4 February (04.02) (35)

శ్రీ శారద శ్యామ సందేశం:

గురుకృప: తల్లి స్తన్యము వచ్చినట్లు. తల్లి పాలు రావాలని - అనుకోదు కదా! అదే విధంగా గురుకృప కూడా అర్హత కలిగి ఉంటే దానికై అదే వస్తుంది.
Guru's Grace: Like a mother's breast has come. She don't want mother's milk to come - right! Similarly, Guru's Grace also comes for the same if it is worthy. (4 Feb)
 


35) ఎన్నడు నీ దయ

ఎన్నడు నీ దయ కలుగునో
నేనెన్నడు నీ దరి జేరుదునో
భవ బంధమ్ముల వలలు తెంచుకొని
బ్రహ్మానందము నెపుడు పొందుదునో
సాయి రామ... రామ సాయి... సాయి రామ ||ఎన్నడు||

మంచి చెడుగులను మది నెరుగకనే
తోచిన దారుల సాగుచుంటిని
ధ్యాన సాధనల సంగతు లెరుగక ,
మందమతిగ భువి మసలు చుంటిని ||ఎన్నడు||

ఎన్ని జన్మల పాప ఫలితమొ
మది నిలువదు నీ చరణములపై
ఏ ఏ దుశ్చర్యల ప్రతిఫలమొ
చేయగ నైతిని నామ జపంబును ||ఎన్నడు||

ఇహమున దేనిని పొందనైతిని,
పరమే తీరుగ నుండునో తెలియదు,
ఎందుకు యీ విధి శోధించెదవో
శ్యామచరణుని బాధించెదవో ||ఎన్నడు||


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)