14 April (14.04.) (105)

శ్రీ శారదా శ్యామ సందేశం:
వ్యక్తిని వ్యక్తిగా కాక వ్యక్తిలోని శక్తిని యుక్తిగా గుర్తెరింగి రక్తిని కలిగించుకుని అనురక్తి పెంపొందించుకొనుటయే భవ బంధ విముక్తికి మార్గము.
Rather than seeing Person as Person, Maneuverly recognise the strength in that person and Cause affection and increase it. It's the liberation path from bondage. (14 Apr)



105) వైభోగము చూడగ రారండి

వైభోగము చూడగ రారండి
శ్రీ సాయి రాముని వైభోగము
చూడగ రారండి ||

1 .సకల బాధలు సమసిపోవునట
సర్వజీవులకు శాంతి కలుగునుట
సకల దేవతల దర్శనమగునట
సంతస మంతట వెల్లివిరియునట

||వైభోగము చూడగా రారండి||

2 . షిరిడి గ్రామము నందు కనిపించి
ద్వారకమాయి నందు నివసించి
సకల జీవులను సమాదరించి
ప్రేమ రూపమై వెలసిన సాయి

||వైభోగము చూడగ రారండి||

3 . భక్తులందరికి అభయ మొసగుచు
బాధ్యతల నెల్ల తానే భరియించుచు

ఇహపర సుఖముల కరుణ నొసంగుచు
వాత్సల్యంబున గాచెడి సాయి
||వైభోగము చూడగ రారండి||

4. వెనుక వైపున ఒక చిన్న రథమును
కుడి వైపున తులసి బృందావనమును
మధ్యన భజనల భక్త బృందమును
ఎదురుగ సాయి కూర్చొని యుండెడి
||వైభోగము చూడగ రారండి||

5 . తాళ మృదంగ భేరి నినాదముల
సంతసమిడు సంగీత స్వరములతో
నిండిన సాయి నామ కీర్తనలు
తిలకించెడి సాయి రాముని
|| వైభోగము చూడగ రారండి||

6. భక్తి భావములు మనసులు నిండగ
నుండగ తనువులే నాట్యములాడగ

మహోత్సాహమున భక్త బృందము
సాయి నామమునే పలుకుచు నుండెడి
||వైభోగము చూడగ రారండి||

7 . తాత్యా తదితర భక్తులను కూడి
ద్వారకమాయి వాసుని చేరి

బయలుదేరుటకు సిద్ధమగుమని

వినయముగా ప్రార్థించుచుండెడి
||వైభోగము చూడగ రారండి||

8 . తాత్యా సాయిని లేవదీయగా
కుడికాలి తోడన ధునిని సవరించి
కుడిచేతి తోడ దీపమునార్పి
మెల్లగ ముందుకు అడిగిడు సాయి
||వైభోగము చూడగ రారండి||

9 . అలంకరించిన శామకర్ణియును
వెండి పల్లకి యు ముందుగ నడువగ
భక్తులు పరిచెడి వస్త్రంబులపై
మెల్లగా ముందుకు అడుగిడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

10 . ఎడమవైపున తాత్యా పటేలు
కుడి వైపున శ్రీ మహాల్సాపతి
వెనుక చత్రమును జోగుసాహెబ్
పట్టుకొనుచుండ నడిచెడి సాయి
||వైభోగము చూడగ రారండి||

11. రకరకముల దీపముల కాంతిలో
రంగురంగుల తోరణములతో
వీనుల విందగు సంగీతములతో
షిరిడీ నెలర మైమరిపించడి
|| వైభోగము చూడగ రారండి||

12. సాయినాధునికి జయము జయమనుచు
భక్తినిండార నృత్యం చేయుచు
సర్వభారముల సాయికి వదలుచు
సంతోషంబున భక్తులుండగ
||వైభోగము చూడగా రారండి||

13 . దివ్య తేజముతో మోము వెలుగొంద
సర్వశక్తి స్వరూపము తానై
ఏమియు నెరుగని సామాన్యుని వలె
చావడి చేరగ అడుగిడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

14 . చక్కని ఆసనములమరించి
కనుల కింపుగా అలంకరించి
చావడి లో అడుగిడిన సాయిని
సుఖాసీనునిగా చేయుచునుండెడి
|]|వైభోగము చూడగ రారండి||

15 . పురంధరుడు హారతుల నీయగ
భక్తులందరూ సేవలు చేయగ
ప్రతి ఒక్కరు ప్రణామమొనరింప
చిరునవ్వులతో చూచెడు సాయి
|| వైభోగము చూడగ రారండి||

16. భక్తులందరి కోరిక మేరకు
వారి సేవలను ప్రేమగా భరియించి
ప్రేమ కరుణలతో నెల్లర గాచుచు
పరమాత్మ పరబ్రహ్మ తానై నిలచిన

|| వైభోగము చూడగ రారండి||

17 . ఎల్లరు బాబా ఆశీస్సులగొని
ఆనందముగా వెడలుచు నుండగ
ప్రాణికోటిని పరిరక్షించుచు
చావడిలో పవళించిన సాయి
|| వైభోగము చూడగ రారండి||



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)