(248) 04 September (04.09.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Sep

మనం ఆచరించకుండా ఎక్కువగా ఎదుటి వారికి చెప్పడం వలన అహంకారం పెరుగుతుంది.
Ego grows when we tell others what we do not practice.


248) పాపివి నీవని పలుకవే మనసా (04.09.)
పాపివి నీవని పలుకవే మనసా 
పశ్చాతాపము జెందవే మనసా
పరిహారములను జేయవే మనసా 
పుణ్య చరితవై మసలవే మనసా 

(1) నీ భావనయే నిను నడిపించును 
నీ పవిత్రతయే నిను రక్షించును 
నీ సన్మార్గము నిను కాపాడును 
నీ గురు భక్తియే నిను కృప జూచును 
॥ పాపిని ॥

(2)  భగవన్నామపు శక్తిని తెలియుము 
భాగవతులతో చెలిమి జేయుము 
సద్గ్రంధముల సారము నెరుగుము 
సదాచరణముతో సతతము నడువుము 
సద్భుద్దిగ బ్రతుకగ నేర్చుము 
॥ పాపిని ॥

(3) త్రిలోక నాధుని చింతన జేయుము 
లోకుల మాటల సరకు జేయకుము 
లోకేశ్వరుని నీలో జూడుము
॥ పాపిని ॥

(4) పతితులు లేరు పావనులే గాని 
పతిద్దాదారకులున కాలముల
పరబ్రహ్మమగు శ్రీ గురుదేవుల 
పాదరేణువగు శ్యామ గనుమా 
॥ పాపిన ॥ 

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)