Posts

Showing posts with the label 02 February

29 February (29.02.) (60)

  60) ఆత్మా రామ ఆనంద రమణ ఆత్మా రామ ఆనంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ భవ భయ హరణ వందిత చరణ రఘుకుల భూషణ రాజీవలోచనా ॥ఆత్మా రామ॥ ఆదినారాయణ ఆనంతశయనా సచితానంద శ్రీ సాయి నారాయణా

28 February (28.02.) (59)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: ఈ జన్మలో అనారోగ్యం, ఇబ్బందులు అనుభవించుటకు బాహ్య శత్రువులు కారణం అయి ఉండవచ్చును. అంతర్గత శత్రువులు, ఈ జన్మకే కాక భవిష్యత్ జన్మలకు కూడా మహా ప్రమాదకరమైనవి. External enemies may be the cause to experience illness and hardship in this life. Internal enemies are very dangerous not only for this birth but also for future births. (28 Feb)   59) అవధూత చింతన గురుదేవ దత్త అవధూత చింతన గురుదేవ దత్త ॥ అవధూత॥ దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా సాయి దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా  శ్రీపాద వల్లభా దిగంబరా  అత్రి నందన దిగంబరా అనసూయత్మజ దిగంబరా అవధూత రూపా దిగంబరా శ్రీ గురుదేవా దిగంబరా జయ గురుదేవా దిగంబరా సమర్థదేవా దిగంబరా  సద్గురు దేవా దిగంబరా   దిగంబరా దత్త దిగంబరా  దత్త దిగంబరా దత్త దిగంబరా   దిగంబరా సాయి దిగంబరా  సాయి దిగంబరా సాయి దిగంబరా   దిగంబరా బాబ దిగంబరా  బాబ దిగంబరా బాబ దిగంబరా   దిగంబరా శ్రీ గురు దిగంబరా  శ్రీ గురు దిగంబరా శ్రీ గురు దిగంబరా   దిగంబరా సద్గురు దిగంబరా  స...

27 February (27.02.) (58)

Image
శ్రీ శారద శ్యామ సందేశం అపరమైన అనంతమైన ఆనందాన్ని పొందుటకు ప్రకృతిని పరిశీలించుట, పరిశీలనల నుండి పాఠములు నేర్చుకొనుట, వాటిని అనుభవంలో తెచ్చుట మార్గములు.  Observing nature, learning lessons from these observations, and putting them into practice are the ways to attain immense and boundless joy.     58 ) ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప ప్రబోవేగ రావా ప్రేమ స్వరూప శరణం దే స్వామి కరుణించవేమి నారాయణ హరి గోవింద గోపాల మురళీ మాధవ వారింజబాంధవ ॥2॥   

26 February (26.02.) (57)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: మనం మన అవసానదశకై ఇప్పటినుండే గురువుల సలహాలను అనుసరిస్తూ, సరైన ఆధారాలను ఆలోచించి తయారు చేసుకొని ఉండాలి. లేకపోతే మనం దైవానుగ్రహాన్ని, అనాయాస మరణాన్ని ఎలా ఆశించగలము? For our final destination, we must follow the Guru's advice from now on, and think and prepare with the proper evidence. If not how can we expect a divine life, euthanasia death? (26 Feb)    57) గోవింద గోపాల నీల మేఘశ్యామ్ గోవింద గోపాల నీలమేఘశ్యామ్  నీల మేఘశ్యామ భజో సాయి గణేష్ శ్యామ్  సాయి గణ శ్యామ్ మేర సాయి గణ శ్యామ్  మురళీమనోహర సాయి గణ శ్యామ్  గోవింద హరి గోపాలహరి గోవర్ధన గిరిదారి శ్యామ  సుందర మదన మోహన బృందావన సంచారి

25 February (25.02.) (56)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: సత్య, ధర్మ, ధైర్య, తృప్తి, నియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ/గురు కృపకు పాత్రులు. Those who live according to truth, virtues,, courage, rules regulations, without causing problems to others are deserve for the grace of God/Guru. (25 Feb)   56) అంబా భవాని జగదంబ భవాని అంబా భవాని జగదంబ భవాని ॥2॥ శ్రీ చక్రధారిని ఆనందదాయుని ॥2॥ జ్ఞాన స్వరూపిణి జ్యోతి ప్రకాశిని ॥2॥ ఓంకార రూపిని విశ్వవినోదిని ॥2॥ ॥అంబా భవాని॥

24 February (24.02.) (55)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: అనుకున్నది జరగడంలేదు, జరుగుతున్నది అనుకోవడం లేదు. జరిగేదానికి అనుగుణంగా మనం బ్రతుకులు లాగుతుంటాము. దీనికి కారణం, మన జీవితానికి గమ్యమేమిటో మనకు తెలియకపోవడమే. కావున, జీవిత ధ్యేయము, గమ్యము నిర్ణయించుకుంటే దానికి అనుగుణంగా గమనం సాగుతుంది. ధ్యేయము, గమ్యము మంచివైతే - ఆనందము, చెడు అయితే - దుఃఖము కలుగక తప్పదు. What is expected that is not happening, what is happening that was not in thought. We live according to what happens. The reason for this is because we don't know the purpose of our life. Therefore, if we decide the purpose of life and destination, the journey will go according to it. If destination is Good - happiness, Bad means- sadness is inevitable. (24 Feb)    55) వందనం వినాయకా..... వందనం వినాయకా..... ఓం నమో గజానన॥ ఓం నమో మూలాధారా........  ఓం నమో శ్యామధారా॥  ఓం నమో ప్రణవ స్వరూపా  ఓం నమో ప్రేమ స్వరూపా  ఓం నమో కృపా స్వరూపా  ఓం నమో సాయి స్వరూపా ॥ వందనం వినాయక॥  

23 February (23.02.) (54)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం  “మనది”లోని “మది”ని నశింపజేసుకొనుటకే సాధనలన్నీ. సాధనలు సద్గురు కృపను పొందగల అర్హతను అందిస్తాయి. ఆ తర్వాత మిగిలేది శూన్యమైన శూన్యమే. All practices are there to destroy "Psyche" in "Ours". Practices give us the eligibility to obtain the grace of Sadguru. After that all that remains is a void of emptiness. (23 Feb)   54) హరి నారాయణ, హరి నారాయణ హరి నారాయణ, హరి నారాయణ,  హరి నారాయణ గోవిందా॥॥    అచ్యుత, కేశవ, మాధవ,  మురహరి హరి నారాయణ గోవిందా ॥ హరి ॥    వామన, నృసింహ, జనార్ధన,  శ్యామ హరి నారాయణ గోవిందా ॥హరి ॥  భక్తి ప్రదాతా , ముక్తి ప్రదాత,  హరి నారాయణ గోవిందా ॥హరి॥

22 February (22.02.) (53)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం విశ్వాసమును నీకు కలిగించేదే నీ గురువు. ఆయననే సదా అంటిపెట్టుకో - నీ రక్షణను ఆయనే వహిస్తాడు. Your Guru is the one who instills faith in you. Always stick to him - He will protect you. (22 Feb)   53 ) పావన గుణ నామ హరే పావన గుణ నామ  హరే పరమ దయా నిలయా  హరే మాయా మానుష రూపా  మాయాతీత మంగళ ధాత  వేదాంత వధూ హృదయ  విహారా వేదమయా పరమానంద రూప॥ పావన॥  కరుణారస భర నయనా దరహాస మనోహరవదనా  నవ తులసీదల మాలా భరణా  నానా జీవన నాటక కారణ॥ పావన॥

21 February (21.02.) (52)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: నైతికమనేది, మనల్ని మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది. సంతోషము - భౌతికమైనది మరియు ఇంద్రియాధీనము, నశించేది. ఆనందము - పారమార్ధికమైనది, ఇంద్రియాతీతము, శాశ్వతమైనది. కావున దైవాన్ని స్మృతియందుంచుకొని ప్రార్థించు. Morality is not a theory that tells us how to make ourselves happy. It tells us how we deserve to experience happiness.   Gleefulness - material and sensual, perishable.   Happiness - transcendental, phenomenonal, eternal. So remember God and pray. (21 Feb)   52 ) శరణం శరణం శ్రీ శ్యామ చరణం శరణం శరణం శ్రీ శ్యామ చరణం  హృదయా భరణం సంకటహరణం  శరణం శరణం శరణం శరణం  గురుదేవా నీ గుణముల త్రోవ నిత్యము నడువా శక్తినీయవా ॥2॥    మహదేవా నీ మహిమను కొలువ వాక్కు నొసగవా ప్రేమ చూపవా నీవు నిండిన మనసు కెన్నడు చేటేరాదయ్యా  నిన్ను నమ్మిన బ్రతుకు ఎప్పుడు లోటేరాదయ్యా    కామ క్రోధ మద లోభ హరణమౌ  దివ్య స్మరణం శ్రీ ...

20 February (20.02.) (51)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: అహంకారం శాశ్వత ధర్మాలను, సత్సంగాన్ని అనుమతించదు మరియు దుఃఖాన్ని కలిగిస్తుంది. నిరహంకారం బలాన్ని, ధైర్యాన్ని, సమగ్ర తృప్తిని ఆహ్వానిస్తుంది. Arrogance does not allow eternal virtues, True Companionship and causes misery. Selflessness invites strength, courage, and inclusive satisfaction. (20 Feb)    51) శరణు శరణు రఘు రామా శరణు శరణు రఘు రామా సాయి రామా. సాయి దత్త గురు నామా సద్గుణ సాయి ధామా ప్రభో సాయిరామా సాయి సాయి యని స్మరియించిన చాలు సకల పాపంబులే సమసి పోవు సాయి సద్గురు కరుణే సదా తోడు నీడయై గాచి రక్షించి ప్రేమ మీర బ్రోచు గాదా సకల దైవ స్వరూపములు సాయియే సకల ప్రాణి స్వరూపములు సాయియే ఎవ్వరెటుల గొలిచినా ఎవ్వరెటుల పిలచినా ఆలకించి సర్వము సమకూర్చు గాదా.

19 February (19.02.) (50)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: మనస్ఫూర్తిగా భగవన్నామస్మరణము భక్తితో చేస్తూ ఉంటే - భగవంతుడే నీకు అండదండగా తోడు-నీడగా ఉంటాడు. సమర్థ సద్గురు రూపములో భగవంతుడు అవతరిస్తాడు. కావున, సమర్థ సద్గురువు మనకు లభించిన, మరొక దైవమును సేవించవలసిన అవసరం లేదు. ఆరాధన, అర్చన, నామస్మరణము, ఆత్మసమర్పణము అన్నీ గురువునకే. శ్రీ గురువు మాత్రమే జీవిని తరింపచేయగల సమర్థుడు. శ్రీ గురు కృప పొందగలిగేలా కృషి మాత్రము తీవ్రముగా మనము చేస్తూ, ఓర్పుతో ఉండాలి. Wholeheartedly Chanting divine name with devotion means God only will be your companion and shadow. God incarnates in the form of Competent Guru. Therefore, we do not have to worship another deity.... Worship, archana, Chanting name, Self-surrender do all to the Guru. Sri Guru is the only one who can drive away us. Work hard and be patient so that we can get the grace of Sri Guru. (19 Feb)   50) రామా పట్టాభి రామా రామా పట్టాభి రామా రామా కోదండ రామా రామా కళ్యాణ రామా రాఘవా రామా సీతాపతి రామా నీవే గతి రామా నీకు మ్రొక్కితి రామా నీచే చిక్కితి రామా నాకెవరు తోడు ర...

18 February (18.02.) (49)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: నిరంతరము జరిగే ప్రతి కార్యక్రమము ఒక సాధన (అది పని కానీ, నామము కానీ) Every activity that happens Constantly is a Divine Practice (whether it is work or Chat). (18 Feb)   49) ఎందులకీ యోచనలు ఎందులకీ యోచనలు మనకెందులకీ సమాలోచనలు యోచనల చేసి తీర్పుల చేసి సాధించునదా సాయి మార్గము ॥ఎందు॥ సాయి సాయి అని పలుకుట తోడనే సమయము లెల్ల గడిచిపోయినె సాయియె సకల విశ్వమయుండని సత్యము నేరిగే సమయమ దెప్పుడు ॥ఎందు॥ వాదన చేత వ్రాతల చేత వ శమవునా శ్రీ సాయి మార్గము భజనల చేత ప్రార్థనల చేత అనుభవమగునా సాయి మార్గము ॥ఎందు॥ అంతరంగమును శుద్ధి చేసుకుని, త్రికరణ శుద్ధిగా పలుక నేర్వని మనసుల తోడ మరి మరి వెదికిన మనకు దొరకునా సాయి మార్గము ॥ఎందు॥ తన మనసునే తాను నమ్మలేని తత్తర పడెడి మందభాగ్యులకు చీటికిమాటికి చిరుబురులాడుచు ఓర్పుగ నుండని మతిహీనులకు ఎటు కలుగునో కదా శ్రీ సాయి కృప ఎటు నడుతురో గదా సాయి మార్గము ॥ఎందు॥

17 February (17.02.) (48)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: రాత్రి పడుకునే ముందు నిస్పక్షపాతంగా దినచర్య రాసుకొని, ఆత్మ పరిశీలన చేయాలి. మరునాడు చేసుకోవలసిన కార్యక్రమములు నిర్ణయించుకోవాలి. ఈ కార్యక్రమములు క్రమంగా చేసుకునేందుకై ఆరోగ్యమును, శక్తిని ఇవ్వమని శ్రీ సద్గురు దేవని ప్రార్ధిస్తూ నిద్రించాలి. ఓమ్ శ్యామ చరణం శరణం మమ. Before going to bed at night, Impartially one should write the daily deeds and take Self-examination. For the next day decide what activities to do. In order to do these activities for health and energy. Pray SriGuru with "Om Shyaama charanam charanam charanam mama" and sleep. (17 Feb)     48) ఏ రూపంబని నిను ఏ రూపంబని నిను ధ్యానించను, ఏ నామంబని మది స్మరియుంచను, ఏ నామంబని హృది జపియుంచను, తెలియని దీనుడ శ్యామచరణుడును, దయ నీవారల గావ వేడెదను ॥ఏ రూప॥ క్రిమి కీటక పశు పక్ష్యాదులలో నర వానర దేవాది గణములతో విశ్వమెల్లడల నీవున్నావని నిదర్శనముల నొసగితి వనగా నీ భక్తులకు జూపితి వనఘా ॥ఏ రూప॥ ఆది మధ్యంతరహితుడ నీవనీ సృష్టి స్థితి లయ గతులు నీవనీ అనంత నామములన్నీ నీవనీ నిదర్శనములనొసగితివనగా నీ భక్తు...

16 February (16.02.) (47)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: సాయంకాలము - దేవుని పూజ, తులసి పూజ, ప్రదక్షిణం Evening- God worship, Tulasi Worship, Divine Circling (16 Feb)      47) ఏమి చేయగా నెంచితివో ఏమి చేయగా నెంచితివో నన్ను ఏమి చేయగా నూహించితివో ఎరుగలేనయ్యా సాయి దేవా పరమ పురుష ప్రేమ స్వభావా ॥ఏమి॥ బహు దుర్లభమగు మానవ జన్మను నా కొసంగీతివి వాత్సల్యముతో సార్ధకత లేని వ్యామోహంలలో ఎందుకు తోసితివయ్యా దేవా ॥ఏమి॥ చిక్కుల నెన్నో కల్పించెదవు ధైర్యమెసంగక దండించెదవు ఏమి చేసితినో నీ కపకారము కృప చూపక నన్నేడిపించుటకు ॥ఏమి॥ అధిక సంపదల నాశించలేదు అధికారంముల కోరగలేదు నిష్ట సబూరుల నా కొసగుమని నిను ప్రార్థించుట నేరమాయెనా ॥ఏమి॥

15 February (15.02.) (46)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: దినచర్య, ప్రార్థన, ప్రదక్షిణ, మిత భాషణం, సాత్వికాహారము, బ్రహ్మచర్యము, త్యాగము, దానము, సేవ, నామము చేస్తూ మిగతా సమయంలో నిద్రపోకుండా (పగటిపూట) సత్గంధపారాయణ, మహాత్ముల చరిత్రలు చదువుట సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము. Daily Deeds, Prayer, Divine Circling, moderate speaking, Diet food, Celibacy, Sacrifice, Donation, Service, Chanting rest of the time (during the day), Legends Recitation, Reading the histories of the sages is the practice compatible path to follow. (15 Feb)   46) ఏదిరా నిజమేదిరా? ఏదిరా నిజమేదిరా?  చివరకు నిలిచేదేది రా ? అనుమానములను అంతము చేసి అనంతమై మిగిలేదేదిరా ॥ ఏదిరా॥ జీవుడు, దేవుడు, ఒక్కటే  యనుచు అద్వైతము బోధించును రా జీవుడు దేవుడు వేరు వేరనుచు  ద్వైతము ఉద్భోదించును రా ॥ఏదిరా॥ ఉన్నది లేదని దేవుడు కలడని  అతడే మూలంబని యందురురా ఉన్నది కలదని దేవుడు లేడని  మనోరోగ మది యని అందురు రా  ॥ఏదిరా॥ వాక్కుకు మనసుకు అందని స్థితి యని అదియే దైవంబని యందరు రా ఊహాజీవుల సోమరి పోతుల పిచ్చి భావమది యని అందురురా...

14 February (14.02.) (45)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: నిర్ణీత సమయంలో నామజపము చేయునప్పుడు ఉచ్ఛ్వాస-నిశ్వాసములతో పాటు నామము చేస్తూ, చెవులతో వింటూ, కళ్ళతో ఆయన రూపాన్ని చూస్తూ నామము చెయ్యాలి. నామము చేయునప్పుడు ఉత్తర దిక్కుగా గానీ, తూర్పు దిక్కుగా కూర్చొని చేయాలి. జపము చేయునప్పుడు భగవత్ శక్తి మనలో పూర్తిగా ఆవహించినట్లుగా భావన చేసుకోవాలి. At the scheduled time, while performing Chanting, name should be chant with inhalations and exhalations. Listen it ears, see his form with eyes. When chanting sit in the north or east direction. While chanting feel that the Divine power is fully absorbed in us. (14 Feb) 45) ఏ ప్రాంతమందున ఏ ప్రాంతమందున జనన మెందితివో కులమేమో మతమేమో నీదు పేరేమో ? తెలియగా లేరయ్యా! రూప గుణ రహిత రామ శివ మారుతి దత్త గురు సాయీ ॥ఏ ప్రాంత॥ పత్రీ గ్రామము నందు జనన మెందితివంట జమునాబాయ్ నందలాల్ తనయుడ నీవంట బాల్యము నందె యెక ముస్లిం ఫకీరు కడ ప్రేమ వాత్సల్యముల పొంది పెరిగితివంట ॥ఏ ప్రాంత॥ నీదు సంకల్పమున వేంకుసా గురుచేరి శుశ్రూషులను చేసి కర్తవ్య మెరిగి గురుని ఆజ్ఞల బొంది గోదావరిని చేరి ఆ చెంతనే నున్న షిరిడీ ...

13 February (13.02.) (44)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: దానము - పాత్రతనెరిగి దానము చేయవలయును. శక్తి వంచన లేకుండా దానము చేయాలి. Donation - Donate by understanding Role, Donate without the deception of energy. (13 Feb)   44) ఏల కానరావయ్య ఏల కానరావయ్య బృందావన విహారా ఎందు దాగినావయ్యా రాధా మానస చోరా॥ ఏల॥ పున్నమి వెన్నెల రాత్రులు కన్నుల పండువు జేయగ నానా విధ సువ్ర బాలలు సుగంధముల విరజిమ్మగ సుందర యమునా తీరము నీ రాకకు తపించగ చల్ల చల్లని పిల్లగాలి నీ కొరకటు నిటు దిరుగగ ॥ఏల॥ చిరుమువ్వల సవ్వడులు ఘల్లు ఘల్లుమనగ మురళీనాదము మోహనరాగ మాలపించగా సమ్మోహమున జగమే సంతసమును బొందగా నీ పద భక్తులు నీకై పరిపరి విధముల వేడగా ॥ఏల॥

12 February (12.02.) (43)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: త్యాగము - పోటీలు, వంతులు, కీచులాటలు లేకుండా భగవంతుని సేవగా భావించాలి. పోటీలు, వంతులు, కీచులాటలు మానుటయే త్యాగము. Sacrifice - Without competition, shares, and shouts, should be feel as service of the God. Leaving competition, shares, and shouts is called the sacrifice. (12 Feb)   43) ఏ క్షణమున నీ కరుణ ఏ క్షణమున నీ కరుణ ప్రసరింప చేతువో ఏ క్షణములో నన్ను ప్రేమ గాచెదవో॥ఏ॥ సాయి....రామా.... సాయి.... రామా ॥ఏ॥ అయిన వారెవరయ్యా, కాని వారెవరయ్యా ఉన్నదేదోనయ్యా ణలేనిదేదోనయ్య ఏ తీరుగా నేను జీవించవలయునో ఏమాత్ర మెరుగక నిన్ను నమ్మితినయ్యా ॥ఏ॥ క్రుళు కుత్సితముల నెరుగగా లేదయ్యా వంచనల మోసముల దెలియగా లేనయ్యా ఇచ్చికము లాడేడి మనసు లేదు గదయ్యా లోకంబులో నేను బ్రతుకు విధమేదయ్యా ॥ఏ॥ పరుల సంపదలకు ఆశపడలేదయ్యా మెప్పుదనముల గోరి మిడిసిపడ లేదయ్యా కలిగినంతటిలోనే కాపుర మెనరింప నీ ఆశ్రితుల కేల కలత లిచ్చితివయ్యా ॥ఏ॥ దీన జన బాంధవా దిగులు తొలగించుమా ఆశ్రిత పోషకా నన్నాదు కొమ్మా ద్వారకామాయశా దరి జేర్చరమ్మా శామచరణానాధులకు సంతసమ్ములిమ్మా ॥ఏ॥

11 February (11.02.) (42)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: బ్రహ్మచర్యము - నిరంతరము భగవంతుని విషయములతో చరించుట బ్రహ్మచర్యము. Celibacy - Celibacy is the constant contact with the things of God. (11 Feb)   42) ఎంత చిత్రమైనదో నీ లీల ఎంత చిత్రమైనదో నీ లీల మరెంత చిత్రమైనదో మా గోల ॥ఎంత॥ నీదు లీల నెరుగకయే మా గోలల వినిపింతుము విసుగు గొనక వినుచుంటివా కరుణాలోలా॥ ఎంత॥ ఆనందము నందు గానక అందరినీ రమ్మనుచు ఆదర మోవ్వగ ప్రేమతో బిలుచుచు, నుండగ ఆనందమున కర్దము తెలియలేని మా బ్రతుకుల ఆకారమే అహమును పెంచును అల్పుని జేయునే మనసా వినయ వివేకములు, లేని ఎడల అది విషముగా మారునే మనసా అనుకున్నది నిజమని బ్రభమియక, నిజము తెలియవే మనసా నిను నీ వెరిగిన శ్యామనాథుని నిక్కము తెలియవే మనసా ॥ఎంత॥

10 February (10.02.) (41)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: శరీరారోగ్యమునకు, శక్తికొరకు మితాహారము తీసుకొనుట, భగవంతుడికి నివేదన చేసినది భుజించుట, ఆహారం తీసుకొనునప్పుడు మౌనముగా కానీ భగవన్నామముతో గానీ ఆహారమును తీసుకొనుట, తయారుచేయనప్పుడు దైవ నామముతోనే చేయుట, భోజనము చేయునప్పుడు భగవంతుని నోట్లో పెడుతున్నట్లుగా భావించుట - సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము. For physical health, energy.. take diet food, offer to God, Eat in silence or with chanting name. Take food in the name of God, feel that you are putting in the God's mouth. It's the practice compatible path to follow. (10 Feb)   41) ఎంత మధురము ఎంత మధురము, నీ నామమెంత మధురము ఎంత మధుర మెంత మధురము మధురాతి మధురము నీదు నామము సాయి రామ తండ్రీ సాయి రామ దేవా సాయి, సాయి ,సాయి, సాయి, సాయి, సాయి యనిన ఎంతకాల మెంతకాల మెంతకాల మనిన గాని రామ, రామ,రామ ,రామ ,రామ, రామ, యనిన ఎంతకాల మెంతకాల మెంతకాల మనిన గాని సాయిరాం, సాయిరాం ,సాయిరాం అనిన గాని సాయి తండ్రి ,సాయి తండ్రి ,సాయి తండ్రి అనిన గాని సాయి దేవ ,సాయి దేవ, సాయి దేవ యనిన గాని సాయి బాబ, సాయి బాబ, సాయిబాబ యనిన గాని సాయి...