(265) 21 September (21.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Sep
గురువు యెక్క మార్గ
దర్శకంలో విషయాల మంచి చెడ్డలు, మనుషులు వారి పనులు, పద్ధతుల అందలి మంచి
చెడ్డల గురించి మన యొక్క అభివృద్ధి కొరకు చర్చించుకోవడము ఎంతైనా అవసరము.
In the guidance of our Guru, it is necessary to discuss the good and bad of our subjects, actions and methods for our growth.
రఘువంశ తిలక- రాజీవ లోచన
నేనేమి జేతురా- నీరజ నయనా
రామా... రామా... రామా... సీతారామా...
(1) పట్టు పీతాంబరము- నవరత్న మాలికలు
వజ్ర సింహాసనము- వాగ్దేవి వేదములు అమరించి- స్తుతియించ శక్తి లేదు కదయ్యా
॥ రఘువంశ ॥
(2) పన్నీట అభిషేకములు చేయలేను
పట్టుపరుపులను అమరించలేను
ఆచారముల నన్నీ పాటించలేను
ప్రేమతో దయ చూపి కరుణించవయ్యా
॥ రఘువంశ॥
(3) భక్తులందరు నిన్ను ఎన్నెన్నో విధములుగ
సేవించు చుందురు కల్యాణ రామా
కాదనక మా చిన్ని సేవలను గ్రహియించి
శామాదులను నీలో నిలుపుకో దేవా
శ్రీరామ రామ - సీతారామ
జయరామ రామ... జానకీ రామా
శరణాగత రక్షకా రామా... శ్రీరామా...
శ్యామ సన్నుతా సాయిరామా
గుణధామా…. శ్రీరామా
॥ రఘువంశ॥
Comments
Post a Comment