12 April (12.04.) (103)
శ్రీ శారదా శ్యామ సందేశం:
నీ గురించి నీవు ఆలోచించుకో లేదా భగవంతుని గురించి ఆలోచించు. అంతేకానీ మూడో వ్యక్తి గురించి అనవసరంగా నీవు ఆలోచించవద్దు.
Think of yourself or think of God. And don't think about the third person unnecessarily. (12 Apr)
103) హరి గురు నామమే
హరి గురు నామమే మధురము మధురము
హరి గురు నామమే మధురాతి మధురము
గురు దరిశనమున కదే సోపానము || హరి గురు||
1. హరియే గురుడట గురుడే హరియట
హరి గురువులకు బేధము లేదట
మానవాళిని ఉద్ధరించుటకు
హరియే గురువుగ అవతరించునట ||హరి గురు||
2 . మానవ రూపమున నుండెడి గురువును
గుర్తించుటయే బహు దుర్లభమగు నట
అహము వదలినచో హరియే గురుడను
సత్యము దెలుయుట సులభమగునట || హరి గురు ||
3 . సద్గురు నామము స్మరియుంచుటకు
సద్గురు కృపయే కారణమగునట
శ్యామనాధుడగు సాయినాధుని
కృపతో సర్వము సులభ మౌనట ||హరి గురు||
4 . పరులకు అపకారములను జేయక
ఉపకారములను జేయుచునుండిన
సర్వజీవులలో దైవము గలడని
వినయము తో సేవించు చుండినను
శ్రీ హరి నామపు మధురము దెలియును
హరి గురు లొకటను అనుభవమగును || హరి గురు ||

Comments
Post a Comment