18 February (18.02.) (49)

శ్రీ శారదా శ్యామ సందేశం:
నిరంతరము జరిగే ప్రతి కార్యక్రమము ఒక సాధన (అది పని కానీ, నామము కానీ)
Every activity that happens Constantly is a Divine Practice (whether it is work or Chat). (18 Feb)
 


49) ఎందులకీ యోచనలు
ఎందులకీ యోచనలు మనకెందులకీ సమాలోచనలు
యోచనల చేసి తీర్పుల చేసి సాధించునదా సాయి మార్గము ॥ఎందు॥

సాయి సాయి అని పలుకుట తోడనే సమయము లెల్ల గడిచిపోయినె
సాయియె సకల విశ్వమయుండని సత్యము నేరిగే సమయమ దెప్పుడు ॥ఎందు॥

వాదన చేత వ్రాతల చేత వ శమవునా శ్రీ సాయి మార్గము
భజనల చేత ప్రార్థనల చేత అనుభవమగునా సాయి మార్గము ॥ఎందు॥

అంతరంగమును శుద్ధి చేసుకుని, త్రికరణ శుద్ధిగా పలుక నేర్వని
మనసుల తోడ మరి మరి వెదికిన మనకు దొరకునా సాయి మార్గము ॥ఎందు॥

తన మనసునే తాను నమ్మలేని తత్తర పడెడి మందభాగ్యులకు
చీటికిమాటికి చిరుబురులాడుచు ఓర్పుగ నుండని మతిహీనులకు
ఎటు కలుగునో కదా శ్రీ సాయి కృప
ఎటు నడుతురో గదా సాయి మార్గము ॥ఎందు॥


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)