6 February (06.02.) (37)
శ్రీ శారదా శ్యామ సందేశం:
ప్రాతఃకాలమున 4 గంటలకు బ్రాహ్మీముహూర్తమున నిదురలేచి, మనోప్రార్థన చేసి, కాలకృత్యములు తీర్చుకొని, 5 గంటల నుండి సాధన మొదలు పెట్టవలెను.
In the Early-morning at 4'o clock on Brahmimuhurth wake up, perform physiologically pray, complete timely-deeds, from 5'o clock start practicing. (6 Feb)
37) ఎంత చిత్రమైన వాడివయ్యా
ఎంత చిత్రమైన వాడివయ్యా సాయినాథనీవెంతో చిత్రమైన వాడివయ్యా ...సద్గురు నాథ ||ఎంత||
కంటికి కనిపించకనే కరుణతోడ గాచెదవు
నీ దరిశన మీయకనే నిదర్శనము చూపెదవు
వింత వింత అనుభూతుల విభూతుల నొసగెదవు
అది ఇది యని దెలియరాని ఆనందము నిలిపెదవు ||ఎంత||
ఎంతటి దూరమున నున్న నీ వారిని చేసుకొందువు
ప్రేమగా పాలించుచు పవిత్రులుగ జేయుదువు
దుష్కర్మల ఫలితములను దూరము గావించెదవు
అంతట నీవున్నావని అనుభూతుల నొసగెదవు ||ఎంత||
చీమ దోమ శునకాదులుగా దరిశన మొసగెదవు
అది తెలియని శ్యామాదుల నాటల నాడించెదవు
నాది నీదను భావము నాశన మొనరించెదవు
నేర్పుగ నీవారి కెల్ల సద్గతులందించెదవు ||ఎంత||
Comments
Post a Comment