(188) 6 July (06.07.)

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Jul

శ్రీ గురుని నీ వానిగా భావించి నీ సర్వస్వమును అర్పించి, ప్రేమ, భక్తులతో ఆరాధించు. నీకు సకలము సిద్ధించును.
Consider the Sri Guru as your own, offer your all things, and worship with love and devotion. Everything will prepare for you.


188) కనుల కెదురుగ లేక కదలి పోయిన గాని (06.07.)

కనుల కెదురుగ లేక కదలి పోయిన గాని
కలకాల మెదలోన కదలు చూనుందువు
నిష్ట సబూరులకు నీవు ప్రతిరూపమై
ఘనత కెక్కితివమ్మ చంద్ర కళావతి

సతతంబు సాయిశు నామమును స్మరియించి
గురుదేవునే మనసులో నిలుపుకున్నావు
గురుదేవ గురుదేవ గురుదేవ అనుచునే
గురునాథు హృదిజేరి పవళించినావు ॥కనుల॥

(2) గురు సేవలను జేయ పరితపించితి వీవు
గురుని సేవల నేడు అందుకొను చున్నావు
బాబాను ధ్యానించి భజియించినావు
బాబా సన్నిధిలోన నివసించు చున్నావు ॥కనుల॥

(3) జోహారు నీకిదే నా చిట్టి తల్లి
జేజేలు నీకివే బంగారు తల్లి
జయము జయము చంద్ర సాయి కళావతి
అందు కొనవే గురుని ఆశీస్సులమ్మ ॥కనుల॥


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)