Posts

Showing posts from August, 2022

(244) 31 August (31.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 31 Aug జాగ్రత్త! జాగ్రత్త! నీ కర్మలే వెనుతిరిగి నీ నెత్తినే పడతాయి.  నీవు చేసిన కర్మల ఫలితములనే నీవు అనుభవించక తప్పదు. Beware! Beware! Your deeds will backfire on you.   You must experience the results of your deeds.

(243) 30 August (30.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 30 Aug ఆలస్యంగా లభించిన ఫలితములు దైవము యొక్క దయవలననే కదా! దీని అర్థము దైవము నీ ప్రార్ధనలను తిరస్కరించినాడని కాదు కదా! తొందరను ఓరిమితో అధిగమించు. ఓరిమియే విజ్ఞ. విజ్ఞులు మాటలతో గాక ఆచరణతో బోధిస్తారు. అంటే వారి బోధలు సజీవ దృష్టాంతాలుగా ఉంటాయి. The late results are due to the grace of God! This does not mean that God has rejected your prayers! Overcome haste with patience. The patience is wisdom. Wise one's teach not by words but by deeds. That is, their teachings are living examples.

(242) 29 August (29.08.)

Image
శ్రీ శారాద శ్యామ సందేశం: 29 Aug తనకు నచ్చింది చేయడం కాక, తన కర్తవ్య కర్మను ఇష్టముతో చేయడమే ఆనందముననుభవించుటలో గల రహస్యం. The secret of happiness is not doing what one likes, but doing one's duty with love.

(241) 28 August (28.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 28 Aug బ్రతికేందుకు ప్రార్థించు. విద్యనేర్చుకొనుటకు, బ్రతుకు ఇచ్చుటకై నేర్చుకో. ఇచ్చేది దైవానికివ్వు. దైవం పదింతలు నీకు తిరిగి ఇస్తాడు. కాలం విలువైనది. దాతృత్వము లేదా త్యాగము మరింత విలువైనది. త్యాగమే దైవము, దైవమే ప్రేమ, ప్రేమే విశ్వం. నీవు విశ్వం యొక్క అంశమే. కనుక ఉదారంగా దానం చేయగల అలవాటు చేసుకో. ఇతరులకిచ్చేది నీకు ఇచ్చుకున్నట్లే అవుతుంది. Pray for Life, to learn education, learn to give life. Give to God. God will repay you tenfold. Time is precious. Charity or sacrifice is more valuable. Sacrifice is God, God is love, love is the universe. You are an element of the universe. So make it a habit to donate generously. What is given to others is what is given to you. 241) కనరావా, కనరావా కరుణానిధే శ్రీ రమణా (28.08.) కానడ రాగం కనరావా, కనరావా కరుణానిధే శ్రీ రమణా కనిపించి ఒకసారి కృప జూపుమా 1.నేను నాదను భావము కలిగిన వాడను నేను లేని నిను ఎటుల కనుగొందు నీ కృప లేక నను నడిపించెడి నీ మార్గములో ఎటు పయనింతురా ll కనరావా ll 2.నీ మార్గము బహు స...

(240) 27 August (27.08.)

Image
  శ్రీ శారాద శ్యామ సందేశం: 27 Aug నిలకడైన శ్రమ లేకుండా సంపద లేదు. సంపద లేకుండా శౌర్యం, శౌర్యం లేకుండా విజయం లేదు. దయ లేకుండా కీర్తి లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా పరమానందం లేదు. Without constant hard work there is no wealth. There is no valor without wealth, no victory without valor. There is no glory without grace. Without spiritual knowledge there is no bliss. 240) మేలుకో మేలుకో …. (27.08.) ఉదయరాగం మేలుకో మేలుకో .... నాలోన నిండి యున్న ప్రాణదేవా,  గురుదేవా, శ్రీ రామకృష్ణ మేలుకో ఓం నమో భగవతే రామకృష్ణాయ  కరుణాకరా ప్రభో శ్రీకరా  (పునరావృతం ) గురుదేవ, గురుదేవ, గురుదేవ, శ్రీరామకృష్ణా (పునరావృతం) కరుణాకరా......... గురుదేవా......... మావలె పుట్టితివి, మావలె పెరిగితివి మాకంటే భిన్నమగు సాధనలు జేసితివి (పునరావృతం) పసిడి మనసును కలిగి మనుజులను గాచితివి పసిడి మనసును కలిగి పతితులను గాచితివి పరమాత్మ రూపిగా స్థిరముగా నిలిచితివి పరమాత్మ రూపిగా స్థిరముగా నిలిచితివి పరమాత్మ రూపివై భువిలో నిలచితివి కరుణాకరా......... గురుదేవా.......... 1.శారదా మాతను పెండ్లి యాడి నిజమగ...

(239) 26 August (26.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 26 Aug అత్యల్పమైన దానిని ఆనందంగా అనుభవించగలిగితే దేనినైననూ సులభముగా అనుభవించవచ్చును. If you can experience the least with joy, you can easily experience anything. 239) రామకృష్ణ గురుదేవా శరణం (26.08.) మాల్కోస్ రాగం మధ్యమావతి రాగం రామకృష్ణ గురుదేవా శరణం శారదా దేవి మాతా శరణం  శ్రీ గురుదేవ రామకృష్ణ పాహిమామ్ రక్షమామ్ శారదనాథ రామకృష్ణ పాహిమామ్ రక్షమామ్ 1.పొట్టకూటి చదువును వదలి తరించు మార్గము నందున తరలి జప తప సాధన లెన్నో చేసి విశ్వరూపిగా మా మది నిలిచిన  ll శ్రీ గురుదేవ ll 2.నేనను భావన లేనివాడవై అమ్మ శక్తిలో నీవు లీనమై దివ్య సమాధిలో నిరతము నిలచి జీవరాశిని నడిపెడి దేవా  ll శ్రీ గురుదేవ ll 3.నవవిధభక్తి మార్గమ్ములలో నడిచెడి వారికి తోడు నీడవై  చక్కగ నడుపుచు సంతస మిచ్చుచు సద్గతి నొసగెడి సద్గురు దేవ  ll శ్రీ గురుదేవ ll   4 నీవే శరణని నమ్మిన వారల బరువు బాధ్యతల భరియించెదవు ప్రేమ మమతలతో కృపను చూపెదవు శ్యామ హృదయమున నిలచి యుందువు  ll శ్రీ గురుదేవ ll

(238) 25 August (25.08.)

Image
  శ్రీ శారాద శ్యామ సందేశం: 25 Aug “నీవు ఇతరుల పట్ల దైవంలా ప్రవర్తిస్తే అందరూ దైవభక్తి పరాయణులు గాను మరియు ప్రతివారు దైవంలాను ప్రవర్తిస్తారు." అనునది సత్యవచనము. మన ఊహలు, భయాల ఫలితములే మన బాధలకు, అనారోగ్యములకు కారణములు. "If you act like a god towards others, everyone will be a stranger to godliness and everyone will act like a god." That is the truth. The results of our imaginations and fears are the causes of our sufferings and illnesses. 238) కృప కనుమా శ్రీమాతా శారదా (25.08.) భీమ్పాస్ రాగం కృప కనుమా శ్రీమాతా శారదా నీవారల మము వీడకు మమ్మా కృప కనుమా శ్రీ మాత శారదా (దే) 1. జపతప సాధనలు చేయగలేను సత్యమార్గమున నడువగలేను  దానధర్మముల చేయగలేను  నీకై నీవే మము నడిపించుమా  ll కృప గనుమా ll 2. భ్రమలకు చిక్కి మాయలొ బడితిని మంచి చెడుగులను తెలియనైతినే సదాలోచనలు చేయగ నైతినే ప్రేమతో మమ్ముల చక్కగ నడపవే  ll కృప గనుమా ll 3. నేనను భావము వదలకున్నది నాదను భావము వీడకున్నది నీ మార్గములో ఎటుపయనింతునో నీ శ్యామగ నే నెప్పుడు నిలుతునో llకృప గనుమాll

(237) 24 August (24.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 24 Aug మానవులను వారి వారి స్వభావాన్ని బట్టి, కర్మలబట్టి, మాటలబట్టి అర్థం చేసుకోవచ్చును. ఎవరైతే మనసా, వాచా, కర్మణా ఏకత్వాన్ని, సఖ్యతను పొంది ఉంటారో వారే పవిత్రులు. Humans can be understood by their nature, actions and words. Those who have attained the unity and harmony of mind, word and action are holy. 237) శ్యామ సుందరీ, జననీ, శ్రీమాత శారదే (24.08.) మోహనరాగం శ్యామ సుందరీ, జననీ, శ్రీమాత శారదే ప్రేమంకరి, శుభంకరి, అభయంకరి, దిగంబరి కరుణామయా, కృపామయా, వరదా భయదాయని జగన్మయా, విశ్వమయా, లోకమయా, చిన్మయా పరాత్పరి, జగదీశ్వరి, పరమేశ్వరి, శ్రీకరి  ll శ్యామ సుందరీ ll  నీ వచనామృత పానమే ఆనంద నిలయం నీ ప్రేమామృత పానమే సంతస వలయం నీ దివ్య సన్నిధియే మాకు ఆలయం నీ కృపాదృష్టియే శ్యామాదుల కభయము ll శ్యామ సుందరీ ll

(236) 23 August (23.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 23 Aug వృద్ధాప్యంలో నిన్నేది సంతోషపరచగలదో దాన్ని యవ్వనంలోనే సిద్ధం చేసి ఉంచుకో. మరణానంతరం ఉత్తర లోకంలో లేదా మరుజన్మలో నీకేది సంతోషాన్నిస్తుందో దాన్ని ఈ జన్మలోనే సిద్దం చేసి What make you happy in old age, prepare it in youth. Whatever makes you happy in the afterlife or in the next life, prepare it in this life itself. 236) కరుణామయీ ప్రేమమయీ (23.08.) కానడ రాగం కరుణామయీ ప్రేమమయీ జననీ శారదే  జననీ కావవే నిర్మల ప్రేమకు నీవే రూపము నిరుపమ ఓర్పుకు నీవాధారము నిజమగు సతికి నీవాదర్శము మాతృ ప్రేమకు నీవే మూలము విశ్వమున కెల్ల మాతవు నీవై బాధల నిందల భరియించితివి ప్రేమామృతమును పంచి పెంచుచు బిడ్డల నెల్లర కాచుచుండెడి కరుణామయీ ప్రేమమయీ జననీ శారదే కులమత జాతి భేదము లెంచక పిల్లల కడుపుల ప్రేమతో నింపుచు విశ్వమంతకు మాతృదేవియై శ్యామ హృదయమున వెలుగుచుండెడి  ll కరుణా ll

(235) 22 August (22.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Aug పరులకు సాయపడటం అంటే నీకు నీవు సాయపడటమే. పరులకు హాని కలిగించుట, నీకు నీవు అసౌకర్యం కలిగించుకొనుటయే. ఒకరికి హాని కలిగించుట నీకు నీవే హాని కలిగించుకొనుట కనుక జాగ్రత్తగా నడుచుకో. Helping others means helping yourself. To harm others is to cause discomfort to yourself. To harm someone is to harm yourself, so carefully go. 235) సాయి శంకర దరిశన మీయవే (22.08.) సాయి శంకర దరిశన మీయవే దరిశనమునతో తరియింప జేయవే 1.చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం గురుదేవ గురుదేవ గురుదేవ పాహిమాం గురుదేవ గురుదేవ గురుదేవ రక్షమాం ll సాయి ll  2.జగద్గురు జగద్గురు జగద్గురు పాహిమాం జగద్గురు జగద్గురు జగద్గురు రక్షమాం   ll సాయి ll  3.ప్రేమ ప్రదాత కరుణాసాగర  జగద్గురు చంద్రశేఖర సాయి శంకర సత్కృప జూపవే సత్కృప జూపి మమ్ము తరియింప  జేయవే  ll సాయి ll (28.01.1987, రా.11.40 గం.కు)

(234) 21 August (21.08.)

Image
శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Aug మనిషి శాంతం చేత కోపాన్ని, మంచితనం చేత చెడును జయించాలి. Humans should conquer anger with peace and evil with goodness. 234) యాడబాయ కున్నా మాయా (21.08.) యాడబాయ కున్నా మాయా  ఎందు బోయనో  తెలియ దాయా  పుడమిలో సద్గురు రాయా  బోధామృతము పానము చేయా… ll 1.పుట్టుల కాధార మాయ  పొత్తుకూడి ఉన్నట్లాయ గుట్టు తెలియగనే నిలిచి పోయ  శ్రీ గురు చంద్రోదయ మాయ ౼॥  2.పట్టరాని రిపులార్గురిని  పట్టి బంధించి న్నట్టులాయా  బట్టబయట చూడగ తానే బ్రహ్మమనుచు నిలకడాయా ౼॥  3.బిందువే బీజమైన దాయా  సంధి తెలియ సమరస మాయా ఎందుచూచినను ఏక మాయా  ఎరుకతానే బ్రహ్మ మాయా ౼॥ 4.మనసు చెదరగానే నిలిపి అహంకార మమతల విడిచి  తనలో తానే తనువును మరచి  ద్వైత భావమును కిందు పరచి౼॥  5.నన్ను నాలోనే చూచితిని నామరూపముల యెడ బాసితిని  చెన్నుమీర పాలలోనే  వెన్న విధమని తెలియనాయా ౼॥ 6.భావ భావములేవేనీ సద్భావమే బ్రహ్మ భావమాయా  జీవుడే గురు మృత్యుంజయుడు దేవుడని తెలియనాయా ౼॥ (18.01.1987, ఇది, రా.7.00 గం.కు)

(233) 20 August (20.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Aug ప్రతీదానిలో మంచిని చూడాలి. జరిగేదంతా భగవత్సంకల్పం. అహంకారం, క్రోధంలో కూడా మంచి చూస్తే చెడు కనిపించదు. మంచి అంటే చెడు లేకుండా ఉండేది, చెడు పోగొట్టేది అని అర్థం. See the good in everything. Everything that happens because of God's will. If you see the good even in pride and anger, you will not see the bad. Good means the absence of evil, the elimination of evil. 233) నీవు నేను ఒక్కటే అన్నావు (20.08.) నీవు నేను ఒక్కటే అన్నావు  దేవా సాయి దేవా  నీవు నేను వేరనెడి మందమతిని  దేవా సాయి దేవా  నన్నెటుల కృప జూతువో దేవా కరుణింతువో దేవా చెప్పిన వినలేని నీ సూక్తుల గనలేని  అణుమాత్రమయినను ఆచరించలేని  బలహీనుడును నేను బాబా.. ఎటు కృప జూతువో నన్ను

(232) 19 August (19.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 19 Aug 'ఆలోచన - ధ్యాస: వద్దనుకున్న దాని గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఉపయోగమా కాదా? ప్రశ్నించుకోవాలి. ఉపయోగం అయితే కొనసాగించు లేదా కట్ చేయి. Thought- Attention: Don't think about what you don't want. Thinking like that, makes it even more so. When it comes immediately question it... is this useful or not? If it's useful continue otherwise cut it 232) అక్కడ యిక్కడ ఎందుకు తిరిగెదవు (19.08.) అక్కడ యిక్కడ ఎందుకు తిరిగెదవు  చెప్పిన మాటను వినవేమే మనసా (2)  (ఆ... ఆ...ఆ) సాధనలేమీ చేయగ లేవని  శాస్త్ర శష్కముల చదువ లేవని  తెలిసియే ఆ పరమాత్ముడు భువిలో సాయిగా షిరిడీలో అవతరించెనని  చెప్పిన వినవేమే మనసా(2)  (ఆ...ఆ...ఆ...) ll అక్కడ ఇక్కడ ll  వృధాగా అక్కడ యిక్కడ  ఎందుకు తిరిగెదవు చెప్పిన మాటను వినవే మనసా(2) ll అక్కడ ఇక్కడ ll  దేనినయినను అనుమానము తోడ పరికించుటయే నీ కలవాటయినది అనుమానములను అంతము చేయగ అవతరించినదిగో సాయీ వినక  ll అక్కడ ఇక్కడ ll  బ్రతుకుకు ...

(231) 18 August (18.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 18 Aug మంచి ఆలోచనలు వస్తే కొనసాగించాలి. చెడు ఆలోచనలు అయితే అక్కడే ఆపివేయాలి. ఈరోజు భగవన్నామము భక్తితో, ఎంతసేపు చేశాము అని ప్రశ్నించుకోవాలి. Good ideas should be continued. Bad thoughts should stop there. Today we should question ourselves how long we have done chanting with devotion to God. 231) ఎవరేమి చేసిన తగిన ఫలితములను ఇచ్చెడి (18.08.) భూపాళ రాగం ఎవరేమి చేసిన తగిన  ఫలితములను ఇచ్చెడి  దేవాది దేవా శ్రీ సాయి దేవా... మంచి చెడుగులకు  తగు ఫలితముల నిచ్చెడి  సత్య ధర్మ స్వరూపా  ఒక్కడుగు నీ వైపు వేసినంతనే  పది అడుగులు మా వైపు వేసెడి దేవా ఒకపరి నిన్ను శరణాగతి వేడిన  వదలక గాచి కృప జూపు దేవా  ll ఎవరేమీ ll  సత్యముండేటి చోట వుందువు నీ వనుచు- అభయము నొసెగెడు అభయ ప్రదాత సద్గురువును నమ్మి  ఓర్పుగా నుండెడి మార్గమే  నీదనుచు తెలిపిడి దేవా  నీ మార్గంలో నడువ  యత్నించు వారలకు  చేయూత నొసగెడి దేవాది దేవా  బాధ్యతల నెరవేర్చి  ఋజుమార్గములో నడిపి బ్రతుకు  సుగమము చేయు దేవాది దేవా శామ...

(230) 17 August (17.08.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 17 Aug ఉన్నదానిలో గొప్పతనం చూసుకోవాలి. లేనిదాని కోసం ఆరాటపడకూడదు. అలా చేయడం వలన ఇప్పుడు ఉన్నవి అనుభవించలేము, లేనివి రావు. రెండింటి చెడ్డవారమవుతాము. ఇప్పుడు ఉన్నవన్నీ ఇంతకు ముందు జన్మలో శ్రమించిన దానివలన వచ్చాయి. ఉన్నదానితో తృప్తి పడకపోతే వచ్చే జన్మలో ఇవి కూడా ఉండవు. Look for the greatness in what you have. Don't anxiet for what you don't have. By doing so, the present cannot be experienced, and the absent will not come. Both will be bad. Everything that exists now has come because of our hardwork in previous births. If you are not satisfied with what you have, you will not have these in the next life. 230) విశ్వాసముతో నుండుము (17.08.) నీ నామస్మరణ లో గడిపే కాలమే  మధురం మధురం పునీతం పునీతం...  నీ లీలా శ్రవణములో గడిపే కాలమే  మధురం, పునీతం పునీతం మధురం....  సాయి రామా.... బాబా సాయీ....  సాయి రామా.... సాయి శ్యామా...  1.నీ లీలా పఠనములో గడిపే కాలమే  పునీతం పునీతం...  నీలీలా చింతనలో గడిపే కాలమే  మధు...

(229) 16 August (16.08.)

Image
శ్రీ శారాద శ్యామ సందేశం: 16 Aug ఏ పని అయినా తెలుసుకొని చేయాలి. లేదంటే చేస్తూ, చేస్తూ పోవడం వలన అదే తెలుస్తుంది. దేవాలయాలు ప్రశాంతతకు, ప్రాయశ్చిత్తములకు, పశ్చాత్తాపములకు నిలయాలు. Any work should be done knowingly. Otherwise it will be known by doing and doing. Temples are abodes of tranquility, Atonements and penitence. 229) విశ్వాసముతో నుండుము (16.08.) విశ్వాసముతో నుండుము -  వినయముతో నడయాడుము  ఓర్పుతో చరియించుము -  ధైర్యోత్సాహముల ఎపుడు వీడకుము ధైర్యము నెపుడు వీడకుము -  ఉత్సాహము వీడకుము  1.విశ్వాసము కలిగించును  వివేక విజ్ఞానములను విశ్వాసము మది పెంచును  ప్రేమాభిమానములను ఓర్పు యున్న వారికే  సత్ఫలితము స్వంతమగును విశ్వాసము ఓర్పులున్న  సద్గురు కృప సులభమగును ll విశ్వాసము ll 2. అచంచలము ఆనందము  అమోఘము విశ్వాసము  దుర్గుణముల పారద్రోలు  బ్రహ్మాస్త్రము  ఓర్పు త్రికరణ శుద్ధిగ జేసెడి  కార్యములకు మూలమవియే  సాయి దేవుడు అందించిన  సులభమైన సూత్రములు  ll విశ్వాసము ll 3. శాస్త్రములు, సాధనలు,  యోగా భ్యాస...

(228) 15 August (15.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Aug మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారో మీరు అలా ఉండాలి. ప్రేమ, విద్య పెంచే కొద్దీ పెరుగుతాయి. You should be what your children want you to be. Love and education will increase as you increase. 228) కేశవ - కేశవ - కేశవ (15.08.) 1.కేశవ - కేశవ - కేశవ శవము వలె నన్ను భువిలో బ్రతుక జేయనీయకురా ॥  2. నారాయణ - నారాయణ - నారాయణ నానా రూపములలోన నీవే కనిపించుము రా - ॥ 3. మాధవ - మాధవ - మాధవ మానవుడే మాధవుడను అనుభవమును ఒసగుమురా ౼॥ 4. గోవిందా - గోవిందా - గోవిందా గోపికలను బ్రోచినటుల మమ్ము కరుణింపుము రా ౼॥   5. విష్ణుదేవ - విష్ణుదేవ - విష్ణుదేవ  వినయముగా నీ పద దాసుల సేవల నొసగుమురా -॥ 6. మధుసూదన - మధుసూదన - మధుసూదన మదనదేవు వశము నుండి మమ్ముల రక్షింపుము రా ౼॥ 7. త్రివిక్రమ - త్రివిక్రమ - త్రివిక్రమ త్రిగుణములు రహితములగు మార్గములో నడుపుమురా ౼॥ 8. వామన - వామన - వామన వాదములను, వైరములను నశింపజేయుమురా - ॥ 9. శ్రీధర - శ్రీధర - శ్రీధర శ్రీకరమౌ నీ రూపము సతతము మదిలో నిలుపుమురా - ॥   10. హృషీకేశ - హృషీకేశ హృషీకేశ హృదయమందు సద్భక్తిని సుస్థిరముగా నిలుపుముర...

(227) 14 August (14.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Aug ఏ పని అయినా ఇది తక్కువ, ఎక్కువ అనుకోకుండా భగవంతుడు మనకు ఆ పని ఇచ్చాడని శ్రద్ధగా చేయాలి. సినిమాలైనా సరే చూసి వాటిలోని మంచిని గ్రహించాలి. మనసు గురుదేవుని ఆధీనము, శరీరము భగవంతుని ఆధీనము. భగవంతుని మీద విశ్వాసంతో ఎందరో బాగుపడ్డారు. మనము ఎందుకుగాను బాగుపడము అని సాధన చేయాలి. Any work which is less or high without much saying, feel that God has given it to us it should be done diligently. Even it movie one should watch and understand the good in that. The mind belongs to Gurudev and the body belongs to God. Many people got better with faith in God. We have to practice why we don't get better. 227) హే శిరిడీ నాయక సాయిరామ్  (14.08.) హే శిరిడీ నాయక సాయిరామ్  శ్రీతజన పోషక సాయిరామ్  సాయిరామ్ జై సాయిరామ్  జై సాయిరామ్ జై సాయిరామ్ ll సాయి రామ్ ll 1.అభయ ప్రదాత, భవభయనాశక ఆపద్బాంధవ సాయిరామ్ సాయిరామ్ ll హే శిరిడీ ll 2. భుక్తి ప్రదాతా, భక్తి ప్రదాతా, శక్తి ప్రదాతా సాయిరామ్ సాయిరామ్  ll హే శిరిడీ ll 3. కరుణాకర హర కృపాకర హరి...

(226) 13 August (13.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Aug మనదైనది మన దగ్గర ఉంటుంది. మనది కానిది మన దగ్గర ఉండదు. సాయిని సమాఆశ్రయించిన తర్వాత, నమ్ముకున్నపుడు, జరిగేదంతా ఆయన సంకల్పమే, అది మన మేలుకేనని అనుకుని మౌనంగా ఉండాలి. ఎవరిని ఏమీ అనకూడదు. Our things will be there with us, we cannot have what is not ours. After taking refuge near Saibaba, believe that whatever happens is His Will and should be silent thinking that it is for our good. Noone should say anything. 226) గురుదత్తేశ్వర జయసాయిశ్వర (13.08.) కానడ రాగం గురుదత్తేశ్వర జయసాయిశ్వర జయమానస మందిర వాస  గురు దత్తేశ్వర జై సాయీ శ్వర  మమ మానస మందిర వాస  జై ప్రాణేశ్వర జై జ్ఞానేశ్వర జైజై సత్యాశ్రయవాస జై ప్రేమేశ్వర జై లోకేశ్వర జైజై ధర్మాశ్రయ వాస  జై యోగేశ్వర జై విశ్వేశ్వర జైజై శాంతి క్షమాశ్రయ వాస  జై నవనాధేశ్వర జై నాథ మహేశ్వర  జై నిర్మల నిరుపమ గుణవాస [జై దయాకరేశ్వర (కృపాకరేశ్వర)] జై కాళేశ్వర జై త్రిగుణేశ్వర జైజై కరుణాలయ వాస జై దయాకరా జై కృపాకరా జై ద్వారక మందిర వాస జై సర్వేశ్వర జై శ్యామేశ్వర జై జై భక్తాశ్రిత వాస (12.06.1986, రా...

(225) 12 August (12.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Aug మనలను గురించి ఎవరేమి అనుకున్నా మనము మాత్రము మౌనంగా ఉండాలి. మనలను అందరూ మంచిగా చూడాలని అనుకోవడం వలన శ్రీ సాయి కృపకు, కరుణకు దూరమవుతాము. No matter what anyone thinks about us, we must remain silent. Because we want everyone to see us as good, we get away from Sri Sai's grace and mercy. 225) లౌకిక రుణముల తీర్చుట కొరకై (12.08.) లౌకిక రుణముల తీర్చుట కొరకై  సతమతమయ్యెడి మనిషినయా నీ ఋణమెటుల తీర్చుకోగలను  నిరుపమ, నిర్మల, ప్రేమమయా అ ...ఆ ... 1.నేనూ నాదను స్వార్థ చింతనలు సంకుచితముగ నను నడుపుచున్నవి నిస్వార్ధ సేవల నెపుడు జేయుదునో నీ దయ కెటుల పాత్రుడ నగుదునొ  llలౌకిక ll 2.అరిషడ్వర్గపు దిగ్భంధనమున అస్తవ్యస్తముగ నడుచుచుంటిని అందరి శ్రేయము నెపుడు కోరుదునో నీ ప్రేమ కెటుల పాత్రుడ నగుదునో  llలౌకిక ll 3.తార్కిక వాదముల వలలో బడితిని తత్వ విచారమునకు దూరమైతిని  శ్యామయే లేడని ఎపుడు తెలియునో నీ కృప కెటుల పాత్రుడ నగుదునో llలౌకిక ll (09.06.1986 రా.11.40 గం.కు)

(224) 11 August (11.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Aug సద్గురువును సమాశ్రయించడం అంటే ఆయన ఆదేశ సందేశములకు అనుగుణముగా నడుచుకుంటూ అన్నింటికీ ఆయనే ధ్యేయమై, లక్ష్యమై, పరబ్రహ్మమై ఉన్నాడని అనుభూతి పొందడమే. Those who surrender to Sadhguru means to follow his instructions accordingly feel that.. For everything God is the mission, goal.  224) ఇచ్చెడి వాడవు నీవు దీన బాంధవా (11.08.) ఇచ్చెడి వాడవు నీవు దీన బాంధవా  నీకేమీ ఇత్తురా లోక బాంధవా.. ll 1.మనిషి జన్మ నొసగినావు… నీ చెంతకు లాగినావు  సద్భోధల జేసినావు…. ఆచరించమన్నావు  నీ కృప లేకయే నేను ఆచరించలేననెడి సత్యమును తెలిపినట్టి ప్రేమ స్వరూపా  llఇచ్చెడి ll 2.బాధ్యతల నెన్నింటినో తొలగించినావు సమస్యలకు పరిష్కారము లెన్నింటినో చూపినావు  సదా నీవు యున్నావను అవగాహనను యొసగినను గుర్తించలేనట్టి గ్రుడ్డివాడ నైతినయ్యా  llఇచ్చెడిll 3.నీ మార్గములో సదా నన్ను నడువనీయుమయ్యా  పరిస్థితుల నెదుర్కుకొనెడి ధైర్యము దయచేయుమయ్యా  నీ కొరకై నిన్ను సదా ప్రేమించనీయుమయ్యా నీ సేవలోన శ్యామనంతము చేయగదయ్యా llఇచ్చెడిll (08.06.1986,  ఆది, రా.11...

(223) 10 August (10.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Aug నీకు చక్కటి అనుభవమును కలిగించి నీ నుంచి దేనినీ కోరక, నీ శ్రేయస్సునే కోరేదాన్ని నమ్ముకో. అదే సక్రమముగా మార్గములో నడిపిస్తుంది. The one who give you a good experience, and wants nothing but your well-being. Trust them. They leads in the right way. 223) ఆనందామృత సాగరా !  (10.08.) ఆనందామృత సాగరా !  ఆశ్రిత పోషక కృపాకరా ! ఆనందామృత సాగరా !  ఆశ్రిత పోషక కృపాకరా_ll  సాయిరాం ! సాయిరాం ! సాయిరామ్ !!  సాయిరాం ! సాయిరాం ! సాయిరామ్ !! 1.ఒకపరి ఆర్తితో "సాయి" అనగనే  పరిపరి విధముల పరిరక్షింతువు  భక్తుడో కాడో గణుతింపకనే బాధ్యతల నెల్ల మోయుచున్నావు  llఆనందామృతll 2.ఎవరి సేవను ఉచితముగా... పొందవలదని బోధించితివి  అనుక్షణము నన్ను కాపాడుచున్న  నీకేమి చేతును దేవాధి దేవా  llఆనందామృతll 3.నీ దయయే గద ఈ జీవితము  నీకరుణయే గద కల్మషహరము  కాదని యేది లేదని తెలిపిన  తెలుసుకోలేని శ్యామచరణుడను  నాదని యేది లేదను నిజము  తెలుసుకోలేని శ్యామచరణుడను  llఆనందామృతll (08.06.1986. ఆది, రా.11.11 గం. నుండి...

(222) 09 August (09.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Aug స్వచ్ఛమైన అపరంజి లాంటి సంస్కారానికి లొంగుతాడు శ్రీగురుడు. భూత దయ, ప్రేమ, కరుణ కలిగిన మానవుని మహాత్మునిగా తీర్చిదిద్దగలడు. Sriguru surrenders to pure refined behaviour. a human being with kindness, love and compassion can transform into a Mahatma.  222) సాయి మార్గము -  బహు చక్కని మార్గము (09.08.) మోహనరాగం సాయి మార్గము -  బహు చక్కని మార్గము  సర్వజనులకు అది సులభ మార్గమూ  ll సాయి మార్గం ll 1..సాధన చతుష్టయములను చేయగా పని లేదు శాస్త్ర షట్కములను చదువగా పని లేదు సద్గురువును విశ్వసించి ఓర్పు తోడ చరియించిన సంతస మందుట కదియే సులభ మార్గమూ  llసాయి మార్గంll 2. పోటీలను,వంతులను, కీచులాటలను అహముతోడ ఇతరుల లోపములను చూపుటను ఇతరుల కన్నను తానే అధికుడనను భావనను విడనాడిన భగవానుడు కృప జూపునను మార్గము llసాయి మార్గంll 3.కుల మతములు జాతులు,ధనిక పేద భావములు మతాంతీకరణములు, సాంప్రదాయ మార్పిడులు జీవజంతు జాలముల హీనముగా జూచుటను వదలినచో భగవంతుడు కృప జూపునను మార్గము  llసాయి మార్గం ll 4.చేసిన కర్మకు ఫలితము అనుభవించవలెననుచును  సత్యముండు చ...

(221) 08 August (08.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Aug రూపమేదైనా, నామమేదైనా తుది శ్వాస వరకు స్మరిస్తూ చేతనైనంత వరకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉండటమే మానవ జన్మకు సార్ధకతను కలిగిస్తుంది. Whatever the form or name is, remembering it till the last breath and praying as much as possible makes human birth meaningful. 221) నీ మహిమల విని చరితమును చదివి (08.08) నీ మహిమల విని చరితమును చదివి ఆశతో నిను స్మయించితినా  నీకై నీవు నను లాగు కొనగ  నిను నమ్ముకొనగ నెంచితివా నిను నమ్మిన ఈ తర్కము రాదు అటు ఇటు నా మది పరుగిడదు అది ఇది నెరుగని స్థితిలోన నుంచి  నడుపు చుంటివా నాటకము  ll నీ మహిమల ll  1.మొట్టమొదట నిను కోరిన కోర్కెల  నెల్ల దీర్చి ఓదార్చెదవు మరల మరల నా మొరలను  వినక మొరాయించి ఆడించెదవు నను వదలవు నిను మరువనీయవు  నడుమ నన్నిరికించెదవు నీ శిక్షణ ఏమిటో చిత్రమైనది  వాక్కుకు మనసుకు అందనిది ll నీ మహిమల ll 2. ఒక పరి నీవున్నావనే ధైర్యము  ఒక పరి నెఱుగనిదేదో అధైర్యము భౌతిక పరమార్థములకు  అర్థము తెలియక ఏదో సతమతము నీ భక్తులమని తిరిగే వారల  తీరుల జూడగ కలకలము నీ శ...

(220) 07 August (07.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Aug "నాకు గురువు కావాలి. మిమ్మల్ని గురువుగా పెట్టుకుంటాను." తీవ్రమైన ఆకలైన వాడు ఆహారాన్ని వెతుక్కుంటాడు. అలాగే నిజంగా మనస్ఫూర్తిగా దైవాన్ని తెలుసుకోవాలని, ఆయన అనుగ్రహాన్ని పొందాలని ఉంటే సర్వాంతర్యామి అయిన దైవం ఏదో ఒక మార్గము ద్వారా గురువు చెంతకు చేర్చుతాడు. "I want a Guru. I'll keep you." He who is very hungry searches for food. Like that, if you really want to know God with your heart and get His grace, who is omnipresent. God will bring you Guru through some means. 220) సుందర తనయ కరుణా హృదయా (07.08) భీమ్పాస్ రాగం సుందర తనయ  కరుణా హృదయా  మమ్మేలగ రావయ్యా….  llసుందరll 1. అరుణాచలమే నీ నివాసము  అది అందరికీ శాంతి నివాసము ఆర్తితో పిలిచే ఈ భక్తులను ఆదుకొనగ రావయ్య రమణ ll సుందర ll  2. భావములే తెలుసుకొని -  మా భావము బాధల నెన్నో తీర్చేవు భగవాన్ రమణ నిన్ను సేవింప వచ్చాము మా సేవ లందుకొనగా దయతో  కరుణింపుమా  ll సుందర ll 3. కొండ మీదకు చేరావు కొండంత దేవుడవయ్యావు  కొసరి కొసరి చూచేవు  కోర్కెలను తీర్చేవ...

(219) 06 August (06.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Aug అంతా యింతే. యింత దానికి అంతెందుకు? అంతెందుకు అని ఊరుకోకు. ఊరుకుంటే ఊరు ఊరుకోదు. ఊరు-పేరులకు తేడా లేదని తెలిసే వరకూ నీకూ నాకూ ఈ తగిలింపులు తప్పవు. తప్పవని నిరుత్సాహ పడకు. తప్పవని తెలిస్తే, తప్పించుకోగల శక్తి వస్తుంది. అది వస్తే అంతా ఇంతేనని అవగాహన అనుభవములలో తెలుస్తుంది. That's it. Why so much for that?  Don't keep by saying why. If you settle down, the town will not keep you settle down. Until we know that there is no difference between town and name, you and I will have inevitable encounters from attachments. Don't be discouraged for inevitable's. If you know that you are inevitable, you will have the power to escape. it will be known in the experiences of awareness. 219) హరి గురు నామమే మధురము మధురము (06.08) హరి గురు నామమే మధురము మధురము హరి గురు నామమే మధురాతి మధురము  గురు దర్శనమున కదె సోపానము llహరిll  1. హరియే గురుడట గురుడే హరియట హరి గురువులకు భేదము లేదట మానవాళిని ఉద్ధరించుటకు  హరియే గురువుగ అవతరించునట llహర...

(218) 05 August (05.08.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Aug అనుకునే అందరూ జన్మించడం లేదు. ఉందామనుకున్న వారందరూ ఉండటంలేదు. రావడం, పోవడం మన చేతిలో లేదు. పరిమితమగు ఆశ నిస్వార్థమైనది అయితే, నెరవేరుతుంది. అపరిమితమగు ఆశ, దురాశ - పేరాశలుగా మారి స్వార్థపూరితమై దుఖంలో ముంచుతుంది. మునిగినది తెలుసుకోవడం కాదు. వెలుపలికి రావడం తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సహచర్యం మనకెంతో లాభము చేకూర్చుతుంది. వినయము, వివేకము అనునయంతో కూడిన భగవత్ కృపను అందిస్తుంది. కోరిక ఏదైనా అనుకోవచ్చు. తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కానీ ఫలితం మాత్రం మన చేతిలో లేదని, ఆ కార్యక్రమానికి వచ్చిన ఫలితమే మనదని, మనకు మేలు చేకూర్చునని గ్రహించుటే ఆనందానికి ఆది. Not everyone who thinks is born. All those who wanted to be there are not here. Coming and going is not in our hands. If unselfish limited hope is there means that can fulfilled. Unbridled hope, greed turns into edacity and selfishness and leads to misery. Not to know the sunk. Know how to come out. The companionship of experienced people will benefit us greatly with humility, wisdom, persuasion and Go...