Posts

Showing posts from July, 2022

(213) 31 July (31.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 31 Jul నీవెవరో, ఏమి చేస్తున్నావో, నీవలన నీకు ఎంత ఉపయోగమో, ఇతరులకు ఎంత ఉపయోగమో చూచుకుంటూ బ్రతికితేగానీ బ్రతుకుకు అర్థం తెలియదు. By watching who you are, what you are doing, how useful you are to yourself and how useful you are to others, if you live, then you know the meaning of life.     213) నా పాలి దేవుడు, నన్నేలు దేవుడు  (31.07.) నా పాలి దేవుడు, నన్నేలు దేవుడు, కృపానిలయుడు శ్రీ సాయినాధుడు అండగా, నా కుండగా, అండగా నాకు యుండగా భయమేల బాధేలా ఈ బ్రదుకులోన - ఈ బ్రదుకులోన సాయిరాం పాహిమాం - సాయిరాం రక్షమాం ॥సాయిరాం॥ (1) సత్యము ధర్మము తప్పని వారలను త్రికరణ శుద్ధితో నుండెడి వారలను సకల జీవులలో దేవుని జూచుచు సేవించు చుండెడి వారికి భయమా ॥నా పాలి॥ సాయిరాం పాహిమాం సాయిరాం రక్షమాం (2) శరణన్న వారలను వదలని వాడు కరుణతో భక్తులను గాచెడి వాడు అనాధ రక్షకుడు ఆశ్రశిత పోషకుడు అనాధనాథుడు దీన బాంధవుడు అండగా నాకు ఉండగా భయమేల, బాధేల, ఈ బ్రతుకులోన ఏనాటికైనా ఏ జన్మకైనా శ్యామచరణునికి ప్రేమను నేర్పి తనవానిగ చేసుకొనగ నెంచి శిక్షణ గరపుచు, రక్షణ నొసగుచు పరిపాల...

(212) 30 July (30.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Jul ఒక పెద్ద వృక్షము అనేక రకముల ప్రాణులకు ఆశ్రయమిస్తుంది. ఆ ప్రాణులు అక్కడ విశ్వాసముతో రక్షణ పొందుతాయి. గురువు కూడా అలాంటి మహావృక్షమే. మనమంతా వారి ఆశ్రయము పొందగల ప్రాణులము. A large tree shelters many species of animals. Those souls will be saved there by faith. Guru is also such a great tree. We are all beings who can take their shelter.     212) శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన  (30.07.) ( బీమ్పాస్ రాగం )   శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన నిలచెడి భాగ్యము నొసగుమ మా సాయి (2) గంగా యమునలు ప్రవహించిన నీ పాదములే పరమ పావనములు సకల తీర్థ, సంపదల నిలయములు పతితుల కెల్లను పరమార్ధములు ॥శ్రీకరమౌ॥ (1) అవగాహనతో నీ చరితమును ఒకపరి అయినను చదివిన చాలును సకల దేవత సాధు జీవములు, సకల విశ్వము నీవని తోచును ॥శ్రీకరమౌ॥ (2) రాజైనను పేదవాలె జీవించెడి వాడు భగవంతుని కృపకు పాత్రుడవునంటివీ రాజాధి రాజులే పడిగాపులు కాచుచుండ భిక్షతో జీవించి ఆచరించి చూపితివి ॥శ్రీకరమౌ॥ (3) పరమాత్మవు నీవైనను మానవునిగ సంచరించి మమతానురాగములతో మనసుల మురిపించితివి భక్తుల కోరికలను దీర్చి అ...

(211) 29 July (29.07.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 29 Jul గురువు ఈ క్రింది వాటికి శిక్షణ ఇవ్వవచ్చును: శారీరక, మానసిక సంబంధములగు విద్య, శుభ్రత, బ్రహ్మచర్యము, సకలకర్మలు, సర్దుబాటుతనము, శక్తి, ఆరోగ్యము కొరకైన ఆహారము, సమయోచిత కార్య నిర్వహణ గుణము, తీర్థయాత్రలు, మహాత్ముల సందర్శనము, నిరాడంబర జీవితము, ఆధ్యాత్మిక ప్రవచనములు, గ్రంధ రచన, నైతిక విలువలకు కట్టుబాటు, ప్రచారానికి దూరంగా ఉండటము, ధ్యానము, నిర్భయత, స్థిరత్వము, అంకితభావంతో కూడిన మానవ సేవాతత్పరత మొదలగునవి, మరియు చివరగా గురువు అనుగ్రహంతో ముక్తి . శిష్యుడు తప్పనిసరిగా ఆధ్యాత్మిక తపన, సహనం కలిగి ఉండాలి. The Guru may give training in the following: physical and mental relative education, cleanliness, celibacy, all deeds, adjustment, energy, healthful diet, proper conduct of work, pilgrimages, visits to Mahatmas, humble life, spiritual discourses, writing scriptures, adherence to moral values, Abstention from propaganda, meditation, fearlessness, steadiness, devoted human service, etc., and finally liberation by the Guru's grace. A disciple must hav...

(210) 28 July (28.07.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Jul గురువు ఈ క్రింది వానిని పరీక్షించవచ్చును: నిరహంకారము, సత్యసంధత, వ్యక్తిత్వము, సమయ పాలనము, నిస్వార్థము, నమ్మకము, ధైర్యము, విశ్వాసము, సహనము, నిష్కపటపు ఓర్పు, సఖ్యత, కోమలత్వము, ప్రశాంతత, శారీరక, మానసిక అర్హత, కాయకష్టము, గ్రహణ శక్తి, జాగరూకత, ఆచరణము, నమ్రత, శక్తి సామర్థ్యములు, నిజాయితీ, సమయోచిత ప్రజ్ఞ, ఎరుక, సాహసము, సత్వస్వభావము, కృతజ్ఞత, ప్రేమ, చురుకుదనము, పెద్దలయందు గౌరవము, విశాల దృక్పథము, కుశాగ్రబుద్ధి మొదలైన గుణముల లక్షణములు, సంస్కారములు. The Guru may test him on the following: Humility, truthfulness, personality, time management, selflessness, trust, courage, faith, patience, sincere endurance, harmony, gentleness, composure, physical, mental fitness, hard work, perceptive power, vigilance, practicality, modesty, Strength, honesty, timely intelligence, consciousness, adventure, true nature, gratitude, love, activeness, respect for elders, broad perspective, alert mind, etc. characteristics and qualities.   210) శారద రమణా శ...

(209) 27 July (27.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 27 Jul మతం అంటే దైవ యెడ, మానవుని యెడ ప్రేమ తప్ప మరేమీ కాదు. జీవితం అశాశ్వతం, కానీ బుద్ధిహీనులు దాన్ని సత్యమని యెంచి దానిలో చిక్కుకొని పోతారు. Religion is nothing but love for God and Human. Life is impermanent, but the unintelligent thinks it is true and get caught up in it.     209) సాయి స్వరూపా - శ్యామాచరణా (27.07.) సాయి స్వరూపా - శ్యామాచరణా చల్లగ చూడుము - ఓ దేవా కరుణాలయ వాసా - శ్యామా  మము బ్రోవగ రావా - దేవా  ॥సాయీ॥ (1) నిరతము నిన్నే భజియుంతుమయా సతతము మమ్ము మరవకుమా ఎల్లవేళలా మమ్ము బ్రోవుమా శాంతి స్వరూపా - శ్యామా చరణా ॥సాయీ॥ (2) కరుణ చిలుకు నీ చల్లని చూపులే నిరతము మా మది దోచునయా ప్రేమతో చూచి వేగమే బ్రోవుమా శారద రమణా శ్యామా చరణా ॥సాయీ॥ (3) చూపులేని దీనురాలికి చూపు నొసగి కరుణించి, కాపాడి, రక్షించి నావు చల్లని తండ్రీ శ్యామా చరణా చల్లని తండ్రీ శారద రమణా ॥సాయీ॥

(208) 26 July (26.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 26 Jul నది నిస్సంగ భావాన్ని, అంకిత భావాన్ని నమ్రతను బోధిస్తుంది. జీవితం కూడా నది వలెనే అనంత దివ్య మహా సాగరం వైపు ప్రవహిస్తోంది. The river teaches unsocial feeling, dedication and modesty. Life itself is like a river flowing towards the Infinite Divine Ocean.   208) ముప్పది వత్సరములన్ని (26.07.) ముప్పది వత్సరములన్ని ముచ్చటగా గడిపితిమని కలిసిమెలిసి బ్రతికితిమని కలతలసలే లేవనుచును మరవకండి మహామాయ ప్రభావమును మదిలోన ముసలి తనము  ముసుగువేసి ముందుకొచ్చె పరుగునా వారు వారు చేసినట్టి కర్మములకు అనుగుణముగ వారి వారి మనోభావములకు సక్రమముగా అనుభవించ వలసి యుండు ఫలితములను క్రమముగా జగదీశ్వరుడాడించెడి నాటకమున పావులుగా ॥ముప్పది॥ (1) నేను నాదను భావమే అన్నిటికీ మూల మనచు అది తొలగిననే గానీ ఆనందము నిలువ దనుచు సద్గురును సేవింపక జీవులు తరియించరనుచు భగవాన్ రమణు లొసగిన ఉపదేశంబును మరిచి ॥ముప్పది॥ (2) జీవితమందున సాధన భాగము కాదని తెలిసి సాధనలో జీవిత మొక భాగమనెడి సత్య మెఱిగి   శ్రీ సాయి సూక్తుల ఆచరణకు మీరంకితమై సుఖియించుడు, తరయించుడు శ్యామనాథు కృపతోడా ॥ ముప్పది ...

(207) 25 July (25.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 25 Jul "ప్రేమపూరిత కరుణ” శాసనాలకన్నా గొప్పది.  దానాలు, కర్మకాండలకన్నా అదే గొప్పది. "Loving compassion" is greater than statutes.  It is greater than deeds and rituals.   207) భగవన్నా మమే తరుణోపాయము (25.07.) భగవన్నా మమే తరుణోపాయము బంధము లూడుట కదే ఉపాయము ॥భగవాన్ నామమే॥ (1) నేను నాదనెడి భావము చేత బంధింపబడిన బడుగు జీవులకు అజ్ఞానముతో అలమటించెడి అసలు సత్యమును తెలియని వారికి  ॥భగవాన్ నామమే॥ (2) ఆనందమునకు ప్రాకులాడుచూ అది ఐహికమున కలదని ఎంచుచు కామాదులతో పరిభ్రమించుచు అశాంతితోడ జీవించు వారికి ॥ భగవన్నామమే ॥ (3) వాల్మీకి వ్యాస మహా ఋషులందరూ తుంబుర, నారద, గంధర్వులందరూ త్యాగయ్య , అన్నమయ్య భక్తాదులెందరో మైమరచి, స్మరియించి, పులకించి, తరియించ ॥భగవన్నామమే॥ (4) నామదేవ, జ్ఞానదేవ, తులసీ, తుకారాము, ఘోరా, మీరా, పురందర, రామదాస కబీరు చైతన్య, రామకృష్ణ శ్యామా ఎందరెందరో మహానుభావులు అనుసరించిన అద్భుత మార్గము   పతిత పావనుని చేరెడి మార్గము  మానవాళి కిదే సులభ మార్గము సాయినాధుడందించిన మార్గము కలిమాయను దాటెడి నుపాయము ॥భగవన్నామమే॥ (19.03.1986 రా.11...

(206) 24 July (24.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 24 Jul ధనం సంపాదించవచ్చు. వస్తువులు కొనవచ్చు. కాని తల్లిదండ్రులను, సత్పురుషులను కొనలేము. వారి సలహాలు చీకట్లో దీపాల వంటివి. తెలివిగా నిర్ణయం తీసుకో. Money can be earned. Things can be bought. But parents and True-men cannot be bought. Their advices are like lamps in the dark. Make a wise decision.     206)  పాహి పాహి యనుచు  (24.07.) పాహి పాహి యనుచు నీదు వెంట నేను బడుదు ననుచు పారిపోవ నుంటివా సాయీ దేహి దేహి యనుచు నిన్ను కోరికలతో దేబరించ రాలేదు లే నేను సాయీ ॥పాహి॥ (1) కామ క్రోధ లోభ మోహ మద మత్సరముల వలలో చిక్కి నిన్ను వేధింతున సాయీ నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించ లేననుచు భయమొందితి సాయీ ॥పాహి॥ (2) ఎంతటి కష్టములనైన భరియించెడి శక్తి నొసగి కృప జూపి బ్రోవుమా సాయీ అంతట నీవే నిండి యున్నావను సత్యమును   శ్యామదేవులకు దయసేయుమా సాయీ ॥పాహి॥ (06.01.1986 సోమవారము రాత్రి 9:50 గం.కు)

(205) 23 July (23.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Jul విగ్రహారాధన చేస్తూ పరులను దూషించడము భక్తి కానేరదు. క్షమ - భక్తుని శాశ్వత ఉజ్జ్వల స్వభావము. మనము మంచివారమైతే అంతా మంచిగనే వుంటుంది. While worshiping idols, blaspheming people is not piety. Forgiveness - the eternal radiant nature of the devotee. If we are good, everything will be good.     205) శీలధీ యనగా సఛీలమునకు నిలయము  (23.07.) శీలధీ యనగా సఛీలమునకు నిలయము శీలధీ రూపాంతరమే షిరిడీ నామము ॥శీలధీ॥ (1) సఛీలముతో షిరిడి గ్రామములో నడుగిడిన దుఃఖములన్నియు నశించు సాయినాథు సత్కృపతో సత్యమూ..... ఇది సత్యమూ సాయినాథుడొసగినట్టి అభయ ప్రదానము సత్యమూ..... ఇది నిత్య సత్యము ॥శీలధీ॥ (2) సకల జీవుల కెల్ల సర్వకాలములలోన ప్రవేశమును కలిగించునదే ద్వారకమాయి సకల జీవులన్నీ యొక్కటే అను అవగాహనతో అడిగినచో సంతోష సుఖములు లావరించును ॥శీలధీ॥ (23.12.1985  ఉ.2.59 గం.కు)

(204) 22 July (22.07.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Jul నీ అనుభూతులను, ఆవేశాలను అణచ వద్దు. ఎవరి వద్ద నీవు స్వేచ్ఛగా మన గలుగుదువో ఆయనతో హృదయంలోని భావాలను పంచుకో. Do not suppress your feelings and emotions. With whom you are free, with him share the feelings of the heart.   204) సనాతనా -  అధునాతన రూపములో  (22.07.) సనాతనా -  అధునాతన రూపములో షిరిడీలోన అవతరించితివి సాయి బాబాగా సాయి బాబా గా ॥సనాతనా॥ (1) భౌతికముగ అరువది వత్సరములు శిధిలమైన ఆ మసీదులోన వసియించిననూ విశ్వవ్యాపివై మానవులకు అనుభవముల నొసగిడి ॥సనాతనా॥ (2) సకల జీవులలో దైవము గలడని మతములన్నియు మనుషులకే నని అనుభవముల దయతో కలిగించుచు ఆనందమార్గములో నడపించెడి - ॥సనాతనా॥ (3) వేదశాస్త్ర పురాణాదులకు సరియగు నిర్వచనమే నీ జీవితము నీ సూక్తులకు అంకితమైనచో సత్యము అనుభవమౌ నీ కృపతో ॥సనాతనా॥ (4) తెలిసీ తెలియని పరిమిత మతితో నిను గ్రహించయించగ నెంచిన   శ్యామ దేవుని  కృప జూపి కరుణతో నడపింపుము నీ కొరకై నిను ప్రేమింపనీయుము ॥సనాతనా॥ (23.12.  ఉ.2.57 గం.కు మాల్కోస్ రాగం)

(203) 21 July (21.07.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Jul అన్ని సాధనలకు ఆరోగ్యకరమైన శరీరము,  ఆరోగ్యకరమైన మనసు అవసరము. For all practices a healthy body and  a healthy mind is necessary.     203) లేరెవరు నీ సాటి నను గావ గల మేటి  (21.07.) లేరెవరు నీ సాటి నను గావ గల మేటి, నా హృదయ మందిర నివాస సాయి,, నీ నోట ప్రతి మాట రతణాల మూటయే నా బోటి వారికది ధీటైన బాటయే మాటిమాటికి నీవు తలపు వచ్చేవయ్యా నాటి నీ నటనతో కట్టి వేసితివయ్యా ll లేరెవరు ll సతము ప్రవహించెడి నీ ప్రేమ వాహిని లో నిలువునా ననుముంచి ఈత నేర్పించినావు దరికి రానీయవు నా దరికి రావు ఎందుకీ చిత్రమగు నటన నా తండ్రి llలేరెవరుll సర్వమును వదిలి నీవెంట రమ్మన్నావు బాధ్యతల భారములు వదల లేనని తెలిసి నాది నీదన్నావు, నడయాడమన్నావు ఇన్నిటిని సృజియించుటేల నా దేవా llలేరెవరుll

(202) 20 July (20.07.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Jul సదా నిరంతర హరిగుణ గావో - నిరంతర భగవన్నామ స్మరణము, చేతనైనంత దానము, సత్సంగము కలియుగమున శ్రేష్ఠములని భాగవతమునందున్నది. ఇష్టమైన నామమును భక్తితో, ప్రీతితో భజియించుటయే మిగిలినవి. సమకూరుటకు మార్గము. Always continuous sing Hari characteristics. Constant remembrance of God, as much as possible donation. True-companionship is the best in Kali Yuga. The rest is to chant the beloved name with devotion and love. Way to get along. 202) నిన్ను వదలి బ్రదుకలేను  (20.07.) నిన్ను వదలి బ్రదుకలేను నిరామయా నిరంజనా నిర్గుణా సనాతనా సాయీ! (1) ఈ కనులకు కనిపించవు -   కలనైనను కనుపించవు ఊహలకే అందవు ఎటులుందు రా ! నేనెటులందురా నిను బాపి ఒంటరిగా ఎటులుందు రా !  ॥నిన్ను॥ (2) నీ నామమునే వింటిని -  నీ చరితమునే చదివితి నీ చిత్తరువును జూచితి -  అయినా ఏదో ఏదో లోలోన వెలితి, వెలితి, వెలితి - అది కనరాని వెలితి  ॥నిన్ను॥ (3) భౌతికమున నిన్నొకపరి ఒకేసారి ఒకసారి చూడనీయుమా - కృప జూపుమా - మాటలాడుమా - మాటలాడుమా - అది చాలు, అది చాలు, అది చాలు, అదే చ...

(201) 19 July (19.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Jul సదా సద్గురునికి దాసునిగా వుండటమే మన కర్తవ్యము. దాసుడే ధన్యుడవుతాడు. ఇది సత్యము. Our duty is to always be a servant of True-Guru. Servent will be blessed. This is the truth. 201) రమణ రమణ రమణ రమణా  (19.07.) రమణ రమణ రమణ రమణా యనరే!  మరణమనిన చింతించె మనసును గనరే! (1) నేనెవరని పరికించెడి మార్గము గనరే! దివ్య మార్గము గనరే! నేను నీవు నశియించెడి భావము గనరే! సద్భావము గనరే!  ॥రమణ॥ (2) ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే!  లోక తీరును గనరే! లోకేశ్వరు సేవించెడి పధమును గనరే! దివ్య పధమును గనరే! ॥రమణ॥ (3) అరిషడ్వర్గములు జేయు వింతల గనరే!  వింత వింతల గనరే!  వింతల నశియుంప జేయు చరణము  గనరే!  రమణు చరణము గనరే! ॥రమణ॥

(200) 18 July (18.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Jul సేవలను అందుకొనుటకు కాక ప్రతి జీవికి ప్రతి దానికి సేవ చేయడానికే మనము ఈ భూమి మీదకు వచ్చామని అందరూ అనుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే బాధకు తావుండదు. There will be no suffering if everyone thinks that we have come on this earth not to receive services but to serve each and every living being. 200) ఏదిరా - నిజమేదిరా!     (18.07.) ఏదిరా - నిజమేదిరా! చివరకు నిలిచేదేమిరా!  అనుమానములను అంతము చేసి అనంతమై మిగిలేదేదిరా! (1) జీవుడు దేవుడు ఒక్కటే యనుచు అద్వైతము బోధించును రా! జీవుడు దేవుడు వేరు వేరనుచు ద్వైతము ఉద్భోదించును రా! ॥ఏదిరా॥ (2) ఉన్నది లేదని, దేవుడు కలడని  అతడే మూలంబని యందురురా! ఉన్నది గలదని, దేవుడు లేడని పిచ్చి భావమది యని యందురు రా! ॥ ఏదిరా ॥ (3) వాక్కుకు మనసుకు అందని స్థితి యది అదియే దైవంబని యందురు రా!  ఊహాజీవుల, సోమరిపోతుల మనోరోగమది యని యందురు రా! ॥ఏదిరా॥ (4) మంచి చెడుగులను బేధ భావములు లేని కాలమే లేదందురు రా! తర్కవాదములతో సత్యము తెలియుట సాధ్యము కాదందురు రా! ॥ఏదిరా॥ (5) విశ్వమె తానై తానే దైవమై నిలచిన జ్...

(199) 17 July (17.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Jul సమర్ధ సద్గురువే పరబ్రహ్మ. త్రికరణశుద్దిగా సద్గురువునకు ఆత్మ సమర్పణ చేసుకొనుటయే సత్యము అనుభవించుటకు మార్గము. Capable True Guru is Demiurge. With Trinity-Purity surrender the soul to the Guru. Its the way to experience the truth. 199) నేను నేననీ నేను నేననీ   (17.07.) నేను నేననీ నేను నేననీ  పలుకుచు నుంటివే శ్యామా (2) నీవెవరో యని  ఒక్కసారైనా  చూచుకొంటివా శ్యామా ॥నేను॥ నీవెవరోయని ఒక్కసారైనా యోచించితివా శ్యామా (1) నాది నాదని నాది నాదని  నీలుగుచు నుంటివే శ్యామా॥నాది॥ నీదేమున్నదో ఒక్కసారైన  యోచించితివా శ్యామా ॥నేను॥ దైవ మటంచును దైవ మటంచును  పలుకుచు నుంటివె శ్యామా దైవలక్షణము నొక్కటియునా తెలుసుకుంటివా  శ్యామా సద్గురు వటంచును  సద్గురు వటంచును వాగుచు నుంటివే   శ్యామా సద్గురు దేవుల తత్వ బోధలు  తెలుసుకుంటివా శ్యామా ॥నేను॥ ధనము ధనమని ధనము ధనమని  దేవులాడెదవే శ్యామా ధనము నీకేమి మేలు చేయునో  చూచుకొంటివా శ్యామా ॥నేను॥ ప్రేమ ప్రేమని ప్రేమ ప్రేమని  పలుకుచు నుందువే శ్యామా ప్రేమ ల...

(198) 16 July (16.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Jul సత్యం చెప్పే వాళ్లు తమ చర్యలను మరీ మరీ సమర్ధించుకోరు. ప్రేక్షకుల వలె చూస్తూ మౌనంగా వుంటారు. Truth tellers do not justify their actions too much. They watch and remain silent like spectators. 198) నీ పాద దూళిగా పడి యుండు  (16.07.) నీ పాద దూళిగా పడి యుండు  భాగ్యమును కలిగించు మా రామ సాయీ నిను జూచి పులకించి మైమరచి  తరియించ కరుణించు మా దేవ సాయి ॥నీ పాద॥  సాయి పాహి దేవా పాహి సాయి దేవా పాహి పాహి  (1) నీ సేవలోనే ఈ జీవితమంతయూ  కరిగి పోనీయు మా సాయీ నీ సేవకుల కెల్ల సేవలను జేయగా దయ జూపు మా దేవ సాయీ (నన్ను తరియుంప జేయుమా సాయి) ॥నీ పాద॥ (2)కామ క్రోధాదులకు కడుదూరమై  నీదు దరి జేర నీయుమా సాయీ నీ దృష్టియే నాకు అన్న పానాదులను  అనుభవం మోసగుమా సాయీ ॥నీ పాద॥ (3) సతతమ్ము నీ నామ స్మరణలో  పులకించ కృప జూపు మా ప్రేమ సాయీ శ్యామాదులకు నామ రూపముల నశియింప జేసి  కృప జూపు మా సాయీ నిను జేరు మార్గమున నడిపించి  శ్యామను తరియింప జేయుమా సాయీ ॥నీ పాద॥

(197) 15 July (15.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Jul Age (అర్హత) వస్తే stage (స్థితి) వస్తుంది. Age రావడం కోసం Sage (గురువు) ని ఆశ్రయించాలి. Age (eligibility) comes, stage (status) comes. Sage (Guru) should be approached for attaining Age. 197) ఏమి చూచుకొని నీకీ పొగరు (15.07.) ఏమి చూచుకొని నీకీ పొగరు వగరు వగరుగా వాగెద వేల పెరిగె పెరిగె గద నీ అహ మెంతో  తిరిగి ఒక్కపరి చూడవదేల ॥ ఏమి ॥ (1) నీ బ్రతుకేమో నీ గతి ఏమో  ఎరుగక నేమో పలికెద వేలా పలుకు నడకలకు పొంతన  ఎంతో తిరిగి నొక్కపరి చూడవ దేలా  ॥ ఏమి ॥ (2) నీ వారనుచును పెరవారనుచును  భేద భావముతో చూచెద వేలా  ఎవరు ఎవ్వరూ ఎవరెవరో  తిరిగి నొక్క పరి చూడవ దేలా ॥ఏమి॥ (3) అందరి తోడను అన్ని విషయముల తెలిసి తెలియకనే కూసెద వేలా కూతకు ఫలితము ఏమే తయనుచు  తిరిగి నొక్క పరి చూడవ దేలా ॥ఏమి॥  (4) పొగడిన పొంగుచు తెగడిన గ్రుంకుచు  స్థితులకు లొంగుచు వంగెద వేలా వగచి వగచి నీ వాడు మాటలను తిరిగి నొక్క పరి చూడవ దేలా  ఓరి శ్యామా నొక్క పరి చూడవదేలా ॥ఏమి॥

(196) 14 July (14.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Jul మనశ్శాంతి, నిస్సంగముగా జీవిస్తూ చివరకు ముక్తిని పొందడానికి దేవుడు మనకు బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ప్రకృతి ధర్మములను అధ్యయనం చేస్తూ గురు సహాయముతో భావి జీవిత పథకాన్ని రూపొందించుకోవాలి. To finally attain salvation, Living with Peace of mind, without association, God has given us intellect. With that use intellect , by studying nature's virtues, with the help of Guru formulate a future life plan.  196) నవరత్నముల వంటి నవవిధ భక్తులు (14.07.) నవరత్నముల వంటి నవవిధ భక్తులు  నా గురుని పాదాల ధూళి రజము  నా గురుని సేవలో నేను తరించిన  నాకేమీ కావలెను ఈ జగతిలో ll నవరత్న ll 1.సాయియన్నను వాడే, సర్వేశ్వరుడు వాడే  శ్యామయన్నను వాడే, శక్తి రూపుడు వాడే. 2.రాముడన్నను వాడే, రక్షించు నతడే, వాని దాసునకేల కలుగు చెడుగు శరణాగతిని చేసి గురుని నెరనమ్మిన  వాని మార్గములోన వాడే నడిపించు ll నవరత్న ll 3. తనను తన బరువులను తానే భరించును తానే కాపాడుచు తరింపచేయును  నను నమ్మిన వారే నా వారాలని బల్కి  నయముగా నేర్పుగా నడక నే...

(195) 13 July (13.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Jul గురువునకు నిజంగా సంపూర్ణ శరణాగతి చేసుకున్న వ్యక్తికి చింతలు, కోరికలు, విచారములు ఉండనేరవు. అతనికి తన గురు సంకల్పమే తప్ప తన సంకల్పమంటూ ఉండదు. A truly complete surrender to the Guru has no worries, desires and sorrows. He has only Guru's will, but not his will.  195) నిన్నెరుగ నా తరమా నీలమేఘశ్యామా (13.07.) నిన్నెరుగ నా తరమా నీలమేఘశ్యామా ప్రేమావతార శ్రీ సద్గురు సాయిరామా  ॥నిన్నెరుగ॥ (1) శుక శౌనక వ్యాసాదులు పడిగాపులు గాచుచుండ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బహువిధముల బొగడుచుండ క్షణక్షణమున అణువణువున నీ శక్తియే నిండియుండ సకల విశ్వమంత నీదు దయతోడనే సాగుచుండ  ॥నిన్నెరుగ॥ (2) ఏ పేరున పిలచి పిలచి నిన్ను పూజ చేసుకుందు ఏ రూపముగా తలచి నిరతము ధ్యానించు చుందు నాదని ఏమున్నదనుచు నివేదనల చేయుచుందు  ఏమి నేరుగ లేని బ్రతుకు ఎటుల లాగించు చుందు ॥నిన్నెరుగ॥ (3) అంతట నీవున్నావని ఎందరి నోటనో వింటిని  అందరినీ బ్రొచుచుండు ఆప్తుడ వీవని వింటిని  నాదేమి కర్మము నాకు తెలియ లేదాయె  అణువణువున నీ దివ్య దరిశనమే కలుగదాయె ॥నిన్నెరుగ॥ (4) నన్ను భువి...

(194) 12 July (12.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Jul మహాత్ముల మాట శిలాశాసనము. మానవుల మాట నీటి మాట. మనలను (మన సంస్కారములను గురించి) మనమే చూసుకోవాలి. పుస్తకములు, ఉపన్యాసములు, చర్చలు - అవగాహన, ఆచరణలు లేనప్పుడు నిరుపయోగములు. పైగా గర్వమును, అహంకారమును పెంచుతాయి. The words of the greats are epitaphs. The word of man is the word of water. We have to look after ourselves (about our rituals). Books, lectures, discussions are useless In the absence of awareness and practice. Moreover, it increases pride and arrogance.                 194) ఇది కల కాదు కల్లా కానే కాదు (12.07.) ఇది కల కాదు కల్లా కానే కాదు ఇది ఆనంద నిలయము కరుణాలయము ఇది భావాలకు అందని బ్రహ్మానంద నిలయము ఇది గురుదేవుల శ్యామచరణ హృదయాలయము ఇది మా అందరి పాలిట ప్రేమాలయము దివ్య ప్రేమాలయము కరుణాలయము మన కరుణాలయము సాయి కరుణాలయము 1. సతమతమౌ నటుల చేయు పిచ్చియోచనలతో వికలము కలిగింపజేయు వ్యర్థ కలాపాలతో తరిగిపోవు నా జీవిత పరిమాణపు సమయాన తరియించగ తపియించుచు నీదరి చేరినదానా బాల ననుచు బేలననుచు జాగుచేయ తగునా..తగున...

(193) 11 July (11.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Jul ఒకరిని నమ్ముకుంటే వమ్ముకాదు మన బ్రతుకు. ఒకరిని వదిలి మరొకరిని, ఇలా మార్చుకుంటూ అందరితో సంబంధాలు ఉంచుకుంటే, చేయవలసినదేదో తెలియదు, చేయరానిదీ తెలియదు. చివరకు మనలోని బలహీనమైన సంస్కారములు దైవము ఉన్నాడా అనే సంశయ దశకు కూడా తీసుకువెళ్తాయి. శాంతి, ఆనందములు నశించి అశాంతి, దుఃఖములతో మనమే కాకుండా మన కుటుంబము కూడా అధోగతి చెందుతుంది. If we trust one, it will not break our life. If leaving one for the other, changing like this  in touch with everyone, you don't know what to do and what not to do. Finally, our weak rituals lead us to the stage of doubting the existence of God. Peace and happiness perish and with unpleasantness, grief will degrade not only us, but also our family.                 193) అరుదెంచె అరుదెంచె (11.07.) అరుదెంచె అరుదెంచె అరుదెంచె నదిగో అరుదెంచె ప్రభు క్రీస్తు నాథుండ దిగదిగో పరమ ప్రేమను పెంచి పాపాత్ములనుద్ధరించి   లోకములానందమయము గావింపగ ॥అరుదెంచె॥  (1) దుచింతన పెరిగి ...

(192) 10 July (10.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Jul సందేశాలను చదవడం వలన, ఆలోచించడం వలన కొంతవరకైనా మీ దుష్ట సంస్కారములకు కళ్లెం పడింది. లేకుంటే అందరికన్నా మీరే ముందుగా ప్రలోభాలకు లొంగేవారేమో! అందుకే అన్నారు, "శ్రీ గురుదేవుల సన్నిధి ఆనందమునకు, శాంతికి పెన్నిధులని.” By Reading the messages and thinking about it has broken some of your bad habits. Otherwise, you would be the first to succumb to temptation! That is why some said, "Sri Gurudev presence is close to happiness and peace."     192) ఏసు నాధుడే ప్రేమకు రూపము (10.07.) ఏసు నాధుడే ప్రేమకు రూపము ప్రేమ రూపమే దైవ భావము ప్రభు ఏసు నాధుడే ప్రేమకు రూపము (1) అరాచకము ప్రబలిపోయి- అన్యాయము పెరిగిపోయి అవినీతికి ఆలవాలమై థూర్తులు మెలగు చుండ ధర్మ న్యాయములను నిలుప అవతరించినట్టి ॥ఏసు॥ (2) సాధుజనుల సౌభాగ్యము -వంచకులే దోచుకొనగ అసత్య మద మత్సరములు ఆర్తులనే హింసించగ లోక కళ్యాణమునకు దయతోడ - వెలిసినట్టి ॥ఏసు॥ (3) అహింసయే ఖడ్గముగ- ఆలనయే పాలనగ  ప్రేమయే పరివారముగ- శాంతియే కవచముగ మౌనముగ మూర్ఖులతో- పోరు సలిపి గెలిచినట్టి ॥ఏసు॥ (4) జాతులు మతమ...

(191) 9 July (09.07.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Jul దిగులు, గుబులును కలిగించి చిత్త చాంచల్యమును పెంచి, నేను కర్తననే భావనను పటిష్టం చేస్తుంది. "నేను" అనే భావన ఉన్నంత వరకు ఆయన ఉన్నాడనే ధైర్యము కలుగదు. Anxiety and confusion causes increase of restlessness in the mind and strengthens the "I" sense in the doer. As long as there is a sense of "I", there is no courage that He exists.   191) ఏసునాధుని స్మరణ జేయండి (09.07.) ఏసునాధుని స్మరణ జేయండి - ఓమాన్యులారా!  ప్రేమ మమతల పంచి పెంచండి  ॥ఏసు॥ (1) తప్పిదములను చేయ బోకండి మీ తోటి ప్రాణుల ఆదరంబున చేరదీయండి పాప చింతన లెల్ల వదిలి జీవకోటికి సేవ జేయుచు సహన విశ్వాసముల తోడను సత్య సంధత వదల వలదను ॥ ఏసు ॥ (2) పరుల దోసగును ఎన్న బోకండి పదిమందిలో మీ గొప్పదనముల చాట బోకండి పర మతమ్ముల గౌరవించుచు ప్రార్థనల అంగీకరించుచు పలు రకముల మతములన్నియు ప్రభుని చెంతకు జేరుననెడి ॥ ఏసు ॥ (3) తర్కవాదము జేయ బోకండి పరమాత్మ తత్వము తర్కములతో దెలియ లేరండి అనుభవమున తెలుసుకోవలె ఆనందము నందవలెనని దైవ కరుణయే దెలుప గలదని నుడివిన శ్రీ శ్యామ నాథుడు  ॥ ఏసు ॥

(190) 8 July (08.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Jul బాహ్య ఆడంబరములు లోకుల కొరకే గాని మరి ఎందుకూ కొరగావు. నిరాడంబరమగు అంతఃకరణమునందుండి, పెల్లుబికే ప్రేమతో పిలిచే పిలుపునకే శ్రీగురుడు ప్రసన్నుడవుతాడు. External ostentatiousness is only for the sake of the society, And why did you ask? From inwardness, calling with exploding love will make Sriguru pleasent.   190) ప్రేమనాథుడగు ఏసునాధునకు (08.07.) ప్రేమనాథుడగు ఏసునాధునకు హారతి నీయగ రారమ్మా- హారతి నీయగ రారమ్మా! ॥ ప్రేమ ॥ పశువుల పాకలో ప్రభవించిన పరిశుద్ధాత్మల మన్నన పొందిన ॥ ప్రేమ ॥ పతిత మానవుల సముథ రించిన ప్రాణి కోటినే పరిరక్షించిన ॥ ప్రేమ ॥ సత్య ధర్మముల సంరక్షించిన ప్రేమ నందరికి మెండుగ బెంచిన ॥ ప్రేమ ॥ చేయని తప్పుకు వేసిన శిక్షను సహనముతో భరియించి నిలచిన ॥ ప్రేమ ॥ శిలువ నెక్కినను చిదానందముతో బ్రహ్మానందము నందర కోసగిన ॥ప్రేమ॥ సమర్థ సద్గురు దైవ రూపమై శ్యామ హృదయమును పరిపాలించడి ॥ ప్రేమ ॥

(189) 7 July (07.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Jul నీవు నమ్మినది నీకు ఎప్పుడూ మంచినే చెబుతుంది. కావున మరేమీ ఆలోచించక విశ్వాసముతో, ధైర్యముగా, ఓర్పుతో ఆచరించు. సన్మార్గుడవై సంచరించు, తరిస్తావు. గురువు యొక్క శరీరాన్ని గానీ, అలవాట్లను పట్టించుకోకు. ఆయన అందించే సందేశాన్ని పొరపాటు లేకుండా ఆచరించు. అదే ఆనందానికి శాంతికి మార్గము. What you believe is always good for you. So don't think about anything else and practice with faith, courage and patience. Wander along the right path and you will prosper. Don't care about the Guru's body or habits. Practice his message without fail. That is the path to happiness and peace. 189) ప్రభో ఏసునాధా..... పరాకేలనయ్యా (07.07.) ప్రభో ఏసునాధా. .... పరాకేలనయ్యా దయను జూపి మమ్ము... దరికి జేర్చవయ్యా ॥ప్రభో॥ (1) నిన్నెరుగ లేక నింద మోపినారు నిజము నెరిగి నంత నిట్టూర్చినారు నీ ప్రేమయే దైవమై దారి జూపే  ॥ ప్రభో॥ (2)  జీవకోటి నెల్ల చేర దీసినావు పతిత మానవాళి నుద్ద రించినావు నీ ప్రేమయే జ్యోతియై దారి జూపే కృష్ణ రాము లీవే - క్రీస్తు మౌలా లీవే శ్యామ సాయి వీవే...

(188) 6 July (06.07.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Jul శ్రీ గురుని నీ వానిగా భావించి నీ సర్వస్వమును అర్పించి, ప్రేమ, భక్తులతో ఆరాధించు. నీకు సకలము సిద్ధించును. Consider the Sri Guru as your own, offer your all things, and worship with love and devotion. Everything will prepare for you. 188) కనుల కెదురుగ లేక కదలి పోయిన గాని (06.07.) కనుల కెదురుగ లేక కదలి పోయిన గాని కలకాల మెదలోన కదలు చూనుందువు నిష్ట సబూరులకు నీవు ప్రతిరూపమై ఘనత కెక్కితివమ్మ చంద్ర కళావతి సతతంబు సాయిశు నామమును స్మరియించి గురుదేవునే మనసులో నిలుపుకున్నావు గురుదేవ గురుదేవ గురుదేవ అనుచునే గురునాథు హృదిజేరి పవళించినావు ॥కనుల॥ (2) గురు సేవలను జేయ పరితపించితి వీవు గురుని సేవల నేడు అందుకొను చున్నావు బాబాను ధ్యానించి భజియించినావు బాబా సన్నిధిలోన నివసించు చున్నావు ॥కనుల॥ (3) జోహారు నీకిదే నా చిట్టి తల్లి జేజేలు నీకివే బంగారు తల్లి జయము జయము చంద్ర సాయి కళావతి అందు కొనవే గురుని ఆశీస్సులమ్మ ॥కనుల॥

(187) 5 July (05.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Jul సదా పరులకు ఉపకారము చేయుచుండు వారికి భగవంతుని కృప సులభ సాధ్యము. దురాశ, అత్యాశ, పేరాశ ఇవి దుఃఖ సముద్రమున ముంచును. కలియుగమున సత్యముగానుండుట సకల శుభములను కలిగించును.  Those who always do good to others, for them God's grace is easy. Greed, covetousness, avarice drown us in the ocean of sorrow. In Kali Yuga, being truthful brings all good things. 187) ఏ నక్షత్రము నందు జనించిన నేమి (05.07.) ఏ నక్షత్రము నందు జనించిన నేమి ? గ్రహగతు లేయే తీరుల నుండిన నేమి ? సద్గురు సాయీ సత్కృప కలిగిన సకలము సంతస భరితము గాదా ॥ఏ నక్షత్రము॥ (1) గ్రహము లన్నియు సాయి నాధుని ఆజ్ఞల కఅనుగుణముగ చెరియింపగ జప తప శాంతుల యోచన లేల సద్గురు సాయిని కొలిచెడి వేళ ॥ఏ నక్షత్రము॥ (2) శక్తి స్వరూపము శాంత స్వభావము ధర్మ స్వరూపము దయా సముద్రము బాబా రూపము బ్రహ్మానందము శ్యామాదులకు అది సర్వస్వము ॥ఏ నక్షత్రము॥

(186) 4 July (04.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Jul మనము గతంలో ఉన్నట్లు ఇప్పుడులేము. ఇప్పుడున్నట్లు ముందు ముందు ఉండబోము. కనుక వర్తమానాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. We are not what we used to be in past. We will not be as we are now. So by carefully focusing present we should perform our duty. 186) ఏమి చేసితి ననుచు వెనుకేసు కొస్తావు (04.07.) ఏమి చేసితి ననుచు వెనుకేసు కొస్తావు వెర్రి తండ్రీ ప్రేమ సాయి- ఏనాటి కైనా నీ తనయునిగ నిలబడే  స్థితి నందు కోగలనా సాయి  ॥ ఏమి ॥ (1) అడుగడుగునా  నన్నాదుకొను చున్నావు ఆపదల పాల్పడక సాయీ విశ్వాస శూన్యుడౌ అవివేకి నేననుచు  అణు మాత్ర మెంచకను సాయి ॥ఏమి॥ (2) తప్పులను జేసినను తప్పించి గాచెదవు  హెచ్చరించుచు కరుణ సాయీ  నిన్ను ప్రేమించనీ నిర్భాగ్యుడని యైన  పరిగణించక దేవ సాయి ॥ఏమి॥ (3) నీ మాటలను వినక నిందలను దెచ్చుకున నింద తొలగింతువే సాయీ నీ యందు అనురక్తి భక్తి శ్రద్ధలు లేని వాడనుచు నెంచకను సాయి ॥ఏమి॥ (4) నేను నాదంతయు నీ స్వంతమే గదా  సచ్చిదా నంద సాయీ  నాది నాదని దలచి నీ కీయ నెంచని  నిండు స్వార...

(185) 3 July (03.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Jul మోసేవాడు ఉండగా మనకెందుకు భయము, దిగులు? మనము ఏమిచేయాలో ఆయనే మన చేత చేయిస్తాడు. మనము చెయ్యవలసినదల్లా అన్నీ ఆయనకు నివేదించుకోవడమే. Why do we fear and worry when there is a bearer? what we want to do, he will makes us to do. All we have to do is Submitting everything to Him. 185) పాహి పాహి హే పరమేశ్వర శివ (03.07.) పాహి పాహి హే పరమేశ్వర శివ  శంకరి లలితే చిద్విలాసినే Il పాహి॥ (1) అంబా భవానీ ఆదిశక్తి -  ఆర్థత్రాణ పరాయిణి గౌరీ భార్గవీ భద్రే బంధ విమోచనీ -  భగవతీ హే భ్రమరాంబ స్వరూపిణీ ॥పాహి॥ (2) బాలా త్రిపుర సుందరి మాతా -  భాగ్య ప్రదాయని విశ్వవినోదిని దుఃఖ వినాశిని ముక్తి ప్రదాయని -  సాయి స్వరూపిణి సద్గతి దాయని ॥పాహి॥

(184) 2 July (02.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 2 Jul మానవుడికి తనమీద తనకు ఎప్పటికీ అహంకారంతో కూడిన విశ్వాసం ఉండకూడదు. తన మీద తాను ఆధారపడకూడదు. ఎప్పుడు భగవంతుని మీద ఆధారపడి ఉండాలి. తాను నడవగలను, తాను ఊపిరి పీల్చుకోగలను, తాను చేయగలను అని తన మీద తనకు విశ్వాసం ఉన్నంత వరకు భగవంతుడు ఏమీ చేయడు. తానేమీ చేయలేనని, ఏమైనా చేయగల శక్తి భగవంతునికిగలదు అని అనుభవంతో తెలుసుకున్నప్పుడే, భగవంతునిపై విశ్వాసం కలిగినప్పుడే, ఆయన మీద ఆధార పడినప్పుడే ఆయన అన్ని చేస్తాడు. Man should never have an arrogant confidence in himself. Don't rely on yourself. Always depend on God.  God will do nothing when he has belief in himself that he can walk, he can breathe, he can do.. with experience when he know that he can do nothing, then God has the power to do anything. Rely on Him, he does everything for you. 184) బాలా త్రిపుర సుందరి మాతా (02.07.) బాలా త్రిపుర సుందరి మాతా రాజ రాజేశ్వరీ మాతా శివే ॥బాలా॥ (1) భగవతి భవానీ శంకరి దుర్గా భక్తవ శంకరి శ్రీలలితా శంభు మనోహరి నాద ప్రియాంకరి  ప్రేమ శుభంకరి సాంబశివే ॥బాలా...

(183) 1 July (01.07.)

Image
  శ్రీ శారాదా శ్యామ సందేశం: 1 Jul నీళ్లలో నావ ఉండాలి కానీ నావలో నీరు ఉండకూడదు అని అంటారు. అంటే దానర్థం, సంసారంలో నీవు ఉండాలి కానీ నీలో సంసారం ఉండకూడదు అని . తామరాకుపై నీటి బొట్టువలె ఉండు అంటారు. అంటే తామరాకుపై నీరు ఉన్నప్పటికీ ఆ నీరు తామరాకును ఎట్లా అంటుకోదో ఆ విధంగా ఈ సంసారంలో ఉండాలి . It is said that there should be a boat in the water but there should be no water in the boat. It means that you should be in all things but no things should be in you. It is called like a drop of water on a lotus. That is, even though there is water on the lotus, that water doesn't stick to it, like that you need to be life with all things (Samsara). 183) హర హర శంకర భక్తవ శంకర గౌరి  (01.07.) హర హర శంకర భక్తవ శంకర గౌరి ప్రియంకర పాహి హరే హరి హరి శ్రీ హరి కేశవ నరహరి మాధవ శౌరి ముకుంద హరే  శివ శివ శంకరి శంభు మనోహరి ప్రేమవశంకరి మాత శివే జయ జయహో శ్రీ రామ, కృష్ణ, శివ, దత్త మారుతీ సాయి ప్రభో (1) నీ లీలల విని నీ మహిమల విని నీ కథలను వినగలిగినచో  నీ పద భక్తి అలౌకిక యుక్తి మహత...