(198) 16 July (16.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Jul

సత్యం చెప్పే వాళ్లు తమ చర్యలను మరీ మరీ సమర్ధించుకోరు. ప్రేక్షకుల వలె చూస్తూ మౌనంగా వుంటారు.
Truth tellers do not justify their actions too much. They watch and remain silent like spectators.


198) నీ పాద దూళిగా పడి యుండు  (16.07.)

నీ పాద దూళిగా పడి యుండు 
భాగ్యమును కలిగించు మా రామ సాయీ
నిను జూచి పులకించి మైమరచి 
తరియించ కరుణించు మా దేవ సాయి ॥నీ పాద॥
 సాయి పాహి దేవా పాహి సాయి దేవా పాహి పాహి 

(1) నీ సేవలోనే ఈ జీవితమంతయూ 
కరిగి పోనీయు మా సాయీ
నీ సేవకుల కెల్ల సేవలను జేయగా
దయ జూపు మా దేవ సాయీ
(నన్ను తరియుంప జేయుమా సాయి) ॥నీ పాద॥

(2)కామ క్రోధాదులకు కడుదూరమై 
నీదు దరి జేర నీయుమా సాయీ
నీ దృష్టియే నాకు అన్న పానాదులను 
అనుభవం మోసగుమా సాయీ ॥నీ పాద॥

(3) సతతమ్ము నీ నామ స్మరణలో 
పులకించ కృప జూపు మా ప్రేమ సాయీ
శ్యామాదులకు నామ రూపముల నశియింప జేసి 
కృప జూపు మా సాయీ నిను జేరు మార్గమున నడిపించి 
శ్యామను తరియింప జేయుమా సాయీ ॥నీ పాద॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)