(264) 20 September (20.09.)
శ్రీ శారద శ్యామ సందేశం: 20 Sep
264) రావయ్య రామయ్య (20.09.)
రావయ్యా రావయ్యా
శ్రీ సీతారామయ్యా
మా సేవలను వేగమే చేకొన
రావయ్య రామయ్యా॥
రామా సీతారామా (2)
(1) మిమ్ము చూచి పులకించి
తరయించగ భక్తులెందరో ఉన్నారయ్యా
॥ రావయ్యా ॥
(2) అకాలమైనను అధిక భక్తితో
సేవకులెందరో యున్నారయ్యా
॥ రావయ్యా ॥
(3) శ్రీకరమౌ మిము దర్శించగా
తహ తహ లాడుతూ యున్నామయ్యా
॥ రావయ్యా ॥
(4) అభయ ప్రదాత ఆపద్బాంధవ
అనాధ రక్షక రావయ్యా
॥ రావయ్యా ॥
(5) సురముని గణ సంపూజిత
సచ్చిదానంద రావయ్యా
॥ రావయ్య॥
(6) శరణాగతుడవు కరుణాకరుడవు
ప్రేమ మయుడవు రావయ్యా
॥ రావయ్యా ॥
నీ నామామృత పానము చేయుచు -
నిరతము నీ చింతన చేయుచు
బ్రతుకును లాగెడి శ్యామాదులను.
కావగ వేగమే రామయ్య
॥ రావయ్యా ॥
సాయిరామా....... సాయి రామా ......
సీతారామా..... సీతారామా.....
(శ్రీరామనవమి
సందర్భంగా బాబా గారు రచించిన పాట)
Comments
Post a Comment