందు
 తగులుకొని యున్నాను సాయిరామ ప్రభో

(5) ఆచరణయే లేని ఆలోచనలు లేని
 పథమున నేనుంటి సాయి రామ ప్రభో

 (6) తల్లి దండ్రి గురు దైవములు నీవనుచు
 బాగుగా చదివితిని సాయిరామ ప్రభో

(7) మనసు నందున అట్టి భావమే కలుగదు
 నా ప్రాప్త మేమొ మరి సాయిరామ ప్రభో ౼

(8) ఆత్మవే నీవనుచు పరమాత్మ నీవనుచు
 బాగుగా వింటిని సాయి రామ ప్రభో

(9) ఆత్మ పరమాత్మల తత్వంబు నెరుగని
 అల్పగ్నుడను నేను సాయిరామ ప్రభో

(10) ఆపదలలో నిన్ను తలచి నంతనే
గాచి రక్షింతు వందురు సాయిరామ ప్రభో

(11) ఆపదలలో నీవు గుర్తుకే రానట్టి
మంద బాగ్యుడనయ్యా సాయిరామ ప్రభో

(12) సతతంబు నీ నామ స్మరణే జేయంగ
 కోరు కొనుచుంటిని సాయిరామ ప్రభో

(13) స్మరణను జేయంగ మనసు కలుగుట లేదు
 ఎందు కిట్లగు చుండె సాయి రామ ప్రభో

(14) నీ మీదనే దృష్టి నిచ్చలముగా నిలిపి
నిను జూడ నెంచితిని సాయి రామ ప్రభో

(15) అది ఏమి కర్మమో దృష్టి నిలువగ లేదు
 నిను జూడ లేనైతి సాయి రామ ప్రభో

(16) బాధ్యతల నూహించ గుండె బరువై పోవు
 ఆవేదనల తోడ సాయిరామ ప్రభో

(17) నీ వుండగా నాకు భయమెందు కను భావ
 మిసు మంత కలుగదే సాయి రామ ప్రభో

(18) ఈర్ష్యౌ అసూయలను దూరముగా జేయు
 ఉద్దేశ్యమున్నది సాయి రామ ప్రభో

(19) గ్రహచారమేమొ మరి అవి వదల కున్నవి
 ఎంత విదిలించినా సాయి రామ ప్రభో

(20) నీ యంత స్థితికి నే జేరాలనే తపన
తీవ్రముగా నున్నది సాయిరామ ప్రభో

(21) ఏమీ తెలియగ లేని ఏమి చేయగ లేని
నాకెటుల గలుగునది సాయి రామ ప్రభో

(22) ధైర్యముగ జీవించి దైవమును భజియించి
 కీర్తించ నెంచితిని సాయి రామ ప్రభో

23) ధైర్యమే నశియించె ధైన్యమే మిగిలించె
దైవము నన్ను వంచె సాయి రామ ప్రభో

(24) వయసు పెరిగిన గాని మనసు పెరగగ లేని
మంద బాగ్యుడనయ్య సాయి రామ ప్రభో

(25) కరుణించమని మంచి మనసుంచమని నిన్ను
వేడుకొను చుంటిని సాయి రామ ప్రభో

(26) దోసము లోనరించు దుర్భాషలను బెంచు
గతిలోన నేనుంటి సాయి రామ ప్రభో

(27) కరుణించమని మంచి గతి నుంచమని నిన్ను
ప్రార్ధించు చుంటి శ్రీ సాయి రామ ప్రభో

(28)ఎంత జేసిన గాని ఏకాగ్రతయె లేక
నైరాశమున  నుంటి సాయి రామ ప్రభో

(29) దయతో నేకాగ్రతను దయ చేయమని నిన్ను
శరణు వేడితినయ్యా సాయిరామ ప్రభో

(30) దృష్టి నీపై నిలుపు నీ నామమే బలుకు
శక్తియే లేదయ్య సాయి రామ ప్రభో

(31) నా కనులలో నిలచి నా పలుకులలో నిలిచి
దయ జూప వేడితిని సాయిరామ ప్రభో

ఏది ఏమైననూ ఎటుల జరుగుచు నున్న
నీ అభయమె మాకు భయము తొలగించునని
నీ అండయె మాకు కొండంత ధైర్యమని
నీ కరుణయె మాకు శ్రీరామ రక్షయని
నీ నామమే మాకు మార్గము జూపునని
నీ ప్రేమయె మాకు శ్రేయము నొసగునని
నీ చూపులే మాకు పరమాత్మ జ్యోతి యని
నీ రూపమే మాకు సద్గతుల నొసగు నని
సతతంబు నా మనసు నందు నివసించుచు
సంత సంబుల నిచ్చి సాయిజ్యమును జేర్చ
పాహి శరణంటి శ్రీ సాయిరామ ప్రభో ౼ 

172) సాయి రామా దేవ నాపై దయను జూపవే (20.06.)

సాయి రామా దేవ నాపై దయను జూపవే
దయను జూపవే సాయి దరికి జేర్చవే ॥ సాయి ॥

(1) నీచుడనూ అజ్ఞానుడ ననీ
దోసములను జేసినాడనని
దలచి నను దూరము జేయకు
దయానిధే సాయి రామా

(2) సక్రమమగు నడతయే లేదని
సత్య భాషణయే లేదని
సబూరియు నిష్టయు లేవని
నన్ను  దూరము జేయకు తండ్రి

(3) సోమరిగ బ్రతుకు చుంటినని
బాధ్యతలను గమనించననీ
బాధలలో వేడు చుంటినని
నను దూరము జేయకు స్వామీ

(4) నీ నామమే దలచుచు నుంటిని
నీ కథలనే జదువుచు నుంటిని
నీ లీలలను బలుకుచు నుంటిని
నీ పూజల జేయు చుంటినని

నీవు మెచ్చుకొను తీరుగ
నన్ను బ్రతుక జేయుము దేవా సాయీ
నిన్ను జేరుకొను రీతిగ
నన్ను కరుణతో గనుమా బాబా సాయీ

(6) రామ కృష్ణ శివ దత్త స్వరూపా
రహీము అల్లా ఏసు స్వరూపా
శంకరి మారుతి శ్యామ సన్నుతా
శాంతి ప్రదాత సద్గతి దాతా

173) సాయి శరణం ౼ సద్గురు శరణం (21.06.)

సాయి శరణం సద్గురు శరణం
సమర్థ సద్గురు సాయిరామ్ శరణం

శ్రీ సాయి శరణం సద్గురు శరణం
సమర్థ సద్గురు చరణం ౼

శ్రీ సాయి దేవా ౼ దేవాధి దేవా ౼
దివ్య ప్రభావా ౼ నన్నేల రావా

తల్లివి నీవై , తండ్రివి నీవై
గురు దైవమీవై నను బ్రోవరావా
నా దిక్కు నీవై , నా మ్రొక్కు నీవే,
నా చిక్కులను దీర్ప వేగమె రావే ౼ ॥

పాపము నెరుగను, పుణ్యము నెరుగను ,
పాపము నందున నను ద్రోయ బోకే

అధర్మ మెరుగను , ధర్మము నెరుగను ౼
అధర్మ మందు నన్నుంచ బోకే ,
అసత్య మెరుగను ౼ సత్యము నెరుగను
అసత్య వాదిగ నన్ను జేయ బోకే ॥

దానము నెరుగను జ్ఞానము నెరుగను
జ్ఞాన దానముల నన్నుంచరావే ౼ ॥

దోసము లైనను మోసము లైనను
జేయంగ నీయక నను గావగ రావే

ఎందు నే నున్న ఏ వేళనైనా ౼
నీ రూప ధ్యానము  జేయంగ నీవే ౼ ॥

ఎటుల బిలచినా ఎప్పుడు బిలచినా
ప్రేమతో నన్ను పాలింప రావే
నా మది లోన కాపుర ముండవే
నీ నామ స్మరణము జేయగ నీవే ౼
నాలోన నీవై నీలోన నేనై నిలచి
బ్రోవగా వరమీయరావే

అభయము నీయవే భయమును బాపవే
అనవరతము నన్నా దరించవే ౼ ॥

ధైర్యము నుంచవే , ధైన్యము దించవే
దరిజేర వేగమే దయజూప రావే
నిష్టయు నేనై , సబూరి నేనై
నీలో నిలిచెడు వరమొకటీ యవే

సత్ కృప జూపవే , సద్గతి నీయవే
శ్యామాదులకు సంతస మీయవే ౼ ॥

174) సాంబ సదాశివ సాయి శంభో (22.06.)

సాంబ సదాశివ సాయి శంభో
అభివాదయే అహంభో ॥ సాయి ॥

(1) త్రిగుణా తీతా త్రిమూర్తి రూపా
కాలాతీతా కాల స్వరూపా
మోహాతీతా మోహన రూపా
భావాతీతా భావ స్వరూపా ॥సాయి॥

(2) జ్ఞానాతీతా జ్ఞాన స్వరూపా
నాదాతీతా నాదస్వరూపా
రాగతీతా రాగ స్వరూపా
లోకాతీతా లోకస్వరూపా ॥సాయి॥

(3) సుజన మనోహర సుందర శుభకర
మృత్యుంజయ హర మదన విదూర
ధర్మ ప్రియాంకర దత్త దిగంబర
భక్తవ శంకర భువన విహారా ॥సాయి॥

175) సాయియే నా గానము  (23.06.)

సాయియే నా గానము -
సాయియే నా ధ్యానము
సాయి నా మానము -
సాయియే నా ప్రాణము ॥సాయి॥

(1) సాయియే నా స్మరణము -
సాయియే నా మరణము
సాయియే ఆభరణము -
సాయియే నా భరణము ॥సాయి॥

(2) సాయియే నా గేయము-
సాయియే నా కాయము
సాయియే నా భావము -
సాయియే నా జీవము ॥సాయి॥

(3) సాయియే సద్భావము-
 సాయియే నా దైవము
సాయియే నా భోగము-
సాయియే నా యోగము ॥సాయి॥

(4) సాయియే భవ రోగము -
సాయియే నా రాగము
సాయియే మమకారము-
సాయియే సత్కారము ॥సాయి॥

(5) సాయియే నిర్వికారము -
సాయియే సహకారము
సాయియే నీ నామము -
సాయియే నా కామము ॥సాయి॥

సాయియే నా సేమము -
సాయియే ఆరామము
సాయియే జయ సాయిరాం -
సాయియే శ్యామ్ సాయిరాం ॥సాయి॥
 
176) సాయి ! నన్ను బ్రోవ భారమా! (24.06.)

సాయి ! నన్ను బ్రోవ భారమా !
రామ సాయీ ! నన్ను బ్రోవ భారమా !
శివ సాయీ ! నన్ను బ్రోవ భారమా !
కృష్ణ సాయి నన్ను బ్రోవ భారమా !
శ్యామ సాయీ నన్ను బ్రోవ భారమా ! ॥సాయి॥

మంచి చెడుగులను బేధము -
మదినెంచక యుండుట నేరమా ॥సాయి॥

కామ క్రోధాదుల తోడనూ -
కలహించి జీవించుట నా నేరమా ॥సాయి॥

దాన ధర్మంబులు జేయక
నీచ స్వార్థంబు నడతలు నేరమా ॥సాయి॥

ఈర్ష్య అసూయల తోడనూ -
భక్తులందరినీ దూరుట నేరమా ॥సాయి॥

తప్పులన్నీ తెలిసి కృంగుచూ
నీకు చెప్పుకొనుట ఘోర నేరమా ॥సాయి॥

చేయరాని పనులు చేసితి
మరి వినగరాని మాటలాడితి నని ॥సాయి॥

శ్యామదేవుని నన్ను దూరము జేయకుమని - 
వేడుకొందును నిన్ను దైవమా ॥సాయి॥ 

177) సాయి బోలో రామ బోలో (25.06.)

సాయి బోలో రామ బోలో
సాయి రామ బోలో బోలో
సాయి బోలో కృష్ణ బోలో
సాయి కృష్ణ బోలో బోలో
సాయి రామ బోలో బోలో
సాయి కృష్ణ బోలో బోలో ॥సాయి॥

(1) సాయిబోలో శ్యామ బోలో
సాయి శ్యామ బోలో బోలో
సాయి బోలో హనుమ బోలో
సాయి హనుమ బోలో బోలో
సాయి శ్యామ బోలో బోలో
సాయి హనుమ బోలో బోలో ॥సాయి॥

(2) సాయి బోలో ఏసు బోలో
సాయి ఏసు బోలో బోలో

సాయి బోలో అల్లా బోలో
సాయి అల్లా బోలో బోలో

సాయి యేసు బోలో బోలో
సాయి యేసు బోలో బోలో ॥సాయి॥

(3) సాయి బోలో బుద్ధ బోలో
సాయి బుద్ధ బోలో బోలో

సాయి బోలో నానక్ బోలో
సాయి నానక్ బోలో బోలో

సాయి బుద్ధ బోలో బోలో
సాయి బుద్ధ బోలో బోలో॥సాయి॥

సాయి బోలో బాల బోలో
సాయి బాలా బోలో బోలో

సాయిబోలో దత్త బోలో
సాయి దత్త బోలో బోలో

సాయి బాల బోలో బోలో
సాయి దత్త బోలో బోలో ॥సాయి॥

సాయి బోలో సద్గురు బోలో
సాయి సద్గురు బోలో బోలో

సాయి బోలో మాతా బోలో
సాయి మాతా బోలో బోలో

సాయి సద్గురు బోలో బోలో
సాయి సద్గురు బోలో బోలో ॥సాయి॥

సాయి బోలో శంకర బోలో
సాయి శంకర బోలో బోలో

సాయి బోలో శివ బోలో
సాయి శివ బోలో బోలో

సాయి శంకర బోలో బోలో
సాయి శంకర బోలో బోలో ॥సాయి॥

178) సాయి..... జయ జయ సాయి...... (26.06.)

సాయి..... జయ జయ సాయి......
ద్వారకమాయి.... పన్నగశాయి....
నామమే హాయి----- హాయి ॥శ్రీ సాయి॥

(1)  కులమతమ్ముల భేదముల నిల
రూపు మాపగ అవతరించి
సకల జీవుల నొక్క రీతిగ
కనికరంబుగ గాచు చుండెడి  ॥శ్రీ సాయి॥

(2) ఎవరెయ్యది కోరుచుండిన
వారి కయ్యది కలుగజేయుచు
దిక్కులేని దీనులందరి
దిక్కు మ్రొక్కై దయను జూచెడి ॥శ్రీ సాయి॥

(3) గాఢమగు విశ్వాస ముండిన
సహన ధైర్యో త్సాహ ముండిన
సర్వము తానే భరియించుచు
బ్రతుకు సుగమము  జేయు చుండెడి  ॥శ్రీ సాయి॥

(4) దైవ స్వరూపములన్నీ తానై
 సాధు రూపములన్నీ తానై
 అణువు పరమాణువులు తానై
 శ్యామచరనుని గతులు తానగు ॥శ్రీ సాయి॥

179) దాసుడ నేన నేనయ్య  (27.06.)

దాసుడ నేన నేనయ్య
రమణ దయ గనుమ
భాస్కర సమతేజ వందనము
సుపధము తెలిపే గురువర పలుకవే
బ్రహ్మజ్ఞానివే కవి నీవు ॥దాసుడ॥

 (1)  పాపిని నేను పావన మూర్తి
వెలుగునిచ్చు జ్యోతివి నీవు
అమర కీర్తివి రమణమూర్తి వి
ఓ గురువరా నీవే జీవము ॥దాసుడ॥

(2)  నిన్ను చూచినప్పుడు నాకు నెమ్మది కలుగు
నీదుకై మన్నే బంగారు తండ్రి
పాలలోచన భవభయహరణ
శివశక్తివి నీవు శ్రుత పారిజాతమా ॥దాసుడ॥

(3)  దేవర నా మనవి ఆలింపరా
పలికితి పిలిచితి ఓ రమణా
దీన జనావన సంకటహరణ
పాహి శరణం భగవాన్ రమణ ॥దాసుడ॥

180) సాయి నామమునకు సాయి రూపమునకు  (28.06.)

సాయి నామమునకు సాయి రూపమునకు
గల మహిమ దెలియ వశమే ఎవరికైన ॥సాయి॥

సాయి నామమే మధురాతి మధురం
సాయి రూపమే నయనా నందకరం
సాయి నామమే సర్వ పాపహరము
సాయి నామమే సకల శ్రీ కరము ॥సాయి॥

సాయి రూపమే సాధు దేవ మయమూ
సాయి రూపమే బ్రహ్మానంద మయమూ
సాయి కరుణ యున్న కాని పనియె లేదు
సాయి దయయే యున్న రానిదేమీ లేదు ॥సాయి॥

సాయి ప్రేమ యున్న జగతి పరము ముక్తి
వదలి పోదు సాయి గాచు
శ్యామ దేవుని మాట పోదు ॥సాయి॥

181) సాయి సద్గురు దేవా - సాయి దేవాధి దేవా (29.06.)

సాయి సద్గురు దేవా -
సాయి దేవాధి దేవా
సాయి దివ్య ప్రభావా -
పాహి శరణము సాయీ

సాయీ ! నా బాబా సాయీ
సాయీ నా దేవ సాయి
 
(1) ఎచట జన్మించినావో - తల్లి దండ్రులెవరో
కులము మతముల దేవో నెరుగ లేనయ్యా దేవా
ఎందెందు దిరిగి నావో నీదు గురువు లెవ్వరో
ఎందుకు షిరిడీ జేరి అందే నివసించినావో

(2) షిరిడీ జేరక ముందు నీదు నామమేమో
నీకు వయసెంత గలదో వేష భాషల వేవో
చాంద్ భాయి పటేలు తనదు అశ్వంబును వెదుకు చుండి
కాననంబున నిన్ను కనులారా జూచెనంట

(3) అగ్ని జలముల సృష్టి జేసి చిలుమును ద్రావి
అశ్వంబు జాడ దెలిపి ఆశ్చర్యము గొలపితి వంట
నీదు శక్తిని జూచి నిలువెల్ల పులకరించి
చాంద్ భాయ్ తనను కరుణించ నిను ప్రార్థించె నట

పిన్న వయసున నీవు షిరిడీ గ్రామము జేరి
నింబ వృక్షము క్రింద నివసించితి వంట దేవా

182) హారతి గైకొనువమ్మా దేవీ (30.06.)

హారతి గైకొనువమ్మా దేవీ
బాల త్రిపుర సుందరి మాతా ॥హారతి॥

ఓంకారేశ్వరీ అనంత రూపిణి -
కాత్యాయని కామాక్షీ గౌరీ
ఆదిశక్తి అర్ధనారీశ్వరీ -
ఆనంద రూపిణి
సాయి స్వరూపిణి

అభయంకరి హే ప్రేమవ శంకరీ -
ఆశ్రిత శుభకరి శ్రీ రాజరాజేశ్వరీ ॥హారతి॥

183) హర హర శంకర భక్తవ శంకర గౌరి (01.07.)

హర హర శంకర భక్తవ శంకర గౌరి ప్రియంకర పాహి హరే
హరి హరి శ్రీ హరి కేశవ నరహరి మాధవ శౌరి ముకుంద హరే 
శివ శివ శంకరి శంభు మనోహరి ప్రేమవశంకరి మాత శివే
జయ జయహో శ్రీ రామ, కృష్ణ, శివ, దత్త మారుతీ సాయి ప్రభో

(1) నీ లీలల విని నీ మహిమల విని నీ కథలను వినగలిగినచో 
నీ పద భక్తి అలౌకిక యుక్తి మహత్తర శక్తులు కలుగు గదా
సత్యము ధర్మము  సత్పథ మర్మము సద్గుణ కర్మము తెలియుగదా
జయ జయహో శ్రీరామ కృష్ణ , శివ ,దత్త , మారుతీ సాయి ప్రభో॥

(2) ఎవరే తీరుగ భావించిన పూజించిన సంతస మందెదవు
ఏ దైవము నారాధించిననూ సకలము నీవని దెలిపెదవు
దైవ మొక్కటని మతములు వేరని సమ్మతమునె ఒన గూర్చెదవు 
Ilజయ జయహో ll

(3) భక్తజనుల కడు యుక్తిగ నీపద రక్తులుగ నొనరించెదవు
బాధ్యతల నెల్ల నా ధ్యంతముగ నీవే ప్రేమగ భరియుంచెదవు
కష్ట, నష్ట, అరిష్టముల బహు నేర్పుగ నీవే తొలగించెదవు
Ilజయ జయహో......ll

(4) కుల మతములు మానవ కల్పితములు, బేధము లెంచుట దోసమనీ
ఎల్లర నొకటగు ప్రేమ భావమున జూచిన శాంతియె గలుగుననీ
దైవ భావమును పాదు కొలిపి ప్రశాంతత జగతికి నొసగెదవు 
జయ జయహో శ్రీరామ, కృష్ణ, శివ, దత్త మారుతీ సాయి ప్రభో 

(5) సకల దేవతల రూపము లన్నియు నీవనియే జూపించెదవు
సకల సాధు స్వరూపము లన్నియు నీ రూపమే యని తెలిపెదవు
సకల ప్రాణులలో నీవు న్నావని నిదర్శనములనే యొసగెదవు 
Ilజయ జయహోll

(6) నిష్ట సబూరులు గలిగి యున్న నీ దరికి దయజూపి లాగెదవు
అడుగడుగున కడు ఆధరము తో ఆలన పాలన జేసెదవు
జన్మ జన్మముల జత విడదీయక జాగ్రత్తగ కాపాడెదవు 
Ilజయ జయహో॥

(7) కోరిన కోర్కెల నెల్ల తీర్చుచు కొందరి నటు కరుణించెదవు
కోరని వాటిని దీర్చుచు కొందరి నింకొక తీరుగ బ్రోచెదవు
ఎవ్వరి కెయ్యది శ్రేయము గూర్చునో అయ్యది వారికి నోసగెదవు 
Ilజయ జయహో ॥

(8) వేద శాస్త్రముల సారము లన్నియు సలలితముగా బోధించెదవు 
సద్గతుల నొసగు సత్కర్మల విచిత్రముగ జేయించెదవు
సత్కర్మల సత్ఫలితముల ఫలము సద్గతినే అందించెదవు
Ilజయ జయహో ॥

(9) సత్య భాషనమె సద్గురు సేవయే సక్రమమగు మార్గములనీ
అన్నపాన విశ్రాంతి దానములు అత్యుత్తమమగు ప్రేమ యనీ
మానావమాన వికారాదులను సమముగ జూడగ నేర్పెదవు
Ilజయ జయహో ॥

(10) సద్గురుని కరుణ సకల శ్రేయముల నొసగి గాచునని జూపెదవు
సత్కధ శ్రవణమే భగవన్నామమె దారి జూపునని దెలిపెదవు
భగవనామ సంకీర్తనములే భద్రత నిడునని సూచించెదవు
Il జయ జయహో ॥

(11) సాయి సాయి యని సతతము దలచెడి వారిని సత్ కృప గాచెదవు
సర్వ భారముల మోసి ఈ భూవిని సంసారంబుధి దాటించెదవు
సద్భక్తుల నీ దరికి జేర్చుకొని  సద్గతుల  ప్రసాదించెదవు
Il జయ జయహో ॥

(12) దెలిసియు తెలియక జేసిన దోసగుల ప్రార్ధించిన క్షమియించెదవు
సమయమున కగు సలహాల నొసగి సాను నయముగ సంరక్షింతువు
గమనము, గమ్యము, ధ్యానము, ధ్యాత, సర్వము నీవై  పరిపాలింతువు 
Il జయ జయహో ॥

(13) సర్వము నీ కర్పించిన వారల సంరక్షణ జేపట్టెదవు
గర్వ విదూరుల జేసి వారలను గమ్యము జేరగ జేయుదువు
ఈర్ష్య అసూయ రహితులుగ జేసి ఇహపర సౌఖ్యము లొసగెదవు 
Ilజయ జయహో ॥

(14) శ్యామా తాత్యా మహల్సాపతీ రాధా కృష్ణ మాయులను 
అబ్దుల్ కాకా సాహెబ్ దీక్షిత్ నానా చందోర్కరాదులను
చేరగ బిలచి పరిరక్షించిన విధమున శ్యామ దేవుని బ్రోవగదే
Il జయ జయహో ॥

(15) కాశీనాధ ఉపాసనీ బూటీ మేఘశ్యాములు దాసగణు
బీవీ దేవు  కృష్ణ బాగోజీ నరసింహ  హనుమ కేశవుల
ఆలన పాలన జేసి గాచిన విధమున శ్యామను బ్రోవ గాదె
Il జయ జయహో ॥

(16) రసానె తారాబాయి సదాశివ తార్కాడ్ ఎంబి రేగే ధూమల్
హరి వినాయక సాధే కుశాభావు శ్రీ నారాయణ ప్రధానులు 
ప్రేమగ దీసి సద్గదుల నొసగిన విధముగ శ్యామదేవుని బ్రోవగదే
Il జయ జయహో॥

(17) బాల భక్త మౌనీశ్వర సారధి వర శ్రీరామ మహాత్ములను
భక్త కోటినీ భాగవతులను సత్సంగ భజన బృందమలను 
కరుణతో గాచెడి విధమున శ్యామదేవుని జన్మజన్మలలో బ్రోవగదే
Il జయ జయహో  ॥

(18) స్తుతియంతు నీ నామ మహిమ శ్రీ సాయి
అనుదినము ప్రతిక్షణము శ్రీశేష సాయి !
సత్భక్తి సద్గుతుల నోసగవే సాయి 
నీలోన శ్యామదేవుని నైక్యమొనరించుకో సాయి ॥
ఓం శాంతి శాంతి శాంతిః

184) బాలా త్రిపుర సుందరి మాతా (02.07.)

బాలా త్రిపుర సుందరి మాతా
రాజ రాజేశ్వరీ మాతా శివే ॥బాలా॥

(1) భగవతి భవానీ శంకరి దుర్గా
భక్తవ శంకరి శ్రీలలితా
శంభు మనోహరి నాద ప్రియాంకరి
 ప్రేమ శుభంకరి సాంబశివే ॥బాలా॥

(2) సాయి స్వరూపిణి సద్గతి దాయిని
ముక్తి ప్రదాయిని హైమవతే
శక్తి స్వరూపిణి జగత్కారిణి
జయ జగదంబ జయ జయహే ॥బాలా॥

185) పాహి పాహి హే పరమేశ్వర శివ (03.07.)

పాహి పాహి హే పరమేశ్వర శివ 
శంకరి లలితే చిద్విలాసినే Il పాహి॥

(1) అంబా భవానీ ఆదిశక్తి - 
ఆర్థత్రాణ పరాయిణి గౌరీ
భార్గవీ భద్రే బంధ విమోచనీ - 
భగవతీ హే భ్రమరాంబ స్వరూపిణీ ॥పాహి॥

(2) బాలా త్రిపుర సుందరి మాతా -
 భాగ్య ప్రదాయని విశ్వవినోదిని
దుఃఖ వినాశిని ముక్తి ప్రదాయని - 
సాయి స్వరూపిణి సద్గతి దాయని ॥పాహి॥

186) ఏమి చేసితి ననుచు వెనుకేసు కొస్తావు (04.07.)

ఏమి చేసితి ననుచు వెనుకేసు కొస్తావు
వెర్రి తండ్రీ ప్రేమ సాయి-
ఏనాటి కైనా నీ తనయునిగ నిలబడే
 స్థితి నందు కోగలనా సాయి  ॥ ఏమి ॥

(1) అడుగడుగునా  నన్నాదుకొను చున్నావు
ఆపదల పాల్పడక సాయీ
విశ్వాస శూన్యుడౌ అవివేకి నేననుచు 
అణు మాత్ర మెంచకను సాయి ॥ఏమి॥

(2) తప్పులను జేసినను తప్పించి గాచెదవు
 హెచ్చరించుచు కరుణ సాయీ
 నిన్ను ప్రేమించనీ నిర్భాగ్యుడని యైన
 పరిగణించక దేవ సాయి ॥ఏమి॥

(3) నీ మాటలను వినక నిందలను దెచ్చుకున
నింద తొలగింతువే సాయీ
నీ యందు అనురక్తి భక్తి శ్రద్ధలు లేని
వాడనుచు నెంచకను సాయి ॥ఏమి॥

(4) నేను నాదంతయు నీ స్వంతమే గదా
 సచ్చిదా నంద సాయీ
 నాది నాదని దలచి నీ కీయ నెంచని
 నిండు స్వార్ధపు నరుడ సాయి ॥ఏమి॥

(5) ఎంత  నీ వొసగినను ఎంత మేల్ జేసినను 
తృప్తి చెందక నుంటి సాయీ
సిగ్గు ఎగ్గులు లేక ఎన్నెన్నో కోరుచు
పీడించు చుంటినే సాయి ॥ఏమి॥

(6) ఆరోగ్య మిమంచు ఆస్తి నీయు మటంచు
అన్ని యడుగుచు నుంటి సాయీ
సర్వ మీవే యొసగి సాకు చున్నావనెడి 
సత్యంబు నెరుగనే సాయీ ॥ఏమి॥

(7) సర్వ ప్రాణుల లోన నిన్ను జూడ నెంచని 
చచ్చు సంస్కారము సాయీ
భజనలను జేయుచు భక్తుడను పించుకొను
నయ వంచకుడనయ్యా సాయీ ॥ఏమి॥

(8) నేనేమి జేసితిని నీకేమీ యిచ్చితిని
యనుచు దలవక నుంటి సాయీ
నాకేమీ యిచ్చితివి నాకేమీ జేయుదువు 
యను జూచు నీచుడనె సాయీ

 (9) అంతయు నీవని అతిగ వాగుచు నుంటి
 ఎందరి ఎందరితోను సాయీ
 అంతరంగము నందు అనుభూతమే లేక
 అణగారు చుంటిగద సాయీ ॥ఏమి॥

(10) నీవు గాచెదవనుచు నిర్భయము  మీకనుచు
భక్తులతో బలికెదను సాయీ
నా మనసులో యట్టి నమ్మకమే లేక
నశియించు చుంటినే సాయీ ॥ఏమి॥

(11) శ్యామాదులను గావ  వేగమే కృప జూప
ప్రార్థించు చున్నాను సాయీ
సాయి సద్గురు దేవా నీ చరణ కమలములే
శరణమని బడియుంటి సాయీ ॥ఏమి॥
 
187) ఏ నక్షత్రము నందు జనించిన నేమి (05.07.)

ఏ నక్షత్రము నందు జనించిన నేమి ?
గ్రహగతు లేయే తీరుల నుండిన నేమి ?
సద్గురు సాయీ సత్కృప కలిగిన
సకలము సంతస భరితము గాదా ॥ఏ నక్షత్రము॥

(1) గ్రహము లన్నియు సాయి నాధుని
ఆజ్ఞల కఅనుగుణముగ చెరియింపగ
జప తప శాంతుల యోచన లేల
సద్గురు సాయిని కొలిచెడి వేళ ॥ఏ నక్షత్రము॥

(2) శక్తి స్వరూపము శాంత స్వభావము
ధర్మ స్వరూపము దయా సముద్రము
బాబా రూపము బ్రహ్మానందము
శ్యామాదులకు అది సర్వస్వము ॥ఏ నక్షత్రము॥

188) కనుల కెదురుగ లేక కదలి పోయిన గాని (06.07.)

కనుల కెదురుగ లేక కదలి పోయిన గాని
కలకాల మెదలోన కదలు చూనుందువు
నిష్ట సబూరులకు నీవు ప్రతిరూపమై
ఘనత కెక్కితివమ్మ చంద్ర కళావతి

సతతంబు సాయిశు నామమును స్మరియించి
గురుదేవునే మనసులో నిలుపుకున్నావు
గురుదేవ గురుదేవ గురుదేవ అనుచునే
గురునాథు హృదిజేరి పవళించినావు ॥కనుల॥

(2) గురు సేవలను జేయ పరితపించితి వీవు
గురుని సేవల నేడు అందుకొను చున్నావు
బాబాను ధ్యానించి భజియించినావు
బాబా సన్నిధిలోన నివసించు చున్నావు ॥కనుల॥

(3) జోహారు నీకిదే నా చిట్టి తల్లి
జేజేలు నీకివే బంగారు తల్లి
జయము జయము చంద్ర సాయి కళావతి
అందు కొనవే గురుని ఆశీస్సులమ్మ ॥కనుల॥

189) ప్రభో ఏసునాధా..... పరాకేలనయ్యా (07.07.)

ప్రభో ఏసునాధా. ....
పరాకేలనయ్యా
దయను జూపి మమ్ము...
దరికి జేర్చవయ్యా ॥ప్రభో॥

(1) నిన్నెరుగ లేక నింద మోపినారు
నిజము నెరిగి నంత నిట్టూర్చినారు
నీ ప్రేమయే దైవమై దారి జూపే  ॥ ప్రభో॥

(2)  జీవకోటి నెల్ల చేర దీసినావు
పతిత మానవాళి నుద్ద రించినావు
నీ ప్రేమయే జ్యోతియై దారి జూపే
కృష్ణ రాము లీవే - క్రీస్తు మౌలా లీవే
శ్యామ సాయి వీవే - సద్గురుడ వీవే

ప్రభో కావరా -వేగమే -దేవా  ॥ప్రభో॥
 
190) ప్రేమనాథుడగు ఏసునాధునకు (08.07.)
ప్రేమనాథుడగు ఏసునాధునకు
హారతి నీయగ రారమ్మా-
హారతి నీయగ రారమ్మా! ॥ ప్రేమ ॥

పశువుల పాకలో ప్రభవించిన
పరిశుద్ధాత్మల మన్నన పొందిన ॥ ప్రేమ ॥

పతిత మానవుల సముథ రించిన
ప్రాణి కోటినే పరిరక్షించిన ॥ ప్రేమ ॥

సత్య ధర్మముల సంరక్షించిన
ప్రేమ నందరికి మెండుగ బెంచిన ॥ ప్రేమ ॥

చేయని తప్పుకు వేసిన శిక్షను
సహనముతో భరియించి నిలచిన ॥ ప్రేమ ॥

శిలువ నెక్కినను చిదానందముతో
బ్రహ్మానందము నందర కోసగిన ॥ప్రేమ॥

సమర్థ సద్గురు దైవ రూపమై
శ్యామ హృదయమును పరిపాలించడి ॥ ప్రేమ ॥

191) ఏసునాధుని స్మరణ జేయండి (09.07.)

ఏసునాధుని స్మరణ జేయండి - ఓమాన్యులారా!
 ప్రేమ మమతల పంచి పెంచండి  ॥ఏసు॥

(1) తప్పిదములను చేయ బోకండి
మీ తోటి ప్రాణుల ఆదరంబున చేరదీయండి పాప చింతన లెల్ల వదిలి జీవకోటికి సేవ జేయుచు సహన విశ్వాసముల తోడను సత్య సంధత వదల వలదను
॥ ఏసు ॥

(2) పరుల దోసగును ఎన్న బోకండి
పదిమందిలో మీ గొప్పదనముల చాట బోకండి
పర మతమ్ముల గౌరవించుచు ప్రార్థనల అంగీకరించుచు
పలు రకముల మతములన్నియు ప్రభుని చెంతకు జేరుననెడి ॥ ఏసు ॥

(3) తర్కవాదము జేయ బోకండి
పరమాత్మ తత్వము తర్కములతో దెలియ లేరండి అనుభవమున తెలుసుకోవలె ఆనందము నందవలెనని
దైవ కరుణయే దెలుప గలదని నుడివిన శ్రీ శ్యామ నాథుడు  ॥ ఏసు ॥

Comments

Popular Posts

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)