(224) 11 August (11.08.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Aug
సద్గురువును
సమాశ్రయించడం అంటే ఆయన ఆదేశ సందేశములకు అనుగుణముగా నడుచుకుంటూ అన్నింటికీ
ఆయనే ధ్యేయమై, లక్ష్యమై, పరబ్రహ్మమై ఉన్నాడని అనుభూతి పొందడమే.
Those
who surrender to Sadhguru means to follow his instructions accordingly
feel that.. For everything God is the mission, goal.
224) ఇచ్చెడి వాడవు నీవు దీన బాంధవా (11.08.)
ఇచ్చెడి వాడవు నీవు దీన బాంధవా
నీకేమీ ఇత్తురా లోక బాంధవా.. ll
1.మనిషి జన్మ నొసగినావు… నీ చెంతకు లాగినావు
సద్భోధల జేసినావు…. ఆచరించమన్నావు
నీ కృప లేకయే నేను ఆచరించలేననెడి
సత్యమును తెలిపినట్టి ప్రేమ స్వరూపా llఇచ్చెడి ll
2.బాధ్యతల నెన్నింటినో తొలగించినావు
సమస్యలకు పరిష్కారము లెన్నింటినో చూపినావు
సదా నీవు యున్నావను అవగాహనను యొసగినను
గుర్తించలేనట్టి గ్రుడ్డివాడ నైతినయ్యా llఇచ్చెడిll
3.నీ మార్గములో సదా నన్ను నడువనీయుమయ్యా
పరిస్థితుల నెదుర్కుకొనెడి ధైర్యము దయచేయుమయ్యా
నీ కొరకై నిన్ను సదా ప్రేమించనీయుమయ్యా
నీ సేవలోన శ్యామనంతము చేయగదయ్యా llఇచ్చెడిll
(08.06.1986, ఆది, రా.11.25 నుండి రా.11.38 వరకు)
Comments
Post a Comment