(186) 4 July (04.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Jul
మనము గతంలో ఉన్నట్లు
ఇప్పుడులేము. ఇప్పుడున్నట్లు ముందు ముందు ఉండబోము. కనుక వర్తమానాన్ని
జాగ్రత్తగా గమనిస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహించాలి.
We
are not what we used to be in past. We will not be as we are now. So by
carefully focusing present we should perform our duty.
186) ఏమి చేసితి ననుచు వెనుకేసు కొస్తావు (04.07.)
ఏమి చేసితి ననుచు వెనుకేసు కొస్తావు
వెర్రి తండ్రీ ప్రేమ సాయి-
ఏనాటి కైనా నీ తనయునిగ నిలబడే
స్థితి నందు కోగలనా సాయి ॥ ఏమి ॥
(1) అడుగడుగునా నన్నాదుకొను చున్నావు
ఆపదల పాల్పడక సాయీ
విశ్వాస శూన్యుడౌ అవివేకి నేననుచు
అణు మాత్ర మెంచకను సాయి ॥ఏమి॥
(2) తప్పులను జేసినను తప్పించి గాచెదవు
హెచ్చరించుచు కరుణ సాయీ
నిన్ను ప్రేమించనీ నిర్భాగ్యుడని యైన
పరిగణించక దేవ సాయి ॥ఏమి॥
(3) నీ మాటలను వినక నిందలను దెచ్చుకున
నింద తొలగింతువే సాయీ
నీ యందు అనురక్తి భక్తి శ్రద్ధలు లేని
వాడనుచు నెంచకను సాయి ॥ఏమి॥
(4) నేను నాదంతయు నీ స్వంతమే గదా
సచ్చిదా నంద సాయీ
నాది నాదని దలచి నీ కీయ నెంచని
నిండు స్వార్ధపు నరుడ సాయి ॥ఏమి॥
(5) ఎంత నీ వొసగినను ఎంత మేల్ జేసినను
తృప్తి చెందక నుంటి సాయీ
సిగ్గు ఎగ్గులు లేక ఎన్నెన్నో కోరుచు
పీడించు చుంటినే సాయి ॥ఏమి॥
(6) ఆరోగ్య మిమంచు ఆస్తి నీయు మటంచు
అన్ని యడుగుచు నుంటి సాయీ
సర్వ మీవే యొసగి సాకు చున్నావనెడి
సత్యంబు నెరుగనే సాయీ ॥ఏమి॥
(7) సర్వ ప్రాణుల లోన నిన్ను జూడ నెంచని
చచ్చు సంస్కారము సాయీ
భజనలను జేయుచు భక్తుడను పించుకొను
నయ వంచకుడనయ్యా సాయీ ॥ఏమి॥
(8) నేనేమి జేసితిని నీకేమీ యిచ్చితిని
యనుచు దలవక నుంటి సాయీ
నాకేమీ యిచ్చితివి నాకేమీ జేయుదువు
యను జూచు నీచుడనె సాయీ
(9) అంతయు నీవని అతిగ వాగుచు నుంటి
ఎందరి ఎందరితోను సాయీ
అంతరంగము నందు అనుభూతమే లేక
అణగారు చుంటిగద సాయీ ॥ఏమి॥
(10) నీవు గాచెదవనుచు నిర్భయము మీకనుచు
భక్తులతో బలికెదను సాయీ
నా మనసులో యట్టి నమ్మకమే లేక
నశియించు చుంటినే సాయీ ॥ఏమి॥
(11) శ్యామాదులను గావ వేగమే కృప జూప
ప్రార్థించు చున్నాను సాయీ
సాయి సద్గురు దేవా నీ చరణ కమలములే
శరణమని బడియుంటి సాయీ ॥ఏమి॥
Comments
Post a Comment