(190) 8 July (08.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Jul

బాహ్య ఆడంబరములు లోకుల కొరకే గాని మరి ఎందుకూ కొరగావు. నిరాడంబరమగు అంతఃకరణమునందుండి, పెల్లుబికే ప్రేమతో పిలిచే పిలుపునకే శ్రీగురుడు ప్రసన్నుడవుతాడు.
External ostentatiousness is only for the sake of the society, And why did you ask?
From inwardness, calling with exploding love will make Sriguru pleasent.

 
190) ప్రేమనాథుడగు ఏసునాధునకు (08.07.)

ప్రేమనాథుడగు ఏసునాధునకు
హారతి నీయగ రారమ్మా-
హారతి నీయగ రారమ్మా! ॥ ప్రేమ ॥

పశువుల పాకలో ప్రభవించిన
పరిశుద్ధాత్మల మన్నన పొందిన ॥ ప్రేమ ॥

పతిత మానవుల సముథ రించిన
ప్రాణి కోటినే పరిరక్షించిన ॥ ప్రేమ ॥

సత్య ధర్మముల సంరక్షించిన
ప్రేమ నందరికి మెండుగ బెంచిన ॥ ప్రేమ ॥

చేయని తప్పుకు వేసిన శిక్షను
సహనముతో భరియించి నిలచిన ॥ ప్రేమ ॥

శిలువ నెక్కినను చిదానందముతో
బ్రహ్మానందము నందర కోసగిన ॥ప్రేమ॥

సమర్థ సద్గురు దైవ రూపమై
శ్యామ హృదయమును పరిపాలించడి ॥ ప్రేమ ॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)