(195) 13 July (13.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Jul

గురువునకు నిజంగా సంపూర్ణ శరణాగతి చేసుకున్న వ్యక్తికి చింతలు, కోరికలు, విచారములు ఉండనేరవు. అతనికి తన గురు సంకల్పమే తప్ప తన సంకల్పమంటూ ఉండదు.
A truly complete surrender to the Guru has no worries, desires and sorrows. He has only Guru's will, but not his will. 



195) నిన్నెరుగ నా తరమా నీలమేఘశ్యామా (13.07.)

నిన్నెరుగ నా తరమా నీలమేఘశ్యామా
ప్రేమావతార శ్రీ సద్గురు సాయిరామా 
॥నిన్నెరుగ॥

(1) శుక శౌనక వ్యాసాదులు పడిగాపులు గాచుచుండ
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బహువిధముల బొగడుచుండ
క్షణక్షణమున అణువణువున నీ శక్తియే నిండియుండ
సకల విశ్వమంత నీదు దయతోడనే సాగుచుండ 
॥నిన్నెరుగ॥

(2) ఏ పేరున పిలచి పిలచి నిన్ను పూజ చేసుకుందు
ఏ రూపముగా తలచి నిరతము ధ్యానించు చుందు
నాదని ఏమున్నదనుచు నివేదనల చేయుచుందు 
ఏమి నేరుగ లేని బ్రతుకు ఎటుల లాగించు చుందు
॥నిన్నెరుగ॥

(3) అంతట నీవున్నావని ఎందరి నోటనో వింటిని 
అందరినీ బ్రొచుచుండు ఆప్తుడ వీవని వింటిని 
నాదేమి కర్మము నాకు తెలియ లేదాయె 
అణువణువున నీ దివ్య దరిశనమే కలుగదాయె
॥నిన్నెరుగ॥

(4) నన్ను భువికి పంపినట్టి భగవంతుడా నీవేగా 
బాధ్యతలను బాధలను తలమోపిన నీవేగా 
తపియింపగా జేసి తప్పించున నీవేగా 
శరణాగత పోషకా శ్యామ నాయకా సాయీ
॥నిన్నెరుగ॥


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)

13 April (13.04.) (104)