(271) 27 September (27.09.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Sep
నామాన్ని వింటూ
వుండాలి. మనం నామం చేస్తూ మనమే వినాలి. ఇలా బాగా రావాలంటే, మనం మాట్లాడే
అన్ని మాటలూ, అన్ని శబ్దాలూ (మంచి, చెడు ఏదైనా కానీ) మనమే వినటం సాధన
చేయాలి.
Listen the chanting, when you are
chanting to listen that. We have to practice listening to all the sounds
and all the words (good or bad) that we speak.
271) ప్రేమావతారా భక్త మందారా (27.09.)
ప్రేమావతారా భక్త మందారా
దీన జన రక్షకా పాహిమాం రక్షమాం
నా బాధ తొలగించి సద్భుద్ది కలిగించి
నీ దారి నడిపించు శ్రీతజన పాలా
సాయిరాం - పాహిమాం సాయిరాం - రక్షమాం
(1) నరనరము నందు నీ నామ స్మరణము లేని
నరజన్మ నా కెందు కొసగినావో ?
ప్రతి క్షణము నీ యందు భక్తి శ్రద్ధలు లేని
బ్రతుకు నాకెందుకు ఒసగి నావో?
తెలిసి తెలియని చదువు అవివేకమును పెంచ
ఓర్పు విశ్వాసములు ఎటుల కలుగు?
అనుమానమే నన్ను పెనుభూతమై
పట్టి పీడించి, ఆడించ వెక్కిరించ
నన్ను కావగ రావా కరుణ జూపగ రావా
నీ యందు భక్తి ప్రేమలను కలిగించవా
సాయి శరణం - రామా శరణం
సాయిరామ - శరణం శరణం
(2) నీయందు అనురక్తి పెంచుకొన నెంచి
నీ నామ స్మరణము జేయ నెంచి నంత
కామ క్రోధాదులు కదము త్రొక్కుతూ వచ్చి
లౌకికమునకు మనసు ఈడ్చినంత
అదియే శాశ్వతమని అజ్ఞాన తిమిరము
శోక సంద్రము నందు ముంచినంత
మునుగుచూ తేలుచూ ఆత్మస్థైర్యము లేక
తపియించి నిను చేర నెంచినంత
ఎవ్వరును కనరారు ఏదిక్కు తోచదు
నీ ఒక్కడివే తప్ప సాయి దేవా
నన్ను కావగా రావా కరుణ జూపగ రావా
నీ యందు భక్తి ప్రేమలను కలిగించవా
నీ వానిగా నన్ను చేసుకొన నెంచవా
నీ కృపను దయతో నామీద చిలికించవా
సాయి శరణం - రామా శరణం
సాయి రామ - శరణం శరణం
(23.06.1989, మ.12.00 గం.కు)
Comments
Post a Comment