(209) 27 July (27.07.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 27 Jul
మతం అంటే దైవ యెడ,
మానవుని యెడ ప్రేమ తప్ప మరేమీ కాదు. జీవితం అశాశ్వతం, కానీ బుద్ధిహీనులు
దాన్ని సత్యమని యెంచి దానిలో చిక్కుకొని పోతారు.
Religion
is nothing but love for God and Human. Life is impermanent, but the
unintelligent thinks it is true and get caught up in it.
209) సాయి స్వరూపా - శ్యామాచరణా (27.07.)
సాయి స్వరూపా - శ్యామాచరణా
చల్లగ చూడుము - ఓ దేవా
కరుణాలయ వాసా - శ్యామా
మము బ్రోవగ రావా - దేవా ॥సాయీ॥
(1) నిరతము నిన్నే భజియుంతుమయా
సతతము మమ్ము మరవకుమా
ఎల్లవేళలా మమ్ము బ్రోవుమా
శాంతి స్వరూపా - శ్యామా చరణా ॥సాయీ॥
(2) కరుణ చిలుకు నీ చల్లని చూపులే
నిరతము మా మది దోచునయా
ప్రేమతో చూచి వేగమే బ్రోవుమా
శారద రమణా శ్యామా చరణా ॥సాయీ॥
(3) చూపులేని దీనురాలికి
చూపు నొసగి కరుణించి,
కాపాడి, రక్షించి నావు
చల్లని తండ్రీ శ్యామా చరణా
చల్లని తండ్రీ శారద రమణా ॥సాయీ॥
Comments
Post a Comment