(194) 12 July (12.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Jul
మహాత్ముల మాట
శిలాశాసనము. మానవుల మాట నీటి మాట. మనలను (మన సంస్కారములను గురించి) మనమే
చూసుకోవాలి. పుస్తకములు, ఉపన్యాసములు, చర్చలు - అవగాహన, ఆచరణలు లేనప్పుడు
నిరుపయోగములు. పైగా గర్వమును, అహంకారమును పెంచుతాయి.
The
words of the greats are epitaphs. The word of man is the word of water.
We have to look after ourselves (about our rituals). Books, lectures,
discussions are useless In the absence of awareness and practice.
Moreover, it increases pride and arrogance.
194) ఇది కల కాదు కల్లా కానే కాదు (12.07.)
ఇది కల కాదు కల్లా కానే కాదు
ఇది ఆనంద నిలయము కరుణాలయము
ఇది భావాలకు అందని బ్రహ్మానంద నిలయము
ఇది గురుదేవుల శ్యామచరణ హృదయాలయము
ఇది మా అందరి పాలిట ప్రేమాలయము
దివ్య ప్రేమాలయము కరుణాలయము
మన కరుణాలయము
సాయి కరుణాలయము
1. సతమతమౌ నటుల చేయు పిచ్చియోచనలతో
వికలము కలిగింపజేయు వ్యర్థ కలాపాలతో
తరిగిపోవు నా జీవిత పరిమాణపు సమయాన
తరియించగ తపియించుచు నీదరి చేరినదానా
బాల ననుచు బేలననుచు జాగుచేయ తగునా..తగునా... తగునా ....
శ్యామాచరణ ఓ శారద రమణా
శ్యామాచరణా హే వందిత రమణా //ఇది కల కాదు//
2. ఏది నీవు లేనిదేదీ నీవు కానిదేదీ నీవు చేయలేనిదేదీ నీవూ
అడుగడుగున ఆదుకునెడి ప్రేమ స్వరూపా అణువణువున నిండియున్న
దివ్య స్వరూపా పరమ దివ్య స్వరూపా
శ్యామా చరణా ఓ శారద రమణా
మా శ్యామ చరణా హే వందిత రమణా //ఇది కల కాదు//
3. నీ సన్నిధి లేనపుడు నా బ్రతుకే అయోమయం
నీ సన్నిధి ప్రభావమున నా బ్రతుకే ప్రేమమయం
కలకాలం నీ దివ్య సన్నిధిలోనే నిలిచిపోని ,రాలిపోని, కరిగిపోని
శ్యామా చరణా హే శారద రమణా
శ్యామా చరణా ఓ శారద రమణ //ఇది కల కాదు//
ఇది ఆనంద నిలయము కరుణాలయము
ఇది భావాలకు అందని బ్రహ్మానంద నిలయము
ఇది గురుదేవుల శ్యామచరణ హృదయాలయము
ఇది మా అందరి పాలిట ప్రేమాలయము
దివ్య ప్రేమాలయము కరుణాలయము
మన కరుణాలయము
సాయి కరుణాలయము
1. సతమతమౌ నటుల చేయు పిచ్చియోచనలతో
వికలము కలిగింపజేయు వ్యర్థ కలాపాలతో
తరిగిపోవు నా జీవిత పరిమాణపు సమయాన
తరియించగ తపియించుచు నీదరి చేరినదానా
బాల ననుచు బేలననుచు జాగుచేయ తగునా..తగునా... తగునా ....
శ్యామాచరణ ఓ శారద రమణా
శ్యామాచరణా హే వందిత రమణా //ఇది కల కాదు//
2. ఏది నీవు లేనిదేదీ నీవు కానిదేదీ నీవు చేయలేనిదేదీ నీవూ
అడుగడుగున ఆదుకునెడి ప్రేమ స్వరూపా అణువణువున నిండియున్న
దివ్య స్వరూపా పరమ దివ్య స్వరూపా
శ్యామా చరణా ఓ శారద రమణా
మా శ్యామ చరణా హే వందిత రమణా //ఇది కల కాదు//
3. నీ సన్నిధి లేనపుడు నా బ్రతుకే అయోమయం
నీ సన్నిధి ప్రభావమున నా బ్రతుకే ప్రేమమయం
కలకాలం నీ దివ్య సన్నిధిలోనే నిలిచిపోని ,రాలిపోని, కరిగిపోని
శ్యామా చరణా హే శారద రమణా
శ్యామా చరణా ఓ శారద రమణ //ఇది కల కాదు//
Comments
Post a Comment