(247) 03 September (03.09.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 3 Sep

ఒక్కసారి పారాయణం చేసి దానిలోని ఒక్క మంచినైనా ఆచరణలో పెట్టాలి. సుఖదుఃఖాలలో కూడా గురువు చెప్పింది చేయాలి.
Once you Recite, in that atleast one good put into practice. Even in happiness and sorrow, should do what Guru says.





247) పరమాత్మ రూపా పతిత పావనా (03.09.)
మోహనరాగం 
పరమాత్మ రూపా పతిత పావనా 
పావన నామా పాండురంగా
॥ పరమాత్మ రూప ॥

రంగా రంగా విఠల విఠల 
రంగా రంగా విఠల విఠల 
పండరినాధా విఠల
పాండురంగ విఠల 
॥ పరమాత్మ రూప॥

(1) పతితుడైనట్టి పుండరీకుని 
ప్రేమతో కావగ వెలసితివయ్యా 
ఇటుక పైననే నిలచితివయ్యా 
భక్తు లెందరినో బ్రోచితివయ్యా 
భక్తులందరినీ బ్రోచితివయ్యా 
బ్రోచెదవయ్యా, కాచెదవయ్యా, 
పతిత పావన పాండురంగా, 
పాండురంగా, పాండురంగ 
రంగా రంగా పాండురంగా 
॥ పరమాత్మ రూప॥ 

(2) లోభిగానున్న పురంధరుని 
నీ దాసునిగా చేసుకుంటివి 
కడజాతి వాడనిన కనకదాసుని 
నీవానిగా నీవు చేసుకుంటివే 
పాండురంగా హరి విఠల 
పాండురంగా హరివిఠల 
॥ పరమాత్మ రూప॥

(3) సర్వము నీవని మదినిండుగా 
నమ్మి నీసేవ చేసిన తుకారాముని 
ఆపదల నుండి  రక్షించితివే 
నీ లోకమునకు పిలుచు కొంటివే ॥
రామకృష్ణ హరి జై జై 
రామకృష్ణ హరి జై జై 
॥ పరమాత్మ రూప॥

(4) సక్కుబాయిని అక్కున జేర్చి 
గోరా కుంభార ప్రేమతో గాచి 
నామదేవుని నడిపించితివే 
జ్ఞాన దేవుని కరుణించితివే 
శ్రీహరి జై జై రంగా జై జై 
శ్రీహరి రంగా జై జై జై జై 
శ్రీహరి జై జై రంగా జై జై 
పాండురంగా జై జై 
పండరి విఠలా జై జై 
పాండురంగ జై జై 
॥ పరమాత్మ రూప॥ 

(5) భక్తుల నెల్లర కాచుచుంటివే 
బాధ్యత లన్నియు మోయిచుంటివే 
నిన్ను పొగడగ ఎవరికి తరమౌ 
నిన్ను తెలియగ ఎవరికి తరమౌ 
ఏమీ తెలియని శ్యామను గావుము 
ఏమీ తెలియని శ్యామను బ్రోవుము 
॥ పరమాత రూప ॥


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)