19 February (19.02.) (50)

 శ్రీ శారదా శ్యామ సందేశం:

మనస్ఫూర్తిగా భగవన్నామస్మరణము భక్తితో చేస్తూ ఉంటే - భగవంతుడే నీకు అండదండగా తోడు-నీడగా ఉంటాడు. సమర్థ సద్గురు రూపములో భగవంతుడు అవతరిస్తాడు. కావున, సమర్థ సద్గురువు మనకు లభించిన, మరొక దైవమును సేవించవలసిన అవసరం లేదు. ఆరాధన, అర్చన, నామస్మరణము, ఆత్మసమర్పణము అన్నీ గురువునకే. శ్రీ గురువు మాత్రమే జీవిని తరింపచేయగల సమర్థుడు. శ్రీ గురు కృప పొందగలిగేలా కృషి మాత్రము తీవ్రముగా మనము చేస్తూ, ఓర్పుతో ఉండాలి.

Wholeheartedly Chanting divine name with devotion means God only will be your companion and shadow. God incarnates in the form of Competent Guru. Therefore, we do not have to worship another deity.... Worship, archana, Chanting name, Self-surrender do all to the Guru. Sri Guru is the only one who can drive away us. Work hard and be patient so that we can get the grace of Sri Guru. (19 Feb)
 

50) రామా పట్టాభి రామా
రామా పట్టాభి రామా రామా కోదండ రామా
రామా కళ్యాణ రామా రాఘవా
రామా సీతాపతి రామా నీవే గతి
రామా నీకు మ్రొక్కితి రామా నీచే చిక్కితి
రామా నాకెవరు తోడు రామా క్రీగంట జూడు
రామా నేను నీ వాడ రామా నాతో మాట్లాడు
రామా నీ నామమె మేలు రామా చించతనే చాలు
రామా నీ నామమె మేలు రామా నీ చింతనె చాలు
 

Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)