(187) 5 July (05.07.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Jul

సదా పరులకు ఉపకారము చేయుచుండు వారికి భగవంతుని కృప సులభ సాధ్యము. దురాశ, అత్యాశ, పేరాశ ఇవి దుఃఖ సముద్రమున ముంచును. కలియుగమున సత్యముగానుండుట సకల శుభములను కలిగించును. 

Those who always do good to others, for them God's grace is easy. Greed, covetousness, avarice drown us in the ocean of sorrow. In Kali Yuga, being truthful brings all good things.



187) ఏ నక్షత్రము నందు జనించిన నేమి (05.07.)
ఏ నక్షత్రము నందు జనించిన నేమి ?
గ్రహగతు లేయే తీరుల నుండిన నేమి ?
సద్గురు సాయీ సత్కృప కలిగిన
సకలము సంతస భరితము గాదా ॥ఏ నక్షత్రము॥

(1) గ్రహము లన్నియు సాయి నాధుని
ఆజ్ఞల కఅనుగుణముగ చెరియింపగ
జప తప శాంతుల యోచన లేల
సద్గురు సాయిని కొలిచెడి వేళ ॥ఏ నక్షత్రము॥

(2) శక్తి స్వరూపము శాంత స్వభావము
ధర్మ స్వరూపము దయా సముద్రము
బాబా రూపము బ్రహ్మానందము
శ్యామాదులకు అది సర్వస్వము ॥ఏ నక్షత్రము॥


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)