(192) 10 July (10.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Jul
సందేశాలను చదవడం వలన,
ఆలోచించడం వలన కొంతవరకైనా మీ దుష్ట సంస్కారములకు కళ్లెం పడింది. లేకుంటే
అందరికన్నా మీరే ముందుగా ప్రలోభాలకు లొంగేవారేమో! అందుకే అన్నారు, "శ్రీ
గురుదేవుల సన్నిధి ఆనందమునకు, శాంతికి పెన్నిధులని.”
By
Reading the messages and thinking about it has broken some of your bad
habits. Otherwise, you would be the first to succumb to temptation!
That is why some said, "Sri Gurudev presence is close to happiness and
peace."
ఏసు నాధుడే ప్రేమకు రూపము
ప్రేమ రూపమే దైవ భావము
ప్రభు ఏసు నాధుడే ప్రేమకు రూపము
(1) అరాచకము ప్రబలిపోయి- అన్యాయము పెరిగిపోయి
అవినీతికి ఆలవాలమై థూర్తులు మెలగు చుండ
ధర్మ న్యాయములను నిలుప అవతరించినట్టి ॥ఏసు॥
(2) సాధుజనుల సౌభాగ్యము -వంచకులే దోచుకొనగ
అసత్య మద మత్సరములు ఆర్తులనే హింసించగ
లోక కళ్యాణమునకు దయతోడ - వెలిసినట్టి ॥ఏసు॥
(3) అహింసయే ఖడ్గముగ- ఆలనయే పాలనగ
ప్రేమయే పరివారముగ- శాంతియే కవచముగ
మౌనముగ మూర్ఖులతో- పోరు సలిపి గెలిచినట్టి ॥ఏసు॥
(4) జాతులు మతములు నీతులు ప్రేమ తత్వ సంపదలని
శాంతి సౌభాగ్యములకు తృప్తియే మూలమని
జీవకోటి నెల్ల వాటి నందించ నిలచి నట్టి ॥ఏసు ॥
(5) ఏ రూపముగ దలచిన ఏ నామముతో బిలచిన
'ఓ ' యనుచు బలుకుచున్న శ్యామనాథుడే
శ్రీ సాయినాధుడు శ్రీ శామనాథుడే ప్రభు ఏసు నాధుడు
॥ఏసు॥
Comments
Post a Comment