(258) 14 September (14.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Sep
1. నామం జపించడం (జప మాల)
2. నామం రాయడం
3. భజన
4. కీర్తన (బాబా గారి పాటలు)
5. మౌనం (వాచక, మానసిక
6. పుస్తక పఠనం
7. ధ్యానం
8. ప్రాణాయామం
9. యోగాసనం
10. పూజ
11. పాక్షిక శరణాగతి
12. ప్రదక్షిణ (గుడిలో గానీ, తులసమ్మకు గానీ, ఇంట్లో ఒక పటము చుట్టూ గానీ)
13. సత్సంగము
14.
భగవంతునితో మాట్లాడాలి, ఎలా వుండాలి అనుకుంటున్నావో, ఏమి చేయాలి
అనుకుంటున్నావో, ఏమి కావాలి అనుకుంటున్నావో, అన్నీ భగవంతునితో మాట్లాడాలి,
ప్రార్థించాలి, అడగాలి. నేను కోరుకుంటున్న కోరికలు మంచిదైతే నాకు ఇవ్వు
తండ్రి అని అడగాలి.
పైవన్నీ నియమిత కాలంలో, నియమిత సంఖ్యతో, టైమ్ టేబుల్ వేసుకుని ఒక వారం ప్రయత్నం చేయండి.
258) దయగనుమా శ్రీ ద్వారకామాయీశా (14.09.)
దయగనుమా శ్రీ ద్వారకామాయీశా
కృప గనుమా కరుణాలయ వాసా
కరుణాలయ వాసా సాయిశా
సాయిశా ప్రభోసాయిశ
(1) నీ దయ లేనిదే గడువదు క్షణము
నీ కృప లేనిదే నడవదు జీవితము
నీ వాధారము సకల సృష్టికి
నీవే రక్ష, నీవేదిక్కు ॥ దయగనుమా ॥
(2) త్రికరణ శుద్ధియు, అణుకువ
ఋజు వర్తనములను గలిగిన గాని
నీ కృప పొందుట కర్హత కలుగదు
నీ కృప లేక నిరర్థకమౌను ॥ దయగనమా॥
(3) నీ వను కొనక నీ దరి చేరరు
నీ దరి చేరిన వెనుకకు మరలరు
ఇటు నటు అటు నిటు ఎటు తిరిగిననూ
చివరకు నీవే శరణ మందురు ॥ దయగనుమా॥
(4) వాక్కుకు అందవు మనసుకు అందవు
బుద్ధికి అందవు దేనికి అందవు
ఏ రీతిగా నిను అనుసరింతురా
నీ దయలేక నడవలేను రా
నీ కృప లేక జీవించలేను రా
భక్తవత్సల భవ భయ నాశక
ప్రేమ స్వరూపా కరుణా జలధే
కృప జూపి శ్యామాదుల బ్రోవుము
నీ మార్గములో మము నడిపింపుము
॥ దయ కనుమా॥
(28.04.1987, రా.10.45 గం.కు)
Comments
Post a Comment