(206) 24 July (24.07.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 24 Jul
ధనం సంపాదించవచ్చు.
వస్తువులు కొనవచ్చు. కాని తల్లిదండ్రులను, సత్పురుషులను కొనలేము. వారి
సలహాలు చీకట్లో దీపాల వంటివి. తెలివిగా నిర్ణయం తీసుకో.
Money
can be earned. Things can be bought. But parents and True-men cannot be
bought. Their advices are like lamps in the dark. Make a wise
decision.
206) పాహి పాహి యనుచు (24.07.)
పాహి పాహి యనుచు
నీదు వెంట నేను బడుదు ననుచు
పారిపోవ నుంటివా సాయీ
దేహి దేహి యనుచు
నిన్ను కోరికలతో దేబరించ
రాలేదు లే నేను సాయీ ॥పాహి॥
(1) కామ క్రోధ లోభ మోహ
మద మత్సరముల వలలో
చిక్కి నిన్ను వేధింతున సాయీ
నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించ
లేననుచు భయమొందితి సాయీ ॥పాహి॥
(2) ఎంతటి కష్టములనైన భరియించెడి
శక్తి నొసగి కృప జూపి బ్రోవుమా సాయీ
అంతట నీవే నిండి యున్నావను సత్యమును
శ్యామదేవులకు దయసేయుమా సాయీ ॥పాహి॥
నీదు వెంట నేను బడుదు ననుచు
పారిపోవ నుంటివా సాయీ
దేహి దేహి యనుచు
నిన్ను కోరికలతో దేబరించ
రాలేదు లే నేను సాయీ ॥పాహి॥
(1) కామ క్రోధ లోభ మోహ
మద మత్సరముల వలలో
చిక్కి నిన్ను వేధింతున సాయీ
నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించ
లేననుచు భయమొందితి సాయీ ॥పాహి॥
(2) ఎంతటి కష్టములనైన భరియించెడి
శక్తి నొసగి కృప జూపి బ్రోవుమా సాయీ
అంతట నీవే నిండి యున్నావను సత్యమును
శ్యామదేవులకు దయసేయుమా సాయీ ॥పాహి॥
(06.01.1986 సోమవారము రాత్రి 9:50 గం.కు)
Comments
Post a Comment