(272) 28 September (28.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Sep
స్నానం చేసేటప్పుడు
పవిత్రంగా నామం చేస్తూ చేయాలి. దేహశుద్ధియే భావ శుద్ధి. పవిత్ర భావంతో
నీళ్ళు తీసుకొని "గంగేచ యమునేచ" అనే శ్లోకాన్ని చెప్పుకొని అన్ని నదులను
ప్రార్ధించి పసుపుతో నక్షత్రం గీసి భగవన్నామంతో చేయాలి. ఈ శరీరం
భగవంతునిది, దీన్ని పవిత్రంగా దేవాలయం లాగా ఉంచాలి. లేకపోతే ఆయన స్థానానికి
భంగం వాటిల్లుతుంది.
While taking a bath,
chanting of holy name should be done. "Purity of body is the Purity of
mind". Take the water with auspicious feeling, by saying the verse
"Gangecha Yamunecha" need to pray all the rivers. by chanting we need
to pour turmeric powder into water. And think that "This body is God's
Gift", it should be kept holy as a temple. Otherwise God's place will be
disrupted.
272) ఏదని దలదును నీ రూపమును (28.09)
ఏదని దలదును నీ రూపమును
ఏమని బిలతును నీ నామమును
లీలా నాటక సూత్రధారి హే
మాయా మానుష వేషధారి
॥ ఏమని ॥
(1) ఇది యది యనక అన్ని రూపముల
లో ఉన్నది నీవే యని దెలుపుచు
సర్వ నామముల కధిపతి నీవై
సమతా మమతలను నిలిపిన దేవా
॥ ఏమని ॥
(2) రామకృష్ణ శివ దత్త మారుతీ
రహీము అల్లా యెహోవా క్రీస్తు
నానక్ నారాయణి శక్తులుగా
దర్శన మొసగడి శ్యామ సన్నుతా
॥ ఏమని ॥
Comments
Post a Comment