7 February (07.02.) (38)

శ్రీ శారద శ్యామ సందేశం:

ప్రార్థన - ప్రాతః స్మరణ, గురుపాదుకాస్తవము, గురుగీత, దక్షిణామూర్తి శ్లోకములు, దత్తస్తవము, లింగాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రము, ధ్యానము, స్తోత్రం చేయవలెను.P

Prayer - Morning Chant, 'Gurupada astakam', 'Guru Gita', Dakshinamoorthy hymns, 'Dattastavamu', 'Lingashtakam', "Vishnu Sahasranama Stotramu", Meditation, "Stotram" should be done. (7 Feb)



38) ఎందుకు నాతో ఆటలాడెదవు

ఎందుకు నాతో ఆటలాడెదవు ద్వారకమాయిశా
తగునా నన్నిటు నటు దిప్పగా షిరిడి సాయిశా ॥ఎందుకు॥
ఎందరెందరినో నా కడ కంపుచు నక్కియుందువయ్యా
అందరిలోనూ దర్శన ముసగుచు వెక్కిరింతువయ్యా ॥ఎందుకు॥

అనేక రూపంబులను ధరించి ఆదరింతువయ్యా
అన్నివేళలలో నా హృదయంబున దాగి యుందువయ్యా ॥ఎందుకు॥

క్రోధముతో నన్నాడగా చేయుచు నవ్వుచుందువయ్యా
ధైర్యమే లేకుండా జేసి దారి జూపవయా
కష్టమునందున మనసును ద్రోసి కానుపింపవయ్యా
సుఖముల నెన్నో కలుగజేయుచూ సంతసింతువయ్యా ॥ఎందుకు॥
 
శాంత గుణంబుల నా కందించుచూ సేదదీర్తువయ్యా
సైర్య ధైర్యముల మనసున నిలిపి సేమమిత్తువయ్యా
ప్రేమ భావమును పెంపొందించుచు పరిపాలింతువయ్యా
దైవభావమును నా మది నిలిపి దయ జూపింతువయ్యా ॥ఎందుకు॥

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)