(252) 08 September (08.09.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Sep

ప్రతి మనిషికి రక్షణ కవచం అనేది ఒకటి ఉంటుంది. మనము ఎక్కువ భజనలు, నామజపం, ధ్యానం చేసే కొద్దీ ఆ రక్షణ కవచం బలోపేతం అవుతుంది. కష్టనష్టాలు వచ్చినా మన మనసుకు తాకకుండా కవచం తగిలి వెనక్కి వెళ్లిపోతాయి.
Every man has a protective shield. The more we do chanting, meditation, God 
adoration, the stronger that protective shield becomes. Difficulties come and go by hitting the shield without touching our minds.


252) ఎవరికెవరు తోడుగా రారు (08.09.)
ఎవరికెవరు తోడుగా రారు 
ఎవరికి వారే బ్రతుకుచు నుందురు 
॥ ఎవరికి ఎవరు ॥

ప్రారబ్దమును అనుసరించియే 
జీవులందరు నడుచుచుందురు 
॥ ఎవరికి ఎవరు॥

(1) సద్గురువునకు శిష్యుడుండడు 
శిష్యుడు తానని పలికెవాడు 
వాడు శిష్యుడెన్నటికీ కానేరడు 
గురువును మనిషిగ తలిచెడువాడు 
శిష్యులలో అధమాధముడు 
॥ఎవరి కెవ్వరు ॥

(2) పరబ్రహ్మమే సద్గురువుగ 
భువిలో నిజముగ అవతరించును 
తను భావముతో ఆలోచించిన 
గురు భావము అర్థము కాదు 
తను భావమును వదిలిన వెంటనే 
పరబ్రహ్మమే గురువని తోచును 
సర్వము గురువని తెలిసిన గానీ 
శిష్యునిగా నిలువ నేరడు 
॥ఎవరికెవ్వరు॥

(3)  సచ్చిష్యుని  లక్షణము లన్నియు 
కలిగిన గాని గురువు తెలియడు 
కనులకు కెదురుగా సద్గురువున్నను 
అంధుని వలె గుర్తించక పోవును 
గురువు గురువను చిలుక పలుకులను
ఎంతగ పలికిన ఫలితము శూన్యము 
సద్గురువు గూడ మనవలె నుండును 
వారిని తెలియుట బహు దుర్లభము 
॥ ఎవరికెవ్వరు॥

(4) త్రికరణ శుద్ధిగ చేసిన పనులకే 
సత్ఫలితములు కలుగుచునుండును 
త్రికరణ శుద్ధిగ భక్తి కలిగినచో 
సద్గురు వనగా నేమో తెలియను 
సద్గురు వొక్కడే విశ్వవ్యాపియై 
సర్వకాలమున నిలిచి యుండును 
సచ్చిష్యున కది అవగతమగును 
సద్గురు కృపతో తరించిపోవును 
॥ ఎవరికెవ్వరు॥

(5) సద్గురువును తమ స్వార్థము కొరకై 
వాడుకొనుటయే మూర్ఖ లక్షణము 
మూర్ఖ లక్షణమే పాప పంకిలము 
నీచ జన్మల కదియే మూలము 
॥ ఎవరికెవ్వరు ॥

(6) శాంతికి పెన్నిధి శ్రీ గురు సన్నిధి 
లౌకికమున కది లొంగని శ్రీనిధి 
పరమ ప్రేమకు అదే జీవనది 
పతితుల కెల్లను పరమావధి 
॥ ఎవరికెవ్వరు ॥

(9) మన వలె భువిలో సంచరించెడి 
గురువును పొందిన వాడే శ్రేష్టుడు 
సద్గురు దేవుని ఆదేశమును 
ఆచరించెడి వాడే ధన్యుడు 
సద్గురు సేవకు సంపూర్ణముగా 
అంకితమైన వాడె పుణ్యుడు 
గురువు తప్ప యిక నితరము నెరుగక 
బ్రతుకుచు నుండెడి వాడే పూజ్యుడు 
॥ ఎవరికెవ్వరు ॥

(8) సద్గురు సచ్చిష్యుల సంబంధము 
జన్మ జన్మముల ౠణాను బంధము 
సచ్చిష్యునిగా మారిన వానికి 
శ్యామనాథుడే సద్గతి నొసగును 
॥ ఎవరికెవ్వరు ॥

(9) చేపల పట్టెడి వలలోని జలము 
తిరిగి జలమునకే చేరు విధముగా 
శిష్యుల మనుకొను వారందరును
లోకవాసనల పాల బడుదురు
॥ ఎవరికెవ్వరు ॥

(10) సదవకాశములు మరి మరి రావు 
సద్గురు వెన్నడు సదా దొరకడు 
సదావకాశమును సద్గురు దేవుని 
వదలు కొనుటయే దౌర్భాగ్యము 
॥ ఎవరికెవ్వరు ॥

(11) ఎన్నో జన్మల పుణ్య ఫలము ననే 
సద్గురు సన్నిధి మనకు లభించును 
సద్గురు దేవుని వదిలిన వానిని 
లోకవాసనలు కబళించును 
లోకవాసనల మునిగిన వాడు 
అధో జన్మలకు పరుగు లెత్తును 
జనన మరణముల వలలో దగులుకొని 
సుఖ దుఃఖంబుల నను భవించును 
॥ ఎవరికకవ్వరు॥

(12) సుఖ దుఃఖములలో భయ వాసనలలో 
సద్గురు దేవునే సమాశ్రయించి 
సర్వస్య శరణాగతి చెందిన 
జీవి తరించును పునీతుడగును 
శ్యామనాథుడగు శ్రీ గురునాథుడు 
కరుణతో బ్రోచి కృప జాపును 
అర్హత కలిగిన వారల నెల్లర 
బ్రహ్మానందము నందు ముంచును 
సర్వజీవులకు సద్గురు వొక్కడే 
ఎన్నటి కైనా పరిరక్షకుడు
శ్యామ చరణుని చక్కగ నడిపెడి 
సద్గురు నాధుడే ఆది మూలము 
॥ ఎవరికెవ్వరు ॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)