(257) 13 September (13.09.)

 శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Sep

మనకు ఇతరులు ఎలా ఉపయోగపడతారు అని అనుకుంటే అది వ్యాపారం అవుతుంది. మనం ఎలా ఇతరులకు ఉపయోగపడతామా అని ఆలోచించాలి.

It will be business if we think about how others can be useful to us. We need to think about how we can be useful to others. 



257) నయ వంచకులతో చెలిమి కలిపెదవు  (13.09.)
నయ వంచకులతో చెలిమి కలిపెదవు 
నీ మార్గమునకు దూరము చేతువు 
పతితుడయినను పాహి పాహి యని 
నీ పద సన్నిధి శరణ మంటినే 
॥ నయవంచకులతో॥

(1) అసలు సత్యమును తెలియగ 
నీయక అపసవ్యముగా నను నడిపింతురు 
గురువుల మనుచు భుజముల కెక్కి 
గురుతును చూపక గుదిబండ లౌతురు 
భయమును పెంచి బానిసలుగా మార్చి 
నిను సంశయించెడి స్థితికి చేర్చెదరు ౹ 
॥ నయవంచకులతో ॥

(2) దైవ నామము ప్రచారము చేయుచు 
లౌకిక సుఖ సంపదలకు లొంగుచు 
బ్రతుకులు లాగెడి మనుజుల తోడ 
నను జేర నీయక నీ కడ నుంచుము 
నీ వొసిగిన ఈ మానవ జన్మము 
నీ సేవలకే వినియోగించగ 
కృపను జూపుమా ఆపద్బాంధవ 
శ్యామచరణ పరిరక్షక, పోషక 
॥నయవంచకులతో॥
(28.04.1987, రా.12.00 గం‌.కు)

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (1వ భాగం) (1 నుండి 200)

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏 (2వ భాగం) (200 నుండి ______)

13 April (13.04.) (104)