(200) 18 July (18.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Jul
సేవలను అందుకొనుటకు
కాక ప్రతి జీవికి ప్రతి దానికి సేవ చేయడానికే మనము ఈ భూమి మీదకు వచ్చామని
అందరూ అనుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే బాధకు తావుండదు.
There
will be no suffering if everyone thinks that we have come on this earth
not to receive services but to serve each and every living being.
200) ఏదిరా - నిజమేదిరా! (18.07.)
ఏదిరా - నిజమేదిరా! చివరకు నిలిచేదేమిరా!
అనుమానములను అంతము చేసి అనంతమై మిగిలేదేదిరా!
(1) జీవుడు దేవుడు ఒక్కటే యనుచు అద్వైతము బోధించును రా!
జీవుడు దేవుడు వేరు వేరనుచు ద్వైతము ఉద్భోదించును రా! ॥ఏదిరా॥
(2) ఉన్నది లేదని, దేవుడు కలడని
అతడే మూలంబని యందురురా!
ఉన్నది గలదని, దేవుడు లేడని
పిచ్చి భావమది యని యందురు రా! ॥ ఏదిరా ॥
(3) వాక్కుకు మనసుకు అందని స్థితి
యది అదియే దైవంబని యందురు రా!
ఊహాజీవుల, సోమరిపోతుల మనోరోగమది యని యందురు రా! ॥ఏదిరా॥
(4) మంచి చెడుగులను బేధ భావములు
లేని కాలమే లేదందురు రా!
తర్కవాదములతో సత్యము తెలియుట సాధ్యము కాదందురు రా! ॥ఏదిరా॥
(5) విశ్వమె తానై తానే దైవమై నిలచిన జ్ఞానిని చదువ మందురు రా!
అటు చదువకనే అహమని బలికిన అవివేకంబివి యని యందురు రా! ॥ఏదిరా॥
శ్యామనాథుడగు సాయినాధుడే
అట్టి దైవమని అందురు రా!
సాయిని ప్రేమతో సమాశ్రయించిన
సత్యము అనుభవమగు నందురు రా! ॥ఏదిరా॥
Comments
Post a Comment