(256) 12 September (12.09.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Sep

భగవంతుడా నీవు ఇచ్చిన జన్మను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొనేటట్లు చేయి తండ్రి అని ఎప్పుడూ అనుకోవాలి.
Always think that God will make life fulfill which is he has given, without wasting it.


256) శ్రీ గురుదేవా పరమ ప్రేమ స్వరూపా (12.09.)
శ్రీ గురుదేవా పరమ ప్రేమ స్వరూపా 
పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వర, సాయీశ్వరా

(1) భుక్తి కొరకు అహరహము ఆరాటపడు చుండెడి 
లోక వాసనల లోన సదా మునిగి యుండెడి 
"నేను"  "నా" దనుచు సతతము ప్రాకులాడుచుండెడి 
నాకెటుల భక్తి కలుగు నీ యందు అనురక్తి కలుగు 
॥శ్రీ గురుదేవ॥

(2) భక్తి యనగ, ముక్తి యనగ యుక్తిగా చెప్పెడి వారల 
ఎందరినో చూచి వారి ఉపన్యాసముల వింటిని 
పరులకు బోధించు తెలివి తేటలేమో పెరిగినవి 
అభిజాత్యము, అహములతో బ్రతుకు దుఃఖమయమైనది 
॥ శ్రీ గురుదేవా॥

(3) నీ మార్గము శ్రేష్టమని చెప్పెడి వారే అథికులు 
నీ మార్గములో నిజముగా నడిచెడి వారే అరుదు 
నీకై నీవు పరమ ప్రేమామృత కరుణతో కృపను జాపి 
శ్యామాదుల నీ మార్గములో నడుపుము 
॥ శ్రీ గురుదేవా ॥

సాయీ శరణం బాబా శరణం 
సాయీబాబా శరణం శరణం 
సాయీ శరణం శ్రీ గురు శరణం 
సద్గురు సాయీ శరణం శరణం 
సాయీ శరణం దత్త శరణం 
సాయీ దత్త శరణం శరణం 
॥ శ్రీ గురుదేవ ॥
(28.04.1987, రా.11-15 గం.కు)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)