5 February (05.02.) (36)
శ్రీ శారద శ్యామ సందేశం:
మోసేవాడువుండగా మనకెందుకు భయము, దిగులు? ఆ సమయములో మనమేమి చేయాలో- ఆయనే మన చేత చేయిస్తాడు. మనము చేయవలసిందల్లా - అన్నీ ఆయనకు నివేదించుకోవడమే!
Why do we fear and worry when there is someone who carries it? At that time, what should we do, that, he will make us do it. All we have to do is report everything to Him! (5 Feb)
Why do we fear and worry when there is someone who carries it? At that time, what should we do, that, he will make us do it. All we have to do is report everything to Him! (5 Feb)
36) ఎంత కాలమని
ఎంత కాలమని వేచియుందురా
ఏ క్షణమని నేనెదురుజూతురా
దయ జూపి నీ దరిశనమీయవు
మనసారగా నాతో మాటలాడవు ||ఎంత||
ఈ జన్మము నా కెటు లేర్పడెనో
ఏ ఏ కర్మము లెపుడు జేసితినో
ఏది ఎందులకు జరుగుచు నుండునో
తెలియక నీ భువి బ్రదుకు గడుపుచు ||ఎంత||
నిను నమ్మినచో నిర్భయ మగునని
నీ నామ స్మరణమే నిష్ట నొసగునని
సద్గురు సేవలే సబూరి యగునని
అపార కరుణతో బోధింతువనీ ||ఎంత||
అరిషడ్వర్గము లధికము లాయెను
సదాలోచనలు శూన్యము లాయెను
ఎదలో వేదన ల మితములాయెను
దరి చేరగా నీ వాదరింతువని ||ఎంత||
ఒకపరి నిను శరణాగతి వేడిన
వారల కరుణతో చేకొందువనీ
నమ్మితి నీ పదము లా శ్రయించితిని
నీ దరి జేరగా శ్యామ సన్నుతా ||ఎంత||
Comments
Post a Comment