(260) 16 September (16.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Sep
సరైన స్థలంలో, సరైన సమయానికి, సరైన విషయం గురించి స్వార్ధ రహితమైన మంచి మనిషి ద్వారా ఇవ్వబడిన, సరైన సలహా అత్యంత విలువైనది.
In the right place, at the right time, the right advice given by a altruistic man is most valuable thing for us.
260) దిక్కులన్నియు వస్త్రమైనదని (16.09.)
దిక్కులన్నియు వస్త్రమైనదని
దిగంబరుడవని యందునా
ఏమీయు లేని వాడవని
దిగంబరుడవని యందునా
ఏ భావముతో నిను స్మరియుతును
ఏ రూపమని నిను పూజింతును
దిగంబరా దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా
(1) దిక్కులన్నీ నీ వస్త్రమైనచో
విశ్వమంతా నీ దేహమే కదా
నీలోన పుట్టుచు గిట్టుచు
నేను నాదనుచు తలచెద నేలనో
దిగంబరా దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా ॥
(2) ఏమియు లేని వాడవయినచో
అంతయు నీవని తెలిపితివేలా
సగుణముల లోన మునిగిన నాకు
నిర్గుణ మీవని ఎటుల తెలియురా
దిగంబరా దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా॥
(3) సత్యా సత్య వివేకము గాని
ధర్మా ధర్మ విచక్షణ గాని
కర్మ కర్మముల మర్మము గాని
జ్ఞానా జ్ఞానముల భేదము గాని
తెలియని వాడగు శ్యామచరణుని
ప్రేమతో చేకొని కృపను జూపుమా
దిగంబరా దిగంబరా
శ్రీపాద వల్లభ దిగంబరా॥
(04.05.1987, 00.43 గం.కు)
Comments
Post a Comment