(270) 26 September (26.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Sep
సాధనలో జీవితం ఒక భాగం కావాలి కానీ జీవితంలో సాధన ఒక భాగం కాకూడదు.
Life should be a part of the practice, but practice should not be a part of life.
270) వందనం - రఘు నందనం (26.09.)
వందనం - రఘు నందనం
సేతు బంధన - భక్త చందన
॥ రామ వందనం ॥
శ్రీ దమ నాతో వాదమా
నే భేదమా ఇది మోదమా
॥ రామ వందనం॥
వింటిని - నమ్ముకొంటిని
శరణంటిని - రమ్మంటిని
॥ రామ వందనం॥
ఓడను - భక్తి వీడనూ
ఒరుల వేడను - నీ వాడనూ
॥ రామావందనం॥
న్యాయమా - నీ కాదాయమా
యింత హేయమా - ముని గేయమా
॥ రామ వందనం॥
వేగరా - కరుణాసాగరా
శ్రీ త్యాగరాజ హృదయాగరా
॥ రామ వందనం॥
(03.04.1990, ఉ.10.30 గం.)
Comments
Post a Comment