14 February (14.02.) (45)
శ్రీ శారదా శ్యామ సందేశం:
నిర్ణీత సమయంలో నామజపము చేయునప్పుడు ఉచ్ఛ్వాస-నిశ్వాసములతో పాటు నామము చేస్తూ, చెవులతో వింటూ, కళ్ళతో ఆయన రూపాన్ని చూస్తూ నామము చెయ్యాలి. నామము చేయునప్పుడు ఉత్తర దిక్కుగా గానీ, తూర్పు దిక్కుగా కూర్చొని చేయాలి. జపము చేయునప్పుడు భగవత్ శక్తి మనలో పూర్తిగా ఆవహించినట్లుగా భావన చేసుకోవాలి.
At the scheduled time, while performing Chanting, name should be chant with inhalations and exhalations. Listen it ears, see his form with eyes. When chanting sit in the north or east direction. While chanting feel that the Divine power is fully absorbed in us. (14 Feb)
45) ఏ ప్రాంతమందున
ఏ ప్రాంతమందున జనన మెందితివోకులమేమో మతమేమో నీదు పేరేమో ?
తెలియగా లేరయ్యా! రూప గుణ రహిత
రామ శివ మారుతి దత్త గురు సాయీ ॥ఏ ప్రాంత॥
పత్రీ గ్రామము నందు జనన మెందితివంట
జమునాబాయ్ నందలాల్ తనయుడ నీవంట
బాల్యము నందె యెక ముస్లిం ఫకీరు కడ
ప్రేమ వాత్సల్యముల పొంది పెరిగితివంట ॥ఏ ప్రాంత॥
నీదు సంకల్పమున వేంకుసా గురుచేరి
శుశ్రూషులను చేసి కర్తవ్య మెరిగి
గురుని ఆజ్ఞల బొంది గోదావరిని చేరి
ఆ చెంతనే నున్న షిరిడీ చేరితివంట ॥ఏ ప్రాంతమందున॥
బాధితులందరినీ బాగుపరచితి వంట
సద్భక్తులకు ముక్తి పదము నిచ్చితివంట
నమ్మి నిన్నే గొలుచు శ్యామ చరణునిగాచి
రక్షించి బ్రోచుచూ నిలిచి యున్నా వంట ॥ఏ ప్రాంతమందున॥
Comments
Post a Comment