1 February (01.02.) (32)
శ్రీ శారద శ్యామ సందేశం:
లోక కోరికలను, ఆశలను కొనసాగనివ్వక ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మునికి సంబంధించిన కార్యక్రమములలో మనస్సును లగ్నం చేస్తే, శ్రీ గురుని కృప అనుభవమునకు వస్తుంది.
Do not let worldly desires and hopes to continue, Engage the mind in activities related to the God that bestows bliss, then will experience the grace of Sri Guru. (1 Feb)
32) శాంతి నొసగుము
శాంతి నొసగుము దేవదేవ
సాయి దేవా శరణము (2).
శరణము శరణము శరణము
సాయి దేవా శరణము (2) ||శాంతి॥
తెలిసి తెలియక దోసములను
తెలిసి తెలియక దోసములను
చేసినామని చింత చేయకు (2)
కన్న తండ్రివి నీవుగాక గాచు వారెవరయ్య మమ్ముల||శాంతి॥
మంచి చెడుగుల తెలియుమయ్య
మాయ మర్మము లెరుగు మయ్యా
మనసు నిండుగ నిన్ను నమ్మిన
మమ్ము కరుణతో కావరావా ||శాంతి॥
జపతపంబుల చేయలేము
ధ్యానములనొనరించలేము
తోచినట్టుల సాయి
స్మరణము చేయుచుంటిని కరుణతో ||శాంతి॥
దీనజనులను బ్రోతు వీవే
బాధ్యతల భరియింతు వీవే
సద్గతుల నందింతు వీవే
శ్యామ చరణుని దైవ ||శాంతి॥
కన్న తండ్రివి నీవుగాక గాచు వారెవరయ్య మమ్ముల||శాంతి॥
మంచి చెడుగుల తెలియుమయ్య
మాయ మర్మము లెరుగు మయ్యా
మనసు నిండుగ నిన్ను నమ్మిన
మమ్ము కరుణతో కావరావా ||శాంతి॥
జపతపంబుల చేయలేము
ధ్యానములనొనరించలేము
తోచినట్టుల సాయి
స్మరణము చేయుచుంటిని కరుణతో ||శాంతి॥
దీనజనులను బ్రోతు వీవే
బాధ్యతల భరియింతు వీవే
సద్గతుల నందింతు వీవే
శ్యామ చరణుని దైవ ||శాంతి॥
Comments
Post a Comment