28 April (28.04.) (119)
శ్రీ శారదా శ్యామ సందేశం:
సాధనలో అడ్డంకులు వస్తాయి. బుద్ధిని ఉపయోగించి, ఆలోచించి బయట పడాలి. బుద్ధికి బాగా పదును పెట్టాలి.
Obstacles come in practice. Use the mind, by thinking should come outside. The intellect must be well sharpened. (28 Apr)
119) నీ సరి గలరా సాయీ
నీ సరి గలరా సాయీ
నీ నామమే గూర్చును హాయీ
1. నిను నమ్మిన ఆశ్రితుల నెల్లప్పుడు
అనునయించుచు అభయ మొసంగుచు
గాచుచు నుందువు కరుణ రూపమై
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //
2. ప్రాపంచికమగు సుఖముల నెన్నో
కలుగజేయుచూ పరిపాలించుచూ
వక్ర మార్గముల జననీయవు గదా
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //
3. కోరకయే సకలము సమగూర్తువు
శాంతి సౌఖ్యముల నందించెదవు
నీ భక్తులకు నొసగెదవు ముక్తిని
సాయి శ్యామ చరణ సన్నుత // నీసరి //
Comments
Post a Comment