17 February (17.02.) (48)
శ్రీ శారదా శ్యామ సందేశం:
రాత్రి పడుకునే ముందు నిస్పక్షపాతంగా దినచర్య రాసుకొని, ఆత్మ పరిశీలన చేయాలి. మరునాడు చేసుకోవలసిన కార్యక్రమములు నిర్ణయించుకోవాలి. ఈ కార్యక్రమములు క్రమంగా చేసుకునేందుకై ఆరోగ్యమును, శక్తిని ఇవ్వమని శ్రీ సద్గురు దేవని ప్రార్ధిస్తూ నిద్రించాలి. ఓమ్ శ్యామ చరణం శరణం మమ.
Before going to bed at night, Impartially one should write the daily deeds and take Self-examination. For the next day decide what activities to do. In order to do these activities for health and energy. Pray SriGuru with "Om Shyaama charanam charanam charanam mama" and sleep. (17 Feb)
48) ఏ రూపంబని నిను
ఏ రూపంబని నిను ధ్యానించను,
ఏ నామంబని మది స్మరియుంచను,
ఏ నామంబని హృది జపియుంచను,
తెలియని దీనుడ శ్యామచరణుడును,
దయ నీవారల గావ వేడెదను ॥ఏ రూప॥
క్రిమి కీటక పశు పక్ష్యాదులలో
నర వానర దేవాది గణములతో
విశ్వమెల్లడల నీవున్నావని
నిదర్శనముల నొసగితి వనగా
నీ భక్తులకు జూపితి వనఘా ॥ఏ రూప॥
ఆది మధ్యంతరహితుడ నీవనీ
సృష్టి స్థితి లయ గతులు నీవనీ
అనంత నామములన్నీ నీవనీ
నిదర్శనములనొసగితివనగా
నీ భక్తులకు తెలిపితి వనఘా ॥ఏ రూప॥
Comments
Post a Comment