(191) 9 July (09.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Jul
దిగులు, గుబులును
కలిగించి చిత్త చాంచల్యమును పెంచి, నేను కర్తననే భావనను పటిష్టం చేస్తుంది.
"నేను" అనే భావన ఉన్నంత వరకు ఆయన ఉన్నాడనే ధైర్యము కలుగదు.
Anxiety
and confusion causes increase of restlessness in the mind and
strengthens the "I" sense in the doer. As long as there is a sense of
"I", there is no courage that He exists.
191) ఏసునాధుని స్మరణ జేయండి (09.07.)
ఏసునాధుని స్మరణ జేయండి - ఓమాన్యులారా!
ప్రేమ మమతల పంచి పెంచండి ॥ఏసు॥
(1) తప్పిదములను చేయ బోకండి
మీ తోటి ప్రాణుల ఆదరంబున చేరదీయండి పాప చింతన లెల్ల వదిలి జీవకోటికి సేవ జేయుచు సహన విశ్వాసముల తోడను సత్య సంధత వదల వలదను
॥ ఏసు ॥
(2) పరుల దోసగును ఎన్న బోకండి
పదిమందిలో మీ గొప్పదనముల చాట బోకండి
పర మతమ్ముల గౌరవించుచు ప్రార్థనల అంగీకరించుచు
పలు రకముల మతములన్నియు ప్రభుని చెంతకు జేరుననెడి ॥ ఏసు ॥
(3) తర్కవాదము జేయ బోకండి
పరమాత్మ తత్వము తర్కములతో దెలియ లేరండి అనుభవమున తెలుసుకోవలె ఆనందము నందవలెనని
దైవ కరుణయే దెలుప గలదని నుడివిన శ్రీ శ్యామ నాథుడు ॥ ఏసు ॥
Comments
Post a Comment