Posts

Showing posts from September, 2022

(274) 30 September (30.09.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Sep చదివి, ఆలోచించి, వదిలించుకోవలసినవి విదిలించి వదిలించుకుని, ఆచరించవలసిన దానిని ఆచరించడానికి తీవ్రంగా కృషి చేస్తూ, నిరంతరం మన కృషి సఫలమయ్యేటట్లు అనుగ్రహము వర్షించమని, భగవన్నామస్మరణతో సచ్చింతనతో కాలం గడుపుతూ వుండటం వలన బ్రతుకు ఆనందంగా నడుస్తుంది. By reading, thinking, getting rid of what needs to be rid of, by striving hard to practice what is to be practiced.  By praying, God's grace constantly hails on our efforts to succeed. Life will run happily with spending time with chanting and Sachintana (Remembering the truth).

(273) 29 September (29.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Sep భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. మౌనంతో, భగవన్నామంతో భోజనం చేస్తే, తిన్న ఆహారం రక్తంగా మారి, అది సక్రమమైన ఆరోగ్యం ప్రసాదించి బుద్ధిని వికసింపచేస్తుంది. ఆరోగ్యం-ఆనందం అని సిద్ధాంతం చెప్పింది. Don't talk while eating. If we eat in silence and by chanting the name of God, the food will turn into blood, and that gives good health and blossoms our mind. It's the Theory of health-happiness. 273) కలతలతోనే కృంగి కృశించుట (29.09) కలతలతోనే కృంగి కృశించుట -  నీకానంద మా సాయీ  కల్లోల పరచి నా మది  అగ్ని జ్వాలల రేపుట వేడుకయా  (1) నీ కరుణ తోనే కలిగినదయ్యా  మానవజన్మ ఈ మహిలో  నీ దయతోనే సాయి నామము విని  స్మరియించితి నా మదిలో  మానవ జన్మము మహిత నామము -  మనసును నీ చరణముల  నిలుపక ఆటంకము లలో ముంచుచు - ఆ శాంతితోనే అలమటించుచు ॥ కలతలలోనే ॥ (2) నీతిగ జీవించగ దలచిన  నిలువక పరుగిడు నా మనసు  ధర్మము గానే బ్రతుక నెంచిన  ధైర్యము కొరవడి హింసించు  విశ్వాసమును కలిగి ఉండుటకు  అనుమానము పెనుభూతముగ ...

(272) 28 September (28.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Sep స్నానం చేసేటప్పుడు పవిత్రంగా నామం చేస్తూ చేయాలి. దేహశుద్ధియే భావ శుద్ధి. పవిత్ర భావంతో నీళ్ళు తీసుకొని "గంగేచ యమునేచ" అనే శ్లోకాన్ని చెప్పుకొని అన్ని నదులను ప్రార్ధించి పసుపుతో నక్షత్రం గీసి భగవన్నామంతో చేయాలి. ఈ శరీరం భగవంతునిది, దీన్ని పవిత్రంగా దేవాలయం లాగా ఉంచాలి. లేకపోతే ఆయన స్థానానికి భంగం వాటిల్లుతుంది. While taking a bath, chanting of holy name should be done. "Purity of body is the Purity of mind". Take the water with auspicious feeling, by saying the verse "Gangecha Yamunecha" need to pray all the rivers. by chanting we need to pour turmeric powder into water. And think that "This body is God's Gift", it should be kept holy as a temple. Otherwise God's place will be disrupted. 272) ఏదని దలదును నీ రూపమును (28.09) ఏదని దలదును నీ రూపమును  ఏమని బిలతును నీ నామమును  లీలా నాటక సూత్రధారి హే  మాయా మానుష వేషధారి  ॥ ఏమని ॥ (1) ఇది యది యనక అన్ని రూపముల లో ఉన్నది నీవే యని దెలుపుచు సర్...

(271) 27 September (27.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Sep నామాన్ని వింటూ వుండాలి. మనం నామం చేస్తూ మనమే వినాలి. ఇలా బాగా రావాలంటే, మనం మాట్లాడే అన్ని మాటలూ, అన్ని శబ్దాలూ (మంచి, చెడు ఏదైనా కానీ) మనమే వినటం సాధన చేయాలి. Listen the chanting, when you are chanting to listen that. We have to practice listening to all the sounds and all the words (good or bad) that we speak. 271) ప్రేమావతారా భక్త మందారా (27.09.) ప్రేమావతారా భక్త మందారా  దీన జన రక్షకా పాహిమాం రక్షమాం  నా బాధ తొలగించి సద్భుద్ది కలిగించి  నీ దారి నడిపించు శ్రీతజన పాలా  సాయిరాం - పాహిమాం సాయిరాం - రక్షమాం   (1) నరనరము నందు నీ నామ స్మరణము లేని నరజన్మ నా కెందు కొసగినావో ?  ప్రతి క్షణము నీ యందు భక్తి శ్రద్ధలు లేని  బ్రతుకు నాకెందుకు ఒసగి నావో? తెలిసి తెలియని చదువు అవివేకమును పెంచ ఓర్పు విశ్వాసములు ఎటుల కలుగు? అనుమానమే నన్ను పెనుభూతమై  పట్టి పీడించి, ఆడించ వెక్కిరించ  నన్ను కావగ రావా కరుణ జూపగ రావా  నీ యందు భక్తి ప్రేమలను కలిగించవా  సాయి శరణం - రామా శరణం  సాయిరామ - శరణం శరణం...

(270) 26 September (26.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Sep సాధనలో జీవితం ఒక భాగం కావాలి కానీ జీవితంలో సాధన ఒక భాగం కాకూడదు. Life should be a part of the practice, but practice should not be a part of life. 270) వందనం - రఘు నందనం (26.09.) వందనం - రఘు నందనం సేతు బంధన - భక్త చందన  ॥ రామ వందనం ॥ శ్రీ దమ నాతో వాదమా నే భేదమా ఇది మోదమా ॥ రామ వందనం॥ వింటిని - నమ్ముకొంటిని శరణంటిని - రమ్మంటిని ॥ రామ వందనం॥ ఓడను - భక్తి వీడనూ ఒరుల వేడను - నీ వాడనూ ॥ రామావందనం॥ న్యాయమా - నీ కాదాయమా  యింత హేయమా - ముని గేయమా  ॥ రామ వందనం॥ వేగరా - కరుణాసాగరా శ్రీ త్యాగరాజ హృదయాగరా  ॥ రామ వందనం॥ (03.04.1990, ఉ.10.30 గం.)

(269) 25 September (25.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Sep సమస్త నామములు నేను నమ్ముకున్న సద్గురునకే అనెడి భావనతో సమర్థ సద్గుర్తువును గాఢంగా విశ్వసిస్తే తరించగలరు. With deep conviction, when we feel all the names for our beloved Guru , then we can get Rid easily. 269) రామ నామమే పావనము (25.09.) రామ నామమే పావనము  శ్రీరామ నామమే జీవనము  శ్రీరామ నామమే తారకము  శ్రీరామ నామమే విశ్వాధారము  రామ నామమే పతిత పావనము  ॥ శ్రీ రామ నామమే ॥ (1) భక్తి నొసగును రామ నామము  శక్తి నొసగును రామ నామము  భుక్తి నొసగును రామ నామము  ముక్తి నొసగును రామ నామము  ॥ రామ నామమే॥ (2) సదాశివుడు స్మరియించెడు నామము భక్తులు ధ్యానము చేసెడి నామము  భవ సంద్రము దాటించెడి నామము  సద్గురు కృప నందించెడి నామము  ॥ రామ నామమే ॥ (3) కోటి జన్మముల పాపపు రాశిని  తృటిలోనే తొలగించెడి నామము  శరణు శరణమని రామ పాదము  పట్టిన వారిని విడువని నామము  ॥ రామ నామమే ॥ (4) సదా హనుమ స్మరియించెడి నామము సత్పురుషుల జూపించెడి నామము సత్సంగములను యొసగడి నామము సద్గురు కృప వర్షించెడి నామము  ॥ రామ నామ...

(268) 24 September (24.09.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Sep ఇది అది యనక అన్నీ దానికే నివేదించు, అన్నింటికీ దానినే ప్రార్థించు, ఆరాధించు, చివరకు అదే నీవు అవుతావు - ఇదే గమ్యము. Without saying this or that, submit all to it. Pray, adore. At last you will be the same and that is your destination.   268) ఏమి మాయయో - అదేమి మాయయో (24.09.) ఏమి మాయయో - అదేమి మాయయో మాయ మాయ అందురు - అదేమి మాయయో  తెలిసినటుల దోచుగాని చివరేమో తెలియదు ॥ ఏమి మాయయో॥ (1) నేను నేను అనుచు నుందు నేనేమో తెలియదు  నాది నాది అనుచు నుందు నాదు వెంట ఏదీ రాదు  ఏమి మాయయో అదేమి మాయయో  ॥ ఏమి మాయయో॥ (2) జరిగినది నా సుఖమునకు అని తెలిసీ తెలియక  తలచినదే జరిగినంత ఎంతెంతో పొంగిపోదు అటులనే కృంగిపోదు తలచినదే జరుగనంత నాకేది మంచిదో చెడుపో తెలిసీ తెలియకనే  ॥ ఏమి మాయయో॥   (3) ఆత్మీయులు చనిపోయిన దుఃఖముతో కృంగిపోదు  నేనూ ఒక నాటికి పోవుదునని తెలిసియు  నా యోచనలన్నీ నిరుపయోగములని తెలిసియు  రకరకముల యోచనలతో పలురీతుల పలుకు చుందు  ॥ ఏమి మాయయో॥ (4) నాదను భావమే దీనికి మూలంబని తెలిసియు  దాని ప్రభావములో నుండి ...

(267) 23 September (23.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Sep నడిచేటప్పుడు భూమి అదిరేటట్టు నడవకూడదు. నెమ్మదిగ నడవాలి. భూమి అదిరిన బ్రతుకులో బాధలు కలుగును. అలా నడవటం సద్భావనలను అల్పముచేసి దుర్భలత్వమును పెంపొందించును. Don't Walk Creepyly on mother earth. Creepy steps will disturb life and reduce our good character, and increase bad qualities. Walk slowly on Earth, it shows your concern. 267) నిన్నే కోరి భజించి సేవించగ (23.09.) నిన్నే కోరి భజించి సేవించగ కృపను జూపుమా దేవరా నేనను భావము నాదంతయును  నీ సేవలకే వినియోగింపుము గురువరా.....॥   (1) పరి పరి విధముల పరిభ్రమించుచు ప్రలోభములకు లోనై తిరుగుచు  నానా రకములుగా నడయాడుచు  నీ మార్గములో నడవ దలచితిని  ॥ నిన్నే ॥ (2) కు సంస్కారములే మూలములై  కు మతంబులె నా నడకయై  నీ మార్గములో నడువ నీయక  వెనుకకు లాగుచు నున్నవి దేవా  ॥ నిన్నే ॥ (3) నీవు చెప్పినటుల జీవించాలనే తపన  ఒక వైపున నన్ను తపింప జేయగ  మరి ఒక తీరుగ నడయాడు చుండుట  నీదు మాయయో నా ప్రారబ్దమో  ॥ నిన్నే॥ (4) తెలిసిన దేదీ లేనే లేదు  తెలియదన...

(266) 22 September (22.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Sep భగవన్నామమును స్మరించునపుడు రూపమును ఆలోచనయందు నిలుపుకొనుట, రూపమును చూచినపుడు భగవన్నామమును స్మరించుట వలన పోను పోను సదవగాహన కలిగి రూపనామముల భేదభావము నశించును. When Chanting the name of God, keep the form in thought. When looking at the form, remember name of God.  This practice makes you to understand that there is no difference between name and form of God (Both are Same). 266) శ్రీరామ రఘురామ సీతా మనోభిరామా (22.09.) శ్రీరామ రఘురామ  సీతా మనోభిరామా  జయరామా జానకి రామా  సాయి రామా సాయి రామా  (1) శ్రిత జనకామా- శ్రీకర నామా  దశరథ కౌసల్య- సుందర రామా  (2) జయ రామ- జయ జయ రామా  జయ జయ రామా- జగదభి రామా  (3) దాశరధీ- దనుజవి రామా  దనుజవి రామా- దయాకర రామా (4) కామిత దాయక- కళ్యాణ రామా  కళ్యాణ రామా- కమనీయ రామా  (5) సురముని పూజిత- మోహన రామా మోహనరామా- జానకిరామా  (6) వినీల నిర్మల- ఘన మేఘ శ్యామా మేఘశ్యామా- రాజారామా (7) ఈప్సిత దాయక- ఇనకుల సోమా  ఇనకుల సోమా- పావన రామా  (8) రఘుపతి రాఘవ రాజారా...

(265) 21 September (21.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Sep గురువు యెక్క మార్గ దర్శకంలో విషయాల మంచి చెడ్డలు, మనుషులు వారి పనులు, పద్ధతుల అందలి మంచి చెడ్డల గురించి మన యొక్క అభివృద్ధి కొరకు చర్చించుకోవడము ఎంతైనా అవసరము. In the guidance of our Guru, it is necessary to discuss the good and bad of our subjects, actions and methods for our growth. 265) రఘువంశ తిలక- రాజీవ లోచన (21.09.) రఘువంశ తిలక- రాజీవ లోచన  నేనేమి జేతురా- నీరజ నయనా  రామా... రామా... రామా... సీతారామా... (1) పట్టు పీతాంబరము- నవరత్న మాలికలు  వజ్ర సింహాసనము- వాగ్దేవి వేదములు అమరించి- స్తుతియించ శక్తి లేదు కదయ్యా ॥ రఘువంశ ॥ (2) పన్నీట అభిషేకములు చేయలేను  పట్టుపరుపులను అమరించలేను  ఆచారముల నన్నీ పాటించలేను  ప్రేమతో దయ చూపి కరుణించవయ్యా ॥ రఘువంశ॥ (3) భక్తులందరు నిన్ను ఎన్నెన్నో విధములుగ  సేవించు చుందురు కల్యాణ రామా  కాదనక మా చిన్ని సేవలను గ్రహియించి  శామాదులను నీలో నిలుపుకో దేవా  శ్రీరామ రామ - సీతారామ  జయరామ రామ... జానకీ రామా  శరణాగత రక్షకా రామా... శ్రీరామా...  శ్యామ సన్నుతా స...

(264) 20 September (20.09.)

Image
 శ్రీ శారద శ్యామ సందేశం: 20 Sep - ఆనుకున్నది నిజమని భ్రమించక నిజమేదో తెలుసుకో - ఇష్టమైన దానికి దూరము గాక తప్పదు, అయిష్టమైన దానిని అనుభవింపక తప్పదు. - దేనిని అసహ్యించుకున్న ఏదోఒక నాటికి వాటిని అనుభవించక తప్పదు.  - మనసే మనిషికి ప్రధమ శత్రువు. - సచ్చీలమే సర్వేశ్వరుని తెలుసుకొను మార్గము చూప గలదు - Don't think that what you think is true, know what is true without deluding. - You must be far away from what you like, you must not experience what you like. - Whatever you hate, you will have to experience it.  - Heart is the first enemy of man - Only the Good character can show the way to know the Lord. 264) రావయ్య రామయ్య (20.09.) రావయ్యా రావయ్యా శ్రీ సీతారామయ్యా మా సేవలను వేగమే చేకొన రావయ్య రామయ్యా॥ రామా సీతారామా (2) (1) మిమ్ము చూచి పులకించి తరయించగ భక్తులెందరో ఉన్నారయ్యా ॥ రావయ్యా ॥ (2) అకాలమైనను అధిక భక్తితో సేవకులెందరో యున్నారయ్యా ॥ రావయ్యా ॥ (3) శ్రీకరమౌ మిము దర్శించగా తహ తహ లాడుతూ యున్నామయ్యా ॥ రావయ్యా ॥ (4) అభయ ప్రదాత ఆపద్బాంధవ అనాధ రక్షక రావయ్యా ॥ రావయ్య...

(263) 19 September (19.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Sep జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని తీవ్రమైన ధ్యాస, జిజ్ఞాసతో సద్గురువును ప్రార్ధిస్తే ఆయన అనుగ్రహిస్తాడు. Gurudev will bless you, if you set a goal for life and pray with intense attention and curiosity. 263) కరుణాంతరంగ ప్రభో సాయినాథ (19.09.) కరుణాంతరంగ ప్రభో సాయినాథ కారుణ్యమూర్తీ శ్రీ గురునాథా కారుణ్య నిలయ శ్రీ సాయినాథా ఆపద్బాంధవ అనాధ రక్షక ఆశ్రిత పోషక శ్రీ సాయినాథా ఆపద్బాంధవ ఆశ్రిత పోషక అనాధనాథ శ్రీ సాయినాథా॥ భవభయ హరణా సంకట హరణా భక్తవత్సలా బాబా సాయీ…….॥ నిరుపమ నిర్గుణ సచ్చిదానంద నిర్మల ప్రేమ స్వరూపా సాయీ సంశయ నాశక సద్గుణ పోషక సద్గతి  దాయక బాబా సాయీ…… ॥ రాజాధిరాజా శ్రీ సాయినాథా శ్రీ యోగిరాజ శ్రీ సాయినాథా సచ్చిదానందా శ్రీ సాయినాథా పరమాత్మ స్వరూపా శ్రీ సాయినాథా సమర్థ సద్గురు శ్రీ సాయినాథా దైవ స్వరూపా శ్రీ సాయినాథా సాధు స్వరూపా శ్రీ సాయినాథా జీవస్వరూపా శ్రీ సాయినాథా విశ్వరూపా శ్రీ సాయినాథా కరుణాసాగర శ్రీ సాయినాథా ప్రేమ స్వరూపా శ్రీ సాయినాథా ప్రేమ ప్రదాతా శ్రీ సాయినాథా కృపాకరా గురు శ్రీ సాయినాథా గురుదేవ దత్త శ్రీ సాయినాథా శ్యామాది పోషక ...

(262) 18 September (18.09.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Sep అరిషడ్వర్గాలకు లోను కాకుండా శ్రీ గురుదేవుల కృప, కరుణ, ప్రేమలను పొందుతూ వారి పాదములకు బుద్ధిని కట్టివేసి వారి సన్నిధిని నిరంతరం అనుభవించాలి. Instead of succumbing to the "Arishdvargas (Six internal enemies)", one should attain the grace, compassion and love of Sri Gurudeva, Fix the mind to the Guru's feet and constantly experience their presence. 262) గురువనగా ఒక దేహము గాదు (18.09.) గురువనగా ఒక దేహము గాదు గురువనగా అది అనంత విశ్వము ॥గురు॥ (1) గుణ రూపములకు గుణ రుణములకు అతీత మైనది శ్రీ గురుడే అంధకారమును తొలగించెడి సర్వశక్తి సమన్విత మదియే ॥ గురు ॥ (2) శాంతికి సన్నిధి, ప్రేమకు పెన్నిధి ఆనందమునకు అది అంభోనిధి పతితుల నెల్లర పావనలుగా మార్చెడి కరుణా సాగర మదియే ॥ గురు ॥ (3) విశ్వాసమును ఓర్పులను కలిగి భక్తిశ్రద్ధలతో సమాశ్రయించిన రణాగతితో ప్రార్ధన జేసిన సద్గతు లొసగెడి శ్యామ దైవము ॥ గురు ॥ (30.08.1987, ఆదివారం, రా.07.45 గం.కు)

(261) 17 September (17.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Sep ఉచ్ఛ్వాస, నిశ్వాసములకు అనుగుణంగా ఎవరికి ఇష్టమైన భగవన్నామాన్ని వారు అనుసంధానం చేసుకొనుట వలన దురలవాట్లు, దురాలోచనలు, దుర్భాషలు నిదానంగా దూరమవుతాయి. When we associate our favorite name of God in our inhalation and exhalation, then slowly abusive thoughts, abusive thoughts, and abusive habits will slowly go away.  261) మంగళం గణనాథాయ (17.09.) మంగళం గణనాథాయ మంగళం గజాననా మంగళం అది నాథాయ మంగళం ఆది నాథాయ ॥మంగళం॥ (1) సర్వ కార్యములు నిర్విఘ్నముగా నెరవేర్చెడి ఆది దైవమా విజ్ఞము లెన్నో కలిగిన వానిని తొలగించెదవు కరుణించెదవు ॥ మంగళం ॥ (2) బొజ్జ నిండుగా ప్రేమను కలిగి భక్తులందరికీ సతతము పంచుచు విశ్వశాంతికై అవతరించిన శ్యామ సన్నుత……  విజ్ఞ వినాయక ॥మంగళం॥ (13‌.08.1987, సా.06.47 గం‌.కు)

(260) 16 September (16.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Sep సరైన స్థలంలో, సరైన సమయానికి, సరైన విషయం గురించి స్వార్ధ రహితమైన మంచి మనిషి ద్వారా ఇవ్వబడిన, సరైన సలహా అత్యంత విలువైనది. In the right place, at the right time, the right advice given by a altruistic man is most valuable thing for us.     260) దిక్కులన్నియు వస్త్రమైనదని (16.09.)   దిక్కులన్నియు వస్త్రమైనదని దిగంబరుడవని యందునా ఏమీయు లేని వాడవని దిగంబరుడవని యందునా ఏ భావముతో నిను స్మరియుతును ఏ రూపమని నిను పూజింతును దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా (1) దిక్కులన్నీ నీ వస్త్రమైనచో విశ్వమంతా నీ దేహమే కదా నీలోన పుట్టుచు గిట్టుచు నేను నాదనుచు తలచెద నేలనో దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా ॥ (2) ఏమియు లేని వాడవయినచో అంతయు నీవని తెలిపితివేలా సగుణముల లోన మునిగిన నాకు నిర్గుణ మీవని ఎటుల తెలియురా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా॥ (3) సత్యా సత్య వివేకము గాని ధర్మా ధర్మ విచక్షణ గాని కర్మ కర్మముల మర్మము గాని జ్ఞానా జ్ఞానముల భేదము గాని తెలియని వాడగు శ్యామచరణుని ప్రేమతో చేకొని కృపను జూపుమా దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా॥ (0...

(259) 15 September (15.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Sep కోపం, అబద్ధం, మొదలగునవి అన్నీ భగవంతునికి చెప్పి చేయాలి. Anger, lying, etc all. should done after approaching to God. 259) శరణు శరణు త్రిలోక నాయక  (15.09.) శరణు శరణు త్రిలోక నాయక  శరణు భవభయ నాశక ॥శరణు॥ (1) శరణు శ్రీకర గురువరా  చిత్ భాస్కరా, హే ప్రభువరా  శరణు భక్తవ శంకరా,   శుభంకరా ప్రళయంకరా ॥ శరణు ॥ (2) శరణు చిన్మయ చిత్సరూపా  సృష్టి స్థితి లయ కారక  జగన్నాటక సూత్రధారీ  భక్తి ముక్తి ప్రదాయకా ॥ శరణు ॥ (3) ముగ్ధ మోహన సుందరా  మునీంద్ర గణ సంసేవితా  శ్యామ నాయక, సుగుణ పోషక  దత్త సాయి వేషకా ॥ శరణు॥ (03.05.1987, రా.11.57 గం.కు)

(258) 14 September (14.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Sep 1. నామం జపించడం (జప మాల) 2. నామం రాయడం 3. భజన 4. కీర్తన (బాబా గారి పాటలు)  5. మౌనం (వాచక, మానసిక 6. పుస్తక పఠనం 7. ధ్యానం 8. ప్రాణాయామం 9. యోగాసనం 10. పూజ 11. పాక్షిక శరణాగతి 12. ప్రదక్షిణ (గుడిలో గానీ, తులసమ్మకు గానీ, ఇంట్లో ఒక పటము చుట్టూ గానీ) 13. సత్సంగము 14. భగవంతునితో మాట్లాడాలి, ఎలా వుండాలి అనుకుంటున్నావో, ఏమి చేయాలి అనుకుంటున్నావో, ఏమి కావాలి అనుకుంటున్నావో, అన్నీ భగవంతునితో మాట్లాడాలి, ప్రార్థించాలి, అడగాలి. నేను కోరుకుంటున్న కోరికలు మంచిదైతే నాకు ఇవ్వు తండ్రి అని అడగాలి. పైవన్నీ నియమిత కాలంలో, నియమిత సంఖ్యతో, టైమ్ టేబుల్ వేసుకుని ఒక వారం ప్రయత్నం చేయండి. 258) దయగనుమా శ్రీ ద్వారకామాయీశా  (14.09.) దయగనుమా శ్రీ ద్వారకామాయీశా  కృప గనుమా కరుణాలయ వాసా  కరుణాలయ వాసా సాయిశా  సాయిశా ప్రభోసాయిశ  (1) నీ దయ లేనిదే గడువదు క్షణము  నీ కృప లేనిదే నడవదు జీవితము  నీ వాధారము సకల సృష్టికి  నీవే రక్ష, నీవేదిక్కు  ॥ దయగనుమా ॥ (2) త్రికరణ శుద్ధియు, అణుకువ  ఋజు వర్తనములను గలిగిన గాని  నీ ...

(257) 13 September (13.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Sep మనకు ఇతరులు ఎలా ఉపయోగపడతారు అని అనుకుంటే అది వ్యాపారం అవుతుంది. మనం ఎలా ఇతరులకు ఉపయోగపడతామా అని ఆలోచించాలి. It will be business if we think about how others can be useful to us. We need to think about how we can be useful to others.  257) నయ వంచకులతో చెలిమి కలిపెదవు  (13.09.) నయ వంచకులతో చెలిమి కలిపెదవు  నీ మార్గమునకు దూరము చేతువు  పతితుడయినను పాహి పాహి యని  నీ పద సన్నిధి శరణ మంటినే  ॥ నయవంచకులతో॥ (1) అసలు సత్యమును తెలియగ  నీయక అపసవ్యముగా నను నడిపింతురు  గురువుల మనుచు భుజముల కెక్కి  గురుతును చూపక గుదిబండ లౌతురు  భయమును పెంచి బానిసలుగా మార్చి  నిను సంశయించెడి స్థితికి చేర్చెదరు ౹  ॥ నయవంచకులతో ॥ (2) దైవ నామము ప్రచారము చేయుచు  లౌకిక సుఖ సంపదలకు లొంగుచు  బ్రతుకులు లాగెడి మనుజుల తోడ  నను జేర నీయక నీ కడ నుంచుము  నీ వొసిగిన ఈ మానవ జన్మము  నీ సేవలకే వినియోగించగ  కృపను జూపుమా ఆపద్బాంధవ  శ్యామచరణ పరిరక్షక, పోషక  ॥నయవంచకులతో॥ (28.04.1987, రా.12.00 ...

(256) 12 September (12.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Sep భగవంతుడా నీవు ఇచ్చిన జన్మను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొనేటట్లు చేయి తండ్రి అని ఎప్పుడూ అనుకోవాలి. Always think that God will make life fulfill which is he has given, without wasting it. 256) శ్రీ గురుదేవా పరమ ప్రేమ స్వరూపా (12.09.) శ్రీ గురుదేవా పరమ ప్రేమ స్వరూపా  పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వర, సాయీశ్వరా (1) భుక్తి కొరకు అహరహము ఆరాటపడు చుండెడి  లోక వాసనల లోన సదా మునిగి యుండెడి  "నేను"  "నా" దనుచు సతతము ప్రాకులాడుచుండెడి  నాకెటుల భక్తి కలుగు నీ యందు అనురక్తి కలుగు  ॥శ్రీ గురుదేవ॥ (2) భక్తి యనగ, ముక్తి యనగ యుక్తిగా చెప్పెడి వారల  ఎందరినో చూచి వారి ఉపన్యాసముల వింటిని  పరులకు బోధించు తెలివి తేటలేమో పెరిగినవి  అభిజాత్యము, అహములతో బ్రతుకు దుఃఖమయమైనది  ॥ శ్రీ గురుదేవా॥ (3) నీ మార్గము శ్రేష్టమని చెప్పెడి వారే అథికులు  నీ మార్గములో నిజముగా నడిచెడి వారే అరుదు  నీకై నీవు పరమ ప్రేమామృత కరుణతో కృపను జాపి  శ్యామాదుల నీ మార్గములో నడుపుము  ॥ శ్రీ గురుదేవా ॥ సాయీ శరణం బాబా శరణం...

(255) 11 September (11.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Sep విచారణ, విశ్లేషణ, ఆచరణ, భగవత్కృప ఇవన్నీ ఏ విషయంలో అయినా విజయానికి దారి తీస్తాయి. Inquiry, analysis, practice, and God's grace all lead to success in any matter. 255) నీ మార్గము చిత్రము (11.09.) నీ మార్గము చిత్రము,  నీ శిక్షణ విచిత్రము  నీ కరుణయె ఛత్రము,  మా కిహ పరముల శ్రీ సాయి  (1) త్వరితముగా, నీ కృపను, పొంది తరించుట కొరకై తెలియని పలు రకములౌ సాధనలు చేయుచుండ  మౌనముగనే చూచుచు, మనసును నిలుపగ నీయవు  మార్గమేదో తెలియనీక చిక్కులలో పడవేతువు  ॥ నీ మార్గము చిత్రము॥ (2) భౌతిక, సుఖ, సంపదలను  పొందగ నెంచును  నా మది అది వలదని  పరులతోడ పలుకుచు నడయాడు చుందు  పరులను వంచించు చుండి  నన్నే వంచించు కుందు  అహము పోవు మార్గమిది అని  చివరకు తెలుసుకొందు  ॥నీ మార్గము చిత్రము॥ (3) మందమతిని నేననుచు తెలిసియు  ఆడింతు వేల అజ్ఞానుడను నేననుచు  అపహాస్యము చేతువేల  అరిషడ్వర్గముల పుట్ట యనుచు  నన్ను పొడుతువేల  నీ ఆటల కిలలోన శ్యామాదులే దొరికిరా  నీ ఆటల కిలలోన శ్యామచరణుడే దొర...

(254) 10 September (10.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Sep 108 నామాలు జపించడం, 108 నామాలు రాయడం, చిన్న భజన చేయడం, ధ్యానం, ఒక్క పేజీ లేదా ఒక పేరా అయినా చదవడం, ఇలా ఒక్కొక్కటి 5 నిమిషాలు అయినా నియమిత కాలం, సంఖ్య చేయాలి. Daily every 5 minutes at a regular time, Chanting 108 names, writing 108 names, doing small bhajans, meditation, daily reading a single page or a paragraph, should be done. 254) బ్రహ్మానందా శరణం శరణం (10.09.) బ్రహ్మానందా శరణం శరణం  పరమ సుఖదా శరణం శరణం  జ్ఞానమూర్తి శరణం శరణం  ద్వంద్వాతీతా శరణం శరణం  గగన సదృశా శరణం శరణం  తత్వ మస్యాది లక్ష్య శరణం శరణం  నిత్య స్వరూపా శరణం శరణం  విమల స్వరూపా శరణం శరణం  అచల స్వరూపా శరణం శరణం  సర్వధీ సాక్షిభూతా శరణం శరణం  భావాతీత శరణం శరణం  త్రిగుణాతీతా శరణం శరణం  సద్గురు దేవా శరణం శరణం  శ్యామ నాయక శరణం శరణం  సాయినాథ శరణం శరణం  దత్తనాధ శరణం శరణం  అవధూత చింతన శరణం శరణం  గురుదేవ దత్త శరణం శరణం  అనాధ రక్షక శరణం శరణం  ఆపద్బాంధవ శరణం శరణం ఆశ్రిత పోషక శరణం శరణం...

(253) 09 September (09.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Sep సత్సంగము వలన విచక్షణాది వివేకము సద్బుద్ధి వైపునకు మరల్చును.  సద్బుద్ధి సన్మార్గమును సూచించును.  సన్మార్గము సత్పురుషుల చెంతకు చేర్చును. సత్పురుషుల సాంగత్యము వలన సద్గురువు లభించును. సద్గురుని సేవలో జీవి తరించును. Due to Good companionship, the Discretion and discreet shifts towards Right intelligence (Wisdom). Wisdom refers to the right path. Right path leads you to reach good people. Good people leave us near Right Guru. In the service of Guru, life will be blessed. 253) నాలో నీవే నిండి యున్నను (09.09.) నాలో నీవే నిండి యున్నను  నే నేలనో నిను కను గొన జాలను  కనుగొన జాలని ఈ దుస్థితికి  కారణమేదియో తెలియదాయెను  ॥ నాలో నీవే ॥ ఏమి చేయుదునో ఎటు పయనింతునో  ఏ మార్గమును అనుసరింతునో  ఎవరిని గురువుగ స్వీకరింతునో ఏ బోధనలను ఆచరింతునో  ఏమియు తెలియని జీవిని నేనని  దయను చూపుమా దీన దయాళా  అహమే మూలము అది వదిలినచో  సత్యము అనుభవమవు నందురయా  భావా తీతపు త్రిగుణా తీతపు స్థితియే  సహజముగ కలు...

(252) 08 September (08.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Sep ప్రతి మనిషికి రక్షణ కవచం అనేది ఒకటి ఉంటుంది. మనము ఎక్కువ భజనలు, నామజపం, ధ్యానం చేసే కొద్దీ ఆ రక్షణ కవచం బలోపేతం అవుతుంది. కష్టనష్టాలు వచ్చినా మన మనసుకు తాకకుండా కవచం తగిలి వెనక్కి వెళ్లిపోతాయి. Every man has a protective shield. The more we do chanting, meditation, God  adoration, the stronger that protective shield becomes. Difficulties come and go by hitting the shield without touching our minds. 252) ఎవరికెవరు తోడుగా రారు (08.09.) ఎవరికెవరు తోడుగా రారు  ఎవరికి వారే బ్రతుకుచు నుందురు  ॥ ఎవరికి ఎవరు ॥ ప్రారబ్దమును అనుసరించియే  జీవులందరు నడుచుచుందురు  ॥ ఎవరికి ఎవరు॥ (1) సద్గురువునకు శిష్యుడుండడు  శిష్యుడు తానని పలికెవాడు  వాడు శిష్యుడెన్నటికీ కానేరడు  గురువును మనిషిగ తలిచెడువాడు  శిష్యులలో అధమాధముడు  ॥ఎవరి కెవ్వరు ॥ (2) పరబ్రహ్మమే సద్గురువుగ  భువిలో నిజముగ అవతరించును  తను భావముతో ఆలోచించిన  గురు భావము అర్థము కాదు  తను భావమును వదిలిన వెంటనే  పరబ్రహ్మమే గురువని ...

(251) 07 September (07.09.)

Image
శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Sep కొన్ని ముఖ్యమైన విషయాలు చూచుకొని వాటిలో ఒక్కదానినైనను నియమం తప్పకుండా ఆచరించవలెను. There are some important things to keep in mind and one of them should be practiced regularly. 251) శ్రీ గురుదేవ జయగురు సాయిదేవ (07.09.) శ్రీ గురుదేవ జయగురు సాయిదేవ  దత్త గురుదేవ రావా రావా  రావా రావా రావా రావా రావా  వేగమే రావా  శ్రీ పాద వల్లభ నరసింహ యతివర  దత్తావతార రావా రావా  మాణిక్య ప్రభు స్వామి సమర్థ  దత్తావతారా రావా రావా  మాణిక్య ప్రభు స్వామి సమర్థ  దత్తావతారా రావా రావా  సాయినాథ గజాననా  అవధూత చింతన  గురుదేవ దత్త   రావా రావా కావ రావా  దత్త దిగంబర దత్త దిగంబర  దత్తదిగంబర పాహి పాహి  సాయి దిగంబర సాయి దిగంబర  అవధూత చింతన పాహి పాహి  దత్తావధూత దత్తావ థూత  దత్తావధూత దత్తావధూత  పాహి పాహి

(250) 06 September (06.09.)

Image
 శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Sep భగవంతుని విషయంలో ఒక నిర్ణయం చేసుకొని,  పద్ధతి ప్రకారం అనుసరించు వాడు ఒక్కో మెట్టు ఎక్కగలడు. One who makes a decision about God and follows that consistently, then can grow gradually. 250) ఓం నమశ్శివాయ హర శంకర జగదీశ్వర (06.09. ఓం నమశ్శివాయ  ఓం నమశివాయ  ఓం నమశివాయ.... (5 సార్లు) హర శంకర జగదీశ్వర  పరమేశ్వర లోకేశ్వర శంకర  పరిపాలయమాం... పరిపాలయమాం...  పరిపాలయమాం... పరిపాలయమాం .... (1) నిటల లోచన నీలకంఠ ధర  నిరుపమ నిర్మల నిర్గుణామయ  పరిపాలయమాం..... (2) గంగాధర హర గౌరి మనోహర  కాల లయంకర మృత్యుంజయకర  పరిపాలయమాం......  (3) ప్రమధ గణార్చిత ప్రళయ భయంకర  భోళా శంకర హర హర శంభో  పరిపాలయమాం...... (4) భస్మపియంకర భవ భయనాశక  శ్యామ మనోహర శ్యామ వందిత  పరిపాలయమాం......  (5)పతిత పావనా పన్నగ భూషణ  గజ చర్మాంబర ధారి త్రిశూలి  పరిపాలయమాం......  (6)భక్తజన ప్రియ భక్తవ శంకర  భస్మోధులిత దేహ మురారి  పరిపాలయమాం...... (7) బిల్వదళ ప్రియ అభిషేక ప్రియ  సదాశివ ప్రభు సచ్చి...