(246) 02 September (02.09.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 2 Sep
అందరినీ ప్రేమగా చూడాలి అంటే
ఎదుటి వారిలోని దోషాలు, తప్పులు మనం ఎత్తి చూపకుండా వారిలోని మంచిని
గమనిస్తే అతనిలో భగవంతుని చూడగలుగుతాము.
To treat everyone with
love means that if we observe the good in others without pointing out
their faults and mistakes, we will be able to see God in them.
246) అరుణగిరి మీద నెలకొన్న స్వామి (02.09.)
అరుణగిరి మీద నెలకొన్న స్వామి
అంధుడను నేనెటుల నిను జూతునయ్య
నీవు చెప్పినదేదో నాకు అర్థము గాదు
నేను ఊహించినది నీవన్నది కాదు
అర్థమైనట్టునుండు నీ బోధనల చదువ
అంతు తెలియదు దాని కనుగుణముగా నడువ
॥ అరుణగిరి మీద ॥
(1) ఏ సాధనలు చేసి నీ వట్టు లైతివో
తెలుసుకొని శక్తి నాకిసుమంత లేదాయె
నీ ప్రవర్తన చదవ నా మది నీవాయే
నేను తొలగిడి మార్గమే తెలియదాయె
॥ అరుణగిరి మీద ॥
(2) నిన్ను మరువలేను నిన్ను వీడగలేను
నీ మార్గమందున పయనించలేను
నా శక్తి చాలదని అనుభవమే
తెలిపినది కృప జూపి
శ్యామను నీవే నడిపించుకో
భగవాన్ రమణ శరణం శరణం
అరుణగిరి నాధ భగవాన్ శరణం
అరుణాచల శివ శరణం శరణం
ఆనంద దాతా శరణం శరణం
॥ అరుణగిరి మీద॥

Comments
Post a Comment