Posts

Showing posts with the label 07 July

(213) 31 July (31.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 31 Jul నీవెవరో, ఏమి చేస్తున్నావో, నీవలన నీకు ఎంత ఉపయోగమో, ఇతరులకు ఎంత ఉపయోగమో చూచుకుంటూ బ్రతికితేగానీ బ్రతుకుకు అర్థం తెలియదు. By watching who you are, what you are doing, how useful you are to yourself and how useful you are to others, if you live, then you know the meaning of life.     213) నా పాలి దేవుడు, నన్నేలు దేవుడు  (31.07.) నా పాలి దేవుడు, నన్నేలు దేవుడు, కృపానిలయుడు శ్రీ సాయినాధుడు అండగా, నా కుండగా, అండగా నాకు యుండగా భయమేల బాధేలా ఈ బ్రదుకులోన - ఈ బ్రదుకులోన సాయిరాం పాహిమాం - సాయిరాం రక్షమాం ॥సాయిరాం॥ (1) సత్యము ధర్మము తప్పని వారలను త్రికరణ శుద్ధితో నుండెడి వారలను సకల జీవులలో దేవుని జూచుచు సేవించు చుండెడి వారికి భయమా ॥నా పాలి॥ సాయిరాం పాహిమాం సాయిరాం రక్షమాం (2) శరణన్న వారలను వదలని వాడు కరుణతో భక్తులను గాచెడి వాడు అనాధ రక్షకుడు ఆశ్రశిత పోషకుడు అనాధనాథుడు దీన బాంధవుడు అండగా నాకు ఉండగా భయమేల, బాధేల, ఈ బ్రతుకులోన ఏనాటికైనా ఏ జన్మకైనా శ్యామచరణునికి ప్రేమను నేర్పి తనవానిగ చేసుకొనగ నెంచి శిక్షణ గరపుచు, రక్షణ నొసగుచు పరిపాల...

(212) 30 July (30.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Jul ఒక పెద్ద వృక్షము అనేక రకముల ప్రాణులకు ఆశ్రయమిస్తుంది. ఆ ప్రాణులు అక్కడ విశ్వాసముతో రక్షణ పొందుతాయి. గురువు కూడా అలాంటి మహావృక్షమే. మనమంతా వారి ఆశ్రయము పొందగల ప్రాణులము. A large tree shelters many species of animals. Those souls will be saved there by faith. Guru is also such a great tree. We are all beings who can take their shelter.     212) శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన  (30.07.) ( బీమ్పాస్ రాగం )   శ్రీకరమౌ నీ పద సన్నిధిలోన నిలచెడి భాగ్యము నొసగుమ మా సాయి (2) గంగా యమునలు ప్రవహించిన నీ పాదములే పరమ పావనములు సకల తీర్థ, సంపదల నిలయములు పతితుల కెల్లను పరమార్ధములు ॥శ్రీకరమౌ॥ (1) అవగాహనతో నీ చరితమును ఒకపరి అయినను చదివిన చాలును సకల దేవత సాధు జీవములు, సకల విశ్వము నీవని తోచును ॥శ్రీకరమౌ॥ (2) రాజైనను పేదవాలె జీవించెడి వాడు భగవంతుని కృపకు పాత్రుడవునంటివీ రాజాధి రాజులే పడిగాపులు కాచుచుండ భిక్షతో జీవించి ఆచరించి చూపితివి ॥శ్రీకరమౌ॥ (3) పరమాత్మవు నీవైనను మానవునిగ సంచరించి మమతానురాగములతో మనసుల మురిపించితివి భక్తుల కోరికలను దీర్చి అ...

(211) 29 July (29.07.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 29 Jul గురువు ఈ క్రింది వాటికి శిక్షణ ఇవ్వవచ్చును: శారీరక, మానసిక సంబంధములగు విద్య, శుభ్రత, బ్రహ్మచర్యము, సకలకర్మలు, సర్దుబాటుతనము, శక్తి, ఆరోగ్యము కొరకైన ఆహారము, సమయోచిత కార్య నిర్వహణ గుణము, తీర్థయాత్రలు, మహాత్ముల సందర్శనము, నిరాడంబర జీవితము, ఆధ్యాత్మిక ప్రవచనములు, గ్రంధ రచన, నైతిక విలువలకు కట్టుబాటు, ప్రచారానికి దూరంగా ఉండటము, ధ్యానము, నిర్భయత, స్థిరత్వము, అంకితభావంతో కూడిన మానవ సేవాతత్పరత మొదలగునవి, మరియు చివరగా గురువు అనుగ్రహంతో ముక్తి . శిష్యుడు తప్పనిసరిగా ఆధ్యాత్మిక తపన, సహనం కలిగి ఉండాలి. The Guru may give training in the following: physical and mental relative education, cleanliness, celibacy, all deeds, adjustment, energy, healthful diet, proper conduct of work, pilgrimages, visits to Mahatmas, humble life, spiritual discourses, writing scriptures, adherence to moral values, Abstention from propaganda, meditation, fearlessness, steadiness, devoted human service, etc., and finally liberation by the Guru's grace. A disciple must hav...

(210) 28 July (28.07.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Jul గురువు ఈ క్రింది వానిని పరీక్షించవచ్చును: నిరహంకారము, సత్యసంధత, వ్యక్తిత్వము, సమయ పాలనము, నిస్వార్థము, నమ్మకము, ధైర్యము, విశ్వాసము, సహనము, నిష్కపటపు ఓర్పు, సఖ్యత, కోమలత్వము, ప్రశాంతత, శారీరక, మానసిక అర్హత, కాయకష్టము, గ్రహణ శక్తి, జాగరూకత, ఆచరణము, నమ్రత, శక్తి సామర్థ్యములు, నిజాయితీ, సమయోచిత ప్రజ్ఞ, ఎరుక, సాహసము, సత్వస్వభావము, కృతజ్ఞత, ప్రేమ, చురుకుదనము, పెద్దలయందు గౌరవము, విశాల దృక్పథము, కుశాగ్రబుద్ధి మొదలైన గుణముల లక్షణములు, సంస్కారములు. The Guru may test him on the following: Humility, truthfulness, personality, time management, selflessness, trust, courage, faith, patience, sincere endurance, harmony, gentleness, composure, physical, mental fitness, hard work, perceptive power, vigilance, practicality, modesty, Strength, honesty, timely intelligence, consciousness, adventure, true nature, gratitude, love, activeness, respect for elders, broad perspective, alert mind, etc. characteristics and qualities.   210) శారద రమణా శ...

(209) 27 July (27.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 27 Jul మతం అంటే దైవ యెడ, మానవుని యెడ ప్రేమ తప్ప మరేమీ కాదు. జీవితం అశాశ్వతం, కానీ బుద్ధిహీనులు దాన్ని సత్యమని యెంచి దానిలో చిక్కుకొని పోతారు. Religion is nothing but love for God and Human. Life is impermanent, but the unintelligent thinks it is true and get caught up in it.     209) సాయి స్వరూపా - శ్యామాచరణా (27.07.) సాయి స్వరూపా - శ్యామాచరణా చల్లగ చూడుము - ఓ దేవా కరుణాలయ వాసా - శ్యామా  మము బ్రోవగ రావా - దేవా  ॥సాయీ॥ (1) నిరతము నిన్నే భజియుంతుమయా సతతము మమ్ము మరవకుమా ఎల్లవేళలా మమ్ము బ్రోవుమా శాంతి స్వరూపా - శ్యామా చరణా ॥సాయీ॥ (2) కరుణ చిలుకు నీ చల్లని చూపులే నిరతము మా మది దోచునయా ప్రేమతో చూచి వేగమే బ్రోవుమా శారద రమణా శ్యామా చరణా ॥సాయీ॥ (3) చూపులేని దీనురాలికి చూపు నొసగి కరుణించి, కాపాడి, రక్షించి నావు చల్లని తండ్రీ శ్యామా చరణా చల్లని తండ్రీ శారద రమణా ॥సాయీ॥

(208) 26 July (26.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 26 Jul నది నిస్సంగ భావాన్ని, అంకిత భావాన్ని నమ్రతను బోధిస్తుంది. జీవితం కూడా నది వలెనే అనంత దివ్య మహా సాగరం వైపు ప్రవహిస్తోంది. The river teaches unsocial feeling, dedication and modesty. Life itself is like a river flowing towards the Infinite Divine Ocean.   208) ముప్పది వత్సరములన్ని (26.07.) ముప్పది వత్సరములన్ని ముచ్చటగా గడిపితిమని కలిసిమెలిసి బ్రతికితిమని కలతలసలే లేవనుచును మరవకండి మహామాయ ప్రభావమును మదిలోన ముసలి తనము  ముసుగువేసి ముందుకొచ్చె పరుగునా వారు వారు చేసినట్టి కర్మములకు అనుగుణముగ వారి వారి మనోభావములకు సక్రమముగా అనుభవించ వలసి యుండు ఫలితములను క్రమముగా జగదీశ్వరుడాడించెడి నాటకమున పావులుగా ॥ముప్పది॥ (1) నేను నాదను భావమే అన్నిటికీ మూల మనచు అది తొలగిననే గానీ ఆనందము నిలువ దనుచు సద్గురును సేవింపక జీవులు తరియించరనుచు భగవాన్ రమణు లొసగిన ఉపదేశంబును మరిచి ॥ముప్పది॥ (2) జీవితమందున సాధన భాగము కాదని తెలిసి సాధనలో జీవిత మొక భాగమనెడి సత్య మెఱిగి   శ్రీ సాయి సూక్తుల ఆచరణకు మీరంకితమై సుఖియించుడు, తరయించుడు శ్యామనాథు కృపతోడా ॥ ముప్పది ...

(207) 25 July (25.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 25 Jul "ప్రేమపూరిత కరుణ” శాసనాలకన్నా గొప్పది.  దానాలు, కర్మకాండలకన్నా అదే గొప్పది. "Loving compassion" is greater than statutes.  It is greater than deeds and rituals.   207) భగవన్నా మమే తరుణోపాయము (25.07.) భగవన్నా మమే తరుణోపాయము బంధము లూడుట కదే ఉపాయము ॥భగవాన్ నామమే॥ (1) నేను నాదనెడి భావము చేత బంధింపబడిన బడుగు జీవులకు అజ్ఞానముతో అలమటించెడి అసలు సత్యమును తెలియని వారికి  ॥భగవాన్ నామమే॥ (2) ఆనందమునకు ప్రాకులాడుచూ అది ఐహికమున కలదని ఎంచుచు కామాదులతో పరిభ్రమించుచు అశాంతితోడ జీవించు వారికి ॥ భగవన్నామమే ॥ (3) వాల్మీకి వ్యాస మహా ఋషులందరూ తుంబుర, నారద, గంధర్వులందరూ త్యాగయ్య , అన్నమయ్య భక్తాదులెందరో మైమరచి, స్మరియించి, పులకించి, తరియించ ॥భగవన్నామమే॥ (4) నామదేవ, జ్ఞానదేవ, తులసీ, తుకారాము, ఘోరా, మీరా, పురందర, రామదాస కబీరు చైతన్య, రామకృష్ణ శ్యామా ఎందరెందరో మహానుభావులు అనుసరించిన అద్భుత మార్గము   పతిత పావనుని చేరెడి మార్గము  మానవాళి కిదే సులభ మార్గము సాయినాధుడందించిన మార్గము కలిమాయను దాటెడి నుపాయము ॥భగవన్నామమే॥ (19.03.1986 రా.11...

(206) 24 July (24.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 24 Jul ధనం సంపాదించవచ్చు. వస్తువులు కొనవచ్చు. కాని తల్లిదండ్రులను, సత్పురుషులను కొనలేము. వారి సలహాలు చీకట్లో దీపాల వంటివి. తెలివిగా నిర్ణయం తీసుకో. Money can be earned. Things can be bought. But parents and True-men cannot be bought. Their advices are like lamps in the dark. Make a wise decision.     206)  పాహి పాహి యనుచు  (24.07.) పాహి పాహి యనుచు నీదు వెంట నేను బడుదు ననుచు పారిపోవ నుంటివా సాయీ దేహి దేహి యనుచు నిన్ను కోరికలతో దేబరించ రాలేదు లే నేను సాయీ ॥పాహి॥ (1) కామ క్రోధ లోభ మోహ మద మత్సరముల వలలో చిక్కి నిన్ను వేధింతున సాయీ నీకోసమే నిన్ను నేను ప్రేమించి సేవించ లేననుచు భయమొందితి సాయీ ॥పాహి॥ (2) ఎంతటి కష్టములనైన భరియించెడి శక్తి నొసగి కృప జూపి బ్రోవుమా సాయీ అంతట నీవే నిండి యున్నావను సత్యమును   శ్యామదేవులకు దయసేయుమా సాయీ ॥పాహి॥ (06.01.1986 సోమవారము రాత్రి 9:50 గం.కు)

(205) 23 July (23.07.)

Image
 శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Jul విగ్రహారాధన చేస్తూ పరులను దూషించడము భక్తి కానేరదు. క్షమ - భక్తుని శాశ్వత ఉజ్జ్వల స్వభావము. మనము మంచివారమైతే అంతా మంచిగనే వుంటుంది. While worshiping idols, blaspheming people is not piety. Forgiveness - the eternal radiant nature of the devotee. If we are good, everything will be good.     205) శీలధీ యనగా సఛీలమునకు నిలయము  (23.07.) శీలధీ యనగా సఛీలమునకు నిలయము శీలధీ రూపాంతరమే షిరిడీ నామము ॥శీలధీ॥ (1) సఛీలముతో షిరిడి గ్రామములో నడుగిడిన దుఃఖములన్నియు నశించు సాయినాథు సత్కృపతో సత్యమూ..... ఇది సత్యమూ సాయినాథుడొసగినట్టి అభయ ప్రదానము సత్యమూ..... ఇది నిత్య సత్యము ॥శీలధీ॥ (2) సకల జీవుల కెల్ల సర్వకాలములలోన ప్రవేశమును కలిగించునదే ద్వారకమాయి సకల జీవులన్నీ యొక్కటే అను అవగాహనతో అడిగినచో సంతోష సుఖములు లావరించును ॥శీలధీ॥ (23.12.1985  ఉ.2.59 గం.కు)

(204) 22 July (22.07.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Jul నీ అనుభూతులను, ఆవేశాలను అణచ వద్దు. ఎవరి వద్ద నీవు స్వేచ్ఛగా మన గలుగుదువో ఆయనతో హృదయంలోని భావాలను పంచుకో. Do not suppress your feelings and emotions. With whom you are free, with him share the feelings of the heart.   204) సనాతనా -  అధునాతన రూపములో  (22.07.) సనాతనా -  అధునాతన రూపములో షిరిడీలోన అవతరించితివి సాయి బాబాగా సాయి బాబా గా ॥సనాతనా॥ (1) భౌతికముగ అరువది వత్సరములు శిధిలమైన ఆ మసీదులోన వసియించిననూ విశ్వవ్యాపివై మానవులకు అనుభవముల నొసగిడి ॥సనాతనా॥ (2) సకల జీవులలో దైవము గలడని మతములన్నియు మనుషులకే నని అనుభవముల దయతో కలిగించుచు ఆనందమార్గములో నడపించెడి - ॥సనాతనా॥ (3) వేదశాస్త్ర పురాణాదులకు సరియగు నిర్వచనమే నీ జీవితము నీ సూక్తులకు అంకితమైనచో సత్యము అనుభవమౌ నీ కృపతో ॥సనాతనా॥ (4) తెలిసీ తెలియని పరిమిత మతితో నిను గ్రహించయించగ నెంచిన   శ్యామ దేవుని  కృప జూపి కరుణతో నడపింపుము నీ కొరకై నిను ప్రేమింపనీయుము ॥సనాతనా॥ (23.12.  ఉ.2.57 గం.కు మాల్కోస్ రాగం)

(203) 21 July (21.07.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Jul అన్ని సాధనలకు ఆరోగ్యకరమైన శరీరము,  ఆరోగ్యకరమైన మనసు అవసరము. For all practices a healthy body and  a healthy mind is necessary.     203) లేరెవరు నీ సాటి నను గావ గల మేటి  (21.07.) లేరెవరు నీ సాటి నను గావ గల మేటి, నా హృదయ మందిర నివాస సాయి,, నీ నోట ప్రతి మాట రతణాల మూటయే నా బోటి వారికది ధీటైన బాటయే మాటిమాటికి నీవు తలపు వచ్చేవయ్యా నాటి నీ నటనతో కట్టి వేసితివయ్యా ll లేరెవరు ll సతము ప్రవహించెడి నీ ప్రేమ వాహిని లో నిలువునా ననుముంచి ఈత నేర్పించినావు దరికి రానీయవు నా దరికి రావు ఎందుకీ చిత్రమగు నటన నా తండ్రి llలేరెవరుll సర్వమును వదిలి నీవెంట రమ్మన్నావు బాధ్యతల భారములు వదల లేనని తెలిసి నాది నీదన్నావు, నడయాడమన్నావు ఇన్నిటిని సృజియించుటేల నా దేవా llలేరెవరుll

(202) 20 July (20.07.)

Image
 శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Jul సదా నిరంతర హరిగుణ గావో - నిరంతర భగవన్నామ స్మరణము, చేతనైనంత దానము, సత్సంగము కలియుగమున శ్రేష్ఠములని భాగవతమునందున్నది. ఇష్టమైన నామమును భక్తితో, ప్రీతితో భజియించుటయే మిగిలినవి. సమకూరుటకు మార్గము. Always continuous sing Hari characteristics. Constant remembrance of God, as much as possible donation. True-companionship is the best in Kali Yuga. The rest is to chant the beloved name with devotion and love. Way to get along. 202) నిన్ను వదలి బ్రదుకలేను  (20.07.) నిన్ను వదలి బ్రదుకలేను నిరామయా నిరంజనా నిర్గుణా సనాతనా సాయీ! (1) ఈ కనులకు కనిపించవు -   కలనైనను కనుపించవు ఊహలకే అందవు ఎటులుందు రా ! నేనెటులందురా నిను బాపి ఒంటరిగా ఎటులుందు రా !  ॥నిన్ను॥ (2) నీ నామమునే వింటిని -  నీ చరితమునే చదివితి నీ చిత్తరువును జూచితి -  అయినా ఏదో ఏదో లోలోన వెలితి, వెలితి, వెలితి - అది కనరాని వెలితి  ॥నిన్ను॥ (3) భౌతికమున నిన్నొకపరి ఒకేసారి ఒకసారి చూడనీయుమా - కృప జూపుమా - మాటలాడుమా - మాటలాడుమా - అది చాలు, అది చాలు, అది చాలు, అదే చ...

(201) 19 July (19.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Jul సదా సద్గురునికి దాసునిగా వుండటమే మన కర్తవ్యము. దాసుడే ధన్యుడవుతాడు. ఇది సత్యము. Our duty is to always be a servant of True-Guru. Servent will be blessed. This is the truth. 201) రమణ రమణ రమణ రమణా  (19.07.) రమణ రమణ రమణ రమణా యనరే!  మరణమనిన చింతించె మనసును గనరే! (1) నేనెవరని పరికించెడి మార్గము గనరే! దివ్య మార్గము గనరే! నేను నీవు నశియించెడి భావము గనరే! సద్భావము గనరే!  ॥రమణ॥ (2) ప్రారబ్దము నడిపించెడి తీరును గనరే!  లోక తీరును గనరే! లోకేశ్వరు సేవించెడి పధమును గనరే! దివ్య పధమును గనరే! ॥రమణ॥ (3) అరిషడ్వర్గములు జేయు వింతల గనరే!  వింత వింతల గనరే!  వింతల నశియుంప జేయు చరణము  గనరే!  రమణు చరణము గనరే! ॥రమణ॥

(200) 18 July (18.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Jul సేవలను అందుకొనుటకు కాక ప్రతి జీవికి ప్రతి దానికి సేవ చేయడానికే మనము ఈ భూమి మీదకు వచ్చామని అందరూ అనుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే బాధకు తావుండదు. There will be no suffering if everyone thinks that we have come on this earth not to receive services but to serve each and every living being. 200) ఏదిరా - నిజమేదిరా!     (18.07.) ఏదిరా - నిజమేదిరా! చివరకు నిలిచేదేమిరా!  అనుమానములను అంతము చేసి అనంతమై మిగిలేదేదిరా! (1) జీవుడు దేవుడు ఒక్కటే యనుచు అద్వైతము బోధించును రా! జీవుడు దేవుడు వేరు వేరనుచు ద్వైతము ఉద్భోదించును రా! ॥ఏదిరా॥ (2) ఉన్నది లేదని, దేవుడు కలడని  అతడే మూలంబని యందురురా! ఉన్నది గలదని, దేవుడు లేడని పిచ్చి భావమది యని యందురు రా! ॥ ఏదిరా ॥ (3) వాక్కుకు మనసుకు అందని స్థితి యది అదియే దైవంబని యందురు రా!  ఊహాజీవుల, సోమరిపోతుల మనోరోగమది యని యందురు రా! ॥ఏదిరా॥ (4) మంచి చెడుగులను బేధ భావములు లేని కాలమే లేదందురు రా! తర్కవాదములతో సత్యము తెలియుట సాధ్యము కాదందురు రా! ॥ఏదిరా॥ (5) విశ్వమె తానై తానే దైవమై నిలచిన జ్...

(199) 17 July (17.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Jul సమర్ధ సద్గురువే పరబ్రహ్మ. త్రికరణశుద్దిగా సద్గురువునకు ఆత్మ సమర్పణ చేసుకొనుటయే సత్యము అనుభవించుటకు మార్గము. Capable True Guru is Demiurge. With Trinity-Purity surrender the soul to the Guru. Its the way to experience the truth. 199) నేను నేననీ నేను నేననీ   (17.07.) నేను నేననీ నేను నేననీ  పలుకుచు నుంటివే శ్యామా (2) నీవెవరో యని  ఒక్కసారైనా  చూచుకొంటివా శ్యామా ॥నేను॥ నీవెవరోయని ఒక్కసారైనా యోచించితివా శ్యామా (1) నాది నాదని నాది నాదని  నీలుగుచు నుంటివే శ్యామా॥నాది॥ నీదేమున్నదో ఒక్కసారైన  యోచించితివా శ్యామా ॥నేను॥ దైవ మటంచును దైవ మటంచును  పలుకుచు నుంటివె శ్యామా దైవలక్షణము నొక్కటియునా తెలుసుకుంటివా  శ్యామా సద్గురు వటంచును  సద్గురు వటంచును వాగుచు నుంటివే   శ్యామా సద్గురు దేవుల తత్వ బోధలు  తెలుసుకుంటివా శ్యామా ॥నేను॥ ధనము ధనమని ధనము ధనమని  దేవులాడెదవే శ్యామా ధనము నీకేమి మేలు చేయునో  చూచుకొంటివా శ్యామా ॥నేను॥ ప్రేమ ప్రేమని ప్రేమ ప్రేమని  పలుకుచు నుందువే శ్యామా ప్రేమ ల...

(198) 16 July (16.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Jul సత్యం చెప్పే వాళ్లు తమ చర్యలను మరీ మరీ సమర్ధించుకోరు. ప్రేక్షకుల వలె చూస్తూ మౌనంగా వుంటారు. Truth tellers do not justify their actions too much. They watch and remain silent like spectators. 198) నీ పాద దూళిగా పడి యుండు  (16.07.) నీ పాద దూళిగా పడి యుండు  భాగ్యమును కలిగించు మా రామ సాయీ నిను జూచి పులకించి మైమరచి  తరియించ కరుణించు మా దేవ సాయి ॥నీ పాద॥  సాయి పాహి దేవా పాహి సాయి దేవా పాహి పాహి  (1) నీ సేవలోనే ఈ జీవితమంతయూ  కరిగి పోనీయు మా సాయీ నీ సేవకుల కెల్ల సేవలను జేయగా దయ జూపు మా దేవ సాయీ (నన్ను తరియుంప జేయుమా సాయి) ॥నీ పాద॥ (2)కామ క్రోధాదులకు కడుదూరమై  నీదు దరి జేర నీయుమా సాయీ నీ దృష్టియే నాకు అన్న పానాదులను  అనుభవం మోసగుమా సాయీ ॥నీ పాద॥ (3) సతతమ్ము నీ నామ స్మరణలో  పులకించ కృప జూపు మా ప్రేమ సాయీ శ్యామాదులకు నామ రూపముల నశియింప జేసి  కృప జూపు మా సాయీ నిను జేరు మార్గమున నడిపించి  శ్యామను తరియింప జేయుమా సాయీ ॥నీ పాద॥

(197) 15 July (15.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Jul Age (అర్హత) వస్తే stage (స్థితి) వస్తుంది. Age రావడం కోసం Sage (గురువు) ని ఆశ్రయించాలి. Age (eligibility) comes, stage (status) comes. Sage (Guru) should be approached for attaining Age. 197) ఏమి చూచుకొని నీకీ పొగరు (15.07.) ఏమి చూచుకొని నీకీ పొగరు వగరు వగరుగా వాగెద వేల పెరిగె పెరిగె గద నీ అహ మెంతో  తిరిగి ఒక్కపరి చూడవదేల ॥ ఏమి ॥ (1) నీ బ్రతుకేమో నీ గతి ఏమో  ఎరుగక నేమో పలికెద వేలా పలుకు నడకలకు పొంతన  ఎంతో తిరిగి నొక్కపరి చూడవ దేలా  ॥ ఏమి ॥ (2) నీ వారనుచును పెరవారనుచును  భేద భావముతో చూచెద వేలా  ఎవరు ఎవ్వరూ ఎవరెవరో  తిరిగి నొక్క పరి చూడవ దేలా ॥ఏమి॥ (3) అందరి తోడను అన్ని విషయముల తెలిసి తెలియకనే కూసెద వేలా కూతకు ఫలితము ఏమే తయనుచు  తిరిగి నొక్క పరి చూడవ దేలా ॥ఏమి॥  (4) పొగడిన పొంగుచు తెగడిన గ్రుంకుచు  స్థితులకు లొంగుచు వంగెద వేలా వగచి వగచి నీ వాడు మాటలను తిరిగి నొక్క పరి చూడవ దేలా  ఓరి శ్యామా నొక్క పరి చూడవదేలా ॥ఏమి॥

(196) 14 July (14.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Jul మనశ్శాంతి, నిస్సంగముగా జీవిస్తూ చివరకు ముక్తిని పొందడానికి దేవుడు మనకు బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ప్రకృతి ధర్మములను అధ్యయనం చేస్తూ గురు సహాయముతో భావి జీవిత పథకాన్ని రూపొందించుకోవాలి. To finally attain salvation, Living with Peace of mind, without association, God has given us intellect. With that use intellect , by studying nature's virtues, with the help of Guru formulate a future life plan.  196) నవరత్నముల వంటి నవవిధ భక్తులు (14.07.) నవరత్నముల వంటి నవవిధ భక్తులు  నా గురుని పాదాల ధూళి రజము  నా గురుని సేవలో నేను తరించిన  నాకేమీ కావలెను ఈ జగతిలో ll నవరత్న ll 1.సాయియన్నను వాడే, సర్వేశ్వరుడు వాడే  శ్యామయన్నను వాడే, శక్తి రూపుడు వాడే. 2.రాముడన్నను వాడే, రక్షించు నతడే, వాని దాసునకేల కలుగు చెడుగు శరణాగతిని చేసి గురుని నెరనమ్మిన  వాని మార్గములోన వాడే నడిపించు ll నవరత్న ll 3. తనను తన బరువులను తానే భరించును తానే కాపాడుచు తరింపచేయును  నను నమ్మిన వారే నా వారాలని బల్కి  నయముగా నేర్పుగా నడక నే...

(195) 13 July (13.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Jul గురువునకు నిజంగా సంపూర్ణ శరణాగతి చేసుకున్న వ్యక్తికి చింతలు, కోరికలు, విచారములు ఉండనేరవు. అతనికి తన గురు సంకల్పమే తప్ప తన సంకల్పమంటూ ఉండదు. A truly complete surrender to the Guru has no worries, desires and sorrows. He has only Guru's will, but not his will.  195) నిన్నెరుగ నా తరమా నీలమేఘశ్యామా (13.07.) నిన్నెరుగ నా తరమా నీలమేఘశ్యామా ప్రేమావతార శ్రీ సద్గురు సాయిరామా  ॥నిన్నెరుగ॥ (1) శుక శౌనక వ్యాసాదులు పడిగాపులు గాచుచుండ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బహువిధముల బొగడుచుండ క్షణక్షణమున అణువణువున నీ శక్తియే నిండియుండ సకల విశ్వమంత నీదు దయతోడనే సాగుచుండ  ॥నిన్నెరుగ॥ (2) ఏ పేరున పిలచి పిలచి నిన్ను పూజ చేసుకుందు ఏ రూపముగా తలచి నిరతము ధ్యానించు చుందు నాదని ఏమున్నదనుచు నివేదనల చేయుచుందు  ఏమి నేరుగ లేని బ్రతుకు ఎటుల లాగించు చుందు ॥నిన్నెరుగ॥ (3) అంతట నీవున్నావని ఎందరి నోటనో వింటిని  అందరినీ బ్రొచుచుండు ఆప్తుడ వీవని వింటిని  నాదేమి కర్మము నాకు తెలియ లేదాయె  అణువణువున నీ దివ్య దరిశనమే కలుగదాయె ॥నిన్నెరుగ॥ (4) నన్ను భువి...

(194) 12 July (12.07.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Jul మహాత్ముల మాట శిలాశాసనము. మానవుల మాట నీటి మాట. మనలను (మన సంస్కారములను గురించి) మనమే చూసుకోవాలి. పుస్తకములు, ఉపన్యాసములు, చర్చలు - అవగాహన, ఆచరణలు లేనప్పుడు నిరుపయోగములు. పైగా గర్వమును, అహంకారమును పెంచుతాయి. The words of the greats are epitaphs. The word of man is the word of water. We have to look after ourselves (about our rituals). Books, lectures, discussions are useless In the absence of awareness and practice. Moreover, it increases pride and arrogance.                 194) ఇది కల కాదు కల్లా కానే కాదు (12.07.) ఇది కల కాదు కల్లా కానే కాదు ఇది ఆనంద నిలయము కరుణాలయము ఇది భావాలకు అందని బ్రహ్మానంద నిలయము ఇది గురుదేవుల శ్యామచరణ హృదయాలయము ఇది మా అందరి పాలిట ప్రేమాలయము దివ్య ప్రేమాలయము కరుణాలయము మన కరుణాలయము సాయి కరుణాలయము 1. సతమతమౌ నటుల చేయు పిచ్చియోచనలతో వికలము కలిగింపజేయు వ్యర్థ కలాపాలతో తరిగిపోవు నా జీవిత పరిమాణపు సమయాన తరియించగ తపియించుచు నీదరి చేరినదానా బాల ననుచు బేలననుచు జాగుచేయ తగునా..తగున...