2 February (02.02.) (33)

 శ్రీ శారద శ్యామ సందేశం:

ఇవ్వడానికి అలవాటుపడితే అందులో వున్న ఆనందం మరెందులోనూ ఉండదని అనిపిస్తుంది. (స్వార్థ రహితంగా)
If you are accustomed to giving, the joy in it seems to be unmatched anywhere else (Unselfishly). (2 Feb)
 



33) ఎంత కాలమిటుల

ఎంత కాలమిటుల వేరు చేతువో సాయీ
వేరు చేసి పేరుతోడ బ్రతుక చేతువో సాయీ ॥ఎంత॥
 
నేను నేను నేననుచు , బ్రతుకు నిలా లాగుచుంటి
నీవు ప్రేమ మయుడవంచు నిజ ముగ ప్రేమించకుంటి
కరుణామయుడవని బలుకుచు కలలో నిను దలచకుంటి
నిదుర మెలకువలలోన నన్ను నేనే దలచుచుంటి ॥ఎంత॥

నీ శక్తిని చూచి శరణు శరణనుచూ పలుకుచుంటి
భక్తి భావమే లేక భజనలనే జేయుచుంటి
నిజముగను నమ్మినటుల నిండుగ నటియించు చుంటి
భౌతిక వాసనల యందు బహు విధముల దగులు కొంటి ॥ఎంత॥

ఏ ఎండల కా గొడుగుల పట్టుకు బ్రతుకుచు నుంటిని
సత్య ధర్మ ప్రేమ శాంతి మార్గములో నడువ కుంటి
అపరిమితంబగు స్వార్థపు రూపము నేనుగ నుంటి
శ్యామ యనుచు పిలువ బడుచు ప్రేమను తెలియగ నుంటి॥ఎంత||

వీటన్నిటి దాట గలిగె మార్గములను తెలియకుంటి
మూర్ఖుడనై నీ కృపకు పడిగాపులు గాచుచుంటి
శరణాగత రక్షకా శ్యామ నాయకా సాయి
దూరమ్మును నుసి చేసి పేరును పరిమార్చి
నీలోనే కలుపుకో నీలోనే నిలుపుకో నీలోనే నిరతమ్ము కలుపుకో నిలుపుకో || ఎంత ||


Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)