🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)
శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం గమనిక: ఇక్కడ చాల పేజీల సాహిత్యం ఉన్నందున దీనిని 2 భాగాలుగా విభజించడం జెరిగింది శ్యామ సుధా పాటలు
(1వ భాగం::- 01 నుండి 200)
201) రమణ రమణ రమణ రమణా (19.07.)
202) నిన్ను వదలి బ్రదుకలేను (20.07.)
206) పాహి పాహి యనుచు (24.07.)
214) దిగంబరా దిగంబరా (01.08)
215) భజన: హరి నారాయణ (02.08)
216) వందనం వినాయకా… (03.08)
217) నిన్నెటుల తెలుసుకోగలము (04.08)
218) షిరిడి మే ఫకీరు తుమ్ హో (05.08)
219) హరి గురు నామమే మధురము మధురము (06.08)
220) సుందర తనయ కరుణా హృదయా (07.08)
221) నీ మహిమల విని చరితమును చదివి (08.08)
222) సాయి మార్గము - బహు చక్కని మార్గము (09.08.)
223) ఆనందామృత సాగరా ! (10.08.)
224) ఇచ్చెడి వాడవు నీవు దీన బాంధవా (11.08.)
225) లౌకిక రుణముల తీర్చుట కొరకై (12.08.)
226) గురుదత్తేశ్వర జయసాయిశ్వర (13.08.)
227) హే శిరిడీ నాయక సాయిరామ్ (14.08.)
228) కేశవ - కేశవ - కేశవ (15.08.)
229) విశ్వాసముతో నుండుము (16.08.)
230) విశ్వాసముతో నుండుము (17.08.)
231) ఎవరేమి చేసిన తగిన ఫలితములను ఇచ్చెడి (18.08.)
232) అక్కడ యిక్కడ ఎందుకు తిరిగెదవు (19.08.)
233) నీవు నేను ఒక్కటే అన్నావు (20.08.)
234) యాడబాయ కున్నా మాయా (21.08.)
235) సాయి శంకర దరిశన మీయవే (22.08.)
236) కరుణామయీ ప్రేమమయీ (23.08.)
237) శ్యామ సుందరీ, జననీ, శ్రీమాత శారదే (24.08.)
238) కృప కనుమా శ్రీమాతా శారదా (25.08.)
239) రామకృష్ణ గురుదేవా శరణం (26.08.)
240) మేలుకో మేలుకో …. (27.08.)
----------------------
201) రమణ రమణ రమణ రమణా (19.07.)
రమణ రమణ రమణ రమణా యనరే!
మరణమనిన చింతించె మనసును గనరే!
(1) నేనెవరని పరికించెడి మార్గము గనరే!
దివ్య మార్గము గనరే!
నేను నీవు నశియించెడి భావము గనరే!
సద్భావము గనరే! ॥రమణ॥
(2) ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే!
లోక తీరును గనరే! లోకేశ్వరు సేవించెడి పధమును గనరే!
దివ్య పధమును గనరే! ॥రమణ॥
(3) అరిషడ్వర్గములు జేయు వింతల గనరే!
వింత వింతల గనరే!
వింతల నశియుంప జేయు చరణము గనరే!
రమణు చరణము గనరే! ॥రమణ॥
202) నిన్ను వదలి బ్రదుకలేను (20.07.)
నిన్ను వదలి బ్రదుకలేను
(1) ఈ కనులకు కనిపించవు - కలనైనను కనుపించవు
ఊహలకే అందవు ఎటులుందు రా ! నేనెటులందురా
నిను బాపి ఒంటరిగా ఎటులుందు రా ! ॥నిన్ను॥
(2) నీ నామమునే వింటిని - నీ చరితమునే చదివితి
నీ చిత్తరువును జూచితి - అయినా ఏదో ఏదో
లోలోన వెలితి, వెలితి, వెలితి - అది కనరాని వెలితి ॥నిన్ను॥
(3) భౌతికమున నిన్నొకపరి ఒకేసారి ఒకసారి
చూడనీయుమా - కృప జూపుమా -
మాటలాడుమా - మాటలాడుమా -
అది చాలు, అది చాలు,
అది చాలు, అదే చాలు ॥నిన్ను॥
(4) ఊహలలో, భావనలో, చింతనలో, స్మరణలో
నిను నిన్నుగా భౌతికముగా
చూడ సాధ్యమా - చూడ సాధ్యమా -
అది ఆనందమా - అది ఆనందమా -
బ్రహ్మానందమా ! ॥నిన్ను॥
(5) ప్రేమ కరుణలతో నిండిన నీ చూపుతో
నన్ను నేను మరతునురా నా ప్రాణదేవా !
మధురామృతమౌ నీ మాటలను విని
మాయ నుండి విడి వడుదును
మహనీయ తేజా - సచ్చిదానంద మయమౌ
నీ చల్లని ఒడిలో- శిరముంచి కౌగిలించి
కరిగిపోదురా, కరిగిపోదు రా,
నీలో నిలిచిపోదురా - ॥నిన్ను॥
(1) ఈ కనులకు కనిపించవు - కలనైనను కనుపించవు
ఊహలకే అందవు ఎటులుందు రా ! నేనెటులందురా
నిను బాపి ఒంటరిగా ఎటులుందు రా ! ॥నిన్ను॥
(2) నీ నామమునే వింటిని - నీ చరితమునే చదివితి
నీ చిత్తరువును జూచితి - అయినా ఏదో ఏదో
లోలోన వెలితి, వెలితి, వెలితి - అది కనరాని వెలితి ॥నిన్ను॥
(3) భౌతికమున నిన్నొకపరి ఒకేసారి ఒకసారి
చూడనీయుమా - కృప జూపుమా -
మాటలాడుమా - మాటలాడుమా -
అది చాలు, అది చాలు,
అది చాలు, అదే చాలు ॥నిన్ను॥
(4) ఊహలలో, భావనలో, చింతనలో, స్మరణలో
నిను నిన్నుగా భౌతికముగా
చూడ సాధ్యమా - చూడ సాధ్యమా -
అది ఆనందమా - అది ఆనందమా -
బ్రహ్మానందమా ! ॥నిన్ను॥
(5) ప్రేమ కరుణలతో నిండిన నీ చూపుతో
నన్ను నేను మరతునురా నా ప్రాణదేవా !
మధురామృతమౌ నీ మాటలను విని
మాయ నుండి విడి వడుదును
మహనీయ తేజా - సచ్చిదానంద మయమౌ
నీ చల్లని ఒడిలో- శిరముంచి కౌగిలించి
కరిగిపోదురా, కరిగిపోదు రా,
నీలో నిలిచిపోదురా - ॥నిన్ను॥
(12.12.1985 గురువారం, రా.10:30 గం.)
203) లేరెవరు నీ సాటి నను గావ గల మేటి (21.07.)
లేరెవరు నీ సాటి నను గావ గల మేటి,
నా హృదయ మందిర నివాస సాయి,,
నీ నోట ప్రతి మాట రతణాల మూటయే
నా బోటి వారికది ధీటైన బాటయే
మాటిమాటికి నీవు తలపు వచ్చేవయ్యా
నాటి నీ నటనతో కట్టి వేసితివయ్యా ll లేరెవరు ll
సతము ప్రవహించెడి నీ ప్రేమ వాహిని లో
నిలువునా ననుముంచి ఈత నేర్పించినావు
దరికి రానీయవు నా దరికి రావు
ఎందుకీ చిత్రమగు నటన నా తండ్రి llలేరెవరుll
సర్వమును వదిలి నీవెంట రమ్మన్నావు
బాధ్యతల భారములు వదల లేనని తెలిసి
నాది నీదన్నావు, నడయాడమన్నావు
ఇన్నిటిని సృజియించుటేల నా దేవా llలేరెవరుll
నా హృదయ మందిర నివాస సాయి,,
నీ నోట ప్రతి మాట రతణాల మూటయే
నా బోటి వారికది ధీటైన బాటయే
మాటిమాటికి నీవు తలపు వచ్చేవయ్యా
నాటి నీ నటనతో కట్టి వేసితివయ్యా ll లేరెవరు ll
సతము ప్రవహించెడి నీ ప్రేమ వాహిని లో
నిలువునా ననుముంచి ఈత నేర్పించినావు
దరికి రానీయవు నా దరికి రావు
ఎందుకీ చిత్రమగు నటన నా తండ్రి llలేరెవరుll
సర్వమును వదిలి నీవెంట రమ్మన్నావు
బాధ్యతల భారములు వదల లేనని తెలిసి
నాది నీదన్నావు, నడయాడమన్నావు
ఇన్నిటిని సృజియించుటేల నా దేవా llలేరెవరుll
204) సనాతనా - అధునాతన రూపములో (22.07.)
మాల్కోస్ రాగం
సనాతనా - అధునాతన రూపములో
షిరిడీలోన అవతరించితివి
సాయి బాబాగా సాయి బాబా గా ॥సనాతనా॥
(1) భౌతికముగ అరువది వత్సరములు
శిధిలమైన ఆ మసీదులోన
వసియించిననూ విశ్వవ్యాపివై
మానవులకు అనుభవముల నొసగిడి ॥సనాతనా॥
(2) సకల జీవులలో దైవము గలడని
మతములన్నియు మనుషులకే నని
అనుభవముల దయతో కలిగించుచు
ఆనందమార్గములో నడపించెడి - ॥సనాతనా॥
(3) వేదశాస్త్ర పురాణాదులకు
సరియగు నిర్వచనమే నీ జీవితము
నీ సూక్తులకు అంకితమైనచో
సత్యము అనుభవమౌ నీ కృపతో ॥సనాతనా॥
(4) తెలిసీ తెలియని పరిమిత మతితో
నిను గ్రహించయించగ నెంచిన శ్యామ దేవుని
షిరిడీలోన అవతరించితివి
సాయి బాబాగా సాయి బాబా గా ॥సనాతనా॥
(1) భౌతికముగ అరువది వత్సరములు
శిధిలమైన ఆ మసీదులోన
వసియించిననూ విశ్వవ్యాపివై
మానవులకు అనుభవముల నొసగిడి ॥సనాతనా॥
(2) సకల జీవులలో దైవము గలడని
మతములన్నియు మనుషులకే నని
అనుభవముల దయతో కలిగించుచు
ఆనందమార్గములో నడపించెడి - ॥సనాతనా॥
(3) వేదశాస్త్ర పురాణాదులకు
సరియగు నిర్వచనమే నీ జీవితము
నీ సూక్తులకు అంకితమైనచో
సత్యము అనుభవమౌ నీ కృపతో ॥సనాతనా॥
(4) తెలిసీ తెలియని పరిమిత మతితో
నిను గ్రహించయించగ నెంచిన శ్యామ దేవుని
కృప జూపి కరుణతో నడపింపుము
నీ కొరకై నిను ప్రేమింపనీయుము ॥సనాతనా॥
(23.12. ఉ.2.57 గం.కు)
205) శీలధీ యనగా సఛీలమునకు (23.07.)
శీలధీ యనగా సఛీలమునకు నిలయము
శీలధీ రూపాంతరమే షిరిడీ నామము ॥శీలధీ॥
(1) సఛీలముతో షిరిడి గ్రామములో నడుగిడిన
దుఃఖములన్నియు నశించు సాయినాథు సత్కృపతో
సత్యమూ..... ఇది సత్యమూ సాయినాథుడొసగినట్టి
అభయ ప్రదానము సత్యమూ..... ఇది నిత్య సత్యము ॥శీలధీ॥
(2) సకల జీవుల కెల్ల సర్వకాలములలోన
ప్రవేశమును కలిగించునదే ద్వారకమాయి
సకల జీవులన్నీ యొక్కటే అను అవగాహనతో
అడిగినచో సంతోష సుఖములు లావరించును ॥శీలధీ॥
శీలధీ రూపాంతరమే షిరిడీ నామము ॥శీలధీ॥
(1) సఛీలముతో షిరిడి గ్రామములో నడుగిడిన
దుఃఖములన్నియు నశించు సాయినాథు సత్కృపతో
సత్యమూ..... ఇది సత్యమూ సాయినాథుడొసగినట్టి
అభయ ప్రదానము సత్యమూ..... ఇది నిత్య సత్యము ॥శీలధీ॥
(2) సకల జీవుల కెల్ల సర్వకాలములలోన
ప్రవేశమును కలిగించునదే ద్వారకమాయి
సకల జీవులన్నీ యొక్కటే అను అవగాహనతో
అడిగినచో సంతోష సుఖములు లావరించును ॥శీలధీ॥
(23.12.1985 ఉ.2.59 గం.కు)
206) పాహి పాహి యనుచు (24.07.)
మధ్యమావతి రాగం
పాహి పాహి యనుచు
నీదు వెంట నేను బడుదు ననుచు
పారిపోవ నుంటివా సాయీ
దేహి దేహి యనుచు
నిన్ను కోరికలతో దేబరించ
రాలేదు లే నేను సాయీ ॥పాహి॥
(1) కామ క్రోధ లోభ మోహ
మద మత్సరముల వలలో
చిక్కి నిన్ను వేధింతున సాయీ
నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించ
లేననుచు భయమొందితి సాయీ ॥పాహి॥
(2) ఎంతటి కష్టములనైన భరియించెడి
శక్తి నొసగి కృప జూపి బ్రోవుమా సాయీ
అంతట నీవే నిండి యున్నావను సత్యమును
శ్యామదేవులకు దయసేయుమా సాయీ ॥పాహి॥
నీదు వెంట నేను బడుదు ననుచు
పారిపోవ నుంటివా సాయీ
దేహి దేహి యనుచు
నిన్ను కోరికలతో దేబరించ
రాలేదు లే నేను సాయీ ॥పాహి॥
(1) కామ క్రోధ లోభ మోహ
మద మత్సరముల వలలో
చిక్కి నిన్ను వేధింతున సాయీ
నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించ
లేననుచు భయమొందితి సాయీ ॥పాహి॥
(2) ఎంతటి కష్టములనైన భరియించెడి
శక్తి నొసగి కృప జూపి బ్రోవుమా సాయీ
అంతట నీవే నిండి యున్నావను సత్యమును
శ్యామదేవులకు దయసేయుమా సాయీ ॥పాహి॥
(06.01.1986 సోమవారము రాత్రి 9:50 గం.కు)
207) భగవన్నా మమే తరుణోపాయము (25.07.)
భగవన్నా మమే తరుణోపాయము
బంధము లూడుట కదే ఉపాయము
బంధము లూడుట కదే ఉపాయము
॥భగవాన్ నామమే॥
(1) నేను నాదనెడి భావము చేత
బంధింపబడిన బడుగు జీవులకు
అజ్ఞానముతో అలమటించెడి
అసలు సత్యమును తెలియని వారికి
(1) నేను నాదనెడి భావము చేత
బంధింపబడిన బడుగు జీవులకు
అజ్ఞానముతో అలమటించెడి
అసలు సత్యమును తెలియని వారికి
॥భగవాన్ నామమే॥
(2) ఆనందమునకు ప్రాకులాడుచూ
అది ఐహికమున కలదని ఎంచుచు
కామాదులతో పరిభ్రమించుచు
అశాంతితోడ జీవించు వారికి
(2) ఆనందమునకు ప్రాకులాడుచూ
అది ఐహికమున కలదని ఎంచుచు
కామాదులతో పరిభ్రమించుచు
అశాంతితోడ జీవించు వారికి
॥ భగవన్నామమే ॥
(3) వాల్మీకి వ్యాస మహా ఋషులందరూ
తుంబుర, నారద, గంధర్వులందరూ
త్యాగయ్య , అన్నమయ్య భక్తాదులెందరో
మైమరచి, స్మరియించి,
పులకించి, తరియించ ॥భగవన్నామమే॥
(4) నామదేవ, జ్ఞానదేవ,
తులసీ, తుకారాము,
ఘోరా, మీరా, పురందర, రామదాస
కబీరు చైతన్య, రామకృష్ణ శ్యామా
ఎందరెందరో మహానుభావులు
అనుసరించిన అద్భుత మార్గము
(3) వాల్మీకి వ్యాస మహా ఋషులందరూ
తుంబుర, నారద, గంధర్వులందరూ
త్యాగయ్య , అన్నమయ్య భక్తాదులెందరో
మైమరచి, స్మరియించి,
పులకించి, తరియించ ॥భగవన్నామమే॥
(4) నామదేవ, జ్ఞానదేవ,
తులసీ, తుకారాము,
ఘోరా, మీరా, పురందర, రామదాస
కబీరు చైతన్య, రామకృష్ణ శ్యామా
ఎందరెందరో మహానుభావులు
అనుసరించిన అద్భుత మార్గము
పతిత పావనుని చేరెడి మార్గము
మానవాళి కిదే సులభ మార్గము
సాయినాధుడందించిన మార్గము
కలిమాయను దాటెడి నుపాయము
సాయినాధుడందించిన మార్గము
కలిమాయను దాటెడి నుపాయము
॥భగవన్నామమే॥
(19.03.1986 రా.11:50 గం.కు)
208) ముప్పది వత్సరములన్ని (26.07)
ముప్పది వత్సరములన్ని
ముచ్చటగా గడిపితిమని
కలిసిమెలిసి బ్రతికితిమని
కలిసిమెలిసి బ్రతికితిమని
కలతలసలే లేవనుచును
మరవకండి మహామాయ ప్రభావమును
మదిలోన ముసలి తనము ముసుగువేసి
ముందుకొచ్చె పరుగునా వారు వారు చేసినట్టి
మరవకండి మహామాయ ప్రభావమును
మదిలోన ముసలి తనము ముసుగువేసి
ముందుకొచ్చె పరుగునా వారు వారు చేసినట్టి
కర్మములకు అనుగుణముగ
వారి వారి మనోభావములకు
సక్రమముగా అనుభవించ వలసి యుండు
ఫలితములను క్రమముగా
జగదీశ్వరుడాడించెడి
సక్రమముగా అనుభవించ వలసి యుండు
ఫలితములను క్రమముగా
జగదీశ్వరుడాడించెడి
నాటకమున పావులుగా ॥ముప్పది॥
(1) నేను నాదను భావమే అన్నిటికీ మూల మనచు
అది తొలగిననే గానీ ఆనందము నిలువ దనుచు
సద్గురును సేవింపక జీవులు తరియించరనుచు
భగవాన్ రమణు లొసగిన ఉపదేశంబును మరిచి
(1) నేను నాదను భావమే అన్నిటికీ మూల మనచు
అది తొలగిననే గానీ ఆనందము నిలువ దనుచు
సద్గురును సేవింపక జీవులు తరియించరనుచు
భగవాన్ రమణు లొసగిన ఉపదేశంబును మరిచి
॥ముప్పది॥
(2) జీవితమందున సాధన భాగము కాదని తెలిసి
సాధనలో జీవిత మొక భాగమనెడి సత్య మెఱిగి
శ్రీ సాయి సూక్తుల ఆచరణకు మీరంకితమై
సుఖియించుడు, తరయించుడు
(2) జీవితమందున సాధన భాగము కాదని తెలిసి
సాధనలో జీవిత మొక భాగమనెడి సత్య మెఱిగి
శ్రీ సాయి సూక్తుల ఆచరణకు మీరంకితమై
సుఖియించుడు, తరయించుడు
శ్యామనాథు కృపతోడా ॥ ముప్పది ॥
(20.03.1986 00.38 గం.కు)
209) సాయి స్వరూపా - శ్యామాచరణా (27.07)
సాయి స్వరూపా - శ్యామాచరణా
చల్లగ చూడుము - ఓ దేవా
కరుణాలయ వాసా - శామా
మము బ్రోవగ రావా - దేవా ॥సాయీ॥
(1) నిరతము నిన్నే భజియుంతుమయా
సతతము మమ్ము మరవకుమా
ఎల్లవేళలా మమ్ము బ్రోవుమా
శాంతి స్వరూపా - శామాచరణా ॥సాయీ॥
(2) కరుణ చిలుకు నీ చల్లని చూపులే
నిరతము మా మది దోచునయా
ప్రేమతో చూచి వేగమే బ్రోవుమా
శారద రమణా శామాచరణా ॥సాయీ॥
(3) చూపులేని దీనురాలికి
చూపు నొసగి కరుణించి,
కాపాడి, రక్షించి నావు
చల్లని తండ్రీ శామాచరణా
చల్లని తండ్రీ శారద రమణా ॥సాయీ॥
చల్లగ చూడుము - ఓ దేవా
కరుణాలయ వాసా - శామా
మము బ్రోవగ రావా - దేవా ॥సాయీ॥
(1) నిరతము నిన్నే భజియుంతుమయా
సతతము మమ్ము మరవకుమా
ఎల్లవేళలా మమ్ము బ్రోవుమా
శాంతి స్వరూపా - శామాచరణా ॥సాయీ॥
(2) కరుణ చిలుకు నీ చల్లని చూపులే
నిరతము మా మది దోచునయా
ప్రేమతో చూచి వేగమే బ్రోవుమా
శారద రమణా శామాచరణా ॥సాయీ॥
(3) చూపులేని దీనురాలికి
చూపు నొసగి కరుణించి,
కాపాడి, రక్షించి నావు
చల్లని తండ్రీ శామాచరణా
చల్లని తండ్రీ శారద రమణా ॥సాయీ॥
210) శారద రమణా శ్రీ శామాచరణా (28.07.)
శారద రమణా శ్రీ శామాచరణా
చల్లగ కరుణించ రా దేవా ॥శారద॥
(1) కరుణాలయములోన వెలసిల్లిన
సాయి మనోహర మమ్మేలుకో
దరహాస కిరణాల చిరువెలుగులు
మాపైన ప్రసరించి బ్రోచేవులే ॥శారద॥
(2) వెలలేని మమతా సుగంధాలను
మాపైన చిలకించు సౌభాగ్యము
కలిగించితివి శారదా రమణా
నీ సేవలో నేను మరిచేనులే ॥శారద॥
చల్లగ కరుణించ రా దేవా ॥శారద॥
(1) కరుణాలయములోన వెలసిల్లిన
సాయి మనోహర మమ్మేలుకో
దరహాస కిరణాల చిరువెలుగులు
మాపైన ప్రసరించి బ్రోచేవులే ॥శారద॥
(2) వెలలేని మమతా సుగంధాలను
మాపైన చిలకించు సౌభాగ్యము
కలిగించితివి శారదా రమణా
నీ సేవలో నేను మరిచేనులే ॥శారద॥
211) కరుణా నిలయుడు - ప్రేమ స్వరూపుడు (29.07)
కరుణా నిలయుడు - ప్రేమ స్వరూపుడు
మంగళకరుడు -శ్రీ శ్యామ చరణుడు
చింతలు బాపి సంతస మొసగి
నను కాపాడిన సద్గురు దేవుడు ॥కరుణా॥
(1) మూగబోయిన గళమును పలికించి
నాకే తెలియని కవితలు నేర్పి
మోడు బారిన జీవిత మందున
సుధ కురిపించిన కరుణామయుడు ॥కరుణా॥
(2) ఏదో తెలియని అనుభూతి కలిగించి
నా మది దోచిన మానస చోరుడు
విశ్వవ్యాపియౖ నాకగుపించె
నను కాపాడిన సద్గురుదేవుడు ॥కరుణా॥
శారద రమణ శ్రీ శామాచరణా
నీ నామ జపమే మధురాతి
మధురం మధురం మధురం
మధురాతి మధురం ॥శ్యామా॥
మంగళకరుడు -శ్రీ శ్యామ చరణుడు
చింతలు బాపి సంతస మొసగి
నను కాపాడిన సద్గురు దేవుడు ॥కరుణా॥
(1) మూగబోయిన గళమును పలికించి
నాకే తెలియని కవితలు నేర్పి
మోడు బారిన జీవిత మందున
సుధ కురిపించిన కరుణామయుడు ॥కరుణా॥
(2) ఏదో తెలియని అనుభూతి కలిగించి
నా మది దోచిన మానస చోరుడు
విశ్వవ్యాపియౖ నాకగుపించె
నను కాపాడిన సద్గురుదేవుడు ॥కరుణా॥
శారద రమణ శ్రీ శామాచరణా
నీ నామ జపమే మధురాతి
మధురం మధురం మధురం
మధురాతి మధురం ॥శ్యామా॥
212) శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన (30.07)
బీమ్పాస్ రాగం
శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన
నిలచెడి భాగ్యము నొసగుమ మా సాయి (2)
గంగా యమునలు ప్రవహించిన
నీ పాదములే పరమ పావనములు
సకల తీర్థ, సంపదల నిలయములు
పతితుల కెల్లను పరమార్ధములు ॥శ్రీకరమౌ॥
(1) అవగాహనతో నీ చరితమును
ఒకపరి అయినను చదివిన చాలును
సకల దేవత సాధు జీవములు,
సకల విశ్వము నీవని తోచును ॥శ్రీకరమౌ॥
(2) రాజైనను పేదవాలె జీవించెడి వాడు
భగవంతుని కృపకు పాత్రుడవునంటివీ
రాజాధి రాజులే పడిగాపులు కాచుచుండ
భిక్షతో జీవించి ఆచరించి చూపితివి ॥శ్రీకరమౌ॥
(3) పరమాత్మవు నీవైనను మానవునిగ
సంచరించి మమతానురాగములతో
మనసుల మురిపించితివి భక్తుల కోరికలను దీర్చి
అభయ మొసగుచున్నావు మానవుడే మాధవుడై
వెలుగు దారి చూపించితివి
శ్యామను నీ చేతిలో కీలు బొమ్మను చేసినావు ॥శ్రీకరమౌ॥
నిలచెడి భాగ్యము నొసగుమ మా సాయి (2)
గంగా యమునలు ప్రవహించిన
నీ పాదములే పరమ పావనములు
సకల తీర్థ, సంపదల నిలయములు
పతితుల కెల్లను పరమార్ధములు ॥శ్రీకరమౌ॥
(1) అవగాహనతో నీ చరితమును
ఒకపరి అయినను చదివిన చాలును
సకల దేవత సాధు జీవములు,
సకల విశ్వము నీవని తోచును ॥శ్రీకరమౌ॥
(2) రాజైనను పేదవాలె జీవించెడి వాడు
భగవంతుని కృపకు పాత్రుడవునంటివీ
రాజాధి రాజులే పడిగాపులు కాచుచుండ
భిక్షతో జీవించి ఆచరించి చూపితివి ॥శ్రీకరమౌ॥
(3) పరమాత్మవు నీవైనను మానవునిగ
సంచరించి మమతానురాగములతో
మనసుల మురిపించితివి భక్తుల కోరికలను దీర్చి
అభయ మొసగుచున్నావు మానవుడే మాధవుడై
వెలుగు దారి చూపించితివి
శ్యామను నీ చేతిలో కీలు బొమ్మను చేసినావు ॥శ్రీకరమౌ॥
(15.03.1986, రా. 1 :30 గం.కు)
213) నా పాలి దేవుడు, నన్నేలు దేవుడు (31.07)
నా పాలి దేవుడు, నన్నేలు దేవుడు, కృపానిలయుడు
శ్రీ సాయినాధుడు అండగా, నా కుండగా, అండగా
నాకు యుండగా భయమేల బాధేలా
ఈ బ్రదుకులోన - ఈ బ్రదుకులోన
సాయిరాం పాహిమాం - సాయిరాం రక్షమాం ॥సాయిరాం॥
(1) సత్యము ధర్మము తప్పని వారలను
త్రికరణ శుద్ధితో నుండెడి వారలను
సకల జీవులలో దేవుని జూచుచు
సేవించు చుండెడి వారికి భయమా ॥నా పాలి॥
సాయిరాం పాహిమాం సాయిరాం రక్షమాం
(2) శరణన్న వారలను వదలని వాడు
కరుణతో భక్తులను గాచెడి వాడు
అనాధ రక్షకుడు ఆశ్రశిత పోషకుడు
అనాధనాథుడు దీన బాంధవుడు
శ్రీ సాయినాధుడు అండగా, నా కుండగా, అండగా
నాకు యుండగా భయమేల బాధేలా
ఈ బ్రదుకులోన - ఈ బ్రదుకులోన
సాయిరాం పాహిమాం - సాయిరాం రక్షమాం ॥సాయిరాం॥
(1) సత్యము ధర్మము తప్పని వారలను
త్రికరణ శుద్ధితో నుండెడి వారలను
సకల జీవులలో దేవుని జూచుచు
సేవించు చుండెడి వారికి భయమా ॥నా పాలి॥
సాయిరాం పాహిమాం సాయిరాం రక్షమాం
(2) శరణన్న వారలను వదలని వాడు
కరుణతో భక్తులను గాచెడి వాడు
అనాధ రక్షకుడు ఆశ్రశిత పోషకుడు
అనాధనాథుడు దీన బాంధవుడు
అండగా నాకు ఉండగా భయమేల, బాధేల,
ఈ బ్రతుకులోన ఏనాటికైనా ఏ జన్మకైనా
శ్యామచరణునికి ప్రేమను
నేర్పి తనవానిగ చేసుకొనగ నెంచి
శిక్షణ గరపుచు, రక్షణ నొసగుచు
పరిపాలించెడి చల్లని దైవము
ఈ బ్రతుకులోన ఏనాటికైనా ఏ జన్మకైనా
శ్యామచరణునికి ప్రేమను
నేర్పి తనవానిగ చేసుకొనగ నెంచి
శిక్షణ గరపుచు, రక్షణ నొసగుచు
పరిపాలించెడి చల్లని దైవము
అండగా నాకు యుండగా భయమేల, బాధేలా -
ఈ బ్రదుకు లోన ఏనాటికైనా, ఏ జన్మకైనా
సాయిరాం పాహిమాం
సాయిరాం రక్షమాం
సాయిరాం పాహిమాం
సాయిరాం రక్షమాం
ఈ బ్రదుకు లోన ఏనాటికైనా, ఏ జన్మకైనా
సాయిరాం పాహిమాం
సాయిరాం రక్షమాం
సాయిరాం పాహిమాం
సాయిరాం రక్షమాం
(15.03.1986 00.00 గం.కు)
214) దిగంబరా దిగంబరా (01.08)
దిగంబరా దిగంబరా
శ్రీపాదవల్లభ దిగంబరా
దిగంబరా దత్త దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా సాయి దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా బాబ దిగంబరా
శ్రీపాదవల్లభ దిగంబరా
దిగంబరా నృసింహ దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా స్వామి దిగంబరా
శ్రీపాదవల్లభ దిగంబరా
దిగంబరా రమణ దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా జ్ఞాన దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా నివృత్తి దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా నాథ దిగంబరా
శ్రీపాదవల్లభ దిగంబరా
దిగంబరా సద్గురు దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా రామ దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
దిగంబరా శ్యామ దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
(27.05.1986)
215) హరి నారాయణ హరి నారాయణ (02.08)
హరి నారాయణ హరి నారాయణ
హరి నారాయణ గోవిందా----(2)
అచ్యుత, కేశవ,
మాధవ, మురహరి
హరి నారాయణ గోవిందా-- – ॥హరి॥
వామన, నృసింహ,
జనార్ధన శ్యామ
హరి నారాయణ గోవిందా---- ॥హరి॥
భక్తి ప్రదాతా, ముక్తి ప్రదాతా,
సాయి నారాయణ గోవిందా ॥హరి॥
(27.05.1986)
216) వందనం వినాయకా… (03.08)
(హంసధ్వని)
వందనం వినాయకా…
ఓం నమో గజాననా
ఓం నమో మూలాధారా…..
ఓం నమో శ్యామధారా…..
ఓం నమో ప్రణవ స్వరూపా
ఓం నమో ప్రేమ స్వరూపా
ఓం నమో కృపా స్వరూపా
ఓం నమో సాయి స్వరూపా ॥వందనం॥
(31.05.1986, శనివారం రాత్రి)
217) నిన్నెటుల తెలుసుకోగలము సాయీ (04.08.)
నిన్నెటుల తెలుసుకోగలము సాయీ
నీ వంటి వారు దప్ప
మా వంటి వారెప్పుడూ….
నీ వంటి వారు తప్ప
నా వంటి వారు ఎప్పుడైనా….
(1) సంస్కారములతో బంధింపబడితిని
కోరికలలోన చిక్కు బడితిని
భేద భావములకు బానిస నైతిని
త్రిగుణములకు దాసుడనైతిని
సంస్కార రహితా… బావాతీతా
త్రిగుణాతీతా…. సద్గురు దేవా…. సాయీ
॥నిన్నెటుల॥
(2) స్వార్ధ చింతనయే….
నా పరమావధి నిస్వార్ధతయే… నీ పద సన్నిధి
వ్యామోహములే…. మాకానందము
నిర్మోహత్వమే…. నీకానందము
నీవు వేరనుట…. నా అవగాహన
నేను నీవనుట…. నీ అనుభవము ॥నిన్నెటుల॥
(03.06.1986, మంగళవారం రా. 01.00 గం.కు)
218) షిరిడి మే ఫకీరు తుమ్ హో (05.08)
షిరిడి మే ఫకీరు తుమ్ హో
అఖిల జగత్ కా అక్బర్ తుమ్ హో
అల్లా తుమకో మాలిక్ తుమ్ హో
అల్లా మాలిక్ తుమ్ హో తుమ్ హో
సాయి....బాబా... బాబా... సాయి...
llషిరిడి మేll
1. పరమ ప్రేమ్ కా రూప్ తుమ్ హో
దివ్య కరుణాసాగర్ తుమ్ హో
దీన జనోంకా బంధు తుమ్ హో
పరబ్రహ్మ అవతార్ తుమ్ హో llషిరిడి మేll
2. సీతా వల్లభ రామ్ తుమ్ హో
మోహన రూపా శ్యామ్ తుమ్ హో
త్రిమూర్తి రూపా దత్తా తుమ్ హో
సమర్థసద్గురు సాయి తుమ్ హో llషిరిడి మేll
3. పతితో ద్థారక పావన తుమ్ హో
పావనసుత హనుమాన్ తుమ్ హో
కళ్యాణ గుణ ధామ్ తుమ్ హో
కలిమల భంజన దేవా తుమ్ హో llషిరిడి మేll
(03.06.1986, రా.09.00 గం.)
219) హరి గురు నామమే మధురము మధురము (06.08)
హరి గురు నామమే మధురము మధురము
హరి గురు నామమే మధురాతి మధురము
గురు దర్శనమున కదె సోపానము llహరిll
1. హరియే గురుడట గురుడే హరియట
హరి గురువులకు భేదము లేదట
మానవాళిని ఉద్ధరించుటకు
హరియే గురువుగ అవతరించునట llహరిll
2. మానవ రూపమున నుండెడి గురువును
గుర్తించుటయే బహు దుర్లభమట
అహము వదలినచో హరియే గురుడను
సత్యము దెలియుట సులభమగునట llహరిll
3. సద్గురు నామము స్మరియించుటకు
సద్గురు కృపయే కారణమగునట
శ్యామనాథుడగు సాయినాధుని
కృపతో సర్వము సులభమౌనట llహరిll
(వేగంగా పాడాలి )
4. పరులకు అపకారములను జేయక
ఉపకారములను జేయుచు నుండిన
సర్వజీవులలో దైవము గలడని
వినయముతో సేవించు చుండినను
శ్రీహరి నామపు మధురము దెలియును
హరి గురు లోకటను అనుభవమగును llహరిll
(09.6.1986, సోమ మ.02.10 నుండి మ.02.30 గం. మధ్య)
220) సుందర తనయ కరుణా హృదయా (07.08)
భీమ్పాస్ రాగం
సుందర తనయ కరుణా హృదయా
మమ్మేలగ రావయ్యా…. llసుందరll
1. అరుణాచలమే నీ నివాసము
అది అందరికీ శాంతి నివాసము
ఆర్తితో పిలిచే ఈ భక్తులను
ఆదుకొనగ రావయ్య రమణ ll సుందర ll
2. భావములే తెలుసుకొని -
మా భావము బాధల నెన్నో తీర్చేవు
భగవాన్ రమణ నిన్ను సేవింప వచ్చాము
మా సేవ లందుకొనగా దయతో కరుణింపుమా
ll సుందర ll
3.కొండ మీదకు చేరావు
కొండంత దేవుడవయ్యావు
కొసరి కొసరి చూచేవు
కోర్కెలను తీర్చేవు ll సుందర ll
(08.06.1986 ఆది, ఉ.09:30 గం.కు)
221) నీ మహిమల విని చరితమును చదివి (08.08)
నీ మహిమల విని చరితమును చదివి
ఆశతో నిను స్మయించితినా
నీకై నీవు నను లాగు కొనగ
నిను నమ్ముకొనగ నెంచితివా
నిను నమ్మిన ఈ తర్కము రాదు
అటు ఇటు నా మది పరుగిడదు
అది ఇది నెరుగని స్థితిలోన నుంచి
నడుపు చుంటివా నాటకము ll నీ మహిమల ll
1.మొట్టమొదట నిను కోరిన కోర్కెల
నెల్ల దీర్చి ఓదార్చెదవు
మరల మరల నా మొరలను
వినక మొరాయించి ఆడించెదవు
నను వదలవు నిను మరువనీయవు
నడుమ నన్నిరికించెదవు
నీ శిక్షణ ఏమిటో చిత్రమైనది
వాక్కుకు మనసుకు అందనిది
ll నీ మహిమల ll
2. ఒక పరి నీవున్నావనే ధైర్యము
ఒక పరి నెఱుగనిదేదో అధైర్యము
భౌతిక పరమార్థములకు
అర్థము తెలియక ఏదో సతమతము
నీ భక్తులమని తిరిగే వారల
తీరుల జూడగ కలకలము
నీ శిక్షణ ఏమిటో చిత్రము
పరిరక్షణ తీరు విచిత్రము
ll నీ మహిమల ll
3.సమ భావముతో అన్ని జీవులను
ప్రేమగ పరిపాలించితివి
తామరాకుపై నీటి బొట్టు వలె
ఎటులుండ వలెనో చూపితివి
నిన్ను జూచి మాట్లాడు యోగ్యత
నాకింతవరకు రాలేదే
నీ భక్తుల మను వారల జూడగా
నిజమేదో తెలియట లేదే ll నీ మహిమల ll
4.నీ వలె నుండెడి ధైర్యము లేదు
నీ మాటలినెడి అర్హత లేదు
నీ సూక్తుల కనుగుణముగ నడవగ
ఆశీస్సులిడుము గురుదేవా
నిజమగు నీ భక్తునిగా నిలబడు
యోగ్యత నొసగుము గురుదేవా
నీ శిక్షణలో పరిరక్షణలో
నను నడిపించుము సాయి దేవా
llనీ మహిమల ll
222) సాయి మార్గము - బహు చక్కని మార్గము (09.08.)
మోహనరాగం
సాయి మార్గము - బహు చక్కని మార్గము
సర్వజనులకు అది సులభ మార్గమూ
ll సాయి మార్గం ll
1..సాధన చతుష్టయములను చేయగా పని లేదు
శాస్త్ర షట్కములను చదువగా పని లేదు
సద్గురువును విశ్వసించి ఓర్పు తోడ చరియించిన
సంతస మందుట కదియే సులభ మార్గమూ
llసాయి మార్గంll
2. పోటీలను,వంతులను, కీచులాటలను
అహముతోడ ఇతరుల లోపములను చూపుటను
ఇతరుల కన్నను తానే అధికుడనను భావనను
విడనాడిన భగవానుడు కృప జూపునను మార్గము
llసాయి మార్గంll
3.కుల మతములు జాతులు,ధనిక పేద భావములు
మతాంతీకరణములు, సాంప్రదాయ మార్పిడులు
జీవజంతు జాలముల హీనముగా జూచుటను
వదలినచో భగవంతుడు కృప జూపునను మార్గము
llసాయి మార్గం ll
4.చేసిన కర్మకు ఫలితము అనుభవించవలెననుచును
సత్యముండు చోటు సదా దైవము తోడు నుండుననుచు
సకల జీవులలోన భగవంతుడే కలడనుచును
భగవంతుడే యజమాని మనకని తెలిపిన మార్గము
llసాయి మార్గం ll
5.భగవంతుడే సద్గురువుగ భువిలో అవతరించుననుచు
దుర్గుణముల పారద్రోలి సద్గుణముల నిలుపుననుచు
సద్గురు దేవుని కృపయే శ్రేయము కలిగించుననుచు
శ్రీ గురుడు ప్రేమలోన శ్యామను ముంచిన మార్గము
llసాయి మార్గం ll
(02.06.1986 సోమ, రా.11:43 గం.)
223) ఆనందామృత సాగరా ! (10.08.)
ఆనందామృత సాగరా !
ఆశ్రిత పోషక కృపాకరా !
ఆనందామృత సాగరా !
ఆశ్రిత పోషక కృపాకరా_ll
సాయిరాం ! సాయిరాం ! సాయిరామ్ !!
సాయిరాం ! సాయిరాం ! సాయిరామ్ !!
1.ఒకపరి ఆర్తితో "సాయి" అనగనే
పరిపరి విధముల పరిరక్షింతువు
భక్తుడో కాడో గణుతింపకనే
బాధ్యతల నెల్ల మోయుచున్నావు llఆనందామృతll
2.ఎవరి సేవను ఉచితముగా...
పొందవలదని బోధించితివి
అనుక్షణము నన్ను కాపాడుచున్న
నీకేమి చేతును దేవాధి దేవా llఆనందామృతll
3.నీ దయయే గద ఈ జీవితము
నీకరుణయే గద కల్మషహరము
కాదని యేది లేదని తెలిపిన
తెలుసుకోలేని శ్యామచరణుడను
నాదని యేది లేదను నిజము
తెలుసుకోలేని శ్యామచరణుడను llఆనందామృతll
(08.06.1986. ఆది, రా.11.11 గం. నుండి రా.11.20 గం. వరకు)
224) ఇచ్చెడి వాడవు నీవు దీన బాంధవా (11.08.)
ఇచ్చెడి వాడవు నీవు దీన బాంధవా
నీకేమీ ఇత్తురా లోక బాంధవా.. ll
1.మనిషి జన్మ నొసగినావు… నీ చెంతకు లాగినావు
సద్భోధల జేసినావు…. ఆచరించమన్నావు
నీ కృప లేకయే నేను ఆచరించలేననెడి
సత్యమును తెలిపినట్టి ప్రేమ స్వరూపా llఇచ్చెడి ll
2.బాధ్యతల నెన్నింటినో తొలగించినావు
సమస్యలకు పరిష్కారము లెన్నింటినో చూపినావు
సదా నీవు యున్నావను అవగాహనను యొసగినను
గుర్తించలేనట్టి గ్రుడ్డివాడ నైతినయ్యా llఇచ్చెడిll
3.నీ మార్గములో సదా నన్ను నడువనీయుమయ్యా
పరిస్థితుల నెదుర్కుకొనెడి ధైర్యము దయచేయుమయ్యా
నీ కొరకై నిన్ను సదా ప్రేమించనీయుమయ్యా
నీ సేవలోన శ్యామనంతము చేయగదయ్యా llఇచ్చెడిll
(08.06.1986, ఆది, రా.11.25 నుండి రా.11.38 వరకు)
225) లౌకిక రుణముల తీర్చుట కొరకై (12.08.)
లౌకిక రుణముల తీర్చుట కొరకై
సతమతమయ్యెడి మనిషినయా
నీ ఋణమెటుల తీర్చుకోగలను
నిరుపమ, నిర్మల, ప్రేమమయా అ ...ఆ ...
1.నేనూ నాదను స్వార్థ చింతనలు
సంకుచితముగ నను నడుపుచున్నవి
నిస్వార్ధ సేవల నెపుడు జేయుదునో
నీ దయ కెటుల పాత్రుడ నగుదునొ llలౌకిక ll
2.అరిషడ్వర్గపు దిగ్భంధనమున
అస్తవ్యస్తముగ నడుచుచుంటిని
అందరి శ్రేయము నెపుడు కోరుదునో
నీ ప్రేమ కెటుల పాత్రుడ నగుదునో llలౌకిక ll
3.తార్కిక వాదముల వలలో బడితిని
తత్వ విచారమునకు దూరమైతిని
శ్యామయే లేడని ఎపుడు తెలియునో
నీ కృప కెటుల పాత్రుడ నగుదునో llలౌకిక ll
(09.06.1986 రా.11.40 గం.కు)
226) గురుదత్తేశ్వర జయసాయిశ్వర (13.08.)
కానడ రాగం
గురుదత్తేశ్వర జయసాయిశ్వర
జయమానస మందిర వాస
గురు దత్తేశ్వర జై సాయీ శ్వర
మమ మానస మందిర వాస
జై ప్రాణేశ్వర జై జ్ఞానేశ్వర
జైజై సత్యాశ్రయవాస
జై ప్రేమేశ్వర జై లోకేశ్వర
జైజై ధర్మాశ్రయ వాస
జై యోగేశ్వర జై విశ్వేశ్వర
జైజై శాంతి క్షమాశ్రయ వాస
జై నవనాధేశ్వర జై నాథ మహేశ్వర
జై నిర్మల నిరుపమ గుణవాస
[జై దయాకరేశ్వర (కృపాకరేశ్వర)]
జై కాళేశ్వర జై త్రిగుణేశ్వర
జైజై కరుణాలయ వాస
జై దయాకరా జై కృపాకరా
జై ద్వారక మందిర వాస
జై సర్వేశ్వర జై శ్యామేశ్వర
జై జై భక్తాశ్రిత వాస
(12.06.1986, రా.7.45 నుండి రా. 09.35 వరకు)
227) హే శిరిడీ నాయక సాయిరామ్ (14.08.)
హే శిరిడీ నాయక సాయిరామ్
శ్రీతజన పోషక సాయిరామ్
సాయిరామ్ జై సాయిరామ్
జై సాయిరామ్ జై సాయిరామ్ ll సాయి రామ్ ll
1.అభయ ప్రదాత, భవభయనాశక
ఆపద్బాంధవ సాయిరామ్ సాయిరామ్ ll హే శిరిడీ ll
2. భుక్తి ప్రదాతా, భక్తి ప్రదాతా,
శక్తి ప్రదాతా సాయిరామ్ సాయిరామ్ ll హే శిరిడీ ll
3. కరుణాకర హర కృపాకర హరి
సజ్జన ప్రియకర సాయిరామ్ ll హే శిరిడీ ll
4. శ్యామ మనోహర సద్గతి వరదా
భక్త వరదా సాయిరామ్
యోగ ప్రదాతా జ్ఞానప్రదాతా
జగత్పితా ప్రభు సాయిరాం ll హే శిరిడీ ll
(31.07.1986, రా.08.15 గం.కు)
228) కేశవ - కేశవ - కేశవ (15.08.)
1.కేశవ - కేశవ - కేశవ
శవము వలె నన్ను భువిలో బ్రతుక జేయనీయకురా ॥
2. నారాయణ - నారాయణ - నారాయణ
నానా రూపములలోన నీవే కనిపించుము రా - ॥
3. మాధవ - మాధవ - మాధవ
మానవుడే మాధవుడను అనుభవమును ఒసగుమురా ౼॥
4. గోవిందా - గోవిందా - గోవిందా
గోపికలను బ్రోచినటుల మమ్ము కరుణింపుము రా ౼॥
5. విష్ణుదేవ - విష్ణుదేవ - విష్ణుదేవ
వినయముగా నీ పద దాసుల సేవల నొసగుమురా -॥
6. మధుసూదన - మధుసూదన - మధుసూదన
మదనదేవు వశము నుండి మమ్ముల రక్షింపుము రా ౼॥
7. త్రివిక్రమ - త్రివిక్రమ - త్రివిక్రమ
త్రిగుణములు రహితములగు మార్గములో నడుపుమురా ౼॥
8. వామన - వామన - వామన
వాదములను, వైరములను నశింపజేయుమురా - ॥
9. శ్రీధర - శ్రీధర - శ్రీధర
శ్రీకరమౌ నీ రూపము సతతము మదిలో నిలుపుమురా - ॥
10. హృషీకేశ - హృషీకేశ హృషీకేశ
హృదయమందు సద్భక్తిని సుస్థిరముగా నిలుపుమురా ౼॥
11. పద్మనాభ - పద్మనాభ - పద్మనాభ
ప్రతి అణువున నీ నామము స్పందింప చేయుమురా ౼॥
12. దామోదర - దామోదర - దామోదర
దమము, శమము శాంతి క్షమల నొసగి మమ్ము నడుపుమురా ౼॥
13. సంకర్షణ - సంకర్షణ - సంకర్షణ
సంఘర్షణ తొలగజేసి సద్బుద్ధుల నోసగుమురా ౼॥
14. వాసుదేవ - వాసుదేవ - వాసుదేవ
వసియించగ మా పలుకుల వరము నీయరా ౼॥
15. ప్రద్యుమ్న - ప్రద్యుమ్న - ప్రద్యుమ్న
ప్రతియోచన యందు నీవు నిలచి ఉండరా౼॥
16. అనిరుద్ధా - అనిరుద్ధా - అనిరుద్ధా
అంతఃకరణమును ఎప్పుడూ శుభ్రముగా నుంచుమురా ౼॥
17. పురుషోత్తమ - పురుషోత్తమ - పురుషోత్తమ
పురుషార్ధముల యందు ధర్మముగ నడుపుమురా ౼॥
18. అధోక్షజ - అధోక్షజ - అధోక్షజ
అందరి శ్రేయముల కొరకు జీవింప జేయుమురా ౼॥
19. నారసింహ - నారసింహ - నారసింహ
నర జన్మము సార్ధకతను నొందు నటుల జేయుమురా ౼॥
20. అచ్యుత - అచ్యుత - అచ్యుత
నీ పాద సన్నిధి నుండి చ్యుత గానీయకురా -॥
21. జనార్ధన - జనార్ధన - జనార్ధన
జగమే నీ రూపమనెడి అనుభవమును యొసగుమురా ౼॥
22. ఉపేంద్ర - ఉపేంద్ర - ఉపేంద్ర
ఉపదేశములు లేని సాయిబాట నొసగుమురా ౼॥
23. హర హరా - హర హరా - హర హరా
హరియే గురుడను సత్యము అనుభవమున నొసగమురా ౼॥
24.శ్రీ కృష్ణ - శ్రీ కృష్ణ - శ్రీకృష్ణ
కృష్ణ రామ ౼ దత్త సాయి కృపను పొంద జేయుమురా ౼॥
229) విశ్వాసముతో నుండుము (16.08.)
విశ్వాసముతో నుండుము -
వినయముతో నడయాడుము
ఓర్పుతో చరియించుము -
ధైర్యోత్సాహముల ఎపుడు వీడకుము
ధైర్యము నెపుడు వీడకుము -
ఉత్సాహము వీడకుము
1.విశ్వాసము కలిగించును
వివేక విజ్ఞానములను
విశ్వాసము మది పెంచును
ప్రేమాభిమానములను
ఓర్పు యున్న వారికే
సత్ఫలితము స్వంతమగును
విశ్వాసము ఓర్పులున్న
సద్గురు కృప సులభమగును
ll విశ్వాసము ll
2. అచంచలము ఆనందము
అమోఘము విశ్వాసము
దుర్గుణముల పారద్రోలు
బ్రహ్మాస్త్రము ఓర్పు
త్రికరణ శుద్ధిగ జేసెడి
కార్యములకు మూలమవియే
సాయి దేవుడు అందించిన
సులభమైన సూత్రములు
ll విశ్వాసము ll
3. శాస్త్రములు, సాధనలు,
యోగా భ్యాసములు
వాదములు ,వేదములు
భేదములు, తర్కములు
ఐహిక ఆముష్కికముల
సంపదలను యోచనలు
నిరర్ధకము వ్యర్థములు
అనర్ధదాయకములగునట
ll విశ్వాసము ll
4.విశ్వాసము ఓర్పు లేక
ఏ పనియు నెరవేరదు
శబ్ద, స్పర్శ, రూప,
రస గంధాదుల దాటలేరు
త్రికరణ శుద్ధియే లేని
ఏ కార్యము ఫలించదు
సద్గురును ఆశ్రయించ కేమియు సాధించలేరు
ll విశ్వాసము ll
5.విశ్వాసము ఓర్పులతో
సద్గురువును సేవించిన
సర్వము శ్రీ గురుదేవుని
పరమొనరించి నిలచి యున్న
అందరి బాధ్యతలను
సద్గురువే భరియించి
సంతస మొసగి
సద్గతి నొసగి బ్రోచు గాదే
ll విశ్వాసము ll
6.శ్యామ నాయకుడు
పరమ కరుణామయుడు
శ్యామసేవితుడనంత
ప్రేమ మందిరుడు
శ్యామ నాయకుడు
అమోఘ కృపాకరుడు
శ్యామవందితుడే గదా
విశ్వనాయకుడు ll విశ్వాసము ll
230) విశ్వాసముతో నుండుము (17.08.)
నీ నామస్మరణ లో గడిపే కాలమే
మధురం మధురం పునీతం పునీతం...
నీ లీలా శ్రవణములో గడిపే కాలమే
మధురం, పునీతం పునీతం మధురం....
సాయి రామా.... బాబా సాయీ....
సాయి రామా.... సాయి శ్యామా...
1.నీ లీలా పఠనములో గడిపే కాలమే
పునీతం పునీతం...
నీలీలా చింతనలో గడిపే కాలమే
మధురం పునీతం మధురం పునీతం ...
llనీ నామ స్మరణలోll
2.నీ సేవలో గడిపే కాలమే
మధురం మధురం మధురం పునీతం....
నీ ఆరాధనలో గడిపే కాలమే
మధురం పునీతం పునీతం మధురం...
నీ పూజలోన గడిపే కాలమే
మధురం మధురం పునీతం పునీతం.....
నిను అర్చించుటలో గడిపే కాలమే
పునీతం పునీతం మధురం మధురం ....
llనీ నామ స్మరణలోll
3.సర్వము నీ సంకల్పమే
అనెడి భావనలో గడిపే కాలమే
మధురం మధురం పునీతం పునీతం...
అంతయు నాదనెడి భావనలో గడిపే కాలమే
అధమం అధమం అధమమాధమం...
llనీ నామస్మరణలోll
4.మైమరపించి పులకించి
తరియింప చేసిడి నీ రూపమే
మధురం మధురం పునీతం పునీతం...
శ్యామాదులపై కృపజూపు
నీ లీలా నాటకమే
మధురం పునీతం...
శ్యామాదుల నడిపించు
నీ లీలా నాటకమే
మధురం పునీతం పునీతం మధురం...
llనీ నామస్మరణలోll
(24.06.1986, రా. 9.10 గం.కు)
231) ఎవరేమి చేసిన తగిన ఫలితములను ఇచ్చెడి (18.08.)
భూపాళ రాగం
ఎవరేమి చేసిన తగిన
ఫలితములను ఇచ్చెడి
దేవాది దేవా శ్రీ సాయి దేవా...
మంచి చెడుగులకు
తగు ఫలితముల నిచ్చెడి
సత్య ధర్మ స్వరూపా
ఒక్కడుగు నీ వైపు వేసినంతనే
పది అడుగులు మా వైపు వేసెడి దేవా
ఒకపరి నిన్ను శరణాగతి వేడిన
వదలక గాచి కృప జూపు దేవా
ll ఎవరేమీ ll
సత్యముండేటి చోట వుందువు నీ వనుచు-
అభయము నొసెగెడు అభయ ప్రదాత
సద్గురువును నమ్మి
ఓర్పుగా నుండెడి మార్గమే
నీదనుచు తెలిపిడి దేవా
నీ మార్గంలో నడువ
యత్నించు వారలకు
చేయూత నొసగెడి దేవాది దేవా
బాధ్యతల నెరవేర్చి
ఋజుమార్గములో నడిపి బ్రతుకు
సుగమము చేయు దేవాది దేవా
శామ్యాదుల నెల్ల ప్రేమ కరుణల
తోడ కృప చూపి బ్రోచెడి
శ్రీ సాయి దేవా.... శ్రీ సాయి దేవా...
ll ఎవరేమీ ll
(24.06.1986, రా.9.25 గం.కు)
232) అక్కడ యిక్కడ ఎందుకు తిరిగెదవు (19.08.)
అక్కడ యిక్కడ ఎందుకు తిరిగెదవు
చెప్పిన మాటను వినవేమే మనసా (2)
(ఆ... ఆ...ఆ)
సాధనలేమీ చేయగ లేవని
శాస్త్ర శష్కముల చదువ లేవని
తెలిసియే ఆ పరమాత్ముడు భువిలో
సాయిగా షిరిడీలో అవతరించెనని
చెప్పిన వినవేమే మనసా(2)
(ఆ...ఆ...ఆ...) ll అక్కడ ఇక్కడ ll
వృధాగా అక్కడ యిక్కడ
ఎందుకు తిరిగెదవు
చెప్పిన మాటను వినవే మనసా(2)
ll అక్కడ ఇక్కడ ll
దేనినయినను అనుమానము తోడ
పరికించుటయే నీ కలవాటయినది
అనుమానములను అంతము చేయగ
అవతరించినదిగో సాయీ వినక
ll అక్కడ ఇక్కడ ll
బ్రతుకుకు అర్థము
తెలిపిన దైవము
జీవితమునకు పరమార్థము
తెలిపిన దైవము
ll అక్కడ ఇక్కడ ll
(24.06.1986, రా.9.45 గం.)
233) నీవు నేను ఒక్కటే అన్నావు (20.08.)
నీవు నేను ఒక్కటే అన్నావు
దేవా సాయి దేవా
నీవు నేను వేరనెడి మందమతిని
దేవా సాయి దేవా
నన్నెటుల కృప జూతువో
దేవా కరుణింతువో దేవా
చెప్పిన వినలేని నీ సూక్తుల గనలేని
అణుమాత్రమయినను ఆచరించలేని
బలహీనుడును నేను బాబా..
ఎటు కృప జూతువో నన్ను
234) యాడబాయ కున్నా మాయా (21.08.)
యాడబాయ కున్నా మాయా
ఎందు బోయనో తెలియ దాయా
పుడమిలో సద్గురు రాయా
బోధామృతము పానము చేయా… ll
1.పుట్టుల కాధార మాయ
పొత్తుకూడి ఉన్నట్లాయ
గుట్టు తెలియగనే నిలిచి పోయ
శ్రీ గురు చంద్రోదయ మాయ ౼॥
2.పట్టరాని రిపులార్గురిని
పట్టి బంధించి న్నట్టులాయా
బట్టబయట చూడగ తానే
బ్రహ్మమనుచు నిలకడాయా ౼॥
3.బిందువే బీజమైన దాయా
సంధి తెలియ సమరస మాయా
ఎందుచూచినను ఏక మాయా
ఎరుకతానే బ్రహ్మ మాయా ౼॥
4.మనసు చెదరగానే నిలిపి
అహంకార మమతల విడిచి
తనలో తానే తనువును మరచి
ద్వైత భావమును కిందు పరచి౼॥
5.నన్ను నాలోనే చూచితిని
నామరూపముల యెడ బాసితిని
చెన్నుమీర పాలలోనే
వెన్న విధమని తెలియనాయా ౼॥
6.భావ భావములేవేనీ
సద్భావమే బ్రహ్మ భావమాయా
జీవుడే గురు మృత్యుంజయుడు
దేవుడని తెలియనాయా ౼॥
(18.01.1987, ఇది, రా.7.00 గం.కు)
235) సాయి శంకర దరిశన మీయవే (22.08.)
సాయి శంకర దరిశన మీయవే
దరిశనమునతో తరియింప జేయవే
1.చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం
గురుదేవ గురుదేవ గురుదేవ పాహిమాం
గురుదేవ గురుదేవ గురుదేవ రక్షమాం
ll సాయి ll
2.జగద్గురు జగద్గురు జగద్గురు పాహిమాం
జగద్గురు జగద్గురు జగద్గురు రక్షమాం
ll సాయి ll
3.ప్రేమ ప్రదాత కరుణాసాగర
జగద్గురు చంద్రశేఖర
సాయి శంకర సత్కృప జూపవే
సత్కృప జూపి మమ్ము తరియింప జేయవే
ll సాయి ll
(28.01.1987, రా.11.40 గం.కు)
236) కరుణామయీ ప్రేమమయీ (23.08.)
కానడ రాగం
కరుణామయీ ప్రేమమయీ జననీ శారదే
జననీ కావవే
నిర్మల ప్రేమకు నీవే రూపము
నిరుపమ ఓర్పుకు నీవాధారము
నిజమగు సతికి నీవాదర్శము
మాతృ ప్రేమకు నీవే మూలము
విశ్వమున కెల్ల మాతవు నీవై
బాధల నిందల భరియించితివి
ప్రేమామృతమును పంచి పెంచుచు
బిడ్డల నెల్లర కాచుచుండెడి
కరుణామయీ ప్రేమమయీ జననీ శారదే
కులమత జాతి భేదము లెంచక
పిల్లల కడుపుల ప్రేమతో నింపుచు
విశ్వమంతకు మాతృదేవియై
శ్యామ హృదయమున వెలుగుచుండెడి
ll కరుణా ll
237) శ్యామ సుందరీ, జననీ, శ్రీమాత శారదే (24.08.)
మోహనరాగం
శ్యామ సుందరీ, జననీ, శ్రీమాత శారదే
ప్రేమంకరి, శుభంకరి, అభయంకరి, దిగంబరి
కరుణామయా, కృపామయా, వరదా భయదాయని
జగన్మయా, విశ్వమయా, లోకమయా, చిన్మయా
పరాత్పరి, జగదీశ్వరి, పరమేశ్వరి, శ్రీకరి
ll శ్యామ సుందరీ ll
నీ వచనామృత పానమే ఆనంద నిలయం
నీ ప్రేమామృత పానమే సంతస వలయం
నీ దివ్య సన్నిధియే మాకు ఆలయం
నీ కృపాదృష్టియే శ్యామాదుల కభయము
ll శ్యామ సుందరీ ll
238) కృప కనుమా శ్రీమాతా శారదా (25.08.)
భీమ్పాస్ రాగం
కృప కనుమా శ్రీమాతా శారదా
నీవారల మము వీడకు మమ్మా
కృప కనుమా శ్రీ మాత శారదా (దే)
1. జపతప సాధనలు చేయగలేను
సత్యమార్గమున నడువగలేను
దానధర్మముల చేయగలేను
నీకై నీవే మము నడిపించుమా
ll కృప గనుమా ll
2. భ్రమలకు చిక్కి మాయలొ బడితిని
మంచి చెడుగులను తెలియనైతినే
సదాలోచనలు చేయగ నైతినే
ప్రేమతో మమ్ముల చక్కగ నడపవే
ll కృప గనుమా ll
3. నేనను భావము వదలకున్నది
నాదను భావము వీడకున్నది
నీ మార్గములో ఎటుపయనింతునో
నీ శ్యామగ నే నెప్పుడు నిలుతునో
llకృప గనుమాll
239) రామకృష్ణ గురుదేవా శరణం (26.08.)
మాల్కోస్ రాగం
మధ్యమావతి రాగం
రామకృష్ణ గురుదేవా శరణం
శారదా దేవి మాతా శరణం
శ్రీ గురుదేవ రామకృష్ణ పాహిమామ్ రక్షమామ్
శారదనాథ రామకృష్ణ పాహిమామ్ రక్షమామ్
1.పొట్టకూటి చదువును వదలి
తరించు మార్గము నందున తరలి
జప తప సాధన లెన్నో చేసి
విశ్వరూపిగా మా మది నిలిచిన
ll శ్రీ గురుదేవ ll
2.నేనను భావన లేనివాడవై
అమ్మ శక్తిలో నీవు లీనమై
దివ్య సమాధిలో నిరతము నిలచి
జీవరాశిని నడిపెడి దేవా
ll శ్రీ గురుదేవ ll
3.నవవిధభక్తి మార్గమ్ములలో
నడిచెడి వారికి తోడు నీడవై
చక్కగ నడుపుచు సంతస మిచ్చుచు
సద్గతి నొసగెడి సద్గురు దేవ
ll శ్రీ గురుదేవ ll
4 నీవే శరణని నమ్మిన వారల
బరువు బాధ్యతల భరియించెదవు
ప్రేమ మమతలతో కృపను చూపెదవు
శ్యామ హృదయమున నిలచి యుందువు
ll శ్రీ గురుదేవ ll
240) మేలుకో మేలుకో …. (27.08.)
ఉదయరాగం
మేలుకో మేలుకో ....
నాలోన నిండి యున్న ప్రాణదేవా,
గురుదేవా, శ్రీ రామకృష్ణ మేలుకో
ఓం నమో భగవతే రామకృష్ణాయ
కరుణాకరా ప్రభో శ్రీకరా (పునరావృతం )
గురుదేవ, గురుదేవ, గురుదేవ, శ్రీరామకృష్ణా
(పునరావృతం)
కరుణాకరా......... గురుదేవా.........
మావలె పుట్టితివి, మావలె పెరిగితివి
మాకంటే భిన్నమగు సాధనలు జేసితివి (పునరావృతం)
పసిడి మనసును కలిగి మనుజులను గాచితివి
పసిడి మనసును కలిగి పతితులను గాచితివి
పరమాత్మ రూపిగా స్థిరముగా నిలిచితివి
పరమాత్మ రూపిగా స్థిరముగా నిలిచితివి
పరమాత్మ రూపివై భువిలో నిలచితివి
కరుణాకరా......... గురుదేవా..........
1.శారదా మాతను పెండ్లి యాడి
నిజమగు సంసార మొనరించినావు
సంసారిగా యుండి తరియించు మార్గమును
లోకముల కెల్లను ఎరుక పరచితివి
ll కరుణాకరా ll
2.అమ్మా, అమ్మా, అమ్మా యనుచు
అమ్మా, అమ్మా, అమ్మా యనుచు
దరిశన మొసగి చేకొన మనుచు
ఆక్రోశించి, ఆక్రోశించి, ఆక్రోశించి
రోదించి, రోదించి, రోదించినావు
ll కరుణాకరా ll
3.ఎంత రోదించినను అమ్మ రాలేదాయే
కనుల కొకసారైనా కనిపించదాయె
అంతు తెలియని బాధ అధికమై నొప్పింప
బండ నేలల పైన పొరలాడి ఏడ్చితివి
అమ్మా కనిపించవా, అమ్మా కనిపించవా
ఆకలి లేదు, నిద్దుర లేదు,
పగలూలేదు, రాత్రీ లేదు
తనవారు లేరు, పెరవారు లేరు
అమ్మ తప్ప తదితరమెవ్వరు లేరు
శోకమ్ము లేదు మోహము లేదు
లౌకికత్వము నందు ధ్యాసయే లేదు
అమ్మ దరిశనము ధ్యేయమే తపనయై
తపియించి, తపియించి, విలపించినావు
ll కరుణాకరా ll
4.మంత్రమేదియు లేదు, తంత్రమేదియు లేదు
ఏ గురువు నుండి ఉపదేశమే లేదు
అమ్మా కనుపించవే, అమ్మా కనుపించవే
అమ్మా, అమ్మా, అమ్మా
(గట్టి స్వరం ) ( పునరావృతం)
ll కరుణాకరా ll
5. అమ్మ కనిపించవే అను
మంత్రంతోడ బ్రతిమలాడితివి
ఎంత చేసిన గానీ అమ్మ కనబడదాయె
ఆవేదనను చూడ అధికమధికమ్మాయె
ఆరాటము చూడ అధికమాయే
ll కరుణాకరా ll
6.అమ్మ రాలేదేమి కనిపించదేమి
ప్రేమతో ఒడిచేర్చి దీవించదేమి
అమ్మలేని బ్రతుకు వ్యర్థంబు గాదె
అనుచు మరణించగా నిశ్చయించితివి
ll కరుణాకరా ll
7.తల్లి కరమందలి కరవాలమును తీసి
మెడపై వేసుకొని మరణించ బోవగా
కోటి సూర్యుల యొక్క తేజముతో కనిపించె
కరుణించె, కరుణించె, అమ్మ కరుణించె
సచ్చిదానందమ్ము నొసగి దీవించె
ll కరుణాకరా ll
8.మానవా తీతమగు సాధనల చేసితివి
సకల దేవతల దర్శనమును బొందితివి
నారాయణుడవే నీవని తెలిపితివి
పసి బాలకుని వోలె సంచరించితివి
ll కరుణాకరా ll
9.పతితుల నెల్లరా పావనులుగా మార్చి
మధురమగు ప్రేమను మాకందరకు పంచి
భక్తి యొక్కటియే మనుజులకు శ్రేష్టమని
ఐక్యత కలిగెడి మార్గమది అన్నావు
ll కరుణాకరా ll
10.లోక హితమునకై అవతరించితివి
లోకోద్దారకుల సృష్టించితివి
ప్రేమకు సాధనకు నిర్వచనమే నీవు
శ్యామచరణుని దయతో కృపజూడుమయ్యా
అంతరంగము నందు నిండియుండెడి దేవా
మేలుకో, ఏలుకో, ఏలుకో మేలుకో
ll కరుణాకరా ll
241) కనరావా, కనరావా కరుణానిధే శ్రీ రమణా (28.08.)
కానడ రాగం
కనరావా, కనరావా కరుణానిధే శ్రీ రమణా
కనిపించి ఒకసారి కృప జూపుమా
1.నేను నాదను భావము కలిగిన వాడను
నేను లేని నిను ఎటుల కనుగొందు
నీ కృప లేక నను నడిపించెడి
నీ మార్గములో ఎటు పయనింతురా
ll కనరావా ll
2.నీ మార్గము బహు సులభమయినది
నా నడకకు అది అసాధ్యమైనది
అర్హత యోగ్యతలు కలిగిన గాని
తెలియవు నీవని తెలుసుకుంటిని
ll కనరావా ll
3.నీ మార్గమును ఆచరించుటకు
మార్గమేదియో తెలియదాయనే
నీకై నీవే కృప జూపినిచో
శ్యామకు నేనను భావముండునే
ll కనరావా ll
(22.02.1987, రా.12.50 గం.)
-----
Comments
Post a Comment