(268) 24 September (24.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Sep
ఇది అది యనక అన్నీ దానికే నివేదించు, అన్నింటికీ దానినే ప్రార్థించు, ఆరాధించు, చివరకు అదే నీవు అవుతావు - ఇదే గమ్యము.
Without saying this or that, submit all to it. Pray, adore. At last you will be the same and that is your destination.
268) ఏమి మాయయో - అదేమి మాయయో (24.09.)
ఏమి మాయయో - అదేమి మాయయో
మాయ మాయ అందురు - అదేమి మాయయో
తెలిసినటుల దోచుగాని చివరేమో తెలియదు
॥ ఏమి మాయయో॥
(1) నేను నేను అనుచు నుందు నేనేమో తెలియదు
నాది నాది అనుచు నుందు నాదు వెంట ఏదీ రాదు
ఏమి మాయయో అదేమి మాయయో
॥ ఏమి మాయయో॥
(2) జరిగినది నా సుఖమునకు అని తెలిసీ తెలియక
తలచినదే జరిగినంత ఎంతెంతో పొంగిపోదు
అటులనే కృంగిపోదు తలచినదే జరుగనంత
నాకేది మంచిదో చెడుపో తెలిసీ తెలియకనే
॥ ఏమి మాయయో॥
(3) ఆత్మీయులు చనిపోయిన దుఃఖముతో కృంగిపోదు
నేనూ ఒక నాటికి పోవుదునని తెలిసియు
నా యోచనలన్నీ నిరుపయోగములని తెలిసియు
రకరకముల యోచనలతో పలురీతుల పలుకు చుందు
॥ ఏమి మాయయో॥
(4) నాదను భావమే దీనికి మూలంబని తెలిసియు
దాని ప్రభావములో నుండి బయట పడక నే నుంటి
బయట పడుట అసాధ్యమని అనుభవమున తెలుసుకొంటి
కృపను జూపి నడిపించి కరుణించుమా శ్రీ గురు
॥ ఏమి మాయయో॥
(05.11.1988, సా.05.45 గం.)
Comments
Post a Comment