13 April (13.04.) (104)
శ్రీ శారదా శ్యామ సందేశం:
సాధనలో పురోగతి లేదు అంటే మనకు స్వీయ నియంత్రణ లేదు అని అర్థము. ఇంద్రియాల మాట వింటే స్వీయ నియంత్రణ ఉండదు.
In practice no progress means we have no self-control. If listen to the senses word, there is no self-control. (13 Apr)
104) పవళించ ప్రార్థింతు పనగ శాయి
పవళించ ప్రార్థింతు పనగ శాయి
శయనించ వేడెదను శ్రీ శేష సాయి || సాయి ||
పట్టు పానుపు మీద పరిమళము వెదజల్లు
మల్లె మాలతి జాజి సంపెంగలను బరచి
శ్యామ హృదయంబున అమరించి నాడయ్యా
శయనించి కరుణ శ్యామను ఏలవయ్య
భక్తులను రక్షించి బాధ్యతల భరియించి
ఆలించి లోకముల పాలించినావూ
అలసిపోయితివేమో దేవాది దేవా
శయనించి కరుణ శ్యామను ఏలవయ్యా
తెరవేయు తనలోని తెరలు తొలగించగా
పాదములు సేవించు మాయ తొలగించగా
అర్ర్చించు నీలోన తానైక్య మొందగ
ప్రార్ధించు ప్రేమ నీ విపుడు శయనించగ

Comments
Post a Comment