(197) 15 July (15.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Jul
Age (అర్హత) వస్తే stage (స్థితి) వస్తుంది. Age రావడం కోసం Sage (గురువు) ని ఆశ్రయించాలి.
Age (eligibility) comes, stage (status) comes. Sage (Guru) should be approached for attaining Age.
197) ఏమి చూచుకొని నీకీ పొగరు (15.07.)
ఏమి చూచుకొని నీకీ పొగరు
వగరు వగరుగా వాగెద వేల
పెరిగె పెరిగె గద నీ అహ మెంతో
తిరిగి ఒక్కపరి చూడవదేల ॥ ఏమి ॥
(1) నీ బ్రతుకేమో నీ గతి ఏమో
ఎరుగక నేమో పలికెద వేలా
పలుకు నడకలకు పొంతన
ఎంతో తిరిగి నొక్కపరి చూడవ దేలా ॥ ఏమి ॥
(2) నీ వారనుచును పెరవారనుచును
భేద భావముతో చూచెద వేలా
ఎవరు ఎవ్వరూ ఎవరెవరో
తిరిగి నొక్క పరి చూడవ దేలా ॥ఏమి॥
(3) అందరి తోడను అన్ని విషయముల
తెలిసి తెలియకనే కూసెద వేలా
కూతకు ఫలితము ఏమే తయనుచు
తిరిగి నొక్క పరి చూడవ దేలా ॥ఏమి॥
(4) పొగడిన పొంగుచు తెగడిన గ్రుంకుచు
స్థితులకు లొంగుచు వంగెద వేలా
వగచి వగచి నీ వాడు మాటలను
తిరిగి నొక్క పరి చూడవ దేలా
ఓరి శ్యామా నొక్క పరి చూడవదేలా ॥ఏమి॥
Comments
Post a Comment