(269) 25 September (25.09.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Sep

సమస్త నామములు నేను నమ్ముకున్న సద్గురునకే అనెడి భావనతో సమర్థ సద్గుర్తువును గాఢంగా విశ్వసిస్తే తరించగలరు.
With deep conviction, when we feel all the names for our beloved Guru , then we can get Rid easily.


269) రామ నామమే పావనము (25.09.)
రామ నామమే పావనము 
శ్రీరామ నామమే జీవనము 
శ్రీరామ నామమే తారకము 
శ్రీరామ నామమే విశ్వాధారము 
రామ నామమే పతిత పావనము 
॥ శ్రీ రామ నామమే ॥

(1) భక్తి నొసగును రామ నామము 
శక్తి నొసగును రామ నామము 
భుక్తి నొసగును రామ నామము 
ముక్తి నొసగును రామ నామము 
॥ రామ నామమే॥

(2) సదాశివుడు స్మరియించెడు నామము
భక్తులు ధ్యానము చేసెడి నామము 
భవ సంద్రము దాటించెడి నామము 
సద్గురు కృప నందించెడి నామము 
॥ రామ నామమే ॥

(3) కోటి జన్మముల పాపపు రాశిని 
తృటిలోనే తొలగించెడి నామము 
శరణు శరణమని రామ పాదము 
పట్టిన వారిని విడువని నామము 
॥ రామ నామమే ॥

(4) సదా హనుమ స్మరియించెడి నామము
సత్పురుషుల జూపించెడి నామము
సత్సంగములను యొసగడి నామము
సద్గురు కృప వర్షించెడి నామము 
॥ రామ నామమే॥

(5) ఇక్కట్టుల సమయించెడి నామము
ఇహపర సుఖముల నొసగెడి నామము
ఆత్మానందం నిలపెడి నామము 
అంతట నిండిన భగవన్నామము 
॥ రామ నామము॥

(6) అహమాదుల నణ గార్చెడి నామము
ఆనందమునకు అదే సోపానము 
ఆత్మ నెరెంగుట కదియే మార్గము
సచ్చిదానందమైన నామము 
॥ రామ నామము ॥

(7) ఆది మధ్యాంత రహిత నామము 
అణు వణువున నిండిన శ్రీ రామ నామము
బంధముల విడ దీసెడి నామము 
బ్రహ్మానందము నిలిపెడి నామము 
॥ రామ నామమే॥

(8) మహర్షు లందరు జపించెడి నామము
భక్తులు గానము చేసిడి నామము
దివి భువి నొకటని తెలిపెడి నామము
దివ్యానుభూతి నొసగెడి నామము 
॥ రామ నామము ॥

(9) అన్ని నామములు ఇమిడిన నామము 
అన్ని రూపములు కలిగిన నామము 
వినీల మేఘశ్యామ నామము 
విమల మచలమై నిలిచిన నామము 
॥రామ నామమే॥

(10) రామ నామమే తారకము 
శ్రీ రామ నామమే పతిత పావనము 
రామ నామమే తరుణోపాయము
శ్రీరామ నామమే భవ భయహరణం 
శ్రీరామ శరణం శరణం
శ్రీ సద్గురుదేవ దివ్య పాదార విందార్పణ మస్తు
(01.04.1990, ఆదివారం, సా.05.15 గం.కు)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)